2004

గ్రెగేరియను క్యాలాండరు లేదా గ్రెగేరియను కాలనిర్ణయ పట్టిక (లేదా గ్రెగేరియను పంచాంగము)లో 2004అనునది గురువారంతో మొదలవు లీపు సంవత్సరం.

సంవత్సరాలు: 2001 - 2002 - 2003 - 2004 - 2005 - 2006 - 2007
దశాబ్దాలు: 1980లు - 1990లు - 2000లు - 2010లు - 2020లు
శతాబ్దాలు: 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం

సంఘటనలు

మరణాలు

Ms subbulakshmi
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి

పురస్కారాలు

2001

2001 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

అక్టోబర్ 18

అక్టోబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 291వ రోజు (లీపు సంవత్సరములో 292వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 74 రోజులు మిగిలినవి.

అక్షరాస్యత

అక్షరాస్యత (ఆంగ్లం : literacy) సాంప్రదాయికంగా, భాషాఉపయోగం చేయడానికి, చదవడం, వ్రాయడం, వినడం మరియు మాట్లాడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం.. నవీన దృక్ఫదంలో సమాచారం (communication) కొరకు కావలసిన నాలుగు మూల వస్తువులైనటివంటి నైపుణ్యాలు చదవడం, వ్రాయడం, వినడం మరియు మాట్లాడడం నేర్చుకునే విధానమే "అక్షరాస్యత". యునెస్కో వారి నిర్వచనం : గుర్తించడం (identify), అర్థం చేసుకోవడం (understand), పాల్గొనడం (interpret), సృష్టించడం (create), వార్తాలాపన (communicate), లెక్కంచడం (compute) మరియు ముద్రించిన మరియు వ్రాయబడిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడం "అక్షరాస్యత".క్రింది పట్టిక, భారతదేశం మరియు పొరుగుదేశాలలోగల మధ్యవయస్కుల మరియు యౌవనుల అక్షరాస్యతను సూచిస్తున్నది. గణాంకాలు 2002లో తీయబడినవి.

అల్లు రామలింగయ్య

అల్లు రామలింగయ్య (అక్టోబర్ 1, 1929 - జూలై 31, 2004) ప్రముఖ సినీ నటుడు, నిర్మాత. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. ఆయన కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారే. ఆయన కుమారుడు అల్లు అరవింద్ ప్రముఖ సినీ నిర్మాత. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడైన చిరంజీవి ఆయన అల్లుడు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఆంధ్ర విశ్వకళా పరిషత్ లేదా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University), భారతదేశంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది.

ఈ విశ్వవిద్యాలయం 1926లో ఏర్పడింది. మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పడింది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ యొక్క ఆదర్శ విశ్వవిద్యాలయము రూపులో తీర్చిదిద్దబడింది.

తర్వాత 1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము ఏర్పడింది. ఆతర్వాత, 1967లో గుంటూరు లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయముగా అవతరించింది. దీని పేరును ఆచార్య నాగార్జునుని పేరిట 2004 లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయము గా మార్చారు.

ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణము (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

విశ్వవిద్యాలయానికి విశాఖపట్టణం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల లోను, తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ లోను, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం లోను, విజయనగరం జిల్లాలో విజయనగరం లోను ఆ కేంద్రాలు ఉన్నాయి. కాని, 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయమును ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ఆ విధంగా, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. కాని అనుబంధ కళాశాలలకు సంబంధించి కొంత కుదించుకు పోయినా, విశ్వవిద్యాలయ ప్రాంగణములో దాని ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. నాక్ (NAAC) సంస్థ " ఎ " గ్రేడుతో అనుబంధం ఇవ్వడం దీనికి తార్కాణం.

కేరళ

కేరళ (ఆంగ్లం: Kerala,കേരളം ) రుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రము. కేరళ సరిహద్దులలో తూర్పు మరియు ఈశాన్య దిక్కులలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. దక్షిణ భారతంగా పరిగణించబడే నాలుగు రాష్ట్రాలలో కేరళ ఒకటి.

క్రీ.పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాతి కాలంలో చేర సామ్రాజ్యంలోను, భూస్వామ్య నంబూదిరిల పాలనలోను ఉంటూ వచ్చింది. విదేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలు చివరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి 1956 నవంబర్ 1 న కేరళ పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది. 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువాన్కూరు సంస్థానాలు చేపట్టిన సామాజిక సంస్కరణలు స్వాతంత్ర్యం తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించారు. అందువలన మూడో ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలిచింది. అయితే, ఆత్మహత్యలు,నిరుద్యోగం, నేరాలు భారత్‌లో కెల్లా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి.కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో వివాదం ఉంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి - ఈరెంటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా పిలుచుకుంటారు. చేర, ఆళం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో వాదన.

