1963

1963 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1960 1961 1962 1963 1964 1965 1966
దశాబ్దాలు: 1940లు 1950లు 1960లు 1970లు 1980లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

జనవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31

ఫిబ్రవరి

ఫిబ్రవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28

మార్చి

మార్చి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31  

ఏప్రిల్

ఏప్రిల్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30

మే

మే
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31

జూన్

జూన్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30  

జూలై

జూలై
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31  

ఆగస్టు

ఆగష్టు
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31

సెప్టెంబర్

సెప్టెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30

అక్టోబర్

అక్టోబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31

నవంబర్

నవంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30

డిసెంబర్

డిసెంబర్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

జననాలు

మరణాలు

Food Minister Rajendra Prasad during a radio broadcast in Dec 1947 cropped
బాబూ రాజేంద్రప్రసాద్

పురస్కారాలు

ఆగష్టు 5

ఆగష్టు 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 217వ రోజు (లీపు సంవత్సరములో 218వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 148 రోజులు మిగిలినవి.

కె. ఎస్. చిత్ర

చిత్ర గా సుపరిచితురాలైన కె. ఎస్. చిత్ర, భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదందుకున్న ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ మరియు బెంగాలీ భాషల సినిమాలకు గాత్రదానం చేసింది.

గోరటి వెంకన్న

గోరటి వెంకన్న ప్రముఖ ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాట లకు మూలాధారాలు. మా టీవీలో ప్రసార మవుతున్న రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.

జూన్ 11

జూన్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 162వ రోజు (లీపు సంవత్సరములో 163వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 203 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమా

తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. దక్షిణ భారతదేశంలో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన దుర్గా సినీటోన్ని నిడమర్తి సూరయ్య రాజమండ్రిలో స్థాపించాడు.

తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం మరియు తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక హైదరాబాదు లోని లలిత కళాతోరణంలో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మరియు చారిత్రక చిహ్నమైన లేపాక్షి నందిని స్ఫూర్తిగా తీసుకొనబడింది.

1940 లో విడుదలైన విశ్వమోహిని భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన మల్లీశ్వరి. ఈ చిత్ర్ం చైనా లోనూ 13 ప్రింట్లతో చైనీసు సబ్-టైటిళ్ళతో బీజింగ్లో 1953 మార్చి 14 లో విడుదలైనది. ఇదే 1951 లో విడుదలైన పాతాళ భైరవి 1952 జనవరి 24 న బొంబాయిలో జరిగిన మొట్టమొదటి ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలన చిత్రం. 1956 లో విడుదలైన తెనాలి రామకృష్ణ ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలింని గెలుచుకొన్న ఏకైక చిత్రం.

2005, 2006 మరియు 2008 సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్ని అధిగమించి దేశం లోనే అత్యధిక చిత్రాలని నిర్మించింది. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియోగా గిన్నీస్ బుక్ లో నమోదైనది. హైదరాబాదులో గల ప్రసాద్స్ ఐమ్యాక్స్ ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను. దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయి.

సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ గుర్తించిన ఉత్తమ వంద చిత్రాలలో మొదటి పది పాతాళ భైరవి (1951), మల్లీశ్వరి (1951), దేవదాసు (1953), మాయాబజార్ (1957), నర్తనశాల (1963), మరో చరిత్ర (1978), మా భూమి (1979), శంకరాభరణం (1979), సాగర సంగమం (1983), శివ (1989) మొదటి పది స్థానాలని దక్కించుకొన్నాయి.

సినిమా తెలుగు వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్య పరంగా రెండవ స్థానంలోనూ (ఇంచుమించు తమిళ సినీరంగానికి కుడియెడంగా) తెలుగు సినిమా వర్ధిల్లుతోంది.

గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే

అతి పెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ మన హైదరాబాద్ శివార్లలో ఉంది, నిర్మించింది రామోజీరావు

ఎక్కువ పాటలు (వివిధ భాషలలో) పాడిన గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 30' వేలకు పైగా

ఎక్కువ సినిమాలకి (వివిధ భాషలలో) దర్శకత్వం వహించిన దర్శకుడు దాసరి నారాయణ రావు (149 సినిమాలు)

ఎక్కువ సినిమాలు (వివిధ భాషలలో) నిర్మించిన నిర్మాత రామానాయుడు (100 సినిమాలకి పైగా)

అతి తక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు బ్రహ్మానందం (750 సినిమాలకి పైగా)

ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల (42 సినిమాలు) తెలుగు చలనచిత్ర సీమకు గొప్పదనం, గౌరవం, ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు.దక్షిణ భారతదేశంలో గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమని టాలీవుడ్ అని సంభోదిస్తారు. హాలీవుడ్ పేరుని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ మాదిరిగా తెలుగు+హాలీవుడ్ ధ్వనించేటట్టు ఈ పేరుని కూర్చారు. ఒక్కోసారి బెంగాలీ సినిమా పరిశ్రమని కూడా (టాలీగంజ్+హాలీవుడ్) టాలీవుడ్ గా సంభోదిస్తారు.

