1961

1961 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1958 1959 1960 1961 1962 1963 1964
దశాబ్దాలు: 1940లు 1950లు 1960లు 1970లు 1980లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Lee De Forest
లీ డి ఫారెస్ట్

పురస్కారాలు

1958

1958 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1962

1962 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2015

2015 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

ఆగష్టు 15

ఆగష్టు 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరములో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి.

కొణిదెల నాగేంద్రబాబు

కొణిదల నాగేంద్రబాబు తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు,నిర్మాత . ఆయన చాలా సినిమాల్లో సహాయ నటుడిగానూ, కొన్ని సినిమాల్లో హీరోగాను కూడా నటించారు. అంతే కాకుండా ఆయన అంజనా ప్రొడక్షన్స్ అనే చిత్ర పరిశ్రమ సంస్థకు అధినేత. ఆయన 1961 అక్టోబర్ 29 లో జన్మించారు.

గోవింద్ వల్లభ్ పంత్

గోవింద్ వల్లభ్ పంత్ (1887 సెప్టెంబరు 10 - 1961 మార్చి 7 ) భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ నాయకుడు. హిందీని భారత దేశ అధికార భాషగా చేయడానికి ఈయన కృషి చేశాడు.

ఒక పేద కుటుంబములో జన్మించిన పంత్, వకీలు వృత్తిని ఎంచుకుని 1914లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యాజ్యములో విజయం సాధించాడు. 1921లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి గెలవడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టాడు. 1937-39, 1946-50 లలో సంయుక్త రాజ్యాలకు (United Provinces: యునైటెడ్ ప్రావిన్సెస్) ముఖ్యమంత్రిగా, ఆ పైన ఉత్తర్ ప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1950-54 లలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1955 లో కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈయనకు 1957లో భారతరత్న పురస్కారం లభించింది.

జూలై 21

జూలై 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 201వ రోజు (లీపు సంవత్సరములో 202వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 164 రోజులు మిగిలినవి.

జూలై 4

జూలై 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 185వ రోజు (లీపు సంవత్సరములో 186వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 180 రోజులు మిగిలినవి.

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

తెలుగు సినిమాలు 1961

ఈ యేడాది 26 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్‌ ఎనిమిది చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ ఏడు చిత్రాల్లోనూ నటించారు. "జగదేక వీరునిక థ, భార్యాభర్తలు, సీతారామకళ్యాణం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు అఖండ విజయం సాధించగా "సతీ సులోచన (ఇంద్రజిత్‌), పెండ్లి పిలుపు, కలసివుంటే కలదుసుఖం, శభాష్‌ రాజా" సాధారణ విజయం సాధించాయి. 'జగదేక వీరుని కథ, ఇద్దరు మిత్రులు' రజతోత్సవం కూడా జరుపుకున్నాయి. 'ఇద్దరు మిత్రులు' చిత్రంలో అక్కినేని పూర్తి స్థాయి ద్విపాత్రాభినయాన్ని తొలిసారి ప్రదర్శించారు. ఇదే సంవత్సరం నందమూరి 'సీతారామకళ్యాణం' చిత్రంతో దర్శకత్వం చేపట్టారు.

అమూల్య కానుక

అనుమానం

ఇద్దరు మిత్రులు

ఇంటికిదీపం ఇల్లాలే

ఉషాపరిణయం

ఎవరు దొంగ

ఋష్యశృంగ

కలసి ఉంటే కలదు సుఖం

కన్నకొడుకు

కన్యకాపరమేశ్వరి మహాత్యం

కష్టసుఖాలు

కత్తిపట్టిన రైతు

కొరడా వీరుడు

కృష్ణప్రేమ

గుళ్లోపెళ్ళి

చిన్నాన్న శపధం

జగదేక సుందరి

జగదేకవీరుని కథ

జేబు దొంగ

టాక్సీరాముడు

తండ్రులు కొడుకులు

తల్లి ఇచ్చిన ఆజ్ఞ

పెళ్ళికాని పిల్లలు

పెండ్లిపిలుపు

భక్త జయదేవ

భార్యాభర్తలు

బాటసారి

బికారి రాముడు

మదనమంజరి

యోధానుయోధుడు

రాణీ చెన్నమ్మ

వాగ్ధానం

వెలుగునీడలు

వరలక్ష్మీ వ్రతం (సినిమా)

