1976

1976 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1973 1974 1975 1976 1977 1978 1979
దశాబ్దాలు: 1950లు 1960లు 1970లు 1980లు 1990లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Kavisamrat Viswanadha Satyanarayana
విశ్వనాథ సత్యనారాయణ

పురస్కారాలు

1902

1902 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1977

1977 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఆంధ్ర విశ్వకళా పరిషత్ లేదా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University), భారతదేశంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది.

ఈ విశ్వవిద్యాలయం 1926లో ఏర్పడింది. మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పడింది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ యొక్క ఆదర్శ విశ్వవిద్యాలయము రూపులో తీర్చిదిద్దబడింది.

తర్వాత 1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము ఏర్పడింది. ఆతర్వాత, 1967లో గుంటూరు లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయముగా అవతరించింది. దీని పేరును ఆచార్య నాగార్జునుని పేరిట 2004 లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయము గా మార్చారు.

ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణము (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

విశ్వవిద్యాలయానికి విశాఖపట్టణం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల లోను, తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ లోను, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం లోను, విజయనగరం జిల్లాలో విజయనగరం లోను ఆ కేంద్రాలు ఉన్నాయి. కాని, 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయమును ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ఆ విధంగా, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. కాని అనుబంధ కళాశాలలకు సంబంధించి కొంత కుదించుకు పోయినా, విశ్వవిద్యాలయ ప్రాంగణములో దాని ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. నాక్ (NAAC) సంస్థ " ఎ " గ్రేడుతో అనుబంధం ఇవ్వడం దీనికి తార్కాణం.

కె. చక్రవర్తి

చక్రవర్తి గుంటూరు జిల్లా , తాడికొండ మండలం, పొన్నెకల్లు వాస్తవ్యుడు . ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త. ఆయన 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. 1936 సెప్టెంబరు 8వ తేదీన జన్మించాడు. ప్రాథమిక విద్య పొన్నెకల్లు. గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ. ఆయన మేనమామ కుమార్తె అయిన రోహిణి దేవిని వివాహం చేసుకొని 1958లో కుటుంబంతో మద్రాసు చేరాడు. ఈయన రెండవ కుమారుడు శ్రీ కూడా తెలుగు సినిమా సంగీతకారుడిగా విశేశంగా రాణించాడు.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

చెళ్ళపిళ్ళ సత్యం

చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు.

జూన్ 16

జూన్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 167వ రోజు (లీపు సంవత్సరములో 168వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 198 రోజులు మిగిలినవి.

జూన్ 6

జూన్ 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 157వ రోజు (లీపు సంవత్సరములో 158వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 208 రోజులు మిగిలినవి.

జూలై 16

జూలై 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 197వ రోజు (లీపు సంవత్సరములో 198వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 168 రోజులు మిగిలినవి.

జూలై 28

జూలై 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 209వ రోజు (లీపు సంవత్సరములో 210వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 156 రోజులు మిగిలినవి.

తణుకు

తణుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. ఇదే తారకాపురం, తళుకు, తణుకుగా రూపాంతరం చెందింది.

తెలుగు సినిమాలు 1976

ఈ యేడాది 65 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మహానటుడు అక్కినేని తనకు ప్రభుత్వం కేటాయించిన 14 ఎకరాల స్థలంలో అన్నపూర్ణ సినీస్టూడియోస్‌ను జనవరి 14న ఆరంభించారు. మరో మహానటుడు నందమూరి ముషీరాబాద్‌లోని తన సొంతస్థలం మూడున్నర ఎకరాలలో రామకృష్ణా సినీస్టూడియోస్‌ను జూన్‌ 7న ప్రారంభించారు. ఈ యేడాది భాస్కరచిత్ర 'ఆరాధన' సూపర్‌ హిట్‌గా నిలిచి రజతోత్సవం జరుపుకుంది. కె.బాలచందర్‌ విభిన్న శైలిలో రూపొందించిన 'అంతులేని కథ' కూడా సూపర్‌ హిట్‌ అయింది. "మనుషులంతా ఒక్కటే, నేరం నాదికాదు ఆకలిది, సెక్రటరీ, పాడిపంటలు, ఇద్దరూ ఇద్దరే, భక్త కన్నప్ప, సిరిసిరిమువ్వ" డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకున్నాయి. అంతకు ముందు డైరెక్టుగా లేదా సింగిల్‌ షిఫ్టుతో మన చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. కాని ఇక్కడ నుండి ఎక్కువ షిప్టింగులతో శతదినోత్సవాలు జరుపుకోవడం మొదలయింది. ఆ విధంగా "అమెరికా అమ్మాయి, అల్లుడొచ్చాడు, జ్యోతి, తూర్పు-పడమర, నా పేరే భగవాన్‌, బంగారు మనిషి, భలే దొంగలు, మొనగాడు" శతదినోత్సవాలు జరుపుకున్నాయి. బాపు 'సీతాకళ్యాణం' ప్రజాదరణ పొందలేకపోయినా విమర్శకుల ప్రశంసలు పొందింది. కె.రాఘవేంద్రరావు, క్రాంతి కుమార్‌ కలయికలో రూపొందిన 'జ్యోతి' మంచి విజయం సాధించింది. జయప్రద, జయసుధ నటీమణులుగా ఈ యేడాది గుర్తింపు సంపాదించారు.

అంతులేని కథ

అల్లుడొచ్చాడు

అమెరికా అమ్మాయి

అత్తవారిల్లు

ఆడవాళ్లు అపనిందలు

ఆదిమానవులు

ఆరాధన

ఉత్తమురాలు

ఊరుమ్మడి బ్రతుకులు

ఒక అమ్మాయి కథ

ఒక దీపం వెలిగింది

ఓ మనిషి తిరిగి చూడు

కొల్లేటి కాపురం

పాడవోయి భారతీయుడా

బంగారుమనిషి

భలేదొంగలు

బ్రహ్మముడి

భక్త కన్నప్ప

తల్లిమనసు

తూర్పు పడమర

దశావతారాలు

దేవుడిచ్చిన భర్త

దేవుడే గెలిచాడు

దేవుడు చేసిన బొమ్మలు

దొరలు దొంగలు

నాడు నేడు

నాపేరే భగవాన్

నేరం నాదికాదు ఆకలిది

నిజం నిద్రపోదు

పల్లెసీమ

ప్రచండవీరుడు

పాడవోయి భారతీయుడా

పిచ్చోడిపిళ్ళి

పీటలమీదపెళ్ళి

పెద్ద అన్నయ్య

పెళ్ళికాని పెళ్ళి

పొగరుబోతు

పొరుగింటి పుల్లకూర

ప్రేమాయణం

ప్రేమబంధం

మనిషి మృగము

మనిషి మృగము

మనుషులంతా ఒక్కటే

మగాడు

మహాత్ముడు

మహాకవి క్షేత్రయ్య

మహేశ్వరి మహత్యం

మనవడి కోసం

మనఊరి కథ

మంచికి మరో పేరు

మాదైవం

మాయావి

మాంగల్యానికి మరో ముడి

ముద్దబంతి పువ్వు

ముగ్గురు మూర్ఖులు

ముత్యాల పల్లకి

మొనగాడు

మోసగాడు

మోసగాళ్ళకి సవాల్

యవ్వనం కాటేసింది

రాధ

రాజువెడలె

రామరాజ్యంలో రక్త పాతం

రత్తాలు రాంబాబు

వధూవరులు

వింతఇల్లు సంతగోల

వేములవాడ భీమకవి

శీలానికి శిక్ష

శ్రీరాజేశ్వరీవిలాస్ కాఫీక్లబ్

శ్రీతిరుపతి వేంకటేశ్వరకళ్యాణం

సంసారంలో సరిగమలు

స్వామి ద్రోహులు

సిరిసిరి మువ్వ

సీతాకళ్యాణం

సీతమ్మ శపథం

సుప్రభాతం

సెక్రటరీ

దాసరి నారాయణరావు

డా. దాసరి నారాయణరావు ( మే 4, 1947 - మే 30, 2017) ఆంధ్రప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.

కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.

దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.

మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.

నవంబర్ 5

నవంబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 309వ రోజు (లీపు సంవత్సరములో 310వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 56 రోజులు మిగిలినవి.

