1991

1991 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1988 1989 1990 1991 1992 1993 1994
దశాబ్దాలు: 1970లు 1980లు 1990లు 2000లు 2010లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

జనవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31

ఫిబ్రవరి

ఫిబ్రవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28

మార్చి

మార్చి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31  

ఏప్రిల్

ఏప్రిల్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30

మే

మే
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31

జూన్

జూన్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30  

జూలై

జూలై
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31  
  • జూలై 10: భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించాడు.
  • జూలై 24: భారత ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది.
  • జూలై 30: చారిత్రక స్టార్ట్ ఒప్పందంపై అమెరికా, రష్యా అధ్యక్షులు జార్జి బుష్, మిఖాయీల్ గోర్భచెవ్‌లు సంతకాలు చేశారు.

ఆగస్టు

ఆగష్టు
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31

సెప్టెంబర్

సెప్టెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30

అక్టోబర్

అక్టోబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31
  • అక్టోబర్ 27: టర్క్‌మెనిస్తాన్ సోవియట్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.

నవంబర్

నవంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30

డిసెంబర్

డిసెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

జననాలు

మరణాలు

Rajiv Gandhi (1987)
రాజీవ్ గాంధీ

పురస్కారాలు

నోబెల్ బహుమతులు

  • భౌతికశాస్త్రం: పియర్ గిల్స్ డి జెన్నెస్.
  • రసాయనశాస్త్రం: రిచర్డ్ ఆర్ ఎర్నెస్ట్.
  • వైద్యశాస్త్రం: ఎర్విన్ నెహెర్, బెర్ట్ సాక్‌మన్.
  • శాంతి: ఆంగ్ సాన్ సూకీ.
  • ఆర్థికశాస్త్రం: రోనాల్డ్ కోస్.
1918

1918 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా కు ఆ పేరు జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం మచిలీపట్నం కాగా, వాణిజ్య కేంద్రంగా విజయవాడ ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన ఖమ్మం జిల్లా, తూర్పున పశ్చిమ గోదావరి, దక్షిణాన బంగాళాఖాతము, నైరుతిలో గుంటూరు జిల్లా, వాయవ్యంలో నల్గొండ జిల్లా ఉన్నాయి.

Map

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

కే.జీ.మడుగుల

కే.జీ.మడుగుల, విశాఖపట్నం జిల్లా, గంగరాజు మాడుగుల మండలానికి చెందిన గ్రామము.

ఇది మండల కేంద్రమైన గంగరాజు మాడుగుల నుండి కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 91 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 396 ఇళ్లతో, 1991 జనాభాతో 196 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 867, ఆడవారి సంఖ్య 1124. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 7 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1605. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 584970.పిన్ కోడ్: 531029.

కోట శ్రీనివాసరావు

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1945, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు.ఇతని పేరు కోట ప్రసాద్.ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

జనవరి 25

జనవరి 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 25వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 340 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 341 రోజులు).

తెలుగు సినిమాలు 1991

శ్యామ్‌ప్రసాద్‌ ఆర్ట్స్‌ 'గ్యాంగ్‌ లీడర్‌' సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. "అసెంబ్లీ రౌడీ, చిత్రం భళారే విచిత్రం, ప్రేమఖైదీ, మామగారు" కూడా సూపర్‌హిట్‌ అయ్యాయి. "కూలీ నంబర్‌ వన్‌, క్షణ క్షణం, నిర్ణయం, తల్లిదండ్రులు, రౌడీ అల్లుడు, సర్పయాగం, సీతారామయ్యగారి మనవరాలు" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఆదిత్య 369, ఇద్దరుపెళ్ళాల ముద్దుల పోలీస్‌, కలికాలం, ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం, కొబ్బరిబోండాం, పెద్దింటల్లుడు, బావాబావా పన్నీరు, భారత్‌బంద్‌, మధురానగరిలో, రౌడీగారి పెళ్ళాం, శత్రువు, స్టూవర్ట్‌పురం దొంగలు" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. యన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా నటించి, సంచలనం రేపిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' విజయం సాధించలేక పోయింది. 'సీతారామయ్యగారి మనవరాలు'తో అక్కినేని ఓల్డ్‌ గెటప్‌ సినిమాలు, 'మామగారు'తో దాసరి నారాయణరావు నటునిగా అనేక సినిమాలు రావడానికి ఈ యేడాది దోహదం చేసింది. రాష్ట్రంలోనే నిర్మించే తెలుగు చిత్రాలకు ప్రభుత్వం వినోదపు పన్నులో అదనపు రాయితీలు కల్పించడంతో పరిశ్రమ హైదరాబాదు‌కు షిఫ్ట్‌ అయింది.