విప్లవ శ్రీ

విప్లవ వీరుడు

విరసిన వెన్నెల

శ్రీకృష్ణ కుచేల

శభాష్ రాజా

శాంత

సతీ సులోచన

సీతారామ కల్యాణం

సీత

స్త్రీ హృదయం

స్వర్ణ ప్రతిమ

దేవిక

దేవిక (Devika) (1943 - మే 2, 2002) ఒక తెలుగు సినిమా నటి. 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.

బరాక్ ఒబామా

బరాక్ ఒబామా (జననం 1961 ఆగస్టు 4) అమెరికా 44వ అధ్యక్షుడు. అమెరికాకు అధ్యక్షుడైన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికను సంతతికి చెందిన వ్యక్తి. అమెరికా ఖండం బయట జన్మించి అమెరికా అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి కూడా బరాక్ ఒబామానే. ఆయన హవాయిలోని హొనొలులులో పుట్టారు. కొలంబియా విశ్వవిద్యాలయం, హార్వర్డ్ లా స్కూల్ లలో డిగ్రీ చదువుకున్నారు ఒబామా. ఆయన అక్టోబరు 1992లో మిచెల్ రాబిన్సన్‌ను వివాహం చేసుకున్నారు. హార్వర్డ్ లా రివ్యూకు ఆయన అధ్యక్షునిగా వ్యవహరించారు. లా డిగ్రీ పొందే ముందు ఆయన చికాగోలో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా చేశారు. 1992 నుండి 2004 వరకు చికాగో లా స్కూల్ విశ్వవిద్యాలయంలో సివిల్ రైట్స్ అటార్నీగా పనిచేస్తూ రాజ్యాంగ చట్టం గురించి బోధించేవారు. 1997 నుండి 2004 వరకు ఇల్లినొయిస్ సెనేట్ లో పనిచేశారు. 2000 లో యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు డెమొక్రటిక్ ప్రైమరీలో చేశారు.

2004లో అమెరికా సెనేట్ ఎన్నికల్లో ఆయన గెలవడంతో దేశం దృష్టిని ఆకర్షించారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున గెలిచారు ఆయన. ఆ తరువాత జూలైలో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఆయన మాట్లాడారు. 2007లో అధ్యక్షునిగా ప్రచారం మొదలుపెట్టిన ఆయన, తన పార్టీలోని హిల్లరీ క్లింటన్ పై అంతర్గత ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవికి టికెట్ సంపాదించారు. ఆ తరువాత అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ మెక్‌కైన్ ను ఓడించి 2009 జనవరి 20న అధ్యక్షునిగా గెలిచారు. అధ్యక్షుని పదవి చేపట్టిన తొమ్మిది నెలల తరువాత 2009 నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.

భారతదేశ నకలు హక్కుల చట్టం

నకలుహక్కు చట్టం 1957 (Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు మరియు సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది.

ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు మరియు ఒప్పందాలకు అనుగుణంగా ఉంది. 1886 బెర్నే సమావేశం (1971 పారిస్ లో మార్చినట్లుగా),1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం మరియు 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశంలో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం (WIPO Copyrights Treaty (WCT) ) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT) లకు అనుగుణంగా ఉంది.

రవీంద్రభారతి

రవీంద్ర భారతి (ఆంగ్లం: Ravindra Bharati) ఒక సాంసృతిక కళా భవనము. హైదరాబాదులో సైఫాబాద్ ప్రాంతంలో నిత్యమూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము జరుగుతూ రద్దీగా ఉంటుంది. దీనిని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్నది. శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిని పర్యవేక్షిస్తున్నారు.

