ISBN

అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది ఒక విశిష్ట సంఖ్యా వాణిజ్య పుస్తక గుర్తింపు. ఐఎస్‌బిఎన్ అనేది ప్రతి ఎడిషన్ మరియు వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్‌బ్యాక్ మరియు అదే పుస్తకం యొక్క గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది. ISBN అనేది 2007 జనవరి 1 నుండి 13 అంకెల పొడవుతో ఈ సంఖ్యను కేటాయిస్తున్నారు. 2007 ముందు 10 అంకెల పొడవుగా కేటాయించబడేది. ISBN కేటాయింపు పద్ధతి దేశాన్ని బట్టి, ప్రచురణ పరిశ్రమ దేశంలో ఎంత పెద్దదనే దాన్ని బట్టీ మారుతూ ఉంటుంది. గుర్తింపు యొక్క ప్రారంభ ISBN ఆకృతీకరణ 1966 లో 9 అంకెలతో రూపొందించిన స్టాండర్డ్ బుక్ నంబరింగ్ (SBN) ఆధారంగా 1967 లో ఉత్పత్తి చేశారు.

International Standard Book Number
{{{image_alt}}}
A 13-digit ISBN, 978-3-16-148410-0, as represented by an EAN-13 bar code
AcronymISBN
Introduced1970
Managing organisationInternational ISBN Agency
Number of digits13 (formerly 10)
Check digitWeighted sum
Example978-3-16-148410-0
Websitewww.isbn-international.org
ISBN Details
The parts of a 10-digit ISBN and the corresponding EAN‑13 and barcode. Note the different check digits in each. The part of the EAN‑13 labeled "EAN" is the Bookland country code.
అల్యూమినియం

అల్యూమినియమ్ (ఆంగ్లం: Aluminium) ఒక గ్రూపు III మూలకము మరియు వెండిలా మెరిసే తేలికైన లోహము. దీని సంకేతం Al; పరమాణు సంఖ్య 13. మొట్టమొదటిసారిగా 1823లో వోలర్ అల్యూమినియమ్ క్లోరైడ్ ను పొటాషియమ్ తో వేడిచేసి అల్యూమినియమ్ ను వేరుచేసాడు. భూతలంలో సమృద్ధిగా దొరికే మూలకాలలో ఆక్సిజన్, సిలికాన్ ల తరువాత మూడవ స్థానం మరియు లోహాలన్నింటిలో మొదటి స్థానంలో ఉంటుంది. భూమి పొరలలో 7.28 శాతం అల్యూమినియమ్ ఉంటుంది. ప్రకృతిలో అల్యూమినియమ్ స్వేచ్ఛా స్థితిలో దొరకదు. ఇది సంయోగస్థితిలో ఇంచుమించు 270 వివిధరకాల లోహాలతో కలిసి ఎక్కువగా లభిస్తుంది. వీటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది బాక్సైట్ ఖనిజం. దీని మిశ్రమాలు విమానాలు, కట్టడాలు తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.

ఆఫ్రికా

ఆఫ్రికా జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా ఆసియా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం. ఆఫ్రికా ఖండం 3.03 కోట్ల చదరపు కిలోమీటర్ల (1.17 కోట్ల చదరపు మైళ్ళ) విస్తీర్ణం కలిగి, భూ ఉపరితలంలో 6 శాతం, సముద్రాలు మినహాయించి భూతలంలో 20 శాతం విస్తరించింది ఉంది. 2016 నాటికి 112 కోట్ల మంది జనాభాతో ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉంది.ఈ ఖండానికి ఉత్తరాన మధ్యధరా సముద్రం, ఈశాన్యంలో సూయెజ్ భూసంధి, ఎర్ర సముద్రం, ఆగ్నేయంలో హిందూ మహాసముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. ఈ ఖండంలో మడగాస్కర్ దీవి, వివిధ ద్వీప సముదాయాలు ఉన్నాయి. ఈ ఖండంలో మడగాస్కర్ దీవి, వివిధ ద్వీప సముదాయాలు ఉన్నాయి. 54 పూర్తిగా గుర్తింపు పొందిన సార్వభౌమ రాజ్యాలు (దేశాలు), 9 ప్రాంతాలు, కొద్దిపాటి గుర్తింపు కానీ లేక గుర్తింపే లేకుండా కానీ ఉన్న రెండు డీ-ఫాక్టో స్వతంత్ర దేశాలు ఉన్నాయి. అత్యధిక సంఖ్యలోని దేశాలు ఉత్తరార్థగోళంలోనే ఉన్నా చెప్పుకోదగ్గ భాగం, పలు దేశాలు దక్షిణార్థ గోళంలోనూ ఉన్నాయి.

