2000

2000 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1997 1998 1999 2000 2001 2002 2003
దశాబ్దాలు: 1980లు 1990లు 2000లు 2010లు 2020లు
శతాబ్దాలు: 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

  • జనవరి 1: ప్రపంచ వ్యాప్తంగా మిలీనియం వేడుకలు నిర్వహించబడ్డాయి.

ఫిబ్రవరి

  • ఫిబ్రవరి 6: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.
  • ఫిబ్రవరి 17: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది

మార్చి

మే

జూలై

సెప్టెంబర్

నవంబర్

మరణాలు

C-SUBRAMANIAM10798
సి.సుబ్రమణ్యం

పురస్కారాలు

నోబెల్ బహుమతులు

  • భౌతికశాస్త్రం: జోరెస్ ఇవనోవిచ్ అల్ఫెరోవ్, హెర్బెర్ట్ క్రోమెర్, జాక్ కిల్బీ.
  • రసాయనశాస్త్రం: అలాన్ హీగర్, అలాన్ మక్ డైర్మిడ్, హిడెకి షిరకావా.
  • వైద్యం: అర్విడ్ కార్ల్‌సన్, పాల్ గ్రీన్‌గర్డ్, ఎరిక్ కాండెల్.
  • సాహిత్యం: గావో జింగ్జియాన్.
  • శాంతి: కిం డే జంగ్
  • ఆర్థికశాస్త్రం: జేమ్స్ హెక్‌మన్, డేనియల్ మెక్ ఫాడెన్.
2001

2001 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి 1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో వేమూరి రాధాకృష్ణ సారథ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా నవ్య వారపత్రిక, ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి ఛానల్ నడుపబడుతున్నాయి.

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh, హిందీ: उत्तर प्रदेश, ఉర్దూ: اتر پردیش) భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రము. వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రము. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రము లక్నో. కాని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం మాత్రం అలహాబాదులో ఉంది. ఇంకా ఆగ్రా, అలీగఢ్, అయోధ్య, వారాణసి, గోరఖపూర్, కాన్పూర్ ముఖ్యమైన నగరాలు. ఉత్తరప్రదేశ్ పొరుగున ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

ఉత్తరప్రదేశ్ ప్రధానంగా గంగా యమునా మైదానప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. 2000 సంవత్సరంలో పార్లమెంట్ చట్టం ప్రకారం అప్పటి మరింత విస్తారమైన ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర పర్వతప్రాంతం ఉత్తరాంచల్ అనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా కలిగి ఉంది. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి. అవి - చైనా, భారత్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండొనేషియా, బ్రెజిల్. సమకాలీన భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా కీలకమైనది కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.

భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి. మొత్తం రాష్ట్రంలో అక్షరాస్యత బాగా తక్కువ. అందునా మహిళలలో అక్షరాస్యత మరీ తక్కువ (భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉన్నది)

ఏప్రిల్ 8

ఏప్రిల్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 98వ రోజు (లీపు సంవత్సరములో 99వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 267 రోజులు మిగిలినవి.

కోట శ్రీనివాసరావు

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1945, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు.ఇతని పేరు కోట ప్రసాద్.ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

చిత్తూరు జిల్లా

చిత్తూరు భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక నగరం మరియు జిల్లాకేంద్రం. చిత్తూరు జిల్లా రాయలసీమలో ఒక భాగం. చిత్తూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌కు దక్షిణాన తమిళనాడు సరిహద్దులలో ఉంది. చిత్తూరుకు పశ్చిమాన తమిళనాడు జిల్లాలైన అయిన ఆర్కాట్ మరియు ధర్మపురి, కర్ణాటక జిల్లా అయిన కోలార్ జిల్లా, తూర్పున తమిళ నాడు జిల్లాలైన అణ్ణా మరియు చెంగై జిల్లాలు, ఉత్తరాన వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల మధ్య ఉంది. జిల్లాను రెండు సహజ విభాగాలుగా విభజించ వచ్చు. ఒకటి కొండలు లోయలతో కూడిన మదనపల్లి విభాగం, రెండవది మైదాన ప్రాంత మండలాలతో కూడిన పుత్తూరు విభాగం.తిరుపతి, కాణిపాకం మరియు శ్రీ కాళహస్తి దేవాలయాలకు ప్రసిద్ధి. ఇది ధాన్యములు, చెరకు, మామిడి, మరియు వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనె గింజలు మరియు బియ్యం మిల్లింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ మండలాలు మరియు గ్రామాలు గలిగిన జిల్లా చిత్తూరు జిల్లా. Map

ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़) (Chhattisgarh), మధ్య భారత దేశములోని ఒక రాష్ట్రము. ఈ రాష్ట్రము 2000 నవంబర్ 1న మధ్య ప్రదేశ్లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. రాయ్‌పుర్ రాష్ట్రానికి రాజధాని.

ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒడిషా, ఈశాన్యాన జార్ఖండ్ మరియు ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

రాష్ట్రము యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానము అంచులలో ఉంది. గంగా నది యొక్క ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుతున్నది. సాత్పూరా శ్రేణులు యొక్క తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి యొక్క పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది మరియు దాని ఉపనదుల యొక్క మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము దక్కన్ పీఠభూమిలో గోదావరి మరియు దాని ఉపనది ఇంద్రావతి యొక్క పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.

ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాషలు మాట్లాడే గోండులకు ఆలవాలము.

దీనికి ఉత్తరాన మరియు దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రంలో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రంకు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దక్షిణాన, తూర్పున ఒడిషా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ మరియు ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.

ఛత్తీస్ గడ్ ముఖ్య భాష ఛత్తీస్ గడీ. ఇంతేకాకుండా హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు మరియు ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.

ఛత్తీస్ గడ్ లో 18 జిల్లాలు (డిస్ట్రిక్ట్స్) ఉన్నాయి. అవి బస్తర్, బిలాస్ పూర్, బీజాపూర్, దన్తెవాడ (దక్షిణ బస్తర్), దమ్తరి, దుర్గ్, జంజ్గీర్-చంప, జష్పూర్, కాంకేర్ (ఉత్తర బస్తర్), కవర్ద, కోర్బా, కొరియ, మహాసముంద్, నారాయణ్ పూర్, రాయ్ గడ్, రాయ్ పూర్, రాజ్ నంద్ గాంవ్ మరియు సర్గుజ.

వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సోలభ్యానికై విభజించబడ్డాయి.

జార్ఖండ్

జార్ఖండ్ లేదా ఝార్ఖండ్ (Jharkhand), (ᱡᱷᱟᱨᱠᱷᱚᱸᱰ) భారతదేశంలో ఒక రాష్ట్రము. దీనికి ఉత్తరాన బీహార్, పశ్చిమాన ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తూర్పున పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఒడిషా రాష్ట్రాలున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రానికి రాజధాని పారిశ్రామికనగరమైన రాంచి. ఇంకా ముఖ్యనగరాలైన జంషెడ్‌పూర్, బొకారో, ధన్‌బాద్‌కూడా భారీగా పరిశ్రమలున్న నగరాలు.

2000 నవంబరు 15న బీహార్ రాష్ట్రంనుండి దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి జార్ఖండ్ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేశారు. చిరకాలం శాంతియుతంగా, ప్రజాస్వామికంగా జరిగిన పోరాటానికి ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది.

దట్టమైన అడవులు ఎక్కువగా ఉన్నందున జార్ఖండ్‌ను "వనాంచల్" అనికూడా అంటారు. అడవులే కాదు. అపారమైన ఖనిజసంపద కూడా ఝార్ఖండ్ రాష్ట్రపు ప్రత్యేకత. భారత రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ తను రచించిన "Ignited Minds"అనే పుస్తకంలో వినియోగానికి వేచియున్న ఖనిజాల నిలయం అని చాలాసార్లు జార్ఖ్షండ్‌ను ప్రస్తావించాడు.

ఫిబ్రవరి 17

ఫిబ్రవరి 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 48వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 317 రోజులు (లీపు సంవత్సరములో 318 రోజులు) మిగిలినవి.

ఫిబ్రవరి 29

ఫిబ్రవరి 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము లీపు సంవత్సరము లోని 60వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 306 రోజులు మిగిలినవి. ఈ తేదీ నాలుగు సంవత్సరములకు ఒకసారే వచ్చును.లీప్ దినం ఫిభ్రవరి 29. లీప్ సంవత్సరంలో అదనంగా వుండేరోజు. నాలుగు చేత శేషం లేకుండా భాగించబడే సంవత్సరం. (మినహాయింపులు 400 చేత భాగించబడని).