ఆదిత్య 369

శత్రువు

420

అగ్నినక్షత్రం

అతిరధుడు

అత్తింట్లో అద్దెమొగుడు

అమ్మ రాజీనామా

అమ్మ

అమ్మకడుపు చల్లగా

అల్లుడు దిద్దిన కాపురం

అశ్వని

అసెంబ్లీరౌడీ

ఆగ్రహం

ఆడపిల్ల

ఆత్మబంధం

ఆదిత్య 369

ఇంట్లో పిల్లి వీధిలో పులి

ఇంద్రభవనం

ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్

ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం

ఎర్రమందారం

ఏప్రిల్ 1 విడుదల

కడప రెడ్డమ్మ

కలికాలం

కీచురాళ్ళు అస్త్రం

కులమా గుణమా?

కూలీ నెం 1

కొబ్బరి బొండాం

క్షణక్షణం

గంగ (సినిమా)

గోదావరి పొంగింది

గ్యాంగ్ లీడర్

చిత్రం భాళారే విచిత్రం

చిన్నారి ముద్దులపాప

చెంగల్వ పూదండ

చైతన్య

జగన్నాటకం

జీవన చదరంగం

జైత్రయాత్ర

తరంగాలు

తల్లిదండ్రులు

తారకప్రభుని దీక్షా మహిమలు

తేనెటీగ

తొలిపొద్దు

నాగమ్మ

నాపెళ్ళాం నాయిష్టం

నాయిల్లే నాస్వర్గం

నియంత

నిర్ణయం

నేనేరా పోలీస్

పందిరిమంచం

పరమశివుడు

పరిష్కారం

పల్లెటూరి పెళ్ళాం

పిచ్చిపుల్లయ్య

పీపుల్స్ ఎన్కౌంటర్

పెద్దింటల్లుడు

పెళ్ళిపుస్తకం

ప్రయత్నం

ప్రార్థన

ప్రేమ ఎంతమధురం

ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం

ప్రేమ తపస్సు

ప్రేమఖైదీ

ప్రేమపంజరం

బావాబావా పన్నీరు

బ్రహ్మర్షి విశ్వామిత్ర

భారత్ బంద్

భార్గవ్

మంచిరోజు

మధురానగరిలో

మహాయజ్ఞం

మామగారు

ముగ్గురత్తల ముద్దులఅల్లుడు

మైనర్ రాజా

యుగళగీతం

రాముడు కాదు రాక్షసుడు

రౌడీ అల్లుడు

రౌడీగారి పెళ్లాం

లంబాడోళ్ళ రాందాస్

లేడీస్ స్పెషల్

వదినమాట

విచిత్రప్రేమ

విధాత

వియ్యాలవారి విందు

శాంతి క్రాంతి

శ్రీ ఏడుకొండల స్వామి

శ్రీవారి చిందులు

శ్రీశైల భ్రమరాంబిక కటాక్షం

సంసారవీణ

సర్పయాగం

సీతారామయ్యగారి మనవరాలు

సూపర్ ఎక్స్‌ప్రెస్

సూర్య ఒ. .