అన్ని ఖండాలతో పోలిస్తే ఆఫ్రికా సగటు జనాభా వయసు అతి తక్కువ; 2012లో ఆఫ్రికా మధ్యగత (మీడియన్) వయసు 19.7 సంవత్సరాలు, అయితే ప్రపంచవ్యాప్తంగా మధ్యగత వయస్సు 30.4 సంవత్సరాలు. విస్తీర్ణం పరంగా ఆల్గేరియా, జనాభా పరంగా నైజీరియా ఆఫ్రికాలో అతిపెద్ద దేశాలు. ఆఫ్రికా, ప్రత్యేకించి మధ్య తూర్పు ఆఫ్రికా, మానవ జాతికి, హోమినిడే క్లాడె (పెద్ద తోకలేని కోతులు) జన్మస్థలంగా పేరొందింది.

ఆవర్తన పట్టిక

"ఆవర్తన పట్టిక" అనునది రసాయన మూలకాలను వాటి పరమాణు సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసములు మరియు ఆవర్తన రసాయన ధర్మముల ఆధారంగా యేర్పాటు చేయబడిన ఒక అమరిక. ఈ పట్టికలో మూలకాలు వాటి పరమాణు సంఖ్య(పరమాణు కేంద్రకంలో గల న్యూట్రాన్ల సంఖ్య) యొక్క ఆరోహణ క్రమంలో అమర్చబడినవి. ఈ పట్టికలో ప్రామాణీకరించబడిన ప్రకారం 18 నిలువు వరుసలు మరియు 7 అడ్డు వరుసలు గానూ, పట్టిక క్రింది భాగంలో రెండు ప్రత్యేక వరుసలు అమర్చబడినవి. ఈ పట్టికను నాలుగు బ్లాకులుగా విభజింపవచ్చు. వాటిలో s-బ్లాకు మూలకాలు ఎడమ వైపు, p-బ్లాకు మూలకాలు కుడి వైపున, d-బ్లాకు మూలకాలు పట్టిక మధ్య భాగం లోనూ, f-బ్లాకు మూలకాలు పట్టిక దిగువ భాగంలోనూ అమర్చబడి ఉన్నాయి.

ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియడ్లు అనుయు, నిలువు వరుసలను గ్రూపులు అనియు వ్యవహరిస్తారు. ఈ గ్రూపులలో కొన్నింటికి హలోజనులు లేదా జడ వాయువులు వంటి పేర్లతో పిలుస్తారు. నిర్వచనం ప్రకారం ఆవర్తన ధర్మాలను కలిగియుండినప్పటికీ ఆ పట్టిక మూలకాల యొక్క ధర్మములను మరియు క్రొత్తగా వచ్చిన, ఇంకా కనుగొనబడని మూలకాల యొక్క ధర్మముల మధ్య సంబంధములను వివరించుటకు కూడా ఉపయోగపడుతుంది. ఫలితంగా, ఒక ఆవర్తన పట్టిక- ప్రామాణిక రూపం లేదా కొన్ని ఇతర రసాయన ప్రవర్తనను విశ్లేషించడం కోసం ఉపయోగకరమైన ముసాయిదా రూపాంతరం-అందిస్తుంది, మరియు పట్టికలు విస్తృతంగా రసాయన శాస్త్రం మరియు ఇతర శాస్త్రాల్లో ఉపయోగిస్తారు.

పూర్వగాములు ఉన్నప్పటికీ డిమిట్రి మెండలీవ్ 1869 లో మొదటి సారి ఆవర్తన పట్టికను ప్రచురణ చేసిన వ్యక్తిగా గుర్తింబడ్డాడు. ఆయన అప్పటికి తెలిసిన మూలకాలను వాటి ధర్మాల ఆధారంగా (పరమాణు భారం) వర్గీకరణను అభివృద్ధిపరచాడు. మెండలీఫ్ కూడా కొన్ని కనుగొనబడని మూలకాలను ఊహించి వాటికి కూడా కొన్ని ఖాళీలను పట్టికలో ఉంచి వాటికి స్థానం కల్పించాడు. ఆయన ఊహించిన మూలాకాలలో చాలా మూలకాలను తదుపరి కాలంలో కనుగొని వాటికి సూచించిన ఖాళీలలో అమర్చారు. తర్వాతి కాలంలో మరికొన్ని మూలకాలను కనుగొన్న తదుపరి మెండలీఫ్ ఆవర్తన పట్టికను విస్తృతపరచారు. తర్వాత తయారుచేయబడిన ఆవర్తన పట్టికలో మూలకాల రసాయన ధర్మాల ఆధారంగా సిద్దాంతీకరించారు.

