1984

1984 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1981 1982 1983 - 1984 - 1985 1986 1987
దశాబ్దాలు: 1960 1970లు - 1980లు - 1990లు 2000లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

స్థాపనలు, ప్రారంభాలు

సంఘటనలు

జననాలు

మరణాలు

Indira Gandhi in 1967
ఇందిరాగాంధీ

పురస్కారాలు

1912

1912 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1926

1926 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

అక్టోబర్ 31

అక్టోబర్ 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 304వ రోజు (లీపు సంవత్సరములో 305వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 61 రోజులు మిగిలినవి.

ఇందిరా గాంధీ

ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది..

మోతీలాల్ నెహ్రూ పేరుమోసిన న్యాయవాది. సంపదలకు నెలవైన ఆ ఇంటికి మోతీలాల్ ఇంగ్లీషు స్నేహితులు (బ్రిటిష్ వారు), స్వదేశీ స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. అతని కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ, కోడలు కమలా నెహ్రూ. కమలా నెహ్రూ సాంప్రదాయక కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం వల్ల అత్తవారింటికి అలవాటు పడటానికి మొదట్లో కొంచెం ఇబ్బంది పడింది. మోతీలాల్ కుటుంబంలోని వారు సవీన సాంప్రదాయానికి అలవాటు పడినవారు.

ఇందిరా ప్రియదర్శిని 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాదులోని ఆనంద్ భవన్ లో జన్మించింది. ఆమ మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు. మోతీలాల్‌కు మనుమరాలంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయన నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నాడు. అయినా తన వృత్తిని వదలలేదు. 1919లో పంజాబ్ లోని వైశాఖీ పండుగ జరుగుతున్న తరుణంలో బ్రిటిష్ వారు జలియన్ వాలా బాగ్‌లో జరిపిన మారణ కాండలో కొన్ని వేలమంది బలయ్యారు. ఈ సంఘటన మోతీలాల్ హృదయాన్ని కదిలించి వేసింది. వెంటనే తన వృత్తిని వదిలిపెట్టాడు. తన వద్ద ఉన్న ఖరీదైన విదేశీ వస్తులనన్నింటినీ తగులబెట్టాడు. ఖద్దరు దుస్తులను మాత్రమే ధరించడం మొదలు పెట్టాడు. తన కుమార్తెకు కాన్వెంట్ స్కూలు మానిపించాడు.

ఇలాంటి తరుణంలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ వారి ఇంటికి వచ్చాడు. నెహ్రూతో చాలా సేపు మాట్లాడాడు. ఇందిరకు వారు మాట్లాడుకున్నది ఏమిటో అర్థం కాకపోయినా ఇంటిలో జరిగే మార్పులకు ఒక చిన్ని ప్రేక్షకురాలిగా ఉంది. అది మొదలు వారి ఇల్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే వీరులకు తమ కార్యక్రమాలను రూపొందించుకునే కేంద్రంగా మారింది. ఆమె తల్లి, తండ్రి ఇద్దరూ స్వాంతంత్ర్యం కోసం కదనరంగంలోకి దూకారు.

చిన్నారి ఇందిర సైతం తన విదేశీ బొమ్మలను వదిలివేసింది. ఇప్పటి దాకా భోగ భాగ్యాలకు అలవాటు పడిన నెహ్రూలు కష్టాలను కోరి ఆహ్వానించినా ఆ కష్టాలను ధైర్యంగా ఎదురీది స్వాతంత్ర్య భారత చరిత్రలో వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. వారి వంశానికి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.

ఉదయం (పత్రిక)

ఉదయం దినపత్రిక 1984 సంవత్సరంలో ప్రముఖ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత దాసరి నారాయణరావు ప్రారంభించారు.

ఉదయం పత్రికను తారక ప్రభు పబ్లికేషన్స్ సంస్థ ప్రచురించేది. దీనికి దాసరి నారాయణరావు ఛైర్మన్. రామకృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. ఎ.బి.కె.ప్రసాద్ సంపాదకుడుగా కొద్ది సంవత్సరాలు పనిచేశారు. ఇది హైదరాబాదు మరియు విజయవాడ నుండి ప్రచురించబడేది. ప్రసాద్ తరువాత కె.రామచంద్రమూర్తి, కె.ఎన్.వై.పతంజలి పత్రికను నిర్వహించారు.

1991లో మాగుంట సుబ్బరామరెడ్డి ఉదయం పత్రికను కొన్నారు. గజ్జెల మల్లారెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు, తరువాత కె.రామచంద్రమూర్తి ప్రధాన సంపాదకులుగా ఉన్నారు.

