1971

1971 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1968 1969 1970 1971 1972 1973 1974
దశాబ్దాలు: 1950లు 1960లు 1970లు 1980లు 1990లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Gurram Jashua
గుర్రం జాషువా

పురస్కారాలు

ఆగష్టు 15

ఆగష్టు 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరములో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి.

ఎల్. ఆర్. ఈశ్వరి

ఎల్. ఆర్. ఈశ్వరి ప్రముఖ నేపథ్య గాయని. ఈమె మద్రాసులో ఒక రోమన్ కాథలిక్ కుటుంబంలో డిసెంబరు 8వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు. ఈమె ఐదేళ్ళ వయసులో అతడు మరణించాడు. ఈమె తల్లి నిర్మల కుటుంబభారాన్ని మోసింది. ఆమె మంచి గాయని కావడంతో సినిమాలలో అవకాశం లభించినప్పుడల్లా కోరస్ బృందాలకు పాడింది. ఆ సమయంలో తల్లితో పాటు ఈమె కూడా రికార్డు స్టూడియోలకు వెళ్ళేది. ఆ సమయంలోనే ఈమెకు కూడా కొన్ని చిత్రాలకు కోరస్ బృందంలో పాడే అవకాశం వచ్చింది. ఈమె పూర్తి పేరు "లూర్డ్ మేరీ". ఈమె బామ్మ హిందూ కావడంతో "రాజేశ్వరి" అని పిలిచే వారు. ఈమె తన తల్లి, తండ్రి ఇరువైపుల బంధువులను తృప్తి పరచడానికి తన పేరును లూర్డ్ రాజేశ్వరిగా మార్చుకుంది. అప్పటికే తమిళ సినీరంగంలో ఒక రాజేశ్వరి గాయినిగా చలామణీలో ఉన్నందుకు తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్. ఆర్. ఈశ్వరిగా మార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు మరియు ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది.

ఈమెను మొదటగా కె.వి.మహదేవన్ గుర్తించి, "నల్ల ఇడత్తు సంబంధం" (1958) అనే తమిళ సినిమాలో మొదటి సారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కాని "పాశమలార్" (1961) సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా చెళ్ళపిళ్ళ సత్యం దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్ మరియు ఐటమ్ నంబర్లకు పాడింది. ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత మొదలైన నాట్యకత్తెలకు పాడింది. వీరే కాకుండా విజయలలిత, లక్ష్మి, సరిత వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసింది. ఈమె మొత్తం 14 భాషలలో పాడింది.

ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమే. పేదరికంలో జీవించిన ఈమె కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. అవివాహితగానే ఉండిపోయి, సమాజం నుండి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.

ఈమెకు తమిళనాడు ప్రభుత్వం 1984లో కళైమామణి అవార్డు ప్రదానం చేసింది.

కె. చక్రవర్తి

చక్రవర్తి గుంటూరు జిల్లా , తాడికొండ మండలం, పొన్నెకల్లు వాస్తవ్యుడు . ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త. ఆయన 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. 1936 సెప్టెంబరు 8వ తేదీన జన్మించాడు. ప్రాథమిక విద్య పొన్నెకల్లు. గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ. ఆయన మేనమామ కుమార్తె అయిన రోహిణి దేవిని వివాహం చేసుకొని 1958లో కుటుంబంతో మద్రాసు చేరాడు. ఈయన రెండవ కుమారుడు శ్రీ కూడా తెలుగు సినిమా సంగీతకారుడిగా విశేశంగా రాణించాడు.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

చంద్రమోహన్

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.

క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపధంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. "ఈయనే కనుక ఒక అడుగు పొడుగు ఉంటే సూపర్ స్టార్ అయిఉండే వారు" అని సినీఅభిమానులు భావిస్తారు.

చెళ్ళపిళ్ళ సత్యం

చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు.

జనవరి 25

జనవరి 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 25వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 340 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 341 రోజులు).