పండిత్ నరేంద్రజీ

పండిత్ నరేంద్రజీ ఏప్రిల్ 10, 1907న హైదరాబాదులో జన్మించాడు. చిన్నతనంలోనే ఆర్యసమాజ్ పట్ల ఆకర్షితుడైనాడు. ఆర్యసమాజ్ యొక్క మంత్రిగా, ఉపాధ్యక్షునిగా పనిచేశాడు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఇతను హైదరాబాదు ఉక్కుమనిషిగా పేరుపొందాడు. హైదరాబాదులో ఆర్యసమాజ్ కార్యక్రమాలకు నరేంద్రజీ విశేషకృషే కారణం.1938లోనే నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు 3 సంవత్సరాలు మన్ననూరు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన పిదప వైదిక దర్శనం పత్రికను నిర్వహించాడు. ఈ పత్రికద్వారా నిజాం నిరకుశత్వాన్ని తీవ్రంగా నిరసించాడు. దీనితో పత్రిక మూతపడింది మరియు ఆస్తులన్నీ జప్తు అయ్యాయి. అయిననూ నరేంద్రజీ తన లక్ష్యాన్ని మార్చుకోలేదు. బలవంతపు మతమార్పిడులు జరిపితే అర్యసమాజం ద్వారా మళ్ళీ హిందూమతంలోకి ఆహ్వానించాడు.

1942 నుండి 1945 వరకు ఆర్యసమాజీయులను ఏకం చేసి ముందుకు నడిపించడానికి నిజాం రాజ్యంలోని పలుప్రాంతాలలో ఐదు ఆర్యసమాజ సభలు నిర్వహించబడ్డాయి. నరేంద్రజీ 1942లో ఉద్గిర్లో జరిగిన మొదటి సమావేశంలో సమావేశపు కార్యదర్శిగా పనిచేయటమే కాకుండా ఆ తర్వాత సభల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నాడు.హైదరాబాదు రాజ్యం భారత యూనియన్ లో విలీనం కావడానికి తీవ్రంగా కృషిచేశాడు. 1947లో మరోసారి జైలుకు వెళ్ళవలసి వచ్చింది. నూతి శంకరరావు లాంటి పోరాటయోధులు కూడా ఇతని ఉపన్యాసాలకు ప్రభావితులైనారు. నిజాం నవాబు పైనే బాంబు విసిరిన నారాయణరావు పవార్ కూడా నరేంద్రజీ శిష్యుడే. 1948 సెప్టెంబరులో నిరంకుశ నిజాం పాలన అంతమై హైదరాబాదు భారత యూనియన్ లో కలిసిన పిదప నరేంద్రజీ హైదరాబాదు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనాడు. 1952లో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు. 1975లో రాజకీయాలకు స్వస్తిచెప్పి సన్యాసం స్వీకరించాడు. సెప్టెంబరు 24, 1976 నాడు మరణించాడు.

మందుముల నరసింగరావు

మందుముల నరసింగరావు (మార్చి 17, 1896 - మార్చి 12, 1976) నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు.

వియత్నాం

వియత్నాం దక్షిణ ఆసియాలోని ఒక దేశం. 2016 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 9 కోట్ల 46 లక్షలు. జనసంఖ్యలో ప్రపంచంలో 15 వ స్థానంలో, ఆసియాలో 9వ స్థానంలో ఉంది. దీనికి ఉత్తరాన చైనా, వాయువ్యాన లావోస్, నైరుతిన కాంబోడియా, తూర్పు దిక్కున మలేషియా, ఫిలిప్ఫీన్స్, ఇండోనేషియా సరిహద్దులుగా ఉన్నాయి. 1976 లో ఉత్తర, దక్షిణ వియత్నాంలు కలిసిపోయినప్పటి నుంచి హనోయ్ నగరం రాజధానిగా ఉంది. హోచిమిన్ నగరం అత్యధిక జనాభా గల నగరం.

క్రీ.శ.5వ శతాబ్దిలో ఇండోచైనాలో చంపా, కాంబోజ అనే ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు నెలకొన్నాయి. 5వ శతాబ్ది నాటి వ్యు శాసనం నుంచి అంతకు రెండు మూడువందల యేళ్ళకు పూర్వమే హిందూ మతం వ్యాపించిందన్న విషయం తెలుస్తోంది. సంస్కృత, ప్రాకృత భాషల్లోని అనేకమైన పదాలు కూడా ఇక్కడి భాషల్లోకి వచ్చి చేరాయి..

విశ్వనాథ సత్యనారాయణ

విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్ 10, 1895 - అక్టోబరు 18, 1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.

20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును .

విశ్వనాథ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించారు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం - ఈ వ్యక్తిత్వం."

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.