1952

1952 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1949 1950 1951 - 1952 - 1953 1954 1955
దశాబ్దాలు: 1930లు 1940లు 1950లు 1960లు 1970లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

KNY Patanjali
కె.ఎన్.వై.పతంజలి

మరణాలు

2011

2011 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2019

2019 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

అక్టోబర్ 18

అక్టోబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 291వ రోజు (లీపు సంవత్సరములో 292వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 74 రోజులు మిగిలినవి.

అడివి బాపిరాజు

అడివి బాపిరాజు (అక్టోబరు 8, 1895 - సెప్టెంబరు 22, 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.

ఉత్తర రైల్వే

ఉత్తర రైల్వే 16 మండలాలు మరియు భారతీయ రైల్వేలులో ఉత్తర జోన్ ఒకటి. దీని ప్రధాన కార్యాలయం బరోడా హౌస్ మరియు న్యూఢిల్లీ రైల్వే స్టేషను వద్ద ఢిల్లీలో ఉంది. ఉత్తర రైల్వే భారతీయ రైల్వేలు తొమ్మిది పాత మండలాలులో ఒకటి మరియు నెట్వర్క్ పరంగా కూడా అతి పెద్ద 6807 కిలోమీటర్ల రైలు మార్గం కలిగి ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ మరియు చండీగఢ్ రాష్ట్రాలను వర్తిస్తుంది. రైల్వే జోన్ 1952 ఏప్రిల్ 14 న, జోధ్‌పూర్ రైల్వే, బికానెర్ రైల్వే, తూర్పు పంజాబ్ రైల్వే మరియు మొఘల్సరాయ్ (ఉత్తర ప్రదేశ్) ఈస్ట్ ఇండియన్ రైల్వే వాయువ్య మూడు విభాగాలు విలీనం ద్వారా, సృష్టించబడింది.

ఇది ఉత్తర భారతదేశంలో 1859 మార్చి 3 న అలహాబాద్ మరియు కాన్పూర్ నుండి ప్రారంభించిన మొదటి ప్రయాణీకుల రైలు మార్గమును కలిగి ఉంది. ఉత్తర రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసు బరోడా హౌస్, న్యూ ఢిల్లీ మరియు విభాగపుల ప్రధానకేంద్రంగా అంబాలా (హర్యానా), ఢిల్లీ, ఫిరోజ్పూర్ (పంజాబ్), లక్నో (ఉత్తరప్రదేశ్) మరియు మోరాడాబాద్ (ఉత్తర ప్రదేశ్) వద్ద ఉన్నాయి.

ఏప్రిల్ 10

ఏప్రిల్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 100వ రోజు (లీపు సంవత్సరములో 101వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 265 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 15

డిసెంబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 349వ రోజు (లీపు సంవత్సరములో 350వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 16 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమా

తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. దక్షిణ భారతదేశంలో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన దుర్గా సినీటోన్ని నిడమర్తి సూరయ్య రాజమండ్రిలో స్థాపించాడు.

తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం మరియు తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక హైదరాబాదు లోని లలిత కళాతోరణంలో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మరియు చారిత్రక చిహ్నమైన లేపాక్షి నందిని స్ఫూర్తిగా తీసుకొనబడింది.

1940 లో విడుదలైన విశ్వమోహిని భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన మల్లీశ్వరి. ఈ చిత్ర్ం చైనా లోనూ 13 ప్రింట్లతో చైనీసు సబ్-టైటిళ్ళతో బీజింగ్లో 1953 మార్చి 14 లో విడుదలైనది. ఇదే 1951 లో విడుదలైన పాతాళ భైరవి 1952 జనవరి 24 న బొంబాయిలో జరిగిన మొట్టమొదటి ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలన చిత్రం. 1956 లో విడుదలైన తెనాలి రామకృష్ణ ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలింని గెలుచుకొన్న ఏకైక చిత్రం.

2005, 2006 మరియు 2008 సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్ని అధిగమించి దేశం లోనే అత్యధిక చిత్రాలని నిర్మించింది. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియోగా గిