1955

1955 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1952 1953 1954 - 1955 - 1956 1957 1958
దశాబ్దాలు: 1930లు 1940లు - 1950లు - 1960లు 1970లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

State-Bank-of-India-Logo
ఎస్.బి.ఐ.లోగో

జననాలు

Mamata banerjee
మమతా బెనర్జీ
Arun Lal
అరుణ్ లాల్

మరణాలు

Alexander Fleming 3
అలెగ్జాండర్ ఫ్లెమింగ్

పురస్కారాలు

1956

1956 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

అరుణా దత్తాత్రేయన్

అరుణా దత్తాత్రేయన్ భారత దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఈమె సెంట్రల్ లెదర్ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా యున్నారు.

ఆగష్టు 27

ఆగష్టు 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 239వ రోజు (లీపు సంవత్సరములో 240వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 126 రోజులు మిగిలినవి.

బొద్దు పాఠ్యం

ఆగ్నేయ రైల్వే

భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఆగ్నేయ రైల్వే (South Eastern Railway) ఒకటి. ఈ రైల్వే జోన్ గార్డెన్ రీచ్, కోలకతా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ జోన్ లో మొత్తం అద్రా, చక్రధర్‌పూర్, ఖరగ్‌పూర్, రాంచీ నాలుగు (డివిజన్స్) విభాగాలు ఉన్నాయి.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (14 మార్చి 1879 – 18 ఏప్రిల్ 1955) జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ప్రతిపాదించారు ఐన్ స్టీన్. ఆయన తత్త్వశాస్త్రంలో కూడా ప్రభావవంతమైన కృషి చేశారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc^2 ను కనిపెట్టారు ఆయన. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఫార్ములా. 1921లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు ఐన్ స్టీన్. క్వాంటం థియరీ పరిణామ క్రమం పరిణామ క్రమానికి ముఖ్యమైన ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టినందుకు ఈ బహుమతి అందుకున్నారు ఆయన.ఆయన కెరీర్ మొదట్లో న్యూటన్ మెకానిక్స్ సంప్రదాయ మెకానిక్స్ ను పునరుర్ధరించలేదని భావించేవారు. దీంతో స్పెషల్ రెలెటివిటి అభివృద్ధికి బాటలు పడ్డాయి. 1916లో సాధారణ సాపేక్షతపై పేపర్ ప్రచురించారు. స్టాటిస్టికల్ మెకానిక్స్, క్వాంటం థియరీల్లోని సమస్యలపై దృష్టి పెట్టారు ఐన్ స్టీన్. పార్టీకల్ థియరీ, అణువుల చలనాలపై వ్యాఖ్యానం చేశారు ఆయన. ఆయన ఉష్ణ లక్షణాల గురించి చేసిన పరిశోధన కాంతి ఫోటాన్ సిద్ధాంతం కనుగొనడానికి ఉపయోగపడింది. 1917లో సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని భారీ స్థాయిలో విశ్వానికి అనువర్తింపచేశారు ఐన్ స్టీన్.1933లో హిట్లర్ జర్మనీలో అధికారంలోకి వచ్చాకా ఆయన అమెరికా వెళ్ళారు. ఆయన జ్యుయిష్ జాతికి చెందినందున తిరిగి జర్మనీ వెళ్ళలేదు. అమెరికాలో బెర్లిన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఆచార్యునిగా పనిచేశారు. 1940లో అమెరికన్ పౌరసత్వం లభించడంతో అక్కడే స్థిరపడిపోయారు ఆయన. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా అత్యంత శక్తివంతమైన బాంబులపై పరిశోధన జరుగుతోందనీ, ఇది అణుబాంబు తయారీకి దారితీస్తుందని వివరిస్తూ అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూసెవెల్ట్ కు ఉత్తరం రాశారు ఐన్ స్టీన్. తాను యుద్ధానికి వ్యతిరేకం కాదనీ, కొత్తగా కనుగొన్న అణుబాంబు ప్రయోగానికి తాను పూర్తి వ్యతిరేకమనీ స్పష్టం చేశారు ఆయన. అణు ఆయుధాలను ఉపయోగించకూడదంటూ బ్రిటన్ కు చెందిన తత్త్వవేత్త బెర్ట్రాండ్ రుసెల్ తో కలసి రుసెల్-ఐన్ స్టీన్ మానిఫెస్టోపై సంతకం చేశారు ఆయన. 1955లో చనిపోయేంతవరకూ న్యూజెర్సీలోని ప్రిన్స్ టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్సెడ్ స్టడీ సంస్థలో పనిచేశారు ఐన్ స్టీన్.

