1999

1999 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002
దశాబ్దాలు: 1970లు - 1980లు - 1990లు - 2000లు - 2010లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

  • జనవరి 1: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
  • జనవరి 3: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.

ఫిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

  • జూన్ 21: ఆపిల్ కంప్యూటర్ తొలి ఐబుక్‌ను విడుదల చేసింది.

సెప్టెంబర్

అక్టోబర్

డిసెంబర్

  • డిసెంబర్ 24: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కామ్దహార్‌కు హైజాక్ చేయబడింది.

మరణాలు

Shankar Dayal Sharma 36
శంకర్ దయాళ్ శర్మ

పురస్కారాలు

నోబెల్ బహుమతులు

  • భౌతికశాస్త్రం:గెరార్డస్ హూహ్ట్, మార్టినస్ వెల్ట్‌మన్.
  • రసాయనశాస్త్రం: అహ్మద్ జెవేల్.
  • వైద్యం: గుంటర్ బ్లోబెల్.
  • సాహిత్యం: గుంటర్ గ్రాస్.
  • శాంతి: మెడిసిన్స్ శాన్స్ ఫ్రాంటియర్స్.
  • ఆర్థికశాస్త్రం: రాబర్ట్ ముండెల్.
1924

1924 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2001

2001 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ఋషిపీఠం

ఋషిపీఠం భారతీయ మానస పత్రిక. ఇది హైదరాబాదులో ముద్రించబడుతున్న తెలుగు ఆధ్యాత్మిక మాసపత్రిక. ఈ పత్రిక 1999లో రిజిస్టర్ చేయబడినది; 2009 సంవత్సరంలో ఈ పత్రిక దశమ వార్షికోత్సవాలు జరుపుకుంటుంది. దీని వ్యవస్థాపక సంపాదకులు సామవేదం షణ్ముఖశర్మ మరియు ప్రచురణకర్త ఉపద్రష్ట శివప్రసాద్. ఈ పత్రిక ఇంతవరకు విస్తృతమైన సమాచారంతో మూడు విశిష్ట సంచికలను ముద్రించింది.

ఎక్కిరాల వేదవ్యాస

ఎక్కిరాల వేదవ్యాస (1934-2014) ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యావేత్త, ఆధ్యాత్మిక పరిశోధకుడు మరియు యోగా గురువు.

ఎన్.టి.రామారావు జాతీయ అవార్డు

ఎన్. టి. ఆర్. జాతీయ అవార్డు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానటుడు, మహానాయకుడు అయిన ఎన్.టి.రామారావు పేరిట 1996లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ అవార్డును నెలకొల్పింది. దేశంలోనే అత్యధికంగా ఐదు లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు ఈ జాతీయ అవార్డును యావద్భారత చలన చిత్ర రంగంలో మేరునగసమానాధీశులైన వారికి ప్రదానం చేస్తోంది.

ఇప్పటి వరకు ఈ అవార్డును అందుకున్న ప్రముఖులలు1996 - అక్కినేని నాగేశ్వరరావు

1997 - దిలీప్ కుమార్

1998 - శివాజీగణేశన్

1999 - లతా మంగేష్కర్

2000 - హృషికేశ్‌ ముఖర్జీ

2001 - భానుమతీ రామకృష్ణ

2002 - రాజ్‌కుమార్

2003

2004

2005

2006 - వహీదా రెహ్మాన్

ఏప్రిల్ 13

ఏప్రిల్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 103వ రోజు (లీపు సంవత్సరములో 104వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 262 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 13

డిసెంబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 347వ రోజు (లీపు సంవత్సరములో 348వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 18 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 24

డిసెంబర్ 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 358వ రోజు (లీపు సంవత్సరములో 359వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 7 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1999

శ్రీసత్యనారాయణమ్మా ప్రొడక్షన్స్‌ 'సమరసింహారెడ్డి' సంచలన సూపర్‌హిట్‌గా విజయం సాధించి, ఫ్యాక్ష న్‌ తరహా కథలకు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచి, కలెక్షన్లలో, రన్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. 'రాజా', 'తమ్ముడు', 'దేవి' కూడా సూపర్‌హిట్‌గా నిలిచి రజతోత్సవం జరుపుకున్నాయి. మహేశ్‌బాబు హీరోగా పరిచయమైన 'రాజకుమారుడు' కూడా సూపర్‌హిట్‌ అయింది. " ప్రేమకు వేళాయెరా, ప్రేయసిరావే, సీతారామరాజు, స్నేహం కోసం, స్వయంవరం" శతదినోత్సవాలు జరుపుకోగా, "యమజాతకుడు, సముద్రం, సాంబయ్య, పోలీస్‌,దేవా" సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి. "ఇద్దరు మిత్రులు, సుల్తాన్‌" కూడా శతదినోత్సవం జరుపుకున్నాయి. శంకర్‌ డబ్బింగ్‌ చిత్రం 'ఒకే ఒక్కడు' సూపర్‌ హిట్టయింది. రజనీకాంత్‌ డబ్బింగ్‌ చిత్రం 'నరసింహా' తెలుగు చిత్రాలతో సమానంగా విజయం సాధించి, రజనీకి తమిళంతో పాటు తెలుగులో సమాంతర మార్కెట్‌ను సృష్టించింది.