జాషువా

ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

డిసెంబర్ 18

డిసెంబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 352వ రోజు (లీపు సంవత్సరములో 353వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 13 రోజులు మిగిలినవి.

డుబ్నియం

డుబ్నియం ఒక రసాయన మూలకం ఉంది. దీని చిహ్నంతో Db మరియు పరమాణు సంఖ్య 105. దీనికి డుబ్నా పట్టణం పేరు పెట్టారు. అందుక్కారణం, రష్యా లోని డుబ్నా లో అది మొదటి సారిగా ఉత్పత్తి చెయ్యబడింది. ఇది ఒక కృత్రిమ మూలకంగా ఉంది మరియు (ప్రయోగశాలలో రూపొందించిన వారు చేయవచ్చు కానీ ప్రకృతిలో లేని మూలకం) రేడియోధార్మికత ; చాలా స్థిరంగా తెలిసిన ఐసోటోప్ , డుబ్నియం -268 ఒకటి ఉంది. దీని సగం జీవితం సుమారు 28 గంటలు. ఆవర్తన పట్టికలో, ఇది ఒక డి బ్లాక్ ట్రాన్స్ ఆక్టినైడ్ మూలకం. ఇది 7 వ కాలం నందు ఒక మూలకం మరియు 5వ గ్రూపు మూలకము లందు ఉంచుతారు. గ్రూపు (సమూహం 5 లోని టాంటలం భారీ హోమోలోగ్స్ వంటి వలెనే హాసియం ప్రవర్తిస్తుంది అని రసాయన శాస్త్రం ప్రయోగాలు ధ్రువీకరించాయి. డుబ్నియం రసాయనిక ధర్మాలను మాత్రమే పాక్షికంగా వర్ణించవచ్చును. కానీ వారు రసాయన శాస్త్రం లోని ఇతర సమూహం 5 మూలకాలు యొక్క అంశాలు బాగా సరిపోల్చడం చేశారు.

తెలుగు సినిమాలు 1971

ఈ యేడాది 69 చిత్రాలు విడుదలయ్యాయి. జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ 'దసరాబుల్లోడు' సంచలన విజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ 'ప్రేమనగర్‌' కూడా బ్రహ్మాండమైన విజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. ఈ యేడాది ఇంకా "పవిత్రబంధం, రైతుబిడ్డ, శ్రీకృష్ణసత్య, చెల్లెలికాపురం, బొమ్మా-బొరుసా, మట్టిలో మాణిక్యం, తాసిల్దారుగారి అమ్మాయి, మోసగాళ్ళకు మోసగాడు" శతదినోత్సవాలు జరుపుకోగా, "జీవితచక్రం, చిన్ననాటి స్నేహితులు, శ్రీమంతుడు, మొనగాడొస్తున్నాడు జాగ్రత్త" చిత్రాలు ఏవరేజ్‌గా నడిచాయి. కృష్ణను స్టార్‌ హీరోగా మార్చిన తొలి కౌబాయ్‌ తరహా చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు' మంచి కలెక్షన్లు రాబట్టింది. అప్పటివరకు హీరోగా నటిస్తున్నా, కొన్ని చిత్రాల్లో సైడ్‌ హీరోగానూ నటించారాయన. ఇక్కడ నుండి ఆయన సోలో హీరోగా ముందుకు సాగిపోయారు. 'తాసిల్దారుగారి అమ్మాయి' సక్సెస్‌తో శోభన్‌బాబు కూడా హీరోగా స్థిరపడ్డారు.

అందం కోసం పందెం

అందరికి మొనగాడు

అడవి వీరుడు

అత్తలు కోడళ్లు

అనురాధ

ఆనందనిలయం

ఆదిపరాశక్తి

అమాయకురాలు

అమ్మమాట

కత్తికి కంకణం

కథానాయకురాలు

కల్యాణ మండపం

కిల్లాడి సింగన్న

కూతురు కోడలు

గూఢచారి 003

గూఢచారి 115

గోల్కొండ గజదొంగ

ఘరానా దొంగలు

చలాకీ రాణి కిలాడీ రాజా

చిన్ననాటి స్నేహితులు

చెల్లెలి కాపురం

జగత్ కంత్రీలు

జగత్ జెంత్రీలు

జగత్ మొనగాళ్ళు

జాతకరత్న మిడతంభొట్లు

జీవిత చక్రం

జేమ్స్ బాండ్ 777

చిన్నారి చిట్టిబాబు (1971 సినిమా)

తల్లీ కూతురు (తల్లీకూతుళ్ళు?)

తల్లిని మించిన తల్లి ?

తాసిల్దారుగారి అమ్మాయి

దసరా బుల్లోడు

దెబ్బకు ఠా దొంగల ముఠా

దొంగ ఓడితే దొరకడు

నమ్మకద్రోహులు

నా తమ్ముడు

నిండు దంపతులు

నేనూ మనిషినే

పగబట్టిన పడుచు

పట్టిందల్లా బంగారం

పట్టుకుంటే లక్ష

పవిత్ర బంధం

పవిత్ర హృదయాలు

ప్రేమ జీవులు

ప్రేమనగర్

బంగారు కుటుంబం (1971 సినిమా)

బంగారుతల్లి

బస్తీ బుల్‌బుల్

బుల్లెమ్మ బుల్లోడు

బొమ్మా బొరుసా

భలేపాప

భాగ్యవంతుడు

భార్యాబిడ్డలు

మట్టిలో మాణిక్యం

మనసిచ్చి చూడు

మనసు మాంగల్యం

మా ఇలవేల్పు

మాస్టర్ కిలాడి

మూగప్రేమ

మొనగాడొస్తున్నాడు జాగ్రత్త

మోసగాళ్ళకు మోసగాడు

మేమే మొనగాళ్ళు

మేరీ మాత

రంగేళీ రాజా

రాజకోట రహస్యం

రామాలయం (సినిమా)

రివాల్వర్ రాణి

రైతుబిడ్డ

రౌడీ రంగడు

రౌడీలకు రౌడీలు

వింత సంసారం

విచిత్ర దాంపత్యం

విచిత్ర ప్రేమ

విక్రమార్క విజయం

వెంకటేశ్వర వైభవం

శ్రీకృష్ణ విజయం

శ్రీకృష్ణ సత్య

శ్రీమంతుడు

సతీ అనసూయ

సిసింద్రీ చిట్టిబాబు

సి.ఐ.డీ.రాజు

సుపుత్రుడు

స్వప్నసుందరి

సంపూర్ణ రామాయణం (1971 సినిమా)

ప్రతివాది భయంకర శ్రీనివాస్

పి.బి.శ్రీనివాస్ (సెప్టెంబరు 22, 1930 - ఏప్రిల్ 14, 2013) (పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్) ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు. ఈయన తన మాతృభాష అయిన తెలుగులో కంటే కన్నడ, తమిళ చిత్రాలలో ఎక్కువ పాటలు పాడాడు. ఆయన హిందీ, మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడాడు. కన్నడ నటదిగ్గజం రాజ్‌కుమార్‌కు ఈయన ఎన్నో గీతాలు ఆలపించాడు. ఈయన తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృత భాషలలో దిట్ట. ఈయన ఎన్నో గజళ్లు వ్రాసాడు. ఈయన గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది. ఈయన మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడాడు. ఆయన సుమారు 3000 లకు పైగా పాటలు పాడాడు.

బొమ్మరిల్లు (పత్రిక)

బొమ్మరిల్లు పిల్లల మాసపత్రిక, ప్రముఖ సినీ నిర్మాతా, దర్శకుడూ అయిన, శ్రీ విజయ బాపినీడు 1971లో స్థాపించారు. దాదాపు, చందమామ వరవడిలోనే కథలు ధరావాహికలు వచ్చేవి కాని భాష, కథా కథనం, కథల ఎంపిక చాలా వేరుగా ఉండేది. ఇందులో మొట్టమొదటి ధారావాహిక 'మృత్యులోయ'. బేతాళ కథలలాగున 'కరాళ కథలు' అని ఒక ధారావాహిక కూడా ప్రవేశపెట్టారు. పత్రికతో బాటు ఒక అనుబంధం కూడా ఇచ్చే పద్ధతి ఈ పత్రికే మొదలు పెట్టింది. కొంతకాలం ఒక రిబ్బనులాంటి వెడల్పుగా చాలా బారుగా ఉన్న ఒక ప్రతిని ఇచ్చేవారు. తరువాత, ఒక చిన్న పుస్తకం ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ చిన్న పుస్తకంలో ఓ కథ బొమ్మలతో వేసేవారు. శ్రీమతి గుత్తా విజయలక్ష్మి గారు 'కుందేలు కథలు' అనేకం (ఆంగ్ల కథలకు స్వేఛ్ఛానువాదం) ఈ చిన్న పుస్తకానుబంధం కోసం వ్రాసారు. చందమామకు దీటయిన పోటీనిచ్చింది ఈ పత్రిక.

భారతదేశ నకలు హక్కుల చట్టం

నకలుహక్కు చట్టం 1957 (Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు మరియు సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది.

ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు మరియు ఒప్పందాలకు అనుగుణంగా ఉంది. 1886 బెర్నే సమావేశం (1971 పారిస్ లో మార్చినట్లుగా),1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం మరియు 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశంలో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం (WIPO Copyrights Treaty (WCT) ) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT) లకు అనుగుణంగా ఉంది.

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.

మందాడి ప్రభాకర రెడ్డి

మప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి (అక్టోబర్ 8, 1935 -నవంబర్ 26, 1997) ప్రముఖ తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. 37 ఏళ్ల కెరీర్‌లో 472కు పైగా సినిమాల్లో నటించాడు. కార్తీక దీపం వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు. హైదరాబాదు లోని మణికొండలో ఈయన స్మారకార్ధం డా.ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరుపెట్టారు.

వాణిశ్రీ

వాణిశ్రీ (జ.1948, ఆగష్టు 3, నెల్లూరు) 1960 మరియు 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయనీ ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి మరియు జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార.

ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్ళి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు మరియు ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ (हिमाचल प्रदेश)

వాయువ్య భారతదేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి తూర్పున టిబెట్ (చైనా), ఉత్తరాన మరియు వాయువ్యమున జమ్మూ మరియు కాశ్మీరు, నైఋతిన పంజాబ్, దక్షిణాన హర్యానా మరియు ఉత్తర్ ప్రదేశ్ మరియు ఆగ్నేయమున ఉత్తరాఖండ్ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్ యొక్క విస్తీర్ణము 55,658 చ.కి.మీలు (21,490 చ.కి.మైళ్లు) మరియు 1991 జనాభా ప్రకారము రాష్ట్రము యొక్క జనాభా 5,111,079. 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభగముగా హిమాచల్ ప్రదేశ్ యేర్పడినది. 1971, జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రముగా అవతరించింది.

రాష్ట్ర రాజధాని షిమ్లా. ధర్మశాల, కాంగ్ర, మండి, కుల్లు, చంబా, డల్‌హౌసీ మరియు మనాలీ ఇతర ముఖ్య పట్టణాలు. రాష్ట్రములో చాలామటుకు ప్రాంతము పర్వతమయము. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన శివాలిక్ పర్వతశ్రేణులు ఉన్నాయి. శివాలిక్ శ్రేణి ఘగ్గర్ నది జన్మస్థలము. రాష్ట్రములోని ప్రధాన నదులు సట్లెజ్ (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉన్నది) మరియు బియాస్ నది. సట్లెజ్ నది మీద కంద్రౌర్, బిలాస్‌పూర్ వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.