ఉదా:2008 లీపు సంవత్సరం. 1900 సంవత్సరం లీపు సంవత్సరం కాదు. కారణం ఏమిటంటే, 1700, 1800, 1900 సంవతరాలు 400 చేత భాగింపబడవు. 400 చేత భాగింపబడే 1600, 2000, 2400 సంవత్సరాలు లీపు సంవత్సరాలు. లీపు దినం నాడు జన్మించిన వారిని 'లీప్ లింగ్స్' అని, 'లీపర్స్' అని అంటారు. మనకు తెలిసిన లీప్ లింగ్/లీపర్ పూర్వ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.

మధ్య ప్రదేశ్

మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) (హిందీ:मध्य प्रदेश) - పేరుకు తగినట్లే భారతదేశం మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని నగరం భోపాల్. ఇంతకు పూర్వం దేశంలో వైశాల్యం ప్రకారం మధ్యప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా ఉండేది. కాని 2000 నవంబరు 1 న మధ్యప్రదేశ్‌లోని కొన్నిభాగాలను వేరుచేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.

మాధవపెద్ది సత్యం

మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 - డిసెంబర్ 18, 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ మరియు సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.

లివర్మోరియం

లివర్మొరియం చిహ్నం Lv మరియు పరమాణు సంఖ్య 116 తో ఒక సింథటిక్ అతి (సూపర్) భారీ మూలకం. ఇది ఒక చాలా రేడియోధార్మిక మూలకంగా ఉంది.

ప్రయోగశాలలో మాత్రమే సృష్టించబడింది మరియు ప్రకృతిలో ఇది గమనించినట్లు లేదు. ఈ మూలకం, 2000 లో లివర్మొరియం తెలుసుకున్నారు. అణు పరిశోధనలకు జాయింట్ ఇన్స్టిట్యూట్, డుబ్న, రష్యాతో యునైటెడ్ స్టేట్స్ లోని లారెన్స్ లివర్మోరే నేషనల్ లాబొరేటరీ కలిసి వారు పేరు పెట్టారు. ప్రయోగశాల అది ఉన్న లివర్మోరే, కాలిఫోర్నియా నగరం, గౌరవార్ధంగా పేరుతో ఉన్నది క్రమంగా రాంచెర్ అని పేరు పెట్టబడింది మరియు

భూస్వామి రాబర్ట్ లివర్మోరే అని పేరు పెట్టబడింది. పేరు మే 30, 2012 IUPAC చే స్వీకరించబడింది. లివర్మొరియం 290 నుండి 293 కలుపుకొని భారీ సంఖ్యలతో; నాలుగు ఐసోటోపులు ఉన్నాయి, వాటిలో పొడవైన జీవితకాలం కలది లివర్మొరియం-293గా ఉంది. దీని ఒక సగం జీవితం కాలం సుమారుగా 60 మిల్లీ సెకండులుగా ఉంది.

ఆవర్తన పట్టికలో, ఇది ఒక పి (p) బ్లాక్ ట్రాన్స్ ఆక్టినైడ్ మూలకం. ఇది 7 వ కాలంలో ఒక మూలకం మరియు భారీ చాల్కోజన్ వంటిది, ఇది చాల్కోజన్ పొలోనియం వలె భారీ హోమోలోగ్ ప్రవర్తించేలా నిర్ధారించబడలేదు అయితే గ్రూపు 16 లో ఉంచుతారు.

లివర్మొరియం, దాని తేలికైన హోమోలోగ్స్, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, మరియు పొలోనియం కొన్ని ఇలాంటి లక్షణాలు కలిగి లెక్కిస్తారు. అది కూడా వాటిని నుండి అనేక ప్రధాన వ్యత్యాసాలను చూపిస్తుంది.

విజయవాడ

విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్దనగరం.ఇది కృష్ణా జిల్లా లో, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతంలతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. మద్రాసు-హౌరా మరియు మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములకు విజయవాడ కూడలి. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఎండాకాలంలో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజువాడ అన్నాడట.

విభాండక ఋషి

విభాండక ఋషి (హిందీ- विभान्डक ॠषि), కశ్యపుడు యొక్క వంశీయుడైన హిందూ సన్యాసి లేదా ఋషి.

శతాబ్దము

శతాబ్దము లేదా శతాబ్ది (Centuary) అనేది 100 సంవత్సరములకు సమానమైన ఒక కాలమానము.

ప్రస్తుతం మనము క్రీ.శ. 21 వ శతాబ్దం (2001 - 2100) లో ఉన్నాం.

శ్రీకాకుళం

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.