1982

1982 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1979 - 1980 - 1981 - 1982 - 1983 - 1984 - 1985
దశాబ్దాలు: 1960లు - 1970లు - 1980లు - 1990లు - 2000లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

CD Deshmukh
సి.డి.దేశ్‌ముఖ్

పురస్కారాలు

1980

1980 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1984

1984 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

అల్లరి నరేష్

నరేష్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అయిన ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు. అల్లరి అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం రాజేంద్ర ప్రసాద్గా పేరొందాడు. గమ్యం చిత్రంలో గాలి శీను పాత్ర, శంభో శివ శంభోలో మల్లి పాత్ర నరేష్ నటనా కౌశలానికి మచ్చుతునకలు.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

చెళ్ళపిళ్ళ సత్యం

చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు.

జూన్ 18

జూన్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 169వ రోజు (లీపు సంవత్సరములో 170వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 196 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1982

ఈ యేడాది 85 చిత్రాలు విడుదలయ్యాయి. విజయమాధవీ కంబైన్స్‌ 'బొబ్బిలిపులి' సెన్సార్‌ సమస్యలు ఎదుర్కొని, ఆలస్యంగా విడుదలై సంచలన విజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది. 'జస్టిస్‌ చౌదరి' కూడా సూపర్‌హిట్‌ అయి, 250 రోజులు ప్రదర్శితమైంది. ఇంకా "అనురాగదేవత, నా దేశం, ప్రేమమూర్తులు, స్వయంవరం, దేవత, ఇల్లాలి కోరికలు, బంగారుభూమి, ఈనాడు, ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య, గృహప్రవేశం, తరంగిణి, త్రిశూలం, నాలుగు స్తంభాలాట, పట్నం వచ్చిన పతివ్రతలు, విప్లవశంఖం, శుభలేఖ" శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇంకా "ప్రతిజ్ఞ, యమకింకరుడు" కూడా సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి. ఇక్కడ నుండి ఉదయం ఆటల సీజన్‌ బాగా పెరిగి, 'ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య' - 516 రోజులు, 'తరంగిణి' - 365 రోజులు, 'త్రిశూలం' - 300 రోజులు ప్రదర్శితమయ్యాయి.

తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్రానికి చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.

13వ లోక్‌సభ (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచింది.

దాసరి నారాయణరావు

డా. దాసరి నారాయణరావు ( మే 4, 1947 - మే 30, 2017) ఆంధ్రప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.

కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.

దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.

మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.

నందమూరి తారక రామారావు

తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.

నవంబర్ 13

నవంబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 317వ రోజు (లీపు సంవత్సరములో 318వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 48 రోజులు మిగిలినవి.

ఫిబ్రవరి 24

ఫిబ్రవరి 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 55వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 310 రోజులు (లీపు సంవత్సరములో 311 రోజులు) మిగిలినవి.

మంచు మోహన్ బాబు

మంచు మోహన్ బాబు (జ. మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.

మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. రజినీకాంత్కు సన్నిహితుడు.

మీట్నీరియం

మీట్నీరియం ఒక రసాయన మూలకం ఉంది. దీని చిహ్నం Mt మరియు పరమాణు సంఖ్య 109. ఇది ఒక చాలా రేడియోధార్మిక కృత్రిమ మూలకంగా ఉంది. దాని చాలా స్థిరంగా ఉండే తెలిసిన ఐసోటోప్, మీట్నీరియం -278. ఈ ఒక ఐసోటోప్ సగం జీవితం కాలం 7.6 సెకన్లుగా ఉంది. డామ్‌స్టాటియం మొదటి సారిగా జిఎస్‌ఐ హెల్హోమ్ల్ట్జ్ సెంటర్, జర్మనీ సమీపంలో డామ్స్టడట్ దగ్గరలోని, జిఎస్‌ఐ హెల్హోమ్ల్ట్జ్ సెంటర్ ఫర్ హెవీ అయాన్ రీసెర్చ్, ద్వారా 1982 సం.లో రూపొందించారు.

ఆవర్తన పట్టికలో, ఇది ఒక డి బ్లాక్ ట్రాన్స్ ఆక్టినైడ్ మూలకం. ఇది 7 వ కాలంలో ఒక మూలకం మరియు 9వ గ్రూపు మూలకములందు ఉంచుతారు. అయితే ఇరిడియం, వంటి భారీ హోమోలోగ్ వంటి వాటితో దీని ప్రవర్త నిర్ధారించడానికి ఏ రసాయన ప్రయోగాలు జరగక పోయినా సమూహం 9 లో వలె ఇది ప్రవర్తిస్తుంది. మీట్నీరియం, దాని తేలికైన హోమోలోగ్స్, కోబాల్ట్, రోడియం, మరియు ఇరిడియం పోలిన లక్షణాలు కలిగిన వాటిని లెక్కిస్తారు.

రాముడు

రాముడు అనగా శ్రీరాముడు లేదా రామావతారము

పరశురాముడు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారము.రాముడు పేరుతో కొన్ని తెలుగు సినిమాలు:

దొంగ రాముడు, 1955 మరియు 1988 లో విడుదలైన తెలుగు సినిమాలు.

రాముడు భీముడు, 1964 మరియు 1988 లో విడుదలైన తెలుగు సినిమాలు.

అందాల రాముడు, తెలుగు సినిమా.

డ్రైవర్ రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.

శృంగార రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.

అడవి రాముడు, తెలుగు సినిమా.

భార్గవ రాముడు, 1987 లో విడుదలైన తెలుగు సినిమా.

బికారి రాముడు, 1961 లో విడుదలైన తెలుగు సినిమా.

సర్కస్ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

తారక రాముడు, 1997 లో విడుదలైన తెలుగు సినిమా.

అమెరికా రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

ఛాలెంజ్ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

ఎదురులేని రాముడు, 1977 లో విడుదలైన తెలుగు సినిమా.

కలియుగ రాముడు, 1982 లో విడుదలైన తెలుగు సినిమా.

రౌడీ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

సరదా రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

భలే రాముడు, 1956 లో విడుదలైన తెలుగు సినిమా.

కళ్యాణ రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.

రాముడు కాదు కృష్ణుడు, 1983 లో విడుదలైన తెలుగు సినిమా.

రావు గోపాలరావు

రావు గోపాలరావు (జనవరి 14, 1937 - ఆగష్టు 13, 1994) తెలుగు సినిమా నటుడు మరియు రాజ్యసభ సభ్యుడు (1986-1992).

ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలల్ను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన 'కీర్తిశేషులు' నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్‌ అమెచ్యూర్‌ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు.

వినోబా భావే

ఆచార్య వినోబా భావేగా ప్రసిద్ధి చెందిన వినాయక్ నరహరి భావే (సెప్టెంబర్ 11, 1895 - నవంబర్ 15, 1982) స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు.

శ్రీదేవి (నటి)

శ్రీదేవి (ఆగస్టు 13, 1963-24 ఫిబ్రవరి 2018) ప్రముఖ భారతీయ సినీ నటి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము,అభినయం,నటన మున్నగువాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది. ఈమె తమిళనాడు లోని శివకాశిలో జన్మించింది. ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్ గది స్నానపు తొట్టెలో ప్రమాదవశాత్తూ మునిగి మరణించింది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.