కొన్ని ఆర్థిక ఇబ్బందులు మరియు కార్మిక సమస్యలు తలెత్తి పత్రిక మూతపడినది.

ఎక్కిరాల కృష్ణమాచార్య

ఎక్కిరాల కృష్ణమాచార్య (ఆగష్టు 11, 1926 - మార్చి 17, 1984) ఆంధ్రప్రదేశ్కు చెందిన రచయిత. ఆయన శిష్యులు ఆయనను మాస్టర్ ఇ. కె. అని పిలుచుకుంటుంటారు.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

చెళ్ళపిళ్ళ సత్యం

చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు.

తెలుగు సినిమాలు 1984

ఈ యేడాది 113 చిత్రాలు వెలుగు చూశాయి. వినోదపు పన్ను వసూలుకు శ్లాబ్‌ సిస్టమ్‌ మార్చి 23 నుండి అమలయింది. రామకృష్ణా సినీస్టూడియోస్‌ వారి 'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' మూడు సంవత్సరాలు సెన్సార్‌తో పోరాటం సాగించి, బయటకు వచ్చి సంచలన విజయం సాధించింది. బాలకృష్ణను స్టార్‌గా నిలబెట్టిన 'మంగమ్మగారి మనవడు' 565 రోజులు ప్రదర్శితమై అత్యధిక ప్రదర్శన రికార్డును నమోదు చేసింది. 'బొబ్బిలి బ్రహ్మన్న' కూడా సూపర్‌ హిట్‌గా నిలచింది. "కథానాయకుడు, ఇల్లాలు - ప్రియురాలు, ఛాలెంజ్‌, స్వాతి, శ్రీవారికి ప్రేమలేఖ, దొంగలు బాబోయ్‌ దొంగలు" శతదినోత్సవం జరుపుకోగా, "బావామరదళ్ళు, గూండా, ఆనందభైరవి, ఇంటిగుట్టు, ఇద్దరు దొంగలు, రారాజు, సితార" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి.

అగ్నిగుండం

అనుబంధం

అమ్మాయిలూ ప్రేమించండి

ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు

అదిగో అల్లదిగో

ఈ తీర్పు ఇల్లాలిది

ఎస్. పి. భయంకర్

కుటుంబగౌరవం

కాంచన గంగ

కలలుకనే కళ్ళు

కోడెత్రాచు

కాయ్ రాజా కాయ్

కోటీశ్వరుడు

కిరాయి అల్లుడు

కురుక్షేత్రంలో సీత

కథానాయకుడు

గృహలక్ష్మి - 1938, 1967, 1984 మూడు సినిమాలు ఇదేపేరుతో వచ్చాయి.

ఘరానారౌడి

చిటపట చినుకులు

చదరంగం

డిస్కోకింగ్

దేవుని రూపాలు

దొంగలు బాబోయ్ దొంగలు

దానవుడు

నాగు

నాయకులకు సవాల్

పల్నాటి పులి

భార్యామణి

భాగ్యలక్ష్మి

బొబ్బిలి బ్రహ్మన్న

మెరుపుదాడి

మానసవీణ

మహానగరంలో మాయగాడు

ముక్కోపి

యమదూతలు

రౌడీ

రుస్తుం

రాజమండ్రి రోమియో

రచయిత్రి

రైలు దోపిడి

రోజులు మారాయి

రావూ గోపాలరావు

వసంత గీతం

శ్రీమతి కావాలి

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర

సంగీత సామ్రాట్

సంపూర్ణప్రేమాయణం

సాహసమే జీవితం

సీతాలు

సీతమ్మ పెళ్ళి

దాసరి నారాయణరావు

డా. దాసరి నారాయణరావు ( మే 4, 1947 - మే 30, 2017) ఆంధ్రప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.

కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.

దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.

మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.

నూతన్ ప్రసాద్

నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ (డిసెంబర్ 12, 1945 - మార్చి 30, 2011) అసలు పేరు తడినాధ వరప్రసాద్. 1970వ మరియు 80వ దశకములో తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధి చెందిన హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు.

ప్రధానమంత్రి

ప్రధానమంత్రి భారత ప్రభుత్వ అధినేత. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం. పదవి రీత్యా రాష్ట్రపతి స్థానం దీనికంటే ఉన్నతమైనదైనా, రాష్ట్రపతి అధికారాలు కేవలం అలంకారప్రాయము, నామమాత్రము కాగా, వాస్తవంలో అధికారాలన్నీ ప్రధానమంత్రి వద్దే కేంద్రీకృతమై ఉంటాయి.

