1958

1958 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1955 1956 1957 1958 1959 1960 1961
దశాబ్దాలు: 1930లు 1940లు 1950లు 1960లు 1970లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Maulana Abul Kalam Azad
మౌలానా అబుల్ కలాం ఆజాద్

పురస్కారాలు

2011

2011 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

అక్టోబర్ 1

అక్టోబరు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 274వ రోజు (లీపు సంవత్సరములో 275వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 91 రోజులు మిగిలినవి.

అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్

ఆహుతి ప్రసాద్ (జనవరి 2, 1958 - జనవరి 4, 2015) తెలుగు సినీ నటుడు. క్యారెక్టర్ నటునిగా, హాస్య నటునిగా గుర్తింపు పొంది 300 పైచిలుకు సినిమాల్లో నటించారు. 1983-84ల్లో మధు యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నాకా విక్రమ్ తో నటునిగా పరిచయం అయ్యాడు. కొద్ది సినిమాల్లో, ఒక సీరియల్లో నటించాకా ఆహుతి (1987) సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆహుతి సినిమా ఘన విజయం సాధించింది, సినిమాలో ప్రసాద్ పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించి అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్ గా పేరొందాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో పోలీసు పాత్రలు, రాజకీయ నాయకుని పాత్రలు చేశాడు. 1990లో పోలీసు భార్య పునర్నిర్మాణం చేసి కన్నడంలో నిర్మాతగా మారి 3 సినిమాలు తీశాడు. తొలి సినిమా విజయవంతం అయినా, మిగతా సినిమాల పరాజయం పాలై అప్పుల పాలు చేశాయి. తెలుగులోనూ అవకాశాలు రాకపోడంతో దాదాపు 4 సంవత్సరాల పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నిన్నే పెళ్ళాడుతా (1996) సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పాత్రతో తిరిగి సినిమా అవకాశాలు పెరిగాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమాలో నటనకు గాను 2002 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. చందమామ (2007) సినిమాలో పోషించిన రామలింగేశ్వరరావు పాత్ర హాస్యం, విభిన్నమైన సంభాషణ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చందమామలో నటనకు గాను 2007 సంవత్సరానికి ఉత్తమ క్యారెక్టర్ నటుడు - గుమ్మడి విభాగంలో నంది అవార్డు పొందారు. ఆ సినిమా తర్వాత కెరీర్ మళ్ళీ మలుపు తిరిగి పలు హాస్య పాత్రలు చేసే అవకాశం వచ్చింది. నిర్మాణ రంగంలో బిల్డర్ గా వ్యాపారం కూడా చేశాడు. 2015 జనవరి 4న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు.

ఆంధ్రప్రభ

ఆంధ్రప్రభ ఒక ప్రముఖ తెలుగు దినసరి వార్తాపత్రిక. ఇది 1938 సంవత్సరం ఆగష్టు 15న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని రామనాథ్ గోయంకా మద్రాసులో ప్రారంభించారు . అప్పుడు ఖాసా సుబ్బారావు సంపాదకులుగా ఉన్నాడు. అతని తరువాత న్యాపతి నారాయణమూర్తి సంపాదకులైనాడు. 1942లో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కొంతకాలం విద్వాన్ విశ్వం సంపాదకత్వంలో ఆంధ్రప్రభ వెలిగిపోయింది. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల వెంకటేశ్వర రావు సంపాదకత్వానికి రాజీనామా చేశాడు. నార్ల సంపాదకులుగా పనిచేసిన సుమారు పదహారు సంవత్సరాలు ఆంధ్రప్రభ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.

ఆగష్టు 29

ఆగష్టు 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 241వ రోజు (లీపు సంవత్సరములో 242వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 124 రోజులు మిగిలినవి.

ఇ.వి.వి.సత్యనారాయణ

ఇ.వి.విగా ప్రసిద్ధిచెందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ (ఆంగ్లం: E. V. V. Satyanarayana) (జూన్ 10, 1958 - జనవరి 21, 2011) తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఇతడు ప్రముఖ దర్శకుడు జంధ్యాల శిష్యుడు. ఈతడి మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నిర్మింపబడిన చెవిలో పువ్వు. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలంతర్వాత నిర్మాత రామానాయుడు ప్రేమఖైదీ చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజనుదొంగలు వంటి చిత్రాలు మరియు నరేష్తో జంబలకిడి పంబ మొదలైన చిత్రాలు తీశారు. సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది (శోభన్ బాబు) లాంటి చిత్రాలతర్వాత ఆమె, తాళి వంటి మహిళాపరమైన చిత్రాలు తీశారు. అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో చిత్రాలు తీశారు. కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్ని హీరోలుగా పరిచయంచేశారు.

