1956

1956 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1953 1954 1955 - 1956 - 1957 1958 1959
దశాబ్దాలు: 1930లు 1940లు 1950లు 1960లు 1970లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Young Ambedkar
అంబేద్కర్
ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో ఉర్దూ ఉంది.ఈ రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు పెన్నా. ఆంధ్ర ప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబరు 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అడపా దడపా సాగిన వేర్పాటు ఉద్యమాల ఫలితంగా దాదాపు 58 సంవత్సరాల తరువాత 2014 జూన్ 2 న పునర్విభజింపబడింది.నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణలు 2 తెలుగు రాష్ట్రాలుగా 2014 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చాయి.హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా 20114 జూన్ 2 నుండి పది సంవత్సరాల వరకు కొనసాగే అవకాశముంది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకు స్థాపన జరిగింది.. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి పరిపాలన మొదలైంది. దేశంలోనే 2వ అతిపెద్ద కోస్తాతీరం ఈరాష్ట్రంలో ఉంది.

ఆగష్టు 19

ఆగష్టు 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 231వ రోజు (లీపు సంవత్సరములో 232వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 134 రోజులు మిగిలినవి.

కన్నెగంటి బ్రహ్మానందం

కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నాడు. 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది.

కర్ణాటక

కర్ణాటక ( కన్నడలో ಕರ್ನಾಟಕ) భారతదేశములోని నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. 1950 లో పూర్వపు మైసూరు రాజ్యము నుండి యేర్పడటము వలన 1973 వరకు ఈ రాష్ట్రము మైసూరు రాష్ట్రముగా వ్యవహరించబడింది. 1956 లో చుట్టుపక్క రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలుపుకొని విస్తరించబడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు రాష్ట్రములో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఏకైక నగరము. మైసూరు, మంగుళూరు, హుబ్లి-ధార్వాడ్, బళ్ళారి మరియు బెళగావి రాష్ట్రములోని ఇతర ముఖ్య నగరాలు. కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష. 2001 జనాభా లెక్కల ప్రకారము దేశములో 5 కోట్లకు మించి జనాభా ఉన్న పది రాష్ట్రాలలో ఇది ఒకటి.

కర్నూలు

కర్నూలు : (ఉర్దూ - کرنول ) దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నగరము మరియు అదే పేరుగల జిల్లా యొక్క ముఖ్య పట్టణం. కర్నూలు నగరము హైదరాబాదు నుండి 212 కి.మీ. (అనగా 132 మై.) దూరంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని అత్యధిక జనాభా గల నగరాలలో కర్నూలు 5వ స్థానములో నున్నది. రాయలసీమకు కర్నూలు ముఖద్వారం లాగా ఉంటుంది. ఒకప్పుడు కందెనవోలు గా ప్రసిద్ధి చెందిన పట్టణం ఇప్పుడు కర్నూలుగా మారింది. 1953 అక్టోబరు 1 నుండి 1956 అక్టోబరు 31 వరకు ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కొనసాగింది. అక్టోబరు 2, 2009న భారీ వర్షాలు మరియు హంద్రీ, తుంగభద్ర నదుల వరద నీటివల్ల కర్నూలు పట్టణంలో వందల ఇండ్లు మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

గద్దె రాజేంద్ర ప్రసాద్

రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

గుండు హనుమంతరావు

గుండు హనుమంతరావు (ఆక్టోబర్ 10, 1956 - ఫిబ్రవరి 19, 2018) ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు. సుమారు నాలుగు వందల సినిమాల్లో నటించాడు. సినిమాలతో పాటు ధారావాహికలు, కార్యక్రమాలు కూడా చేశాడు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రమాలకిచ్చే నంది అవార్డులు అందుకున్నాడు.మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతూ 2018, ఫిబ్రవరి 19న హైదరాబాదులో కన్ను మూశాడు.

చిన్న జీయర్ స్వామి

త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఒక వేద గురువు, ఉపదేశకుడు, శ్రీవైష్ణవ ప్రముఖుడు. ఈయన 1956 నవంబరు 3 న జన్మించారు.