స్నేహం కోసం

నేటి గాంధీ

తెలంగాణా (సినిమా)

సమరసింహారెడ్డి

పెద్దమనుషులు

మానవుడు-దానవుడు

విచిత్రం

సీతారామరాజు

మాణిక్యం

పోలీస్

వెలుగునీడలు

స్వప్నలోకం

యమజాతకుడు

అమ్మో పోలీసోళ్ళు

ఇంగ్లీషు పెళ్లాం ఈష్టు గోదావరి మొగుడు

దేవి

హరిశ్చంద్ర

రాజా

చిన్ని చిన్ని ఆశ

మనసులో మాట

ఫిల్మ్ నగర్

కూలన్న

ప్రేమ కథ

వీడు సామాన్యుడు కాడు

గుప్త శాస్త్రం

స్వయంవరం

రాజస్థాన్

ఇద్దరు మిత్రులు

సుల్తాన్

భారతరత్న (సినిమా)

నా హృదయంలో నిదురించే చెలీ

అల్లుడుగారు వచ్చారు

స్పీడ్ డాన్సర్

ప్రేమించేమనసు

ఓ స్త్రీ రేపురా

తమ్ముడు

రాజకుమారుడు

బొబ్బిలి వంశం

ప్రేమకు వేళాయెరా

ఆశలసందడి

శీను

పిచ్చోడి చేతిలో రాయి

అనగనగా ఓ అమ్మాయి

దేవా

హలో యమ

పిల్ల నచ్చింది

కృష్ణ బాబు

మా బాలాజీ

ప్రేమించేది ఎందుకమ్మా

ప్రేమ కోసం

మెకానిక్ మావయ్య

రావోయి చందమామ

సముద్రం

పంచదార చిలక

శృంగార పురుషుడు

ప్రేయసి రావే

రామసక్కనోడు

సాంబయ్య

నీకోసం

రైతురాజ్యం

టైం

సూర్య పుత్రిక

ఆవిడే శ్యామల

తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్రానికి చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.

13వ లోక్‌సభ (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచింది.

దేవి (సినిమా)

దేవి 1999 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం. ఈ సినిమాకు మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించిన శ్రీ ప్రసాద్, ఈ సినిమాను తన పేరులో చేర్చుకుని దేవి శ్రీప్రసాద్ గా మారాడు.

న్యూజీలాండ్

న్యూజీలాండ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి మూలన ఉన్న ఒక ద్వీపం. ఇందులో ప్రధానంగా రెండు భూభాగాలున్నాయి. ఒకటి ఉత్తర ద్వీపం మరియొకటి దక్షిణ ద్వీపం. ఇంకా చిన్న చిన్న ద్వీపాలైన స్టీవార్ట్, చాతామ్ వంటి ద్వీపాల సమూహమే న్యూజీలాండ్.

న్యూజీలాండ్ అనే భూభాగాన్ని అన్నింటికన్నా చివరన కనుగొన్నారు. ప్రపంచంలోనే అతి పిన్న దేశంగా పేరు గాంచింది. అంతర్జాతీయ కాలరేఖకు దగ్గరగా ఉండటం చేత ఈ దేశపు వాసులు అందరికన్నా ముందుగా సూర్యోదయాన్ని వీక్షిస్తారు. విద్యా సౌకర్యాల్లో అగ్ర దేశాలతో సమానంగా ఉంది. అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి. మహిళకు ఓటు హక్కు ఇచ్చిన మొట్టమొదటి దేశం.1999 నుంచి 2008 వరకూ సుదీర్ఘకాలం హెలెన్ క్లార్క్ ప్రధాన మంత్రిగా పని చేసింది. న్యూజిలాండ్ కు ప్రధానిగా పనిచేసిన రెండవ మహిళ హెలెన్. ఆమె తరువాత డేవిడ్ షేరర్ ప్రధానిగా చేయగా, ప్రస్తుతం జాన్ కీ బాధ్యతలు చేపట్టాడు.

