తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ దళిత కవి.

దాశరథి కృష్ణమాచార్య

అయోమయ నివృత్తి పేజీ కృష్ణమాచార్యులు చూడండితెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) . దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.

పంజాబ్ పునరావాస కార్యక్రమం

పంజాబ్ పునరావాస కార్యక్రమం అన్నది 1947లో భారత్ పాకిస్తాన్ మధ్య పంజాబ్ విభజన జరిగాక భారతదేశంలోని తూర్పు పంజాబ్ కి వలస వచ్చిన హిందువులు, సిక్కులకు భారత ప్రభుత్వం నిర్వహించిన పునరావాస కార్యక్రమం.

పింగళి వెంకయ్య

పింగళి వెంకయ్య (ఆగష్టు 2, 1878 - జూలై 4, 1963), స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

పుట్టపర్తి కనకమ్మ

పుట్టపర్తి కనకమ్మ (జూలై 22, 1922 - 1983) ప్రముఖ సంస్కృతాంధ్ర కవయిత్రి. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ఈమె భర్త.

పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చి 28, 1914 - సెప్టెంబర్ 1, 1990) తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.

పొక్కిలి (తెలంగాణ కవిత్వం)

పొక్కిలి 2002, మే నెలలో వచ్చిన తెలంగాణ కవిత్వ సంకలన పుస్తకం. తెలంగాణ ప్రాంతీయ చైతన్యాన్ని ఆవిష్కరించే బృహత్తర లక్ష్యంతో జూలూరి గౌరీశంకర్ సంపాదకులుగా నల్లగొండ జిల్లా, కోదాడలోని స్పృహ సాహితీ సమాఖ్య ప్రచురించిన ఈ కవితా సంకలనంతో 129 మంది తెలంగాణ కవులు రాసిన కవిత్వాలు ఉన్నాయి.

ముకేష్

ముకేష్ (హిందీ: मुकेश ) (జూలై 22, 1923 - ఆగస్టు 27, 1976) భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకుడు. ఇతని సమకాలికులు మహమ్మద్ రఫీ మరియు కిషోర్ కుమార్, 1950 నుండి 1970 ల మధ్య కాలంలో ప్రముఖ గాయకుడు.ముకేష్, తనకాలంలో కొద్ది పాటలు పాడినా, నేటికినీ మరపురాని గాయకునిగా చిరస్మరణీయుడు.

రాగతి పండరి

రాగతి పండరి (జూలై 22, 1965 - 19 ఫిబ్రవరి, 2015) తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్టులలో (వాగ్దేవి, కె.సి లలిత అడపాదడపా వ్యంగ్య చిత్రాలను ప్రచురించినప్పటికీ), రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్ట్. అదొక్కటే ప్రత్యేకత కాదు, అనతి కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబు ల సరసన నిలబడగలిగిన స్థాయి చేరుకున్నది. ఈ మంచి పేరుకు వెనుక అకుంఠిత దీక్ష, వ్యంగ్య చిత్ర కళ మీద ఎనలేని ప్రేమ, నిరంతర పరిశ్రమ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఈమెకు చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా చలాకీగా తిరగలేక పోయినా, అంతకు మించిన మానసిక చలాకీతనంతో, చకచకా కార్టూన్లు గీసి అందరి మన్ననలు అందుకుంటున్నది. ఆమె మాటలలోనె చెప్పాలంటే, "జీవితంలో వేదనని కాసేపు పక్కకు నెట్టి, నిండుగా నవ్వగలిగే శక్తినిచ్చే కార్టూన్లు, మనిషికి గ్లూకోజు డోసులాంటివి". ఏవిధమైన తటపటాయింపు లేకుండా, తాను కార్టూన్లు గీయాలన్న కోరిక మరియు స్ఫూర్తి, ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ కలగ చేశారని చెపుతుంది. అలాగే, జయదేవ్ కూడా రాగతి పండరి తన నిజమైన శిష్యురాలని చెప్పుకుంటాడు.

వేంపెంట ఉద్యమం

వేంపెంట ఉద్యమం కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామం లో ప్రభుత్వం తలపెట్టిన జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్థులు చేసిన సుదీర్ఘ ఉద్యమం. ప్రజాస్వామ్య పద్ధతిలో గాంథేయ మార్గంలో గ్రామస్థులు 1567 రోజుల సుదీర్ఘ దీక్షను చేపట్టారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పవర్ ప్లాంటు అనుమతులను రద్దుచేసింది.

మరో భాషలో చదవండి