1967

1967 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1964 1965 1966 - 1967 - 1968 1969 1970
దశాబ్దాలు: 1940లు 1950లు - 1960లు - 1970లు 1980లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Che Guevara June 2, 1959
చే గువేరా

పురస్కారాలు

ISBN

అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది ఒక విశిష్ట సంఖ్యా వాణిజ్య పుస్తక గుర్తింపు. ఐఎస్‌బిఎన్ అనేది ప్రతి ఎడిషన్ మరియు వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్‌బ్యాక్ మరియు అదే పుస్తకం యొక్క గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది. ISBN అనేది 2007 జనవరి 1 నుండి 13 అంకెల పొడవుతో ఈ సంఖ్యను కేటాయిస్తున్నారు. 2007 ముందు 10 అంకెల పొడవుగా కేటాయించబడేది. ISBN కేటాయింపు పద్ధతి దేశాన్ని బట్టి, ప్రచురణ పరిశ్రమ దేశంలో ఎంత పెద్దదనే దాన్ని బట్టీ మారుతూ ఉంటుంది. గుర్తింపు యొక్క ప్రారంభ ISBN ఆకృతీకరణ 1966 లో 9 అంకెలతో రూపొందించిన స్టాండర్డ్ బుక్ నంబరింగ్ (SBN) ఆధారంగా 1967 లో ఉత్పత్తి చేశారు.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

జాకిర్ హుసేన్

జాకిర్ హుస్సేన్ (ఫిబ్రవరి 8, 1897 - మే 3, 1969), భారత 3వ రాష్ట్రపతి (మే 13 1967 నుండి 1969 మే 3 న మరణించినంతవరకు)

హుసేన్ హైదరాబాదు (భారతదేశం) లో జన్మించాడు. ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవాడు. ఇతడు హైదరాబాదు నుండి ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ కు వలస వచ్చాడు. హుసేన్ ఇటావా (ఉత్తరప్రదేశ్) లోని 'ఇస్లామియా ఉన్నత పాఠశాల' లో చదువుకున్నాడు, ఉన్నతవిద్య అలీఘర్ లోని ఆంగ్లో మహమ్మడన్ ఓరియంటల్ కాలేజిలో అభ్యసించాడు. ఇచట విద్యార్థిసంఘ నాయకుడిగా గుర్తింపబడ్డాడు.

హుసేన్ 23 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ దగ్గర, ఒక జాతీయముస్లింవిశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దానికి జామియా మిల్లియా ఇస్లామియా అనే పేరు పెట్టాడు. తరువాత ఇతను విత్తశాస్త్రంలో పి.హెచ్.డి. చేసేందుకు, 'బెర్లిన్ విశ్వవిద్యాలయానికి (జర్మనీ) వెళ్ళాడు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ (1797-1868) జీవితగాధ మరియు కవితాసంగ్రహాలను క్రోడీకరించాడు. భారతదేశానికి తిరిగి వచ్చి, జామియా మిల్లియా ఇస్లామియాకు మార్గదర్శకుడిగా మారాడు.

బ్రిటిష్ వారితో పోరాటానికి, మహాత్మా గాంధీతో చేతులుకలిపి, "బేసిక్ విద్య" పై కఠోర పరిశ్రమ చేశాడు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించాడు. ఈ కాలంలో హుసేన్ ఉత్తమ దార్శనికుడిగా, భారత విద్యావిభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందాడు. తమ రాజకీయ ప్రత్యర్థియైన మహమ్మద్ అలీ జిన్నా చేతగూడా పొగడబడ్డాడు. తన వ్యక్తిగత సంపదనంతా భారతదేశానికి ధారబోసిన దేశభక్తుడు.

భారత స్వాతంత్ర్యం తరువాత, అలీఘర్ ముస్లిం యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ పదవికి అంగీకరించాడు. స్వాతంత్ర్యం వచ్చిన ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను, ముఖ్యంగా అలీఘర్ లో, అదుపులో ఉంచుటకు, ఇతని నియామకం ఎంతో ఉపయోగపడింది. వైస్ ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956 లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1957 లో బీహారు గవర్నరుగా నియమింపబడి, పార్లమెంటుకు రాజీనామాచేశాడు.