ఐన్ స్టీన్ 300కు పైగా శాస్త్రీయ పత్రికలు, 150 శాస్త్రీయేతర పత్రికలు ప్రచురించారు. 5 డిసెంబరు 2014న విశ్వవిద్యాలయాల్లోని ఐన్ స్టీన్ కు చెందిన 30,000 శాస్త్రీయ పత్రాలను విడుదల చేశారు. చాలా రంగాల్లో ఆయన చేసిన కృషికి తెలివితేటలకు ఆయన పేరు మారుపేరుగా మారింది.

ఆస్ట్రియా

ఆస్ట్రియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా) మధ్య ఐరోపాలోని ఒక భూపరివేష్టిత దేశం. ఈ దేశము స్లొవేనియా మరియు ఇటలీలకు ఉత్తర దిశలో, స్విట్జర్లాండ్ మరియు లీక్టెన్స్టెయిన్లకు తూర్పులో, స్లొవేకియా మరియు హంగేరీలకు పశ్చిమాన, జర్మనీ మరియు చెక్ రిపబ్లిక్లకు దక్షిణ దిశలో ఉంది. ఈ దేశ రాజధాని నగరమైన వియన్నా డానుబే నదీ తీరాన ఉంది.

తొమ్మిదవ శతాబ్దంలో ఆస్ట్రియా భూభాగాలలో జనసాంద్రత పెరగడంతో ఈ దేశచరిత్ర మూలాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. 996లో వెలువడిన ఒక అధికార పత్రములో మొట్టమొదటిసారిగా "ఆస్టర్రీచీ" అన్న పేరు వాడబడింది. కాలక్రమంలో ఈ పేరు ఆస్టర్రీచ్గా రూపాంతరం చెందింది.

ఆస్ట్రియా తొమ్మిది రాష్ట్రాలతో కూడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఐరోపాలోని ఆరు నిరంతర తటస్థ దేశాలలో ఆస్ట్రియా ఒకటి; అనంత తటస్థత విధానాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన బహు కొద్ది దేశాలలో ఆస్ట్రియా ఉంది. 1955 నుండి ఐక్య రాజ్య సమితిలో సభ్యదేశంగా ఉన్న ఆస్ట్రియా 1995లో ఐరోపా సమాఖ్యలో చేరింది.

చాళుక్యులు

చాళుక్యులు దక్షిణభారత దేశాన్ని క్రీ.శ. 6- 12 శతాబ్ధాల మధ్య పరిపాలించిన రాజులు. ముఖ్యంగా వీరు భారత దేశంలోని కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు. క్రీ.శ. 2వ శతాబ్దమునాటి ఇక్ష్వాకుల శాసనములో "కండచిలికి రెమ్మనక" అనువాడు ఇక్ష్వాకుల సామంతుడని ఉంది. ఇక్ష్వాకుల పతనము తర్వాత పల్లవుల ధాటికి తాళలేక వీరు కర్ణాటప్రాంతానికి వెళ్ళారు. దుర్గా ప్రసాద్, అడ్లూరి గారి అభిప్రాయములను బట్టి చాళుక్యుల పూర్వీకులు ఆంధ్రులే. రెండవ పులకేశి మారుటూరు శాసనములో 'చాళుక్య విషయము' ప్రసక్తి గలదు. ఈ చాళుక్య విషయము ప్రస్తుత రాయలసీమలోని కడప-కర్నూలు ప్రాంతము. కర్ణాట దేశమందలి బాదామినేలుతున్న కదంబులనోడించి చాళుక్యులు ఒక మహా సామ్రాజ్యము స్థాపించారు.