పరమణు సంఖ్య 1 (హైడ్రోజన్ నుండి 118 (అననోక్టియం) వరకు గల అన్ని మూలకాలలో కొన్ని కనుగొనబడినవి మరికొన్ని కృత్రిమంగా తయారుచేయబడినవి. పరమాణు సంఖ్యలు 113,115,117 మరియు 118 గా గల మూలకాలు యిప్పటికీ నిర్ధారింపబడలేదు. ఆవర్తన పట్టికలో మొదటి 98 మూలకాలు ప్రకృతిలో సహజంగా గలవి. మరికొన్ని మూలకాలు వాటిలో కొన్ని మూలకాలు ప్రయోగశాలలో కృత్రిమంగా కనుగొనబడినవి. పరమాణు సంఖ్యలు 99 నుండి 118 వరకు గల మూలకాలను కృత్రిమంగా సృష్టించారు.అధిక పరమాణు సంఖ్యలు కలిగిన మూలకాలు ఉత్పత్తి ఆవర్తన పట్టికలో కొనసాగుతున్న చర్చనీయాంశంగానే ఉండటం అటువంటి చేర్పులు స్థానం కల్పించే మార్పు అవసరం అనేది ప్రశ్నార్థకంగా మారింది. అనేక కృత్రిమ రేడియోన్యూక్లైడ్ సహజంగా మూలకాలులు కూడా ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయబడ్డాయి.

ఇడ్లీ

ఇడ్లీ (ఆంగ్లం: Idli or Idly) దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు మరియు బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు. మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.

సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి చట్నీ లేదా సాంబారు లేదా కారంపొడిగానీ, పచ్చడితో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి. అంతే కాకుండా, ఇడ్లీలు ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.

ఇస్లాం మతం

ఇస్లాం ధర్మం : ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం. దేవుడు ఒక్కడే అనే ప్రాతిపదిక పైన ముహమ్మద్ ప్రవక్త ] ఆఖరి ప్రవక్త మరియు ఇది ముహమ్మద్ [] స్థాపించిన మతం కాదు. ఇస్లాం భూమి పుట్టుక నుండి ప్రళయం వరకు అల్లాహ్ మానవజాతి కోసం నిర్ణయించిన ధర్మం. 140 నుండి 180 కోట్ల జనాభాతో ప్రపంచంలో పెద్దదయన క్రైస్తవం తరువాత ఇస్లాం మతం రెండవ అతి పెద్ద మతం.

ఇస్లాం అనునది సిల్మ్ అనే అరబ్బి పదం నుండి వచ్చింది దీని అర్థం శాంతి, ముస్లిం అనగా అల్లాహ్‌కి తన విధేయత ప్రకటించిన వ్యక్తి అని అర్ధం.

ఇస్లాం అనే పదానికి మూలం అరబీ భాషాపదం 'సిల్మ్', అనగా శాంతి, స్వఛ్ఛత, అర్పణ, అణకువ మరియు సత్ శీలత. ధార్మిక పరంగా చూస్తే ఇస్లాం అనగా భగవదేఛ్ఛకు అర్పించడం మరియు అతడి ధర్మానికి అనుగుణంగా నడచుకోవడం. ముస్లిం అనగా భగవదేఛ్ఛకు లోబడి, స్వయాన్ని భగవంతుడికి అప్పగించేవాడు, శాంతి కాముకుడు, శాంతి స్థాపకుడు. మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన మార్గాన్ని, ధర్మాన్ని అవలంబించువాడు. మానవులకులకు పరమ పవిత్రం దేవుని (అల్లాహ్) వాక్కు, ఆదేశము ఖురాన్, మరియు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు/ఉల్లేఖనాలు హదీసులు.

అల్లాహ్ వాక్కు ఖురాను ప్రకారం ఆదమ్ ఆది పురుషుడు మరియు ప్రథమ ప్రవక్త. ముహమ్మద్ చివరి ప్రవక్త.

కెనడా

కెనడా ఉత్తర అమెరికా లోని అతి పెద్ద దేశం . ఈ దేశం పశ్చిమములోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పడమరలోని పసిఫిక్ మహాసముద్రము వరకి వ్యాపించి ఉత్తరములోని ఆర్కిటెక్ మహాసముద్రము లోపలకు కూడా వ్యాపించి ఉంది. ఇది విస్తీరణంలో ప్రపంచములోనే రెండవ అతి పెద్ద దేశం. దక్షిణములో మరియు వాయుమ్వంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఉన్న ఉమ్మడి సరిహద్దు, ప్రపంచములోనే అతి పెద్దది.