స్టూవర్టుపురం దొంగలు

స్టూవర్టుపురం పోలీసుస్టేషన్

స్వతంత్ర భారతం

పి.ఆదినారాయణరావు

పెనుపాత్రుని ఆదినారాయణరావు (ఆగష్టు 21, 1914 - జనవరి 25, 1991) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నిర్మాత. ఇతడు భార్య, సుప్రసిద్ధ నటి అంజలీదేవి పేరుతో స్థాపించిన అంజలీ పిక్చర్స్ అధినేత.

పినాకిని ఎక్స్‌ప్రెస్

పినాకిని ఎక్స్‌ప్రెస్ అనే బండి భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ జంక్షన్ మరియు తమిళనాడు లోని చెన్నై ల మధ్య నడిచే వేగమైన రైలు. ఈ బండి 1991 లో నడపబడింది. పెన్నా నది పేరు మీదగా ఈ బండికి పినాకిని అని పేరు పెట్టినారు. భారతీయ రైల్వే లోని దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే విభాగం దీనిని నడుపుచున్నది.

భారత దేశం

భారత గణతంత్ర రాజ్యము నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో రెండో స్థానం కలిగి వుంది, వైశాల్యములో ప్రపంచంలో ఏడవది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి (పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో భారత దేశం ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది.

దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన (అరేబియా సముద్రము అరేబియా సముద్రం), మరియు తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్[1] దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరికతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము) జన్మనిచ్చింది. 18 వ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా స్వాధీనం చేసుకోవడంతో భారతదేశం బ్రిటిష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ నుండే పాలించబడింది. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం చేసిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1947లో బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందింది.

భారత ఆర్థిక వ్యవస్థ నామమాత్ర GDP మరియు కొనుగోలు శక్తి తుల్యత (PPP) ద్వారా మూడవ అతిపెద్ద ద్వారా ప్రపంచ పదకొండో స్థానంలో ఉంది. 1991 లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది.భారత దేశాన్ని కొత్తగా పారిశ్రామీకరణ జరిగిన దేశంగా భావిస్తారు. అయితే, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, పోషకాహార లోపం, మరియు తగని ప్రజా ఆరోగ్య సవాళ్లను ఎదుర్కుంటూ ఉంది. ఒక అణ్వాయుధ మరియు ప్రాంతీయ శక్తి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైన్యం కలిగి ఉంది. ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. భారతదేశం 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య రాజ్యాంగ గణతంత్రం. భారతదేశం ఒక, బహుభాషా, మరియు బహుళ జాతి సొసైటీ. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశము.

మంచు మోహన్ బాబు

మంచు మోహన్ బాబు (జ. మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.

మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. రజినీకాంత్కు సన్నిహితుడు.

మార్చి 3

మార్చి 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 62వ రోజు (లీపు సంవత్సరములో 63వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 303 రోజులు మిగిలినవి.

యుడికాట్స్

యుడికాట్స్, యుడికోటిడి లేక యుడికోటైలిడన్స్ పుష్పించే మొక్కల యొక్క మోనోఫైలిటిక్ సమూహంలో ఉన్నాయి, వీటిని మునుపటి రచయితలు ట్రికోల్‌పాటిస్ లేదా నాన్-మాగ్నోలిడ్ డికాట్స్ అనేవారు. ఈ వృక్షశాస్త్ర పదాలు పరిణామ వృక్షశాస్త్రజ్ఞుడు జేమ్స్ ఎ. డోయల్ మరియు పాలెయోవృక్షశాస్త్రజ్ఞుడు కరోల్ ఎల్. హోటన్ ద్వారా 1991 లో పరిచయం చేయబడ్డాయి, ముందటి తక్కువ ప్రత్యేకగల డికాట్స్ నుండి ట్రికోల్ పాటి డికాట్స్ యొక్క తదుపరి పరిణామాత్మక వ్యత్యాసాన్ని నొక్కిచెప్పడానికి. షేర్డ్ డిరివేడ్ కారెక్టర్స్ (shared derived characters) యొక్క పదనిర్మాణ అధ్యయనాల్లో tricolpate పుప్పొడి రేణువులతో పుష్పించే మొక్కల మధ్య దగ్గరి సంబంధాలున్నట్టు ప్రారంభంలో భావించబడింది.