ఉన్నవ లక్ష్మీనారాయణ

ఉన్నవ లక్ష్మీనారాయణ ( డిసెంబరు 4, 1877 - సెప్టెంబరు 25, 1958) గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. గుంటూరులో ఆయన స్థాపించిన శ్రీ శారదా నికేతన్ స్త్రీ విద్యను ప్రోత్సహించడంలో మంచి కృషి చేసింది.

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

గుంతకల్లు రైల్వే డివిజను

గుంతకల్లు రైల్వే డివిజను భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ (SCR) లోని ఆరు (డివిజన్లలో) విభాగాలలో ఒకటి. ఈ డివిజను యొక్క ప్రధాన కేంద్రం గుంతకల్లు వద్ద ఉంది మరియు దీని జోనల్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లో ఉంది. గుంతకల్లు డివిజను యూని గేజ్‌గా ఉంది. అనగా మొత్తం డివిజను బ్రాడ్ గేజ్ రైలు మార్గముగా ఉంది. 2014-15 సం.లో గుంతకల్లు రైల్వే డివిజను ఆదాయం దాదాపు రూ. 1460 కోట్లుగా ఉంది.

జయంతి (పత్రిక)

విశ్వనాథ సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రభవ నామ సంవత్సరం (జూలై, 1927)లో వెలువడిన సాహిత్య పత్రిక జయంతి.

ఒక సంవత్సరం వెలువడి పత్రిక ఆగిపోయింది. 1958లో విశ్వనాథ గారు గౌరవ సంపాదకులుగా, మల్లంపల్లి సోమశేఖరశర్మ, దివాకర్ల వేంకటావధాని, కేతవరపు రామకోటిశాస్త్రి మరియు జువ్వాడి గౌతమరావు సహాయ సంపాదకులుగా జయంతి మాసపత్రికగా తిరిగి ప్రారంభమైనది.

సరికొత్త జయంతి 2003లో ప్రారంభించబడింది. దీనికి కూడా జువ్వాడి గౌతమరావు ముఖ్య సంపాదకులు. వెలిచాల కొండలరావు కార్యనిర్వాహక సంపాదకులు.

జయమాలిని

జయమాలిని (జ. 1958 జూన్ 15) సుప్రసిద్ద దక్షిణాది సినిమా నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 600 చిత్రాలలో నటించింది. శృంగార నృత్య తారగా ప్రసిద్ధి చెందినది. ఈమె సోదరి జ్యోతిలక్ష్మి కూడా సుప్రసిద్ద సినీ నర్తకి.. ఈమె 1970 నుండి 1990 దశకం వరకూ అనేక విజయవంతమైన చిత్రాలలో శృంగార నృత్యాలను చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

తెలుగు సినిమాలు 1958

ఈ యేడాది 21 చిత్రాలు విడుదల కాగా, యన్టీఆర్‌ ఆరు చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ నాలుగు చిత్రాల్లోనూ ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. "ఇంటిగుట్టు, చెంచులక్ష్మి, మంచి మనసుకు మంచి రోజులు ఘనవిజయం సాధించాయి; వీటితో పాటు 'శోభ', 'రాజనందిని' శతదినోత్సవాలు జరుపుకున్నాయి. 'భూకైలాస్‌', 'ముందడుగు' మంచి ఆదరణ పొందాయి. 'కార్తవరాయని కథ', 'పెళ్ళినాటి ప్రమాణాలు' యావరేజ్‌ విజయాలు సాధించాయి.