ట్రావన్కోర్ (తిరువాన్కూరు) రాజు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనంతపురం లోని పద్మ నాభ స్వామికి అంకితం చేసి ఆయన దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తర్వాత ఆయన వారసులైన రాజులు కూడా ఆ విధంగా నే చేసారు. రాజ ముద్రలు దేవుని పేరునే ఉండేవి. అందు కనే కేరళను "God's own country" భగవంతుని రాజ్యంగా అంటారు.

కొంగర జగ్గయ్య

కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 - మార్చి 5, 2004) ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు.

జూలై 28

జూలై 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 209వ రోజు (లీపు సంవత్సరములో 210వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 156 రోజులు మిగిలినవి.

జూలై 5

జూలై 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 186వ రోజు (లీపు సంవత్సరములో 187వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 179 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 26

డిసెంబర్ 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 360వ రోజు (లీపు సంవత్సరములో 361వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 5 రోజులు మిగిలినవి.

తెలంగాణ రాష్ట్ర సమితి

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27 న అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.ఆలె నరేంద్ర, సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు తెరాసను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు సలీమా బాషా (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.

తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్రానికి చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.

13వ లోక్‌సభ (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచింది.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం

ధర్మవరపు సుబ్రహ్మణ్యం (సెప్టెంబర్ 20, 1954 - డిసెంబర్ 7, 2013) తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించాడు. స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం .వామపక్షభావాలు కలిగిన సుబ్రహ్మణ్యం గతంలో ప్రజా నాట్యమండలి తరఫున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు. దూరదర్శన్లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు పొందాడు. చిత్రరంగంలో హాస్యపాత్రలో తనదైన ముద్రతో ప్రముఖస్థానంలో కొనసాగుతున్నాడు. దర్శకునిగా (తోకలేని పిట్ట) కూడా కొంత ప్రయత్నం చేశాడు. ఆయన 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేసాడు. 2004 నుండి 2013 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగారు .

నారా చంద్రబాబునాయుడు

నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి 1వ ముఖ్యమంత్రి (2014-2019). విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. అతను ఇండియా టుడే నుండి "ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం", ద ఎకనమిక్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్", టైమ్స్ ఆసియా నుండి "సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్", ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు. అతను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు.

నిహోనియం

నిహోనియం (Nh) ఒక రసాయన మూలకం. ఈ మూలకాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించేరు. ఇది మిక్కిలి వికీర్ణ ఉత్తేజితమైన (radio-active) పదార్థం. దీని ఏకస్థానులలో (isotopes) ఎక్కువ నిశ్ఛలత కల నిహోనియం-286 యొక్క అర్ధ ఆయుర్దాయం 10 సెకండ్లు. ఆవర్తన పట్టికలో ఇది 7 వ ఆవర్తులో, 13 వ గుంపులో (అనగా, బోరాన్ గుంపులో) కనిపిస్తుంది. ఇంత వికీర్ణ ఉత్తేజితమైన పదార్థం ఇంత ఎక్కువ అర్ధ ఆయుర్దాయం కలిగి ఉండడం అబ్బురమే! దీనికి కారణం ఇది "ఎక్కువ స్థిర నిశ్చలత ఉన్న ద్వీపం" (en: island of stability) లో ఉండడమే అన్న వాదం ఒకటి ఉంది.

డూబ్నాలో ఉన్న రష్యా-అమెరికా సంయుక్త అణుగర్భ పరిశోధనా సంస్థ (en:JINR) సా. శ. 2002 లోనూ, రైకెన్ (Riken) లో ఉన్న జపానీ సంస్థ సా. శ. 2003 లో దీనిని తమ ప్రయోగశాలలో తయారు చేసేమని ప్రకటించేరు. ఈ ప్రతిష్ఠ ఎవరికి దక్కుతుందో నిశ్చయించడానికి అమెరికా, జెర్మనీ, స్వీడన్, చైనాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి జపానుకి దక్కుతుందని తీర్మానించేరు. అప్పుడు జపనీయులు సా. శ. 2016 లో ఈ మూలకానికి నిహోనియం (జపానీలో జపాను దేశాన్ని నిహాన్ అంటారు).

