1974

1974 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1971 1972 1973 1974 1975 1976 1977
దశాబ్దాలు: 1950లు 1960లు 1970లు 1980లు 1990లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Bust of SV Ranga Rao at Vijayawada
విజయవాడలోని ఎస్.వి.రంగారావు కాంస్య విగ్రహం

పురస్కారాలు

అక్టోబర్ 1

అక్టోబరు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 274వ రోజు (లీపు సంవత్సరములో 275వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 91 రోజులు మిగిలినవి.

అక్టోబర్ 9

అక్టోబర్ 9, గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 282వ రోజు (లీపు సంవత్సరములో 283వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 83 రోజులు మిగిలినవి.

అధికార భాష

ఒక ప్రాంతంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాషను అనుసరించి ప్రభుత్వాలు ఆ భాషను ఆ ప్రాంతానికి అధికార భాషగా నిర్ణయిస్తాయి. అనగా, మన దేశానికి హిందీ అధికార భాష. మన రాష్ట్రానికి తెలుగు అధికార భాష. ఒక భాషని అధికార భాషగా నిర్ణయంచిన తర్వాత ఆయా ప్రభుత్వాలు అన్ని విధాలా ఆ భాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధ్యమైనంతవరకూ ఆ భాషనే ఉపయోగించాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966 మే 14 న అధికారభాషా చట్టం చేసింది. 19-3-1974 న అధికారభాషా సంఘాన్ని ఏర్పరిచింది.

ఈనాడు

ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2018 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 18,07,998 పత్రిక అమ్మకాలతో దేశంలో ఏడవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

ఎస్.వి. రంగారావు

ఎస్. వి. రంగారావు గా సుప్రసిద్ధుడైన సామర్ల వెంకట రంగారావు (జులై 3, 1918 - జులై 18, 1974) ప్రముఖ సినీ నటుడు మరియు దర్శకుడు, రచయిత. కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసులోనూ, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నాయి. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఈయన బిరుదులు. 1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదకృష్ణ (1975).

ఏప్రిల్ 5

'ఏప్రిల్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 95వ రోజు (లీపు సంవత్సరములో 96వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 270 రోజులు మిగిలినవి.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

గోదావరి ఎక్స్‌ప్రెస్

గోదావరి ఎక్స్‌ప్రెస్ భారత దక్షిణ మధ్య రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్. ఈ రైలు విశాఖపట్నం ⇌ హైదరాబాద్ మధ్యలో నడుస్తుంది. ఈ రైలుని వాల్తేరు ⇌ హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ క్రింద ఫెబ్రవరి 1, 1974 న ట్రైన్ నెంబర్లు 7007, 7008 తో ప్రవేశపెట్టారు. ఈ రైలు ప్రస్తుత ట్రైన్ నెంబర్లు 12727, 12728. ఈ రైలుకు ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా ఈ రైలుకు పూర్తి స్థాయి ఏ.సి సదుపాయం ఉన్న గరీబ్ రథ్ మరియు దురోంతో లు ప్రవేశపెట్టటంతో ఈ రైళ్ళలో ప్రజల రద్దీ ఇంకా పెరిగింది.

రెండు కొత్త రైళ్ళు ప్రవేశపెట్టినప్పటికీ, ఈ రైలుకి ఇప్పటికి భారి రద్దీ ఉంది . ప్రజల డిమాండ్ మేరకు కొన్నిమార్లు రిజర్వేషన్ లేని జనరల్ భోగీలను స్లీపర్ మరియు మూడవ క్లాసు భోగిలతో మారుస్తుంటారు.విశాఖ, హైదరాబాద్ మధ్య వెళ్ళు రైలు మార్గాలలో ఈ రైలు వెళ్ళే మార్గాన్ని ఉత్తమంగా భావిస్తారు. అందుకే అధికారులు దీన్ని శుభ్రంగా ఉంచుతారు. ఇది ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో ఉంది .ఈ రైలును భుభనేశ్వర్ వరకు పొడిగించలనీ ప్రతిపాదనలు వచ్చిన ప్రజలు, రాజకీయ నాయకులూ దిన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ఆ తరువాత విశాఖ ఎక్స్ప్రెస్కి ప్రతిపాదనలు వచ్చాయి, వాటిని ఆమోదించారు. ఇప్పుడు ఆ రైలు ప్రయాణ సమయం గణనీయంగా పెరిగింది.

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోస్తా ప్రాంతాలని అప్పటి రాజధాని హైదరాబాద్ (ఇప్పుడు తెలంగాణ రాజధాని) కు కలపాలనేదే గోదావరి ఎక్స్‌ప్రెస్ లక్ష్యం.

ఈ రైలు విశాఖపట్నం లోని 5 స్టేషన్లు, పశ్చిమ గోదావరి లోని 3 స్టేషన్లు, తూర్పు గోదావరి లోని 6 స్టేషన్లు, మరియు కృష్ణ జిల్లా విజయవాడలో ఆగుతుంది.

ఘంటసాల వెంకటేశ్వరరావు

ఘంటసాల వెంకటేశ్వరరావు ( డిసెంబర్ 4, 1922 - ఫిబ్రవరి 11, 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరముతో, పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపథ్యగాయకులలో ప్రముఖుడు. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు వారిలో అత్యంత ప్రజాదరణ పొందినది.

చంద్రమోహన్

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.

క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపధంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. "ఈయనే కనుక ఒక అడుగు పొడుగు ఉంటే సూపర్ స్టార్ అయిఉండే వారు" అని సినీఅభిమానులు భావిస్తారు.

జనవరి 31

జనవరి 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 31వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 334 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 335 రోజులు).

జూలై 18

జూలై 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 199వ రోజు (లీపు సంవత్సరములో 200వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 166 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 15

డిసెంబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 349వ రోజు (లీపు సంవత్సరములో 350వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 16 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1974

ఈ యేడాది 60 సినిమాలు విడుదలయ్యాయి. పద్మాలయా పిక్చర్స్‌ 'అల్లూరి సీతారామరాజు' తొలి పూర్తిస్థాయి కలర్‌- సినిమాస్కోప్‌గా రూపొంది, ఘనవిజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది. 'నిప్పులాంటి మనిషి' అనూహ్య విజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. ఈ చిత్రవిజయంతో కొంతకాలం హిందీ చిత్రాలను తెలుగులో రీమేక్‌ చేసే ట్రెండ్‌ కొనసాగింది. "మంచివాడు, బంగారుకలలు, దొరబాబు, మనషుల్లో దేవుడు, ఖైదీబాబాయ్‌, అందరూ దొంగలే, ఎవరికివారే యమునాతీరే, కృష్ణవేణి, నీడలేని ఆడది, నోము" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. "రాధమ్మపెళ్ళి, బంట్రోతు భార్య, తాతమ్మకల, ఛైర్మన్‌ చలమయ్య, కన్నవారి కలలు" కూడా విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి.

బాలకృష్ణ తొలి చిత్రం 'తాతమ్మకల' కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా రూపొందింది. ఆ సమయంలో ప్రభుత్వం కుటుంబ నియంత్రణకు అనుకూలం. దాంతో ప్రభుత్వం, నిర్మాత ఓ అవగాహనతో ఈ చిత్ర ప్రదర్శనను 50 రోజులకు నిలిపివేసి, తరువాత కొన్ని మార్పులు, చేర్పులతో విడుదల చేశారు. ఇలా విడుదలై కొద్ది రోజులు ప్రదర్శితమై మళ్లీ రీ-షూట్‌ చేసి విడుదలైన చిత్రం ఇదొక్కటే!

ఈ ఏడాది ఫిబ్రవరి 11నే మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పరమపదించారు.అడవిదొంగలు

అల్లూరి సీతారామరాజు

అమ్మాయి పెళ్ళి

అనగనగా ఒక తండ్రి

ఆడంబరాలు అనుబంధాలు

ఆడపిల్లల తండ్రి

ఆడపిల్లలు అర్ధరాత్రి హత్యలు

ఇంటికోడలు

ఇంటింటి కథ

ఊర్వశి

ఎవరికివారే యమునాతీరే

ఓ సీత కథ

కలిసొచ్చిన కాలం

కోడెనాగు

కోటివిద్యలు కూటికొరకే

కృష్ణవేణి

గుణవంతులు

గాలిపటాలు

గౌరవం

గౌరి

గుండెలుతీసిన మొనగాడు

ఛైర్మన్ చెలమయ్య

చక్రవాకం

చందన

జీవితాశయం

తాతమ్మకల

తీర్పు

తులాభారం

తులసి

తిరుపతి (1974 సినిమా)