అత్తా ఒకింటి కోడలే

అన్నా తమ్ముడు

ఆడపెత్తనం

ఇంటిగుట్టు

ఉత్తమ ఇల్లాలు

ఎత్తుకు పైఎత్తు

కార్తవరాయుని కథ

కొండవీటి దొంగ

గంగాగౌరీ సంవాదం

చెంచులక్ష్మి

దొంగలున్నారు జాగ్రత్త

పెద్ద కోడలు

పార్వతీ కళ్యాణం

పెళ్ళినాటి ప్రమాణాలు

బడిపంతులు

భూకైలాస్ (1958 సినిమా)‌

బొమ్మల పెళ్ళి

భూలోక రంభ

మంచి మనసుకు మంచి రోజులు

ముందడుగు

మహాదేవి

మహిషాసుర మర్ధిని

రాజనందిని

వీరఖడ్గం

విజయకోటవీరుడు

వీరప్రతాప్

శోభ

శ్రీరామాంజనేయ యుద్ధం

శ్రీకృష్ణగారడీ

శ్రీకృష్ణమాయ

సౌభాగ్యవతి

స్త్రీశపధం

నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్

నాసా అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థను సంక్షిప్తంగా నాసా అని వ్యవహరిస్తూంటారు. ఇది జూలై 1958 29 న స్థాపించబడింది. దీని వార్షిక బడ్జెట్ 2007లో $16.8 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంతరిక్ష ప్రాజెక్టులు మాత్రమే కాకుండా మిలిటరీ అంతరిక్ష విశ్లేషణకు ఈ సంస్థ ద్వారా చేపడుతున్నారు. దీని ప్రధాన కేంద్రం వాషింగ్టన్లో గలదు.

పోసాని కృష్ణ మురళి

పోసాని కృష్ణ మురళి ప్రధానంగా తెలుగు సినిమాలో రంగంలో పనిచేసే రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత. ఇతను 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. వ్యాపారపరంగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 2009లో చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసి, ఓటమి పాలయ్యాడు. ఎదటి వ్యక్తి పేరేదైనా, రాజా అంటూ అతణ్ణి సంబోధించే ఒక మేనరిజమును సినిమాల్లో ప్రవేశపెట్టి దానికి ప్రాచుర్యం తెచ్చాడు. రాజా అనే నామవాచకానికి సర్వనామంగా ప్రాచుర్యం తెచ్చాడు.

మార్చి 19

మార్చి 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 78వ రోజు (లీపు సంవత్సరములో 79వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 287 రోజులు మిగిలినవి.

మే 21

మే 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 141వ రోజు (లీపు సంవత్సరములో 142వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 224 రోజులు మిగిలినవి.

మే 5

మే 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 125వ రోజు (లీపు సంవత్సరములో 126వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 240 రోజులు మిగిలినవి.

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్

మౌలానా అబుల్ కలాం ఆజాద్ (నవంబర్ 11, 1888 — ఫిబ్రవరి 22, 1958) (బెంగాళీ: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకరు. అతను ప్రఖ్యాత పండితుడు మరియు కవి.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ *అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ,పెర్షియన్ మరియు బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు.

అతని పేరు సూచించినట్లు అతను *వాదనలో రారాజు మరియు వాదనా పటిమలో మేటి. అతను తన కలం పేరు ఆజాద్ గా స్వీకరించినాడు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కానగరం లో నవంబర్ 11, 1888 న జన్మించారు. అతని వంశస్తులు బాబర్ రోజుల్లో హేరాత్ (ఆఫ్గనిస్తాన్ లో ఒక నగరం) కు చెందిన వారు. ఆజాద్ ముస్లిం పండితులు, లేదా మౌలానా ల వంశం నుండి వచ్చాడు. అతని తల్లి ఒక అరబ్ మరియు షేక్ మహ్మద్ జహీర్ వత్రి మరియు అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాలు ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వచ్చి అక్కడే స్థిరపడ్డారు.

1890 లో అయన తన కుటుంబం తో కలకత్తా వచ్చారు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అబ్యసించి నాడు. అతని విద్య ఇంట్లో సాగింది మొదట తండ్రి పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్ మొదట *అరబిక్ మరియు పెర్షియన్ నేర్చుకున్నాడు తరువాత *తత్వశాస్త్రం,రేఖాగణితం, గణితం మరియు బీజగణితం అబ్యసించి నాడు. స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర మరియు రాజకీయాలు నేర్చుకున్నాడు.

ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందినాడు.అతను దివ్య ఖురాన్ పై భాష్యం వ్రాసినాడు..

అతను జమాలుద్దిన్ ఆఫ్ఘానీ యొక్క పాన్-ఇస్లామిక్ సిద్ధాంతాలను లో మరియు అలిగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క ఆలోచనలో ఆసక్తి చూపినారు. పాన్-ఇస్లామిక్ భావాలతో అతను ఆఫ్గనిస్తాన్,ఇరాక్, ఈజిప్ట్, సిరియా మరియు టర్కీ సందర్శించారు.