చాళుక్యులు ప్రధానంగా

బాదామి చాళుక్యులు

తూర్పు చాళుక్యులు

కళ్యాణి చాళుక్యులు

ముదిగొండ చాళుక్యులు

వేములవాడ చాళుక్యులు

యలమంచిలి చాళుక్యులుగా పాలన కొనసాగించారు.చాళుక్యులు తెలంగాణముగుండా తిరిగి ఆంధ్రదేశము ప్రవేశించి వేములవాడ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, చాళుక్య చోళులు మున్నగు శాఖలుగా పరిపాలన చేశారు.

చిరంజీవి

చిరంజీవి గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కథానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా .

జగతి (పత్రిక)

జగతి ఒక ప్రముఖ తెలుగు పత్రిక. దీనికి సంపాదకులుగా ఎన్.ఆర్.చందూర్ (మాలతీ చందూర్ భర్త) పనిచేశారు. ఈ పత్రిక 1985 నాటికే 30 సంవత్సరాలు పూర్తిచేసుకున్నది. చివరి సంచిక (నెం.654) జనవరి 2014లో వెలువడింది.

తెలుగు సినిమాలు 1955

ఈ యేడాది 20 చిత్రాలు వెలుగు చూశాయి. అక్కినేని ఆరు చిత్రాల్లోనూ, నందమూరి ఆరు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. సారథి వారి 'రోజులు మారాయి', యన్‌. ఏ.టి.వారి 'జయసింహ' అఖండ విజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకున్నాయి. రాష్ట్రపతి బహుమతులలో బి.యన్‌. రెడ్డి రూపొందించిన 'బంగారుపాప' సత్యజిత్‌ రే తొలి చిత్రం 'పథేర్‌ పాంచాలి'తో పోటీపడి రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అన్నపూర్ణ సంస్థ తొలి చిత్రంగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'దొంగరాముడు' ఘనవిజయం సాధించింది. దీంతో పాటు 'అర్ధాంగి', 'అనార్కలి', 'సంతానం', 'మిస్సమ్మ', 'సంతోషం', 'రేచుక్క', 'శ్రీకృష్ణతులాభారం' చిత్రాలు కూడా శతదినోత్సవం జరుపుకున్నాయి. 'రోజులు మారాయి'లో "ఏరువాకా సాగారో... పాటలో నర్తించిన వహిదా రెహమాన్‌, 'జయసింహ'లో నాయికగా నటించి, ఆ తరువాత హిందీరంగంలో అగ్రతారగా వెలుగొందారు. మాయలు, మంత్రాలు లేకుండా విజయం సాధించిన తొలి జానపద చిత్రంగా 'జయసింహ' చరిత్రకెక్కింది. గురజాడ అప్పారావు విఖ్యాత నాటిక 'కన్యాశుల్కం'ను వినోదావారు సినిమాగా రూపొందించారు. మొదట సరైన విజయాన్ని చేజిక్కించుకోలేకపోయినా ఈ సినిమా తరువాతి కాలంలో విశేషాదరణ చూరగొంది. యమ్‌.జి.రామచంద్రన్‌ నటించిన ఏకైక తెలుగు చిత్రం 'సర్వాధికారి' ఈ యేడాదే విడుదలై ప్రజాదరణ పొందింది.

అనార్కలి

ఆడబిడ్డ

అంతా ఇంతే (డబ్బింగ్?)