బీహారు గవర్నరుగా 1957 నుండి 1962 వరకు సేవలందించిన తరువాత 1962 నుండి 1967 వరకు భారత ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించాడు. తదనంతరం మే 13 1967 న భారతరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని ప్రథమ ఉపన్యాసంలో "మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం" అని పేర్కొన్నాడు. అత్యల్పకాలం రాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. (ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ). ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963 లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.

జూన్ 14

జూన్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 165వ రోజు (లీపు సంవత్సరములో 166వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 200 రోజులు మిగిలినవి.

జూన్ 7

జూన్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 158వ రోజు (లీపు సంవత్సరములో 159వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 207 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 11

డిసెంబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 345వ రోజు (లీపు సంవత్సరములో 346వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 20 రోజులు మిగిలినవి.

తమిళనాడు

తమిళనాడు భారతదేశపు దక్షిణాన ఉన్న ఒక రాష్ట్రము. కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, పుదుచ్చేరిలు దీని సరిహద్దు రాష్ట్రాలు. తమిళనాడుకు ఆగ్నేయాన సముద్రంలో శ్రీలంక ద్వీపమున్నది. శ్రీలంకలో గణనీయమైన తమిళులున్నారు..తమిళనాడు అధికార భాష తమిళ్.

తమిళనాడు రాజధాని చెన్నై. 1996కు ముందు దీని అధికారికనామము 'మద్రాసు'. ఇంకా కోయంబత్తూరు, కడలూరు, మదురై, తిరుచిరాపల్లి, సేలం, తిరునల్వేలి తమిళనాట ముఖ్యమైన నగరాలు.

తమిళనాడు బహుముఖంగా ప్రాముఖ్యత సంతరించుకున్న రాష్ట్రం. సంప్రదాయాలనూ, ఆధునికతనూ కలగలిపిన సమాజం. సాహిత్యము, సంగీతము, నాట్యము తమిళనాట ఈనాటికీ విస్తారమైన ఆదరణ కలిగి ఉన్నాయి. పారిశ్రామికంగానూ, వ్యాపార రంగంలో, సినిమా రంగంలో, వ్యవసాయంలో, విద్యలోనూ కూడా గణనీయమైన అభివృద్ధి సాధించింది. దేశరాజకీయాలలో తమిళనాడు కీలకమైన పాత్ర కలిగిఉన్నది.

తెలుగు సినిమాలు 1967

* ఈ యేడాది 41 చిత్రాలు విడుదల కాగా, వాటిలో నందమూరి 12 చిత్రాల్లోనూ, అక్కినేని ఐదు చిత్రాల్లోనూ నటించారు.

* ఉమ్మడి కుటుంబం సంచలన విజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది.

* "పూలరంగడు, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణావతారం" చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి.

* "కంచుకోట, భామావిజయం, నిండు మనసులు, ఆడపడచు" చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

* "అవే కళ్ళు, ఇద్దరు మొనగాళ్ళు, కాంభోజరాజు కథ, గోపాలుడు భూపాలుడు, చిక్కడు దొరకడు, భువనసుందరి కథ, రంగులరాట్నం, లక్ష్మీనివాసం,

శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న, సుఖదుఃఖాలు" మంచి కలెక్షన్లు సాధించి, విజయాల జాబితాలో చేరాయి.

* ఎస్.వి. రంగారావు తొలిసారి దర్శకత్వం వహించి చదరంగం చిత్రం జనాదరణ చూరగొంది.

* బాపు దర్శకునిగా చేసిన తొలి ప్రయత్నం సాక్షి విజయవంతమై బడ్జెట్‌ చిత్రాల్లో కొత్తపోకడకు శ్రీకారం చుట్టింది.