ఫ్లోరిన్

ఫ్లోరిన్ (లాటిన్ : అర్థం "ప్రవహించు"), అనేది ఒక వాయు రూపంలో ఉండే మూలకము. దీని సంకేతము F మరియు పరమాణు సంఖ్య 9. రసాయనిక చర్యలలో అతి చురుకుగా పాల్గొంటుంది. స్వచ్ఛమైన స్థితిలో ఫ్లోరిన్ లేత గోధుమ రంగులో ఉండే విష వాయువు. దీని రసాయనిక ఫార్ములా F2. అన్ని ఇతర హాలోజన్ మూలకాల వలె ఇది కూడా చాలా ప్రమాదకరమైనది. తాకగానే చర్మాన్ని కాల్చుతుంది. కర్బనముతో దీని మిశ్రమాలు ఫ్లోరోకార్బన్లు చాలా పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ

భారతీయ జనతా పార్టీ (భాజపా), భారతదేశంలోని ప్రముఖ జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గం యొక్క మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు మరియు దృఢమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిని ఇస్తున్నాయి.

స్థాపన నుండే, భాజపా భారత జాతీయ కాంగ్రేసు యొక్క ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. భారతీయ రాజకీయరంగంలో నాలుగు దశాబ్దాలపాటు ఆధిపత్యము వహించిన కాంగ్రేసు పార్టీ యొక్క వామపక్ష ధోరణులను తిప్పివేసేందుకు భాజపా ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. అయితే భాజపా భావజాల యుద్ధ నినాదము మాత్రం హిందుత్వమే (సాంస్కృతిక హిందూ జాతీయవాదం).

భాజపా, అనేక ఇతర పార్టీల మద్దతుతో 1999 నుండి 2004 వరకు భారత కేంద్ర ప్రభుత్వాన్ని పాలించింది. దాని సీనియర్ నాయకులైన అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగాను, లాల్ కిషన్ అద్వానీ ఉప ప్రధానమంత్రిగానూ పనిచేశారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో ప్రధాన పార్టీ అయిన భాజపా, భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షముగా 2014 మే వరకు కొనసాగింది.

2014 సార్వత్రిక ఎన్నికలలో లోక్ సభ లోని 543 స్థానాలకు మునుపెన్నడూ లేనన్ని 281 స్థానాలు గెలుచుకున్న భాజపా (మిత్ర పక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమికి 337 స్థానాలు) నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారం చేబట్టింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం లో మళ్లీ అధికారం చేపట్టింది.

మెదడు

మానవునిలో మెదడు (Brain) తలభాగంలో కపాళంచే రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం.మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని తేలింది. సెరిబ్రల్‌ కార్టెక్స్‌ ప్రాంతంలో నాడీకణాలు గాయాలకు తగినట్లుగా తమ ఆకృతిని సైతం మార్చుకుని పునరుత్తేజం పొందుతున్నట్లు గుర్తించారు. మెదడుకి ఎం చెయ్యాలో ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, గత విషయాలు గుర్తు పెట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే పురుషులకు జ్ఞాపక శక్తికంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, స్త్రీలకు తెలివితేటలకంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని, పురుషులు స్త్రీల కంటే తెలివైనవారని తాజా పరిశోధనల్లో తేలింది. దీనికి కారణం మెదడులో న్యూరాన్ల నిర్మాణంలో తేడాయే అని తేలింది. 1999 నుండి 2005 వరకూ రిచర్డ్ లిన్ నిర్వహించిన మెటా స్టడీలో సగటు తెలివితేటలు స్త్రీలకంటే పురుషుల్లో 3 - 5 పాయింట్లు ఎక్కువని తేలింది. 17, 18 సంవత్సరాల వయసు గల బాలురలో తెలివితేటలు 3.63 పాయింట్లు ఎక్కువ ఉన్నట్లు జాక్సన్ మరియు రస్టన్ అను శాస్త్ర వేత్తలు తేల్చారు.

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం విజయనగరం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. ఈ జిల్లా 1979 జూన్ 1 తేదీన ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారము విజయనగరం జిల్లా యొక్క జనాభా 22,45,100. ఈ జిల్లా సరిహద్దులు శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాలు, ఒడిషా రాష్ట్రం మరియు బంగాళా ఖాతము.

Map

సాలూరు రాజేశ్వరరావు

సాలూరు రాజేశ్వరరావు తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి

సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి'ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ 'వై. సత్యారావు'ని చెబుతారు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.