ఇరాక్ లో అతను ఇరాన్ రాజ్యాంగ ప్రభుత్వ స్థాపనకు పోరాటo సల్పుతున్న నిర్వాసిత విప్లవ కారులను కలుసుకున్నారు. ఈజిప్ట్ లో అతను షేక్ ముహమ్మద్ అబ్దుహ్ మరియు సయీద్ పాషా వంటి అరబ్ ప్రపంచంలోని ఇతర విప్లవకారులను కలుసుకున్నారు. అతను కాన్స్టాంటినోపుల్లో యంగ్ టర్క్స్ భావాలతో పరిచయం పెంచుకొన్నారు. ఈ పరిచయాలు అన్ని అతనిని ఒక జాతీయవాద విప్లవవాది గా రూపాంతరం చెందిoచాయి.

విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆజాద్, బెంగాల్ కు చెందిన *అరవింద ఘోష్, శ్రీ శ్యాం సుందర్ చక్రవర్తి వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నారు మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టారు. విప్లవాత్మక చర్యలు బెంగాల్, బీహార్ లకు పరిమితం అగుట ఆజాద్ కు తెలిసి రెండు సంవత్సరాల లోపల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటుచేసారు. ఆసమయం లో విప్లవ వాదులు ముస్లింల విప్లవ వ్యతిరేకులుగా భావించసాగారు ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీని ఉపయోగిస్తున్నాదని భావించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టటానికి ప్రయత్నించారు.

1912 లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ లో ‘ అల్ హిలాల్’ వార పత్రిక ముస్లింలు మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. అల్ హిలాల్ మోర్లే-మింటో సంస్కరణల పలితంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణల తర్వాత హిందూ మతం-ముస్లిం వర్గాల మద్య ఐక్యత కుదుర్చటం లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ‘అల్ హిలాల్’ అతివాద భావనల ఒక విప్లవాత్మక ధ్వనిగా మారింది. ప్రభుత్వం వేర్పాటువాద భావనల ప్రచారకునిగా “అల్- హిలాల్” ను భావిస్తింది. ప్రభుత్వం దానిని 1914 లో నిషేదిoచినది.

ఆజాద్ భారతీయ జాతీయ వాదం మరియు హిందూ -ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను “అల్ బలఘ్” ప్రారంభించారు.1916 లో ప్రభుత్వం ఈ పత్రికను కూడా నిషేధించారు మరియు రాంచి లో ఆజాద్ ను నిర్భందించారు. ఆతరువాత మొదటి ప్రపంచ యుద్ధం 1920 తర్వాత విడుదల చేసారు. విడుదల తరువాత ఆజాద్ *ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీ లో బ్రిటిష్ వ్యతిరేక భావాలు పెంచారు. ఖలీఫా ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఖలీఫాను తిరిగి టర్కీ రాజుగా ప్రకటించడం.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధీజీ ప్రారంభించిన "సహాయ నిరాకరణ"ఉద్యమం ను సమర్ధించి 1920 లో భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రవేశించినాడు. ఇతడు ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడు గా (1923) ఎన్నికయ్యారు.

మౌలానా ఆజాద్ గాంధీజీ *ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930 లో అరెస్టు అయినారు. అతనిని ఒక సంవత్సరంన్నర పాటు మీరట్ జైల్లో ఉంచారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1940 (రాంగడ్) లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు మరియు 1946 వరకు ఆ పదవి లో ఉన్నారు.

అతను *విభజన కు వ్యతిరేకి . విభజన అతని కలలను నాశనం చేసింది. హిందువులు మరియు ముస్లింలు కలసి సహజీవనం చేస్తున్న ఒక ఏకీకృత దేశం బద్దలు అగుట అతని కల ను నాశనం చేసి అతనిని విపరీతంగా బాధించింది.

ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు.

సనాతన సారథి

సనాతన సారథి 1958 సంవత్సరంలో ప్రారంభించబడిన ఆధ్యాత్మిక మాసపత్రిక. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సత్యం, ధర్మం, శాంతి మరియు ప్రేమ అనే భావాలపై సమాచారం ఈ పత్రిక అందిస్తుంది. ఇది అనంతపురం జిల్లా, పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్స్ ట్రస్ట్, ప్రశాంతి నిలయం నుండి ప్రచురించబడుతున్నది. ఈ పత్రిక చాలా భాషలలో వెలువడుతున్నది. బాబా గారి సందేశాలు (ప్రసంగాలు) తెలుగు సనాతన సారథిలో ఉంటాయి. ఇతర భాషలలో అనువాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి కూడా సమాచారం తెలియజేస్తుంది. ప్రస్తుతం సనాతన సారథి సంపాదకులు వి.వేంకటేశ్వర్లు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.