రాముడు

రాముడు అనగా శ్రీరాముడు లేదా రామావతారము

పరశురాముడు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారము.రాముడు పేరుతో కొన్ని తెలుగు సినిమాలు:

దొంగ రాముడు, 1955 మరియు 1988 లో విడుదలైన తెలుగు సినిమాలు.

రాముడు భీముడు, 1964 మరియు 1988 లో విడుదలైన తెలుగు సినిమాలు.

అందాల రాముడు, తెలుగు సినిమా.

డ్రైవర్ రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.

శృంగార రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.

అడవి రాముడు, తెలుగు సినిమా.

భార్గవ రాముడు, 1987 లో విడుదలైన తెలుగు సినిమా.

బికారి రాముడు, 1961 లో విడుదలైన తెలుగు సినిమా.

సర్కస్ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

తారక రాముడు, 1997 లో విడుదలైన తెలుగు సినిమా.

అమెరికా రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

ఛాలెంజ్ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

ఎదురులేని రాముడు, 1977 లో విడుదలైన తెలుగు సినిమా.

కలియుగ రాముడు, 1982 లో విడుదలైన తెలుగు సినిమా.

రౌడీ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

సరదా రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

భలే రాముడు, 1956 లో విడుదలైన తెలుగు సినిమా.

కళ్యాణ రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.

రాముడు కాదు కృష్ణుడు, 1983 లో విడుదలైన తెలుగు సినిమా.

వట్టికోట ఆళ్వారుస్వామి

వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు. ఆయన రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, కమ్యూనిస్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, మరియు ప్రచారకుడు. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడు. తెలుగులో రాజకీయ నవలలకు ఆద్యుడు.

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి (ఏప్రిల్ 23, 1891 - ఫిబ్రవరి 25, 1961). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన.

వేదవేదాంగాలు తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన కుటుంబంలో పుట్టి, సంస్కృతానికి స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న కథకి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన ఆత్మకథ పేరు అనుభవాలూ-జ్ఞాపకాలూనూ.

సుహాసిని

సుహాసిని (జ. 15 ఆగష్టు, 1971) ప్రముఖ దక్షిణ భారత నటి. ప్రముఖ దర్శకుడు మణిరత్నంను వివాహమాడింది. తమిళనాడులో గల చెన్నై పట్టణంలో జన్మించింది. నటనలోనే కాకుండా కథకురాలిగా, నిర్మాతగా అనుభవముంది. ఈవిడ తొలిసారి 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంలో నటించింది.

సుహాసిని, ప్రసిద్ధ భారతీయ నటుడు కమల హాసన్ అన్న, నటుడు చారు హాసన్ కూతురు. 1988లో ఈమె ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంను పెళ్ళిచేసుకున్నది. వీరికి 15 యేళ్ళ వయసున్న కొడుకు ఉన్నాడు.

1996లో, దర్శకత్వములో అడుగుపెట్టి, జి.వి.ఫిల్మ్స్ నిర్మించిన ఇందిర సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుహాసినినే సమకూర్చింది. ఈమె మరియు ఈమె భర్త, తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ టాకీస్ యొక్క నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటారు. మద్రాస్ టాకీస్ లో మణిరత్నం సోదరుడు కీ.శే. జి.శ్రీనివాసన్ కూడా ఉండేవారు.

సుహాసిని 1985లో కె.బాలచందర్ దర్శకత్వము వహించిన తమిళ సినిమా సింధుభైరవిలో తన నటనకు గాను 1986లో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారము (ఉత్తమనటి) అవార్డు అందుకున్నది.

ఈమె తమిళ, తెలుగు మరియు కన్నడతో పాటు మళయాళము భాషా చిత్రాలలో కూడా నటించింది. 1999లో ఎ.ఎఫ్.ఐ చిత్రోత్సవముకు ఎన్నికైన వానప్రస్థమ్ సినిమాలో సుహాసిని తన నటనకుగాను ప్రశంసలందుకున్నది.

సూర్యకాంతం

సూర్యకాంతం (అక్టోబర్ 28, 1924 - డిసెంబర్ 17, 1996) ఒక ప్రముఖ సినీ నటి. తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది.

ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు"

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.