కెనడా భూభాగములో అనేక రకాల ఆదిమవాసి ప్రజలు వేలాది సంవత్సరాలుగా నివసించేవారు. 15వ శతాబ్దము చివరి భాగము మొదలుకుని, బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారు సాహస యాత్రలు నిర్వహించి, తరువాత అట్లాంటిక్ తీరములో స్థిరపడ్డారు. ఏడు సంవత్సరాల యుద్ధం అనంతరం 1763లో ఫ్రాన్స్, ఉత్తర అమెరికా లోని వారు ఆక్రమించిన ప్రదేశాలలో దాదాపు అన్నిటినీ వదులుకుంది. 1867లో మూడు బ్రిటిష్ ఉత్తర అమెరికాల కాలనీలని కలిపి ఒక కాన్ఫేడేరేషన్‌గా ఏర్పడి, నాలుగు సంస్థానాలను కలిగి ఉన్న ఫెడరల్ డోమినియన్‌గా కెనడా ఏర్పాటయింది. ఈ ప్రక్రియ వలన సంస్థానాలు మరియు భూభాగాలకు క్రమేపీ విస్తరిస్తూ, యునైటెడ్ కింగ్డం నుండి స్వయంప్రతిపత్తిని పెంచుకోవటం జరిగింది. విస్తరిస్తున్న స్వయంప్రతిపత్తికి 1931 నాటి స్టాచ్యూ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ నిదర్శనముగా నిలిచి 1982లో కెనడా యాక్ట్‌తో ఒక కొలిక్కి వచ్చింది. దీని ద్వారా బ్రిటిష్ శాసన సభ పై చట్టపరంగా ఆధార పడవలసిన అవసరాల యొక్క అవశేషాలు కూడా తెంపివేయబడ్డాయి.

పది సంస్థానాలు మూడు భూభాగాలు కలిగిన ఒక సమాఖ్య కెనడా, శాసన సభతో కలిగిన ఒక ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ ప్రకారం ఎలిజాబెత్ రాణి II దేశ అధిపతిగా ఉన్న ఒక రాజ్యాంగ రాజ్యరికం. ఇది ఒక ద్విభాషా మరియు బహుసంస్కృతులు కలిగిన దేశం. ఆంగ్లం మరియు ఫ్రెంచ్ సమాఖ్య స్థాయిలోనూ మరియు న్యూ బృన్స్ విక్‌ప్రావిన్స్ లోనూ అధికార భాషలుగా ఉన్నాయి. కెనడా ప్రపంచంలోనే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. కెనడా యొక్క బహుముఖ ఆర్థిక విధానము దాని యొక్క అపారమైన సహజ వనరులు మీదనూ, వర్తకము పైననూ, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ తో వాణిజ్యము మీద ఆధారపడివున్నది. యునైటెడ్ స్టేట్స్ తో కెనడాకు దీర్ఘకాల సంకీర్ణ సంబంధం ఉంది. కెనడా G8, G20, NATO, ఆర్గనైసేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, WTO, కామన్వెల్త్ అఫ్ నేషన్స్, ఆర్గనైసేషన్ ఇంటర్నేషనల్ డి లా ఫ్రాంకో ఫోనీ, OAS, APEC, మరియు యునైటెడ్ నేషన్స్ సంస్థలలో సభ్యత్వం కలిగి ఉంది.

చైనా

ఇతరవాడుకలు రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదాతైవాన్

చైనా అని సాధారణంగా పిలువబడే చైనా ప్రజల గణతంత్రం (ఆంగ్లము: People's Republic of China పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, మరియు ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి. 130 కోట్ల (1.3 బిలియన్) పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశంగా

చైనా ఉంది. చైనా రాజధాని నగరం బీజింగ్ (Beijing).అతిపెద్ద నగరం షాంఘై (shangai).చైనా ఏక పార్టీ పాలిత దేశం.

చైనాలో 22 భూభాగాలు ఉన్నాయి., వీటిలో 5 స్వయం ప్రతిపత్తి (అటానిమస్) కలిగిన భూభాగాలు, నాలుగు డైరెక్ట్ కంట్రోల్డ్ మునిసిపాలిటీలు (బీజింగ్, తియాజిన్, షాంగై మరియు చాంగ్క్వింగ్), రెండు స్వయంపాలిత భూభాగాలు (హాంగ్‌కాంగ్ మరియు మాకౌ) ఉన్నాయి. పి.ఆర్.సిలో ఉన్న ఫ్రీ ఏరియా ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా భూభాగాలను రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలనలో ఉన్నాయి. తైవాన్, కిన్మెన్, మత్సు, ఫ్యూజియన్ మరియు దక్షిణాసియా అధీనంలో ఉన్న ద్వీపాలు రాజకీయ స్థితి వివాదాస్పదంగా ఉంది.