తెలుగు సినిమాలు 1963

ఈ సంవత్సరం 27 చిత్రాలు వెలుగు చూశాయి. నందమూరి 12 చిత్రాల్లోనూ, అక్కినేని రెండు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ అభినయించారు. తెలుగులో పూర్తి రంగుల చిత్రంగా లలితాశివజ్యోతి వారి 'లవకుశ' విడుదలై నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో సంచలన విజయం సాధించింది. తొలి విడతలో 26 ప్రింట్లతో విడుదలై, 26 కేంద్రాలలోనూ 150 రోజుల వరకు ప్రదర్శితమై, 14 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని, తొలిసారిగా 250 రోజులకు నాందీ పలికి, 470 రోజులు వరకు ప్రదర్శితమైంది 'లవకుశ'. పత్రికలలో కలెక్షన్లు ప్రకటించిన తొలి దక్షిణాది చిత్రంగా చరిత్రకెక్కి వందరోజులకు రూ. 25 లక్షలు పోగుచేసి, 365 రోజులకు కోటి రూపాయలను నాటి 25 పైసలు, రూపాయి టిక్కెట్లపై వసూలు చేసింది. ఆ నాటి రూపాయి విలువ నేటికి ఎన్నో రెట్లు పెరిగింది. ఆ కొలమానంలో చూసుకుంటే ఈ చిత్రం వసూళ్ళు నేటికీ రికార్డుగా నిలిచాయనే చెప్పాలి. అంతకు ముందున్న రికార్డుల కంటే ఈ చిత్రం మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఆ నాడు మన రాష్ట్ర జనాభా 3 కోట్లు మాత్రమే, అయితే ఈ సినిమాను నూరు కేంద్రాలలో 1.98 కోట్ల మంది ప్రజలు ఆదరించినట్లు ఆ నాటి పత్రికా ప్రకటనలు చెబుతున్నాయి. అంటే ప్రతి కేంద్రంలోనూ ఆ యా కేంద్రాల జనాభా కంటే నాలుగు రెట్లు టిక్కెట్లు అమ్ముడై అప్పటికీ ఇప్పటికీ కనివినీ ఎరుగని చరిత్రను సొంతం చేసుకుందీ చిత్రం. (ఉదాహరణకు 1-1-1964 తేదీన వరంగల్‌ రాజరాజేశ్వరి థియేటర్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆ ఊరిలో ఆ చిత్రాన్ని 4, 34, 800 మంది చూసినట్లు ఆధారం ఉంది. ఆ నాటి వరంగల్‌ జనాభా ఒక లక్ష మాత్రమే). అలాగే ఆ తరువాత కూడా ఈ చిత్రం అప్రతిహతంగా నడచి అన్ని కేంద్రాలలో సంయుక్తంగా అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలిచింది. 'నర్తనశాల'లో యన్టీఆర్‌ బృహన్నల పాత్రను పోషించడం అప్పట్లో సంచలనంగా నిలిచింది. అలాగే ఆ చిత్రం కూడా సంచలన విజయం సాధించి, రెండు వందల రోజులు ప్రదర్శితమై దేశవిదేశాల్లో కీర్తిప్రతిష్ఠలను సంపాదించింది. ఈ యేడాది విడుదలైన ఇతర చిత్రాలలో "శ్రీకృష్ణార్జున యుద్ధం, చదువుకున్న అమ్మాయిలు, పరువు - ప్రతిష్ఠ, గురువును మించిన శిష్యుడు" శతదినోత్సవం జరుపుకోగా, యన్టీఆర్‌, బి.విఠలాచార్య కలయికలో రూపొందిన తొలి చిత్రం 'బందిపోటు' కూడా పెద్ద హిట్‌అయి శతదినోత్సవం జరుపుకుంది., 'లక్షాధికారి' చిత్రం కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. 'శ్రీతిరుపతమ్మ కథ' అప్పట్లో విజయం సాధించకున్నా, రిపీట్‌ రన్‌లో బాగా ఆడింది.

పి.లీల

పొరయత్తు లీల (మే 19, 1934 - అక్టోబరు 31, 2005) ప్రముఖ దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.

పింగళి వెంకయ్య

పింగళి వెంకయ్య (ఆగష్టు 2, 1876 - జూలై 4, 1963), స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

పెండ్యాల నాగేశ్వరరావు

పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్‌ పెండ్యాల నాగేశ్వరరావు. పెండ్యాల గారు సినీ జీవితం ప్రారంభించిన కొత్తల్లో తల్లిప్రేమ (1941), సతీ సుమతి (1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడిగా పనిచేశారు. స్వతంత్ర సంగీత దర్శకుడిగా పని చేయగల ప్రతిభ, పేరు ఉండి కూడా కొత్తపొకడలు నేర్చుకోవచ్చునన్న ఆశతో సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర సహాయకులుగా చేరారు. సాలూరు రాజేశ్వరరావు గారు విదేశీయ సంగీతాన్నీ, హిందుస్తానీ పోకడల్నీ తీసుకుని మన రాగాలతో మిళితం చేసి, ‘తెలుగుపాట’లా చేసి వినిపించగల సమర్థుడని పెండ్యాల పేర్కొనేవారు. పెండ్యాల గారు సంగీతాన్ని అందించిన సినిమాలు దొంగరాముడు (1955), ముద్దుబిడ్డ (1956), భాగ్యరేఖ (1957), జయభేరి (1959), మహామంత్రి తిమ్మరుసు (1962), శ్రీకృష్ణార్జున యుద్ధం (1963), రాముడు భీముడు (1964), శ్రీ కృష్ణ తులాభారం (1966) కొన్ని చాలు - వందకుపైగా సంగీతం కూర్చిన ఆ స్వరచక్రవర్తి సంగీతం గురించి చెప్పుకోవడానికి.

బాబూ రాజేంద్ర ప్రసాద్

డా. రాజేంద్ర ప్రసాద్ (1884 డిసెంబర్ 3 – 1963 ఫిబ్రవరి 28) భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. అతడు 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించాడు. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా 'బాబూ' అని పిలిచేవారు. అతడు భారతీయ రాజకీయ నాయకునిగా భారత జాతీయ కాంగ్రెస్ లో భారత స్వాంతంత్ర్యోద్యమ కాలంలో చేరాడు. అతడు బీహార్ లో ప్రముఖ నాయకునిగా ఎదిగాడు. మహాత్మాగాంధీ మద్దతుదారునిగా అతడు 1931 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లోజరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1946 ఎన్నికల తరువాత అతడు ఆహారం, వ్యవసాయం శాఖకు భారత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించాడు. అతడు భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి అధ్యక్షత వహించాడు. 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తరువాత అతడు రాగ్యాంగ పరిషత్తు ద్వారా మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. 1951 సార్వత్రిక ఎన్నికల తరువాత అతడు మొదటి భారత పార్లమెంటు ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఒక రాష్ట్రపతిగా అతడు పక్షపాత ధోరణి లేకుండా, ఉన్నత పదవులలో ఉన్నవారు స్వతంత్రంగా వ్యవహరించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుండి వైదొలగి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఈ పదవి అలంకారప్రాయ మైనదైనప్పటికీ అతడు భారతదేశంలో విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు గాను అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ కు వివిధ సందర్భాలలో సలహాలనిచ్చేవాడు. 1957లో అతడు రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికై, రెండు సార్లు భారత రాష్ట్రపతి పదవినలంకరించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.

మాధవపెద్ది సత్యం

మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 - డిసెంబర్ 18, 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ మరియు సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

మిక్కిలినేని గా ప్రసిద్ధులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 - ఫిబ్రవరి 22, 2011) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత.

శ్రీకాకుళం

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.

శ్రీదేవి (నటి)

శ్రీదేవి (ఆగస్టు 13, 1963-24 ఫిబ్రవరి 2018) ప్రముఖ భారతీయ సినీ నటి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము,అభినయం,నటన మున్నగువాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది. ఈమె తమిళనాడు లోని శివకాశిలో జన్మించింది. ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్ గది స్నానపు తొట్టెలో ప్రమాదవశాత్తూ మునిగి మరణించింది.

సి.యస్.ఆర్. ఆంజనేయులు

సి.యస్.ఆర్. ఆంజనేయులు (చిలకలపూడి సీతారామాంజనేయులు) (జూలై 11, 1907 - అక్టోబరు 8, 1963) ప్రముఖ రంగస్థల, సినిమా నటుడు.

సింగిరెడ్డి నారాయణరెడ్డి

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

సుమలత

సుమలత అంబరీష్ (జ: ఆగష్టు 27, 1963) తెలుగు సినిమా నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించింది.

1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి, బొంబాయి మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించింది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించింది.

తెలుగులో తొలిచిత్రం విజయచందర్ హీరోగా నటించి, బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'. తర్వాత కృష్ణతో సమాజానికి సవాల్ లో నటించింది.

సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992 న సహ కన్నడ నటుడు అంబరీష్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.

చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్లో ఈమె ఒక పాత్ర పోషించింది. గేమ్ సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.