అంతే కావాలి

అతనెవరు

అర్థాంగి

బీదల ఆస్తి

చెరపకురా చెడేవు

దొంగరాముడు

జయసింహ

కన్యాదానం

కన్యాశుల్కం

మిస్సమ్మ

పసుపు కుంకుమ

రోజులు మారాయి

సంతానం

సంతోషం

శ్రీజగన్నాథ మహాత్యం

శ్రీకృష్ణ తులాభారం

వదిన

వదినగారి గాజులు

విజయగౌరి

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా

ఉత్తమ తెలుగు సినిమాకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారం ప్రతియేటా భారత కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన చలనచిత్రోత్సవాల డైరెక్టరుచే ప్రదానం చేయబడుతున్నది. ఈ పురస్కారం క్రింద వెండి కమలం, లక్షరూపాయల నగదు ఇస్తారు. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు 1954 నుండి భారతీయ సినిమాకు ప్రదానం చేయబడుతున్న ప్రముఖమైన పురస్కారాలు. ఈ పురస్కారాలలో భాగంగా దేశంలోని ఏడు ప్రాంతీయ భాషా చిత్రాలకు కూడా బహుమతి ప్రదానం చేస్తున్నారు. రెండవ సంవత్సరం (1955) నుండి బెంగాలీ, హిందీ, కన్నడ, మళయాల,మరాఠీ, తమిళ, తెలుగు భాషలలో ఉత్తమ చిత్రానికి రాష్ట్రపతి వెండిపతకం, ఉత్తమ ద్వితీయ, తృతీయ చిత్రాలకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేయడం ప్రారంభించారు. 1967లో చివరి రెండు బహుమతులు ఉపసంహరించారు.

తెలుగులో మొదటిసారిగా పెద్దమనుషులు చిత్రానికి రాష్ట్రపతి రజతపతకం, తోడుదొంగలు,విప్రనారాయణలకు ద్వితీయ మరియు తృతీయ ఉత్తమచిత్రాలుగా పురస్కారాలు లభించాయి. 1973, 1974, 1987, 1994, 2002, 2007, 2009, 2010, 2011 సంవత్సరాలలో వరుసగా జరిగిన 21వ, 22వ, 35వ, 42వ, 50వ, 55వ, 57వ, 58వ మరియు 59వ ఉత్సవాలలో ఈ పురస్కారానికి ఏ తెలుగు చిత్రమూ అర్హత పొందలేదు.

మార్చి 13

మార్చి 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 72వ రోజు (లీపు సంవత్సరములో 73వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 293 రోజులు మిగిలినవి.

మెండలీవియం

మెండలెవియం ఒక సంధాన (అనగా, ప్రయోగశాలలో కృత్రిమంగా చేసినది) రసాయన మూలకం ఉంది. దీని రసాయన సంకేతం Md (గతంలో Mv). అణు సంఖ్య 101. ఇది ఆక్టినైడ్ వరసలో ఉన్న ఒక లోహ రేడియోధార్మిక ట్రాంంస్ యురానిక్ మూలకం. ఈ మూలకానికి ఏ ఉపయోగమూ ఉన్నట్లు లేదు; కేవలం కుతూహలం కోసం అధ్యయనం చెయ్యడం తప్ప.

రాముడు

రాముడు అనగా శ్రీరాముడు లేదా రామావతారము

పరశురాముడు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారము.రాముడు పేరుతో కొన్ని తెలుగు సినిమాలు:

దొంగ రాముడు, 1955 మరియు 1988 లో విడుదలైన తెలుగు సినిమాలు.

రాముడు భీముడు, 1964 మరియు 1988 లో విడుదలైన తెలుగు సినిమాలు.

అందాల రాముడు, తెలుగు సినిమా.

డ్రైవర్ రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.

శృంగార రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.

అడవి రాముడు, తెలుగు సినిమా.

భార్గవ రాముడు, 1987 లో విడుదలైన తెలుగు సినిమా.

బికారి రాముడు, 1961 లో విడుదలైన తెలుగు సినిమా.

సర్కస్ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

తారక రాముడు, 1997 లో విడుదలైన తెలుగు సినిమా.

అమెరికా రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

ఛాలెంజ్ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

ఎదురులేని రాముడు, 1977 లో విడుదలైన తెలుగు సినిమా.

కలియుగ రాముడు, 1982 లో విడుదలైన తెలుగు సినిమా.

రౌడీ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

సరదా రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.

భలే రాముడు, 1956 లో విడుదలైన తెలుగు సినిమా.

కళ్యాణ రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.

రాముడు కాదు కృష్ణుడు, 1983 లో విడుదలైన తెలుగు సినిమా.

విజయనగర సామ్రాజ్యము

విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావని మొత్తం తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము.