* శ్రీకృష్ణావతారం బెంగుళూరులో రజతోత్సవం జరుపుకొని, తరువాతి కాలంలో కూడా తెలుగునేలలో కన్నా కన్నడనాట విశేషాదరణ పొందింది.

* శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న ద్వారా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం గాయకునిగా పరిచయమయ్యారు.

అంతులేని హంతకుడు

అగ్గిదొర

అవే కళ్ళు

అనుమానం పెనుభూతం

ఆడపడుచు

ఇద్దరు మొనగాళ్ళు

ఉమ్మడికుటుంబం

ఉపాయంలో అపాయం

కంచుకోట

కాంభోజరాజు కథ

కొంటెపిల్ల

గృహలక్ష్మి - 1938, 1967, 1984 మూడు సినిమాలు ఇదేపేరుతో వచ్చాయి.

గొప్పవారి గోత్రాలు

గోపాలుడు భూపాలుడు

చదరంగం

చిక్కడు దొరకడు

దేవుని గెలిచిన మానవుడు

ధనమే ప్రపంచలీల

నిండు మనసులు

నిర్దోషి

నా మాటంటే

పట్టుకుంటే పదివేలు

పెద్ద అక్కయ్య

పిన్ని

పూలరంగడు

ప్రాణమిత్రులు

ప్రేమలో ప్రమాదం

ప్రైవేటు మాష్టారు

పుణ్యవతి

బ్రహ్మచారి

భాగ్యలక్ష్మి

భక్త ప్రహ్లాద (1967 సినిమా) - రోజారమణి

భామావిజయం

భువనసుందరి కథ

మా వదిన

మరపురాని కథ

ముద్దుపాప

ముగ్గురు మిత్రులు

ముళ్ళ కిరీటం

మంచి కుటుంబం

రహస్యం

రక్తసింధూరం

రంగులరాట్నం

లక్ష్మీనివాసం

వసంతసేన

వీరపూజ

శభాష్ రంగస ??

శ్రీకృష్ణావతారం

శ్రీకృష్ణ మహిమ

శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న

సాక్షి

సతీ సుమతి

సతీ తులసి

సుఖదుఃఖాలు

సుడిగుండాలు

సత్యమే జయం

స్త్రీజన్మ

హంతకుని హత్య

దాశరథి కృష్ణమాచార్య

అయోమయ నివృత్తి పేజీ కృష్ణమాచార్యులు చూడండితెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) . దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.

బూర్గుల రామకృష్ణారావు

బూర్గుల రామకృష్ణారావు (మార్చి 13, 1899 - సెప్టెంబర్ 14, 1967) బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసాడు.

భానుప్రియ

భానుప్రియ ప్రముఖ సినీనటి మరియు నర్తకి. 1980-1993 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు మరియు తమిళ చిత్రాలలో కథానాయికగా నటించింది. 1990లలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. ఈమె 1967, జనవరి 15న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. భానుప్రియ సోదరి నిషాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయమైంది. భానుప్రియ ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, మరియు భరతనాట్యంలో శిక్షణ ఇస్తుంది. భానుప్రియ దాదాపు 110 సినిమాలలో కథానాయికగా నటించింది. అభిమానులు ఆమెను మరో శ్రీదేవిగా పిలుచుకుంటుంటారు.

రమ్యకృష్ణ

రమ్యకృష్ణ ఒక భారతీయ సినీ నటి. ప్రముఖ చలన చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఈమె తమిళనాట ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు. ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన ఈమె నటించింది. 1985లో వచ్చిన ఇద్దరు మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి, 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రంద్వారా మంచినటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. 1992లో విడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి.

వాణిశ్రీ

వాణిశ్రీ (జ.1948, ఆగష్టు 3, నెల్లూరు) 1960 మరియు 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయనీ ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి మరియు జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార.

ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్ళి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు మరియు ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది.

సాలూరు రాజేశ్వరరావు

సాలూరు రాజేశ్వరరావు తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది.