ఉత్తమ ఇల్లాలు

దీక్ష

దేవదాసు

దేవుడుచేసిన మనుషులు

దేవుడుచేసిన పెళ్ళి

దొరబాబు

ధనవంతులు

నీడలేని ఆడది

నిప్పులాంటి మనిషి

నిత్య సుమంగళి

నోము

పల్లెపడుచు

పెద్దలు మారాలి

ప్రేమలూ పెళ్ళిళ్ళు

బంగారు కలలు

బంట్రోతు భార్య

భూమికోసం

మంచి మనుషులు

మాంగల్య భాగ్యం

మనుషుల్లో దేవుడు

మనుషులు - మట్టిబొమ్మలు-1974

మీనా

ముగ్గురు అమ్మాయిలు

రాధమ్మపెళ్ళి

రామయ్యతండ్రి

రామ్ రహీమ్

రాముని మించిన రాముడు

వాణి దొంగలరాణి

శ్రీరామాంజనేయ యుద్ధం

సత్యానికి సంకెళ్ళు

హారతి

హనుమాన్ విజయం

యమునా కృష్ణన్

యమునా కృష్ణన్ 25 మే 1974 న జన్మించిన ఒక ప్రముఖ భారత రసాయన శాస్త్రవేత్త. ఈమె బెంగుళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS, లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

సింగిరెడ్డి నారాయణరెడ్డి

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

సియాబోర్గియం

సియాబోర్గియం ఒక రసాయన మూలకం ఉంది. దీని చిహ్నం Sg తో మరియు పరమాణు సంఖ్య 106. దాని చాలా స్థిరంగా ఉండే తెలిసిన ఐసోటోప్, సియాబోర్గియం-271. ఈ ఒక ఐసోటోప్ సగం జీవితం కాలం 1.9 సెకన్లుగా ఉంది. నైడ్ మూలకం. ఇది 6 వ కాలంలో ఒక మూలకం మరియు 6వ గ్రూపు మూలకము లందు ఉంచుతారు. గ్రూపు (సమూహం 6 లోని టంగ్స్టన్ భారీ హోమోలోగ్స్ వంటి వలెనే సియాబోర్గియం ప్రవర్తిస్తుంది అని రసాయన శాస్త్రం ప్రయోగాలు ధ్రువీకరించాయి.

హైదరాబాదు విశ్వవిద్యాలయము

హైదరాబాదు విశ్వవిద్యాలయము (University of Hyderabad) 1974లో భారతదేశ పార్లమెంటు యొక్క చట్టముచే కేంద్ర విశ్వవిద్యాలయముగా యేర్పరచబడింది. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంగా పేరుపొందిన ఈ విశ్వవిద్యాలయమును ఇటీవల హైదరాబాదు విశ్వవిద్యాలయముగా నామకరణము చేశారు. ఈ విశ్వవిద్యాలయము ఉన్నత విద్యకు మరియు పరిశోధనకు భారతదేశములో అత్యున్నత విద్యాసంస్థగా ఎదిగినది.

విశ్వవిద్యాలయము యొక్క ప్రధాన క్యాంపస్ హైదరాబాదు నుండి 20 కిలోమీటర్ల దూరంలో శివార్లలో పాత హైదరాబాదు - బాంబే రహదారిపై ఉంది. ౨౦౦౦ ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ విశ్వవిద్యాలయము హైదరాబాదు నగరములోని అతి సుందరమైన క్యాంపస్ లలో ఒకటి. నగరములోని అనుబంధ క్యాంపస్ సరోజినీ నాయుడు యొక్క గృహమైన బంగారు గడప (గోల్డెన్ త్రెషోల్డ్) లో ఉంది.

హైదరాబాదు విశ్వవిద్యాలయం దేశంలోనే పేరొందిన పరిశోధనా సంస్థలలో ఒకటి. హై.కేం.యు ఉన్నతవిద్య మరియు పరిశోధనలకు పెట్టింది పేరు. ఇది 1974 సంవత్సరంలో ఆచార్య గురుభక్త సింఘ్ మొదటి ఉపకులపతి (Vice Chancellor)గా ప్రారంభమైంది. 2012 సంవత్సరంలో భారతదేశంలోనే ఏడవ రాంకుతో Indian Institute of Science and Technology కన్న ముందంజలో నిలబడింది. (ఇండియటుడే ఆధారంగా.)

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.