సెప్టెంబర్ 2003 లో మొదలు పెట్టి జపనీయులు బిస్మత్ ని జింక్ తో బాది ప్రయోగాలు చెయ్యగా జూలై 2004 లో ఒకే ఒక్క అణువు (atom) 278113 వారికి లభించింది. వారి ప్రయత్నం ఈ దిగువ చూపిన సమీకరణం ద్వారా తెలియబరచవచ్చు:

20983Bi + 7030Zn → 279113* → 278113 + neutron

అత్యంత విలువైన లోహాలలో అగ్రస్థానం ఈ మూలకానిదే! ఒక అణువు నిహోనియం 7.5 మిలియను అమెరికా డాలర్లు ఉంటుందని సా. శ. 2019 లో అంచనా వేసేరు.

నిహోనియం యొక్క సంగతకులు లేదా "సహకుటింబీకులు" (homolgues) అయిన బోరాన్ (Bo), అల్లూమినం (Al), గేలియం (Ga), ఇండియం (In), థేలియం (Th) లక్షణాలని బట్టి నిహోనియం లక్షణాలని ఊహించవచ్చు. నిహోనియం రసాయన లక్షణాలు నేటికి (2019) ఇంకా అవగాహన లోకి రాలేదు.

పాములపర్తి వెంకట నరసింహారావు

పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.

ప్రధానమంత్రి

ప్రధానమంత్రి భారత ప్రభుత్వ అధినేత. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం. పదవి రీత్యా రాష్ట్రపతి స్థానం దీనికంటే ఉన్నతమైనదైనా, రాష్ట్రపతి అధికారాలు కేవలం అలంకారప్రాయము, నామమాత్రము కాగా, వాస్తవంలో అధికారాలన్నీ ప్రధానమంత్రి వద్దే కేంద్రీకృతమై ఉంటాయి.

భారత్ అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి లో లోక్‌సభలో అత్యధిక బలం కలిగిన రాజకీయ పక్షానికి గాని, కూటమికి గాని నాయకుడై, సభలో మెజారిటీ పొందగలిగి ఉండాలి. ప్రధాన మంత్రి లోక్‌సభ లోగాని, రాజ్యసభ లోగాని సభ్యుడై ఉండాలి, లేదా ప్రధానమంత్రిగా నియమితుడైన ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి.

భారతీయ జనతా పార్టీ

భారతీయ జనతా పార్టీ (భాజపా), భారతదేశంలోని ప్రముఖ జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గం యొక్క మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు మరియు దృఢమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిని ఇస్తున్నాయి.

స్థాపన నుండే, భాజపా భారత జాతీయ కాంగ్రేసు యొక్క ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. భారతీయ రాజకీయరంగంలో నాలుగు దశాబ్దాలపాటు ఆధిపత్యము వహించిన కాంగ్రేసు పార్టీ యొక్క వామపక్ష ధోరణులను తిప్పివేసేందుకు భాజపా ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. అయితే భాజపా భావజాల యుద్ధ నినాదము మాత్రం హిందుత్వమే (సాంస్కృతిక హిందూ జాతీయవాదం).

భాజపా, అనేక ఇతర పార్టీల మద్దతుతో 1999 నుండి 2004 వరకు భారత కేంద్ర ప్రభుత్వాన్ని పాలించింది. దాని సీనియర్ నాయకులైన అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగాను, లాల్ కిషన్ అద్వానీ ఉప ప్రధానమంత్రిగానూ పనిచేశారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో ప్రధాన పార్టీ అయిన భాజపా, భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షముగా 2014 మే వరకు కొనసాగింది.

2014 సార్వత్రిక ఎన్నికలలో లోక్ సభ లోని 543 స్థానాలకు మునుపెన్నడూ లేనన్ని 281 స్థానాలు గెలుచుకున్న భాజపా (మిత్ర పక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమికి 337 స్థానాలు) నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారం చేబట్టింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం లో మళ్లీ అధికారం చేపట్టింది.

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం విజయనగరం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. ఈ జిల్లా 1979 జూన్ 1 తేదీన ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారము విజయనగరం జిల్లా యొక్క జనాభా 22,45,100. ఈ జిల్లా సరిహద్దులు శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాలు, ఒడిషా రాష్ట్రం మరియు బంగాళా ఖాతము.

Map

21వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.