ఢిల్లీ

ఈ వ్యాసం భారత జాతీయ రాజధాని ప్రదేశం అయిన ఢిల్లీ మహానగరాన్ని గురించి. భారతదేశపు రాజధాని గురించిన వ్యాసం కోసం క్రొత్త ఢిల్లీ చూడండి.

ఢిల్లీ (Delhi, హిందీ: दिल्ली ఉర్దూ: دیلی ) వ్యాసం ఆరంభంలో మూడు వేరు వేరు పదాలగురించి తెలుసుకోవాలి:

భారతదేశం రాజధాని : క్రొత్త ఢిల్లీ నగరం

జాతీయ రాజధాని ప్రదేశం (నేషనల్ కేపిటల్ టెర్రిటరీ ): ఇది చట్టపరంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశం. ఇందులో ప్రధాన విభాగాలు.

క్రొత్తఢిల్లీ నగరం

ఢిల్లీ నగరం

ఢిల్లీ కంటోన్మెంటు

(జనాభా గణాంకాల ప్రకారం) ఇంకా 59 పట్టణాలు, 165 గ్రామాలు.

హర్యానాలోని ఫరీదాబాద్, గుర్‌గావ్‌లు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, నోయిడా (న్యూ ఒక్లహా ఇండస్ట్రియల్ డెవెలెప్మెంట్ అధారిటీ - నోయిడా )జాతీయ రాజధాని ప్రదేశం ఒక కేంద్రపాలిత ప్రాంతంగా 1956 నవంబరు 1న ఏర్పాటు చేయబడింది. దేశం నలుమూలలనుండి రాజధాని నగరానికి ప్రజలు వలస వస్తుండడంవల్ల అక్కడ జనం వత్తిడి విపరీతంగా పెరుగుతున్నది. అందువలన చుట్టుప్రక్కల నగరాలను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలనే అభిప్రాయంతో జాతీయ రాజధాని ప్రదేశాన్ని ఏర్పరచారు.

తనికెళ్ళ భరణి

తనికెళ్ళ భరణి (జననం: జులై 14, 1956) రంగస్థల, సినిమా రచయిత, నటుడు. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకల కళాకోవిదుడు. ఇతనికి దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. ఇప్పటిదాకా దాదాపు 320 సినిమాలలో నటించాడు.

తెలుగు సినిమా

తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. దక్షిణ భారతదేశంలో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన దుర్గా సినీటోన్ని నిడమర్తి సూరయ్య రాజమండ్రిలో స్థాపించాడు.

తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం మరియు తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక హైదరాబాదు లోని లలిత కళాతోరణంలో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మరియు చారిత్రక చిహ్నమైన లేపాక్షి నందిని స్ఫూర్తిగా తీసుకొనబడింది.

1940 లో విడుదలైన విశ్వమోహిని భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన మల్లీశ్వరి. ఈ చిత్ర్ం చైనా లోనూ 13 ప్రింట్లతో చైనీసు సబ్-టైటిళ్ళతో బీజింగ్లో 1953 మార్చి 14 లో విడుదలైనది. ఇదే 1951 లో విడుదలైన పాతాళ భైరవి 1952 జనవరి 24 న బొంబాయిలో జరిగిన మొట్టమొదటి ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలన చిత్రం. 1956 లో విడుదలైన తెనాలి రామకృష్ణ ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలింని గెలుచుకొన్న ఏకైక చిత్రం.

2005, 2006 మరియు 2008 సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్ని అధిగమించి దేశం లోనే అత్యధిక చిత్రాలని నిర్మించింది. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియోగా గిన్నీస్ బుక్ లో నమోదైనది. హైదరాబాదులో గల ప్రసాద్స్ ఐమ్యాక్స్ ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను. దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయి.

సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ గుర్తించిన ఉత్తమ వంద చిత్రాలలో మొదటి పది పాతాళ భైరవి (1951), మల్లీశ్వరి (1951), దేవదాసు (1953), మాయాబజార్ (1957), నర్తనశాల (1963), మరో చరిత్ర (1978), మా భూమి (1979), శంకరాభరణం (1979), సాగర సంగమం (1983), శివ (1989) మొదటి పది స్థానాలని దక్కించుకొన్నాయి.