జీడి

జీడిపప్పు అనకార్డియేసి అనే వృక్ష జాతికి చెందింది. దీనిని తెలుగులో జీడిమామిడి చెట్టు అంటారు.

ఆ ఆంగ్ల పేరు జీడిమామిడి చెట్టు యొక్క పోర్ట్యుగీస్ పేరు అయిన కాజు నుంచి పుట్టింది. ఈ పేరు కూడా టూపి పదం అయిన ఆకజూ నుంచి వచ్చింది. ఈ చెట్టు ఉష్ణమండలాల్లో జీడిపప్పు మరియు జీడి పండ్ల ఉత్పత్తి కోసం విరివిగా పెంచబడుతుంది.

జీడి లేదా జీడి మామిడి (Cashew) అని కూడా అంటారు. ప్రకృతిలోనే జీడిపండు ఒక అద్భుతం. అన్ని పండ్లకీ పిక్క[గింజ] లోపల ఉంటే...దీంట్లొ అది బయటకె కనపడుతూ ఉంటుంది. ఇది ఇసుక నేలల్లో పండే పంట. జీడి పళ్లు వేసవిలో వచ్చే పళ్ళు. ఈ పళ్ళను తింటారు. చాలా వగరుగా వుంటాయి. ఈ జీడి రసం కొంచెం ప్రమాదకరం. బట్టల మీద పడితే ఆ మరక వదలదు. మానవ చర్మం మీద పడినా, కొంచెం ప్రమాదమె. ఈ జీడి పంట ద్వారా వచ్చే జీడి పిక్కలను, జీడి పప్పుగా తయారు చేసే పరిశ్రమలు పలాస (శ్రీకాకుళం జిల్లా), మోరి (తూర్పు గోదావరి జిల్లా) గ్రామాలలో ఉన్నాయి. ఈ పరిశ్రమల మీద ఆధారపడి అనేక కుటుంబాలు బ్రతుకు తున్నాయి. ఈ జీడి పప్పు ఎగుమతి ద్వారా, ఎగుమతి దారులు, భారత దేశానికి, విలువైన విదేశీ మారక ద్రవ్యం సంపా దించి పెడుతున్నారు.

తెలుగు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో హిందీ, తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది. మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.

వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును' ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌' గా వ్యవహరించారు. కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. తెలుగు అక్షరమాల కన్నడ భాష లిపిని పోలియుంటుంది. తెలుగు భాషలోని చాలా పదాలు, పద శబ్దాలు కూడా కన్నడ భాషను పోలియుంటాయి.

పాకిస్తాన్

పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 16 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది. కామన్‌వెల్తులోను (2004–2007లో కొంతకాలము బహిష్కరించబడినది), ఇస్లామిక్ దేశాల సంస్థలోను సభ్యత్వం ఉంది. 1947కు పూర్వం భారత అంతర్భాగమైన ఈ పాకిస్తాన్, 1947లో భారత్ నుండి వేరుపడి పాకిస్తాన్ (పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్ ల సమాహారం) ఏర్పడింది. ఈ విభజనకు ముఖ్య కారకులలో ముహమ్మద్ అలీ జిన్నా ఒక్కరు.

పురాణములు

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

బెర్కీలియం

బెర్కీలియం ఒక సింథటిక్ (ట్రాంస్యురానిక్) రేడియోధార్మిక రసాయన మూలకం ఉంది. దీని రసాయన సంకేతం Bk మరియు పరమాణు సంఖ్య 97. ఇది ఆక్టినైడ్ మూలకం మరియు ట్రాంస్ యురేనియం సిరీస్ లోని మూలకం. దీనికి కాలిఫోర్నియా లోని బర్కిలీ, నగరం పేరు పెట్టారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రేడియేషన్ ప్రయోగశాల స్థానం అయిన ఇక్కడ అది డిసెంబర్ 1949లో కనుగొనబడింది. ఈ కిరణ ప్రసారక లోహము, ప్లుటోనియం, క్యూరియం మరియు అమేరిషియం తర్వాత కనుగొన్నారు. ఐదవ ట్రాంస్ యురేనియం మూలకంగా ఉంది.

భారత దేశం

భారత గణతంత్ర రాజ్యము నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో రెండో స్థానం కలిగి వుంది, వైశాల్యములో ప్రపంచంలో ఏడవది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి (పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో భారత దేశం ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది.

దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన (అరేబియా సముద్రము అరేబియా సముద్రం), మరియు తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్[1] దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరికతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము) జన్మనిచ్చింది. 18 వ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా స్వాధీనం చేసుకోవడంతో భారతదేశం బ్రిటిష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ నుండే పాలించబడింది. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం చేసిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1947లో బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందింది.

భారత ఆర్థిక వ్యవస్థ నామమాత్ర GDP మరియు కొనుగోలు శక్తి తుల్యత (PPP) ద్వారా మూడవ అతిపెద్ద ద్వారా ప్రపంచ పదకొండో స్థానంలో ఉంది. 1991 లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది.భారత దేశాన్ని కొత్తగా పారిశ్రామీకరణ జరిగిన దేశంగా భావిస్తారు. అయితే, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, పోషకాహార లోపం, మరియు తగని ప్రజా ఆరోగ్య సవాళ్లను ఎదుర్కుంటూ ఉంది. ఒక అణ్వాయుధ మరియు ప్రాంతీయ శక్తి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైన్యం కలిగి ఉంది. ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. భారతదేశం 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య రాజ్యాంగ గణతంత్రం. భారతదేశం ఒక, బహుభాషా, మరియు బహుళ జాతి సొసైటీ. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశము.

మహాత్మా గాంధీ

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్ (CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.

మెండలీవియం

మెండలెవియం ఒక సంధాన (అనగా, ప్రయోగశాలలో కృత్రిమంగా చేసినది) రసాయన మూలకం ఉంది. దీని రసాయన సంకేతం Md (గతంలో Mv). అణు సంఖ్య 101. ఇది ఆక్టినైడ్ వరసలో ఉన్న ఒక లోహ రేడియోధార్మిక ట్రాంంస్ యురానిక్ మూలకం. ఈ మూలకానికి ఏ ఉపయోగమూ ఉన్నట్లు లేదు; కేవలం కుతూహలం కోసం అధ్యయనం చెయ్యడం తప్ప.

యునైటెడ్ కింగ్‌డమ్

గ్రేట్ బ్రిటన్ మరియు ఉత్తర ఐర్లాండ్ యొక్క సంయుక్త రాజ్యం (ఆంగ్లము: United Kingdom of Great Britain and Northern Ireland యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్), అందరికీ తెలిసినట్లుగా సంయుక్త రాజ్యం, యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom) , లేదా బ్రిటన్ (Britain),పశ్చిమ ఐరోపాలోని స్వార్వభౌమాధికారం కలిగిన దేశం. ఐరోపా ఖండములోని స్వతంత్ర దేశము. ఇదొక ద్వీప దేశము, గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్, మరియు చాలా ద్వీపాలు కలిసి ఏర్పడింది. ఉత్తర ఐర్లాండ్ యునైటెడ్ కింగ్‌డమ్ లోనూ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ లోనూ భాగము. ఈ భూభాగాలు కాకుండా అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర సముద్రం, ఇంగ్లీష్ కాలువ మరియుఐరిష్ సముద్రంతో ఆవరించబడి ఉన్నాయి. ఈ దీవులన్నింటిలోకి గ్రేట్ బ్రిటన్ పెద్దదైన భూభాగము.

యునైటెడ్ కింగ్‌డమ్ క్రింద నాలుగు దేశాలు ఉన్నాయి. దేశానికి రాణి రెండవ ఎలిజబెత్. ప్రస్తుత ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్.ఇంగ్లాండు,వేల్స్, స్కాట్లాండ్,ఉత్తర ఐర్లాండ్

