1954

[1]1954 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1951 1952 1953 - 1954 - 1955 1956 1957
దశాబ్దాలు: 1930లు 1940లు - 1950లు - 1960లు 1970లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

Kamal Haasan FICCI event
కమల్ హాసన్

మరణాలు

  • నవంబర్ 28: ఎన్రికో ఫెర్మి, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
  •  : రాయసం వెంకట శివుడు, ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకులు మరియు సంఘసంస్కర్త. (జ.1870)

పురస్కారాలు

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; undefined అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
1952

1952 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1956

1956 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఆంధ్ర విశ్వకళా పరిషత్ లేదా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University), భారతదేశంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది.

ఈ విశ్వవిద్యాలయం 1926లో ఏర్పడింది. మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పడింది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ యొక్క ఆదర్శ విశ్వవిద్యాలయము రూపులో తీర్చిదిద్దబడింది.

తర్వాత 1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము ఏర్పడింది. ఆతర్వాత, 1967లో గుంటూరు లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయముగా అవతరించింది. దీని పేరును ఆచార్య నాగార్జునుని పేరిట 2004 లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయము గా మార్చారు.

ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణము (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

విశ్వవిద్యాలయానికి విశాఖపట్టణం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల లోను, తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ లోను, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం లోను, విజయనగరం జిల్లాలో విజయనగరం లోను ఆ కేంద్రాలు ఉన్నాయి. కాని, 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయమును ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ఆ విధంగా, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. కాని అనుబంధ కళాశాలలకు సంబంధించి కొంత కుదించుకు పోయినా, విశ్వవిద్యాలయ ప్రాంగణములో దాని ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. నాక్ (NAAC) సంస్థ " ఎ " గ్రేడుతో అనుబంధం ఇవ్వడం దీనికి తార్కాణం.

కల్వకుంట్ల చంద్రశేఖరరావు

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (జ.1954 ఫిబ్రవరి 17) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖర్ రావు 14వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు.కేసీఆర్ మొదట తెలుగుదేశం పార్టీలో సభ్యుడు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధనే ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసుతో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాతి కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేశాడు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ తాను గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్యసృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు అందజేస్తోంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నారు.

జూలై 5

జూలై 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 186వ రోజు (లీపు సంవత్సరములో 187వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 179 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1954

ఈ యేడాది తొలిసారిగా 30 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్‌ ఎనిమిది చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ నాలుగు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. పక్షిరాజా వారి 'అగ్గిరాముడు' సూపర్‌హిట్టయి మాస్‌ చిత్రాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది, 'పెద్ద మనుషులు' కూడా ఘనవిజయం సాధించగా, 'సతీ సక్కుబాయి', 'సంఘం', 'వద్దంటే డబ్బు', 'రాజు-పేద' చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ తొలి చిత్రం 'కాళహస్తీశ్వర మహాత్మ్యం' (ద్విభాషా చిత్రం) కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యన్‌.ఏ.టి. వారి 'తోడుదొంగలు' ప్రశంసలు పొందినా, పరాజయం చవిచూసింది. ఈ యేడాది నుండే ఉత్తమ చిత్రాలకు రాష్ట్రపతి బహుమతులు ప్రదానం చేయడం ఆరంభమైంది. 'పెద్ద మనుషులు' చిత్రానికి రజత పతకం లభించగా, 'తోడుదొంగలు', 'విప్రనారాయణ' చిత్రాలు మెరిట్‌ సర్టిఫికెట్స్‌ పొందాయి. కె.యస్‌. ప్రకాశరావు 'బాలానందం' పేరుతో "బూరెల మూకుడు, కొంటె కిష్టయ్య, రాజయోగం పేర్లతో మూడు భాగాల పిల్లల చిత్రం రూపొందించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకునిగా, డి.వి.నరసరాజు రచయితగా ఈ యేడాదే పరిచయమయ్యారు.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం

ధర్మవరపు సుబ్రహ్మణ్యం (సెప్టెంబర్ 20, 1954 - డిసెంబర్ 7, 2013) తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించాడు. స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం .వామపక్షభావాలు కలిగిన సుబ్రహ్మణ్యం గతంలో ప్రజా నాట్యమండలి తరఫున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు. దూరదర్శన్లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు పొందాడు. చిత్రరంగంలో హాస్యపాత్రలో తనదైన ముద్రతో ప్రముఖస్థానంలో కొనసాగుతున్నాడు. దర్శకునిగా (తోకలేని పిట్ట) కూడా కొంత ప్రయత్నం చేశాడు. ఆయన 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేసాడు. 2004 నుండి 2013 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగారు .

నవంబర్ 15

నవంబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 319వ రోజు (లీపు సంవత్సరములో 320వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి.

పద్మ విభూషణ్ పురస్కారం

పద్మ విభూషణ్ పురస్కారము జనవరి 2, 1954 నెలకొల్పబడింది. భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవముగా ఈ పురస్కారమును గుర్తిస్తారు. భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవ నందించిన భారత పౌరులకు ఈ పతకమునిచ్చి గౌరవిస్తారు.

పద్మశ్రీ పురస్కారం

పద్మశ్రీ (ఆంగ్లం : Padma Shri) భారత ప్రభుత్వముచే ప్రదానం చేసే పౌర పురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ మరియు ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే పౌరపురస్కారం.

పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం భారతరత్న, రెండవది పద్మ విభూషణ్ మూడవది పద్మ భూషణ్ మరియు నాలుగవది పద్మశ్రీ. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ"లు వ్రాయబడి వుంటాయి. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు.

ఫిబ్రవరి 2010 నాటికి, మొత్తం 2336 మంది పౌరులు ఈ పురస్కారాన్ని పొందారు.

పుదుచ్చేరి

పుదుచ్చేరి లేదా పాండిచెర్రి (Pondicherry), దక్షిణ భారతదేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతము.

పుదుచ్చేరిలో నాలుగు విడి విడిగా ఉన్న జిల్లాలు ఉన్నాయి.

పుదుచ్చేరి లేదా పాండిచెర్రీ పట్టణము: బంగాళా ఖాతం తీరమున, తమిళనాడు రాష్ట్రం అంతర్భాగంగా - ఈ భాగం వైశాల్యం 293 చ.కి.మీ

కరైకాల్: బంగాళా ఖాతం తీరమున, తమిళనాడు రాష్ట్రం అంతర్భాగంగా - ఈ భాగం వైశాల్యం 160 చ.కి.మీ

యానాం: బంగాళా ఖాతం తీరమున, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతర్భాగంగా, కాకినాడ సమీపంలో - ఈ భాగం వైశాల్యం 30 చ.కి.మీ

మాహె: అరేబియన్ సముద్రం తీరాన - ఈ భాగం వైశాల్యం 9 చ.కి.మీపుదుచ్చేరిలోని నాలుగు భాగాల మొత్తం జనాభా సుమారు 9,70,000 (2001 జనాభా లెక్కలు ప్రకారం)

తమిళంలో 'పుదు - చ్చేరి' అంటే 'క్రొత్త - ఊరు' అని అర్థం. దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం దీనిని ఫ్రెంచివారు "Poudichéry" అని పిలిచారు. ఎప్పుడో పొరబాటున ఆంగ్లంలో 'u' బదులు 'n' అని వ్రాయడం వల్ల దీనిని ఆంగ్లంలో 'పాండిచేరి' అని పిలువడం మొదలయ్యింది. తరువాత అదే ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఆంగ్లంలో అధికారికంగా 'పుదుచ్చేరి' అని పేరు మార్చే ప్రయత్నం జరుగుతున్నది.

భానుమతీ రామకృష్ణ

భానుమతీ రామకృష్ణ (సెప్టెంబరు 7, 1926 - డిసెంబరు 24, 2005) ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు. మల్లీశ్వరి, మంగమ్మ గారి మనవడు ఆమె నటించిన ప్రముఖ చిత్రాలు. ఒంగోలులో జన్మించింది. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, మరియు ఎడిటరు అయిన పి. ఎస్. రామకృష్ణారావును వివాహమాడింది. తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారీ దంపతులు. భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966 లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది.