విజయనగర సామ్రాజ్యాన్ని (కర్ణాట సామ్రాజ్యం అని, పోర్చుగీసువారు బిస్నెగర్ రాజ్యం కూడా పిలుస్తారు). ఇది దక్షిణ భారతదేశంలోని దక్కను పీఠభూమి ప్రాంతంలో ఉంది. దీనిని 1336 లో సంగమ రాజవంశానికి చెందిన మొదటి హరిహర రాయుడు, సోదరుడు మొదటి బుక్క రాయుడు స్థాపించారు. 13 వ శతాబ్దం చివరి నాటికి ఇస్లామికు దండయాత్రలను నివారించడానికి దక్షిణాది శక్తుల ప్రయత్నాల పరాకాష్టగా ఈ సామ్రాజ్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది 1646 వరకు కొనసాగినప్పటికీ 1565 లో తళ్ళికోట యుద్ధంలో దక్కను సుల్తానేట్ల సంయుక్త సైన్యాలుతో జరిగిన పోరాటంలో ఓటమి తరువాత దాని శక్తి క్షీణించింది. ఈ సామ్రాజ్యం దాని రాజధాని విజయనగరం పేరు మీద ఉంది. దీని శిధిలాలు ప్రస్తుత హంపి పరిసరాలలో ఉన్నాయి. ప్రస్తుత భారతదేశంలోని కర్ణాటకలో హంపి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడుతుంది. డొమింగో పేసు, ఫెర్నావో నూన్సు, నికోలో డా కాంటి వంటి మధ్యయుగ ఐరోపా ప్రయాణికుల రచనలు, స్థానిక భాషలలోని సాహిత్యం దాని చరిత్ర గురించి కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి. విజయనగరం వద్ద జరిపిన పురావస్తు త్రవ్వకాలలో సామ్రాజ్యం శక్తి, సంపద వెల్లడయ్యాయి.

దక్షిణ భారతదేశంలో విస్తరించిన సామ్రాజ్యం వారసత్వసంబంధిత అనేక స్మారక చిహ్నాలను కలిగి ఉంది. వీటిలో బాగా తెలిసినది హంపి వద్ద ఉన్న నిర్మాణ సమూహం. దక్షిణ, మధ్య భారతదేశంలో వివిధ ఆలయ నిర్మాణ సంప్రదాయాలు విజయనగర నిర్మాణకళా శైలిలో నిర్మితమయ్యాయి. ఈ సంశ్లేషణ హిందూ దేవాలయాల నిర్మాణ ఆవిష్కరణలకు ప్రేరణనిచ్చింది. విజయనగరపాలన సమర్థవంతమైన పరిపాలన, శక్తివంతమైన విదేశీ వాణిజ్యం, నీటిపారుదల, నీటి నిర్వహణ వ్యవస్థ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చింది. సామ్రాజ్యం ప్రోత్సాహంతో కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతంలో లలిత కళలు, సాహిత్యం కొత్త ఎత్తులకు చేరుకోగలిగింది. ప్రస్తుత రూపంలో కర్ణాటక సంగీతం ఉద్భవించింది. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారత చరిత్రలో హిందూ మత ప్రచారం చేయడం ద్వారా దక్షిణ భరతదేశాన్ని సమైఖ్యపరచి ప్రాంతీయతను అధిగమించింది.

విశాఖపట్నం జిల్లా

విశాఖపట్నం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ తీరప్రాంతంలోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం విశాఖపట్నం. దీనికి ఉత్తరాన ఒడిషా రాష్ట్రం మరియు విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా, పడమర ఒడిషా రాష్ట్రం, తూర్పున బంగాళాఖాతం వున్నాయి. 18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం ఒక జిల్లాగా ఏర్పడింది. 1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం శ్రీకాకుళం జిల్లా గా ఏర్పడింది. ఇంకొంతభాగం 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా లో భాగమైంది.

ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలోబొజ్జన్నకొండ, శంకరము, తొట్లకొండ వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. Map

సిరివెన్నెల సీతారామశాస్త్రి

సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి'ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ 'వై. సత్యారావు'ని చెబుతారు.

సెప్టెంబర్ 30

సెప్టెంబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 273వ రోజు (లీపు సంవత్సరములో 274వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 92 రోజులు మిగిలినవి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.