ఉత్తర ఐర్లాండ్ యు.కె ఏకైక భాగం మరొక సార్వభౌమ్య రాజ్యంగా భూ సరిహద్దును పంచుకున్నప్పటికీ దాని విదేశీ భూభాగాలలో రెండు కూడా ఇతర సార్వభౌమ దేశాలతో భూ సరిహద్దులను పంచుకున్నాయి. యు.కె సరిహద్దులో గిబ్రల్టార్ స్పెయిన్‌తో సరిహద్దును కలిగి ఉంది. సైప్రస్ రిపబ్లిక్, ఉత్తర సైప్రస్ మరియు ఐరోపా బఫర్ జోన్లతో రెండు సైప్రియట్ విధానాలను వేరుచేసే అగ్రోతిరి మరియు ధెకిలియా వాటా సరిహద్దుల సావరిన్ బేస్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ భూ సరిహద్దులతో యునైటెడ్ కింగ్డమ్ అట్లాంటిక్ మహాసముద్రంతో, తూర్పు సరిహద్దులో నార్త్ సీ, తూర్పు సరిహద్దులో ఇంగ్లీష్ కెనాల్, వాయవ్య సరిహద్దులో సెల్టిక్ సముద్రం సెల్టిక్ సముద్రం ఉన్నాయి. యు.కె ప్రపంచంలోని 12 వ అతిపెద్ద పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఐరిష్ సముద్రం గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ల మధ్య 2,42,500 చదరపు కిలోమీటర్ల (93,600 చదరపు మైళ్ల) విస్తీర్ణంలోంవిస్తరించి ఉంది. యునైటెడ్ కింగ్డమ్ ప్రపంచంలోని 78 వ అతిపెద్ద సార్వభౌమ రాజ్యంగా మరియు ఐరోపాలో 11 వ అతిపెద్దదిగా ఉంది. ఇది సుమారుగా 21 వ అత్యంత జనసాంద్రత గల దేశంగా ఉంది. అంచనా ప్రకారం 65.5 మిలియన్ల మంది పౌరులు నివసిస్తున్నారు. ఇది ఐరోపా సమాఖ్య (ఇ.యు.) లో నాల్గవ అత్యంత జనసాంద్రత గల దేశాన్ని చేస్తుంది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కలిగిన యునైటెడ్ కింగ్డమ్ ఒక రాచరికప్రజాస్వామ్యదేశ రాజ్యాంగంగా ఉంది. ఈ రాజవంశం 1952 ఫిబ్రవరి 6 నుండి క్వీన్ రెండవ ఎలిజబెత్ పాలిస్తూ ఉంది. యునైటెడ్ కింగ్డమ్ రాజధాని మరియు దాని అతిపెద్ద నగరం లండన్ ప్రపంచ పట్టణం మరియు ఆర్థిక కేంద్రంగా 10.3 మిలియన్ జనసంఖ్య కలిగిన పట్టణ ప్రాంతంగా ఉంది. ఐరోపాలో నాల్గవ-అతిపెద్ద మరియు యూరోపియన్ యూనియన్లో రెండవ అతిపెద్దది.

యునైటెడ్ కింగ్డంలోని ఇతర ప్రధాన పట్టణ ప్రాంతాలు బర్మింగ్హామ్, లీడ్స్, గ్లాస్గో, లివర్పూల్ మరియు మాంచెస్టర్ లలో కేంద్రీకృతమై ఉన్నాయి. యునైటెడ్ కింగ్డంలో నాలుగు దేశాలు ఉన్నాయి - ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ మరియు ఉత్తర ఐర్లాండ్. చివరి మూడు సంస్థలు పరిపాలనలను

ప్రతి ఒక్కరికి విభిన్న శక్తులు

వారి రాజధానులు ఎడిన్బర్గ్, కార్డిఫ్ మరియు బెల్ఫాస్ట్ లలో ఉన్నాయి. సమీపంలోని ఐల్ ఆఫ్ మాన్, బెయిల్విక్ ఆఫ్ గ్వెర్నిసీ మరియు బెయిల్విక్ జెర్సీలు యునైటెడ్ కింగ్డంలో భాగం కావడం లేదు. రక్షణ మరియు అంతర్జాతీయ ప్రాతినిధ్య బాధ్యత కలిగిన బ్రిటీష్ ప్రభుత్వం వహిస్తుంది.యునైటెడ్ కింగ్డమ్ సృష్టికి ముందు వేల్స్ ఇప్పటికే ఇంగ్లాండ్ రాజ్యం చేత జయించి స్వాధీనం చేసుకుంది. ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ల మధ్య యూనియన్ ఒప్పందం ద్వారా 1707 లో సృష్టించబడిన యునైటెడ్ కింగ్డం గ్రేట్ బ్రిటన్ అన్ని అంశాలను కలిగి ఉంది. 1801 లో ఐర్లాండ్ రాజ్యం ఈ రాష్ట్రంతో విలీనం అయ్యింది. యునైటెడ్ కింగ్డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ ఏర్పడింది. ఐర్లాండ్ అయిదు ఆరవ శతాబ్దం బ్రిటన్ నుండి 1922 లో విడిపోయింది. ఇది గ్రేట్ బ్రిటన్ మరియు ఉత్తర ఐర్లాండ్ యునైటెడ్ కింగ్డం ప్రస్తుత సూత్రీకరణను వదిలివేసింది.