సినిమా తెలుగు వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్య పరంగా రెండవ స్థానంలోనూ (ఇంచుమించు తమిళ సినీరంగానికి కుడియెడంగా) తెలుగు సినిమా వర్ధిల్లుతోంది.

గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే

అతి పెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ మన హైదరాబాద్ శివార్లలో ఉంది, నిర్మించింది రామోజీరావు

ఎక్కువ పాటలు (వివిధ భాషలలో) పాడిన గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 30' వేలకు పైగా

ఎక్కువ సినిమాలకి (వివిధ భాషలలో) దర్శకత్వం వహించిన దర్శకుడు దాసరి నారాయణ రావు (149 సినిమాలు)

ఎక్కువ సినిమాలు (వివిధ భాషలలో) నిర్మించిన నిర్మాత రామానాయుడు (100 సినిమాలకి పైగా)

అతి తక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు బ్రహ్మానందం (750 సినిమాలకి పైగా)

ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల (42 సినిమాలు) తెలుగు చలనచిత్ర సీమకు గొప్పదనం, గౌరవం, ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు.దక్షిణ భారతదేశంలో గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమని టాలీవుడ్ అని సంభోదిస్తారు. హాలీవుడ్ పేరుని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ మాదిరిగా తెలుగు+హాలీవుడ్ ధ్వనించేటట్టు ఈ పేరుని కూర్చారు. ఒక్కోసారి బెంగాలీ సినిమా పరిశ్రమని కూడా (టాలీగంజ్+హాలీవుడ్) టాలీవుడ్ గా సంభోదిస్తారు.

తెలుగు సినిమాలు 1956

ఈ యేడాది 21 చిత్రాలు విడుదల కాగా, యన్టీఆర్‌ ఏడు చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ రెండు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి రెండు చిత్రాల్లోనూ నటించారు. విజయం మనదే, భలేరాముడు, ఇలవేల్పు, గౌరీమహాత్మ్యం, చరణదాసి, హరిశ్చంద్ర, నాగులచవితి' చిత్రాలు మంచి విజయం సాధించి, శతదినోత్సవాలు జరుపుకున్నాయి. తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, ఉమాసుందరి కూడా ప్రజాదరణ పొందాయి. దక్షిణభారతదేశ తొలి కలర్‌ చిత్రం 'ఆలీబాబా 40 దొంగలు' (భానుమతి, యమ్‌.జి. ఆర్‌.) తెలుగులోకి అనువాదమై విజయం సాధించింది.

నవంబర్ 1

నవంబర్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 305వ రోజు (లీపు సంవత్సరములో 306వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 60 రోజులు మిగిలినవి.

ఫిబ్రవరి 20

ఫిబ్రవరి 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 51వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 314 రోజులు (లీపు సంవత్సరములో 315 రోజులు) మిగిలినవి.

బిందు ఎ బంబాహ్

బిందు అనుభా బంబాహ్ భారత డేసానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఈమె చికాగోలో 1983 న పి.హెచ్.డిని పూర్తి చేశారు. ప్రస్తుతం స్కూల్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఈమె UNESCO వారి ద్వారా యంగ్ సైంటిస్ట్ అవార్డును పొందారు. ఆమె పి.ఎం.ఎస్.బ్లాకెట్ట్ స్కాలషిప్ ను కూడా పొందుతున్నారు. ఈమె థియరీటికల్ హై ఎనర్జీ ఫిజిక్స్ మరియు డైనకిక్స్ సిస్టమ్స్ రంఆలలో పరిశోధనలు చేస్తున్నారు.

భారతదేశ నకలు హక్కుల చట్టం

నకలుహక్కు చట్టం 1957 (Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు మరియు సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది.

ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు మరియు ఒప్పందాలకు అనుగుణంగా ఉంది. 1886 బెర్నే సమావేశం (1971 పారిస్ లో మార్చినట్లుగా),1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం మరియు 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశంలో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం (WIPO Copyrights Treaty (WCT) ) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT) లకు అనుగుణంగా ఉంది.

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.

శ్రీకాకుళం

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.