భారత్ అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి లో లోక్‌సభలో అత్యధిక బలం కలిగిన రాజకీయ పక్షానికి గాని, కూటమికి గాని నాయకుడై, సభలో మెజారిటీ పొందగలిగి ఉండాలి. ప్రధాన మంత్రి లోక్‌సభ లోగాని, రాజ్యసభ లోగాని సభ్యుడై ఉండాలి, లేదా ప్రధానమంత్రిగా నియమితుడైన ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి.

మంచు మోహన్ బాబు

మంచు మోహన్ బాబు (జ. మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.

మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. రజినీకాంత్కు సన్నిహితుడు.

మందాడి ప్రభాకర రెడ్డి

మప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి (అక్టోబర్ 8, 1935 -నవంబర్ 26, 1997) ప్రముఖ తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. 37 ఏళ్ల కెరీర్‌లో 472కు పైగా సినిమాల్లో నటించాడు. కార్తీక దీపం వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు. హైదరాబాదు లోని మణికొండలో ఈయన స్మారకార్ధం డా.ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరుపెట్టారు.

మార్చి 17

మార్చి 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 76వ రోజు (లీపు సంవత్సరములో 77వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 289 రోజులు మిగిలినవి.

రాజీవ్ గాంధీ

రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (ఆగష్టు 20, 1944 – మే 21, 1991), ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఈయన వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.

విజయశాంతి

విజయశాంతి ( జననం:జూన్ 24, 1966 ) తెలుగు సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మరియు హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూపర్ స్టార్" మరియు "లేడీ అమితాబ్" గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది. ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది. 1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. 1987లో ఆమె చిరంజీవి తో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనె తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడినాయి. ఆమె అగ్నిపర్వతం (సినిమా), ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, మువ్వగోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, శత్రువు (సినిమా), గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, మరియు చినరాయుడు వంటి విజయవంటమైన సినిమాలలో నటించింది. ఆమె 1980లలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. 1990లలో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్. ఆమె 1998లో రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది.

స్వాతి వారపత్రిక

స్వాతి సపరివార పత్రిక తెలుగు పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది 1984 సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం విజయవాడ నుండి మొదలైనది. సంపాదకులు వేమూరి బలరామ్. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 2005జాతీయ చదువరులసర్వే (NRS2005) ప్రకారం 39.59 లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగి ఉంది.

హాసియం

హాసియం ఒక రసాయన మూలకం ఉంది. దీని చిహ్నం 'Hs' తో మరియు పరమాణు సంఖ్య 108. హెస్సీ అను జర్మన్ రాష్ట్రం యొక్క పేరు పెట్టారు. ఇది ఒక కృత్రిమ మూలకంగా ఉంది. (ఒక ప్రయోగశాలలో రూపొందించిన వారు చేయవచ్చు కానీ ప్రకృతిలో లేని మూలకం) మరియు రేడియోధార్మికత; దాని చాలా స్థిరంగా ఉండే తెలిసిన ఐసోటోప్, హాసియం -269. ఈ ఒక ఐసోటోప్ సగం జీవితం కాలం 9.7 సెకన్లుగా ఉంది. 100 కంటే ఎక్కువ హాసియం అణువులను కృత్రిమంగా ఇప్పటి వరకు తయారు చేశారు.

ఆవర్తన పట్టికలో, ఇది ఒక డి బ్లాక్ ట్రాన్స్ ఆక్టినైడ్ మూలకం. ఇది 7 వ కాలంలో ఒక మూలకం మరియు 8వ గ్రూపు మూలకములందు ఉంచుతారు. గ్రూపు (సమూహం 8 లోని ఓస్మెయం భారీ హోమోలోగ్స్ వంటి వలెనే హాసియం ప్రవర్తిస్తుంది అని రసాయన శాస్త్రం ప్రయోగాలు ధ్రువీకరించాయి. హాసియం రసాయనిక ధర్మాలను మాత్రమే పాక్షికంగా వర్ణించవచ్చును. కానీ వారు రసాయన శాస్త్రం లోని ఇతర సమూహం 8 మూలకాల యొక్క అంశాలు బాగా సరిపోల్చడం చేశారు. బల్క్ (అధిక/సమూహ) పరిమాణంలో, హాసియం ఒక వెండి మెటల్‌గా ఉంటుందని భావిస్తున్నారు మరియు గాలిలోని ఆక్సిజన్ తో కలిసి తక్షణ ఒక అస్థిర టెట్రాక్సైడ్ ఏర్పాటు అవుతుంది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.