పద్నాలుగు బ్రిటీష్ విదేశీ భూభాగాలు ఉన్నాయి. ఇవి బ్రిటీష్ సామ్రాజ్యం అవశేషాలు 1920 వ దశకంలో దాని శిఖరాగ్రంలో ఉన్నప్పుడు ప్రపంచ భూభాగంలో దాదాపు నాలుగింటిని చుట్టుముట్టాయి. చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యంగా ఉంది. బ్రిటీష్ పాలిత ప్రాంతాలలో ప్రభావం దాని పూర్వ కాలనీల భాష సంస్కృతి మరియు చట్టపరమైన వ్యవస్థల్లో బ్రిటిష్ ప్రభావం గమనించవచ్చు.

యునైటెడ్ కింగ్డమ్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఉంది మరియు నామమాత్ర జి.డి.పి. మరియు కొనుగోలు శక్తి సమానతతో తొమ్మిదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా, ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. యు.కె. అధిక ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నట్లు భావిస్తారు మరియు మానవ అభివృద్ధి సూచికలో అత్యధికంగా వర్గీకరించబడుతుంది. ప్రపంచంలోని 16 వ స్థానంలో ఉంది. ఇది 19 వ మరియు 20 వ శతాబ్ది ప్రారంభంలో ప్రపంచం మొట్టమొదటి పారిశ్రామికీకరణ దేశంగా మరియు ప్రపంచంలోని మొట్టమొదటి శక్తిగా ఉందని చెప్పవచ్చు. యు.కె. అంతర్జాతీయంగా గణనీయమైన ఆర్థిక, సాంస్కృతిక, సైనిక, శాస్త్రీయ మరియు రాజకీయ ప్రభావాలతో గొప్ప శక్తిగా మిగిలిపోయింది. ఇది గుర్తించబడిన అణ్వాయుధ రాజ్యం మరియు ప్రపంచంలోని సైనిక వ్యయంలో ఏడవ దేశంగా ఉంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 1946 లో మొదటి సమావేశం నుండి యు.కె. ఒక శాశ్వత సభ్యదేశంగా ఉంది. ఇది 1973 నుండి ఇ.యు. మరియు దాని పూర్వీకుడైన యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (ఇ.ఇ.సి.) ప్రముఖ సభ్య దేశంగా ఉంది. అయితే, 2016 జూన్ 23 ఇ.యు. యు.కె.సభ్యత్వం వదలడానికి ఒక ప్రజాభిప్రాయ ఫలితంగా, యు.కె. ఓటర్లలో 51.9% అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఇ.యు. నుండి దేశం భవిష్యత్ నిష్క్రమణ చర్చలు జరుగుతున్నాయి. యు.కె కూడా కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, కౌన్సిల్ ఆఫ్ ఐరోపా, జి7 ఫైనాన్స్ మంత్రులు, జి7 ఫోరమ్, జి20, నాటో, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఇ.ఇ.సి.డి.) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ప్రపంచ వాణిజ్య సంస్థ) సభ్యత్వం కలిగి ఉంది.

రాజస్థాన్

రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు. మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)

రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశము థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం. అందువల్ల అది ఎడారిగా మారింది. మరొప్రక్క దట్టమైన అడవులతో గూడిన రణథంబోర్ నేషనల్ పార్క్ (పులులకు సంరక్షణాటవి), ఘనా పక్షి ఆశ్రయము, భరత్ పూర్ పక్షి ఆశ్రయము ఉన్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరం.

లక్ష్మి

లక్ష్మి (Lakshmi) లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువు నకు ఇల్లాలు.భృగు పుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీర సాగరమథన సమయంలో ఉద్భవించింది. జైనమతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టనష్టాలనుండి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుంది.

సంస్కృతంలో "లక్ష్మి" అన్న పదానికి మూల ధాతువులు - లక్ష్ - పరిశీలించుట, గురి చూచుట . ఇదే ధాతువును "లక్ష్యం" అనే పదంలో కూడా చూస్తాము. వేదాలలో లక్ష్యాయిధి లక్ష్మిః - అనగా జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగినది - అని అన్నారు.

మహాలక్ష్మిని శ్రీ అని కూడా అంటారు. తమిళంలో తిరుమగళ్ అంటారు. ఆమె ఆరుసుగుణములు పరిపూర్ణముగా కలిగినది. నారాయణుని శక్తికి ఆమెయే కారణము. ఆమె విష్ణువునకు ఇల్లాలు. సీతగా రాముని పెండ్లాడినది. రాధ, రుక్మిణి మరియు శ్రీకృష్ణుని భార్యలందరును లక్ష్మీదేవి అంశలేబెంగాల్‌లో దుర్గాపూజ సమయంలో లక్ష్మి, సరస్వతి, వినాయకుడు, కార్తికేయుడు - వీరందరినీ దుర్గామాత బిడ్డలుగా ఆరాధిస్తారు.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.