రాజీవ్ గాంధీ

రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (ఆగష్టు 20, 1944 – మే 21, 1991), ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఈయన వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.

రావి నారాయణరెడ్డి

రావి నారాయణరెడ్డి, (జూన్ 5, 1908 - సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. ఆయన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా ఆయనను పేర్కొనవచ్చు.

విజయశాంతి

విజయశాంతి ( జననం:జూన్ 24, 1966 ) తెలుగు సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మరియు హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూపర్ స్టార్" మరియు "లేడీ అమితాబ్" గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది. ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది. 1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. 1987లో ఆమె చిరంజీవి తో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనె తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడినాయి. ఆమె అగ్నిపర్వతం (సినిమా), ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, మువ్వగోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, శత్రువు (సినిమా), గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, మరియు చినరాయుడు వంటి విజయవంటమైన సినిమాలలో నటించింది. ఆమె 1980లలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. 1990లలో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్. ఆమె 1998లో రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది.

వినాయకుడు

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయేతెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను)

అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం

అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే(అగజ) పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.

ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం‌

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములో మాత్రమే వినాయకుని, వైష్ణవములో మాత్రము విష్వక్సేన ని పూజిస్తారు. అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్థన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానంలో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు)

వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు (కుమారస్వామి వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు, నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రథము. హిందూ సంప్రదాయముతో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.

సోవియట్ యూనియన్

సోవియట్ యూనియన్ (ఆంగ్లం : Union of Soviet Socialist Republics) (సూక్ష్మ రూపం : USSR) ; రోమనీకరణ : Soyuz Sovetskikh Sotsialisticheskikh Respublik, SSSR), ఇంకనూ సోవియట్ యూనియన్ (రష్యన్ లో Советский Союз ) ; (రోమనీకరణ : Sovetsky Soyuz), రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సోషలిస్టు రాజ్యం. ఇది యురేషియాలో 1922 నుండి 1991 వరకు విలసిల్లింది. 1991 లో ఇందు నుండి దీని రిపబ్లిక్ రాష్ట్రాలు విడిపోయాయి.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ (हिमाचल प्रदेश)

వాయువ్య భారతదేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి తూర్పున టిబెట్ (చైనా), ఉత్తరాన మరియు వాయువ్యమున జమ్మూ మరియు కాశ్మీరు, నైఋతిన పంజాబ్, దక్షిణాన హర్యానా మరియు ఉత్తర్ ప్రదేశ్ మరియు ఆగ్నేయమున ఉత్తరాఖండ్ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్ యొక్క విస్తీర్ణము 55,658 చ.కి.మీలు (21,490 చ.కి.మైళ్లు) మరియు 1991 జనాభా ప్రకారము రాష్ట్రము యొక్క జనాభా 5,111,079. 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభగముగా హిమాచల్ ప్రదేశ్ యేర్పడినది. 1971, జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రముగా అవతరించింది.

రాష్ట్ర రాజధాని షిమ్లా. ధర్మశాల, కాంగ్ర, మండి, కుల్లు, చంబా, డల్‌హౌసీ మరియు మనాలీ ఇతర ముఖ్య పట్టణాలు. రాష్ట్రములో చాలామటుకు ప్రాంతము పర్వతమయము. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన శివాలిక్ పర్వతశ్రేణులు ఉన్నాయి. శివాలిక్ శ్రేణి ఘగ్గర్ నది జన్మస్థలము. రాష్ట్రములోని ప్రధాన నదులు సట్లెజ్ (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉన్నది) మరియు బియాస్ నది. సట్లెజ్ నది మీద కంద్రౌర్, బిలాస్‌పూర్ వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.