భారతరత్న

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ పురస్కారం 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. మరియు ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది.

ఎలాంటి జాతి, ఉద్యోగం,స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారగ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది.

భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది (మొదటిది ఆరూ- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాన మంత్రి, ముఖ్య న్యాయాధీశులు). కానీ ఈ గౌరవం వలన ఎలాంటీ అధికారాలు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులూ రావు.

ఈ పురస్కారం పొందిన విదేశీయుల జాబితాలో సరిహద్దు గాంధిగా పేరుపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987) మరియు నెల్సన్ మండేలా (1990) ఉన్నారు.

మే 24

మే 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 144వ రోజు (లీపు సంవత్సరములో 145వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 221 రోజులు మిగిలినవి.

వియత్నాం

వియత్నాం దక్షిణ ఆసియాలోని ఒక దేశం. 2016 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 9 కోట్ల 46 లక్షలు. జనసంఖ్యలో ప్రపంచంలో 15 వ స్థానంలో, ఆసియాలో 9వ స్థానంలో ఉంది. దీనికి ఉత్తరాన చైనా, వాయువ్యాన లావోస్, నైరుతిన కాంబోడియా, తూర్పు దిక్కున మలేషియా, ఫిలిప్ఫీన్స్, ఇండోనేషియా సరిహద్దులుగా ఉన్నాయి. 1976 లో ఉత్తర, దక్షిణ వియత్నాంలు కలిసిపోయినప్పటి నుంచి హనోయ్ నగరం రాజధానిగా ఉంది. హోచిమిన్ నగరం అత్యధిక జనాభా గల నగరం.

క్రీ.శ.5వ శతాబ్దిలో ఇండోచైనాలో చంపా, కాంబోజ అనే ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు నెలకొన్నాయి. 5వ శతాబ్ది నాటి వ్యు శాసనం నుంచి అంతకు రెండు మూడువందల యేళ్ళకు పూర్వమే హిందూ మతం వ్యాపించిందన్న విషయం తెలుస్తోంది. సంస్కృత, ప్రాకృత భాషల్లోని అనేకమైన పదాలు కూడా ఇక్కడి భాషల్లోకి వచ్చి చేరాయి..

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (Sri Venkateswara University) చిత్తూరు జిల్లా తిరుపతి లోగల విశ్వవిద్యాలయం.

దీనిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో 1954 లో ప్రారంభించారు. మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.

1,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాలచెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంటుంది. మొదట్లో ఇక్కడి భవనాలను ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించడం విశేషం.

సంగారెడ్డి పురపాలక సంఘము

సంగారెడ్డి పురపాలక సంఘం, సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. 1954లో ఏర్పడిన ఈ పురపాలక సంఘం ప్రస్తుతం మొదటిశ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. 2011 గణన ప్రకారం పురపాలక సంఘం పరిధిలోని జనాభా 71426 కాగా, 2014 మార్చి నాటికి 52556 ఓటర్లున్నారు. ప్రస్తుతం ఇందులో 31 వార్డులు ఉన్నాయి.

సదాశివపేట పురపాలక సంఘము

సదాశివపేట పురపాలక సంఘం, సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘం. 1954లో స్థాపితమైన ఈ పురపాలక సంఘం మూడవ శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. హైదరాబాదుకు పశ్చిమాన 68 కిమీ దూరంలో జాతీయ రహదారిపై ఉన్న సదాశివపేట పట్టణం 77° 57’ తూర్పు రేఖాంశం, 17° 37’ ఉత్తర అక్షాంశంపై ఉపస్థితియై ఉంది. 2001 నాటికి పట్టణ జనాభా 36,334 కాగా, 2011 నాటికి 42,809కు పెరిగింది. 2014 మార్చి నాటికి వార్డుల సంఖ్య 23, ఓటర్ల సంఖ్య 29255. పట్టణ విస్తీర్ణం 24.4 చకిమీ. 2010లో పారిశుద్ధ్యం విషయంలో ఈ పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.