సీజియం

సీసియం (Caesium) ఒక రసాయన మూలకము. దీని సంకేతం Cs. పరమాణు సంఖ్య 55. ఇది మెత్తగా, వెండి-బంగారు వర్ణంలో ఉంటే క్షార లోహం (alkali metal). దీని ద్రవీభవన స్థానం 28 °C (83 °F), అనగా సామాన్య ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఐదు ద్రవలోహాలలో ఇది ఒకటి. సీజియం పదార్ధాలను అణు గడియారాలలో (atomic clocks వాడుతారు,.

ఆంగ్లంలో సీజియాన్ని రెండు స్పెల్లింగులతో వ్రాస్తారు. Caesium అని IUPAC ప్రామాణికరించింది. కాని అమెరికాలో cesium అనే స్పెల్లింగు అధికంసీసియం ఎమిషన్ స్పెక్ట్రమ్ (emission spectrum) లో రెండు నీలి రంగు భాగంలో రెండు ప్రకాశవంతమైన లైనులు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల భాగంలో మరి కొన్ని లైనులు ఉంటాయి. ఇది వెండి-బంగారు (silvery gold) రంగులో ఉంటుంది. ఇది మెత్తనిది మరియు సాగదీయడానికి వీలయినది కూడాను (both soft and ductile). అన్ని రసాయన మూలకాలలోను సీసియం అతి తక్కువ అయొనైజేషన్ పొటెన్షియల్ (ionization potential) కలిగి ఉంది.

రేడియో ధార్మికత లేని ఐదు క్షార లోహాలలోను సీసియం భూమిలో అతి తక్కువగా లభించే లోహం. (అన్నింటి కంటే ఫ్రాన్సియం అత్యంత అరుదైనది. ఎందుకంటే ఫ్రాన్సియం చాలా ఎక్కువ రేడియో ధార్మికత కల లోహం కనుక త్వరగా తరిగిపోతుంది. మొత్తం భూగర్భంలో కేవలం 30 గ్రాముల ఫ్రాన్సియం ఉండవచ్చునని ఒకప్పటి అంచనా. అందుచేత వాస్తవంగా ఫ్రాన్సియం "దాదాపు అసలు లేదు" అనవచ్చును.).

సీజియం హైడ్రాక్సైడ్ (Caesium hydroxide - CsOH) చాలా బలమైన క్షారం. ఇది గాజు తలాన్ని చాలా త్వరగా తినేస్తుంది. అందువలన CsOH అనే పదార్థం "strongest base" అనుకొంటారు. కాని నిజానికి n-butyllithium మరియు sodium amide లాంటివి ఇంకా బలమైన base పదార్ధాలు .

ప్రస్తుతం అధికంగా సీజియం వినియోగం ఆయిల్ పరిశ్రమలో ఉంది. సీజియం ఫార్మేట్‌తో తయారైన ఒక ద్రవాన్ని డ్రిల్లింగ్ ఫ్లూయిడ్‌గా వాడుతారు.

ఇంకా సీజియాన్ని పరమాణు గడియారాలలో (atomic clocks) వాడుతారు. ఈ రకమైన గడియారాలో వేల సంవత్సరాల వ్యవధిలో టైము తేడా కొద్ది సెకండ్లలోపే ఉంటుంది. 1967 మయండి అంతర్జాతీయ కొలమాన విధానం (International System of Measurements) వారి ప్రామాణిక సమయం సీజియం లక్షణాలపైనే ఆధాఱపడి ఉంది. SI నిర్వచనం ప్రకారం ఒక సెకండు అనగా 9,192,631,770 సైకిల్స్ రేడియేషన్ - ఇది 133Cs పరమాణువు యొక్క రెండు హైపర్ ఫైన్ ఎనర్జీ లెవెల్స్కు చెందిన గ్రౌండ్ స్టేట్‌ల మధ్య ట్రాన్సిషన్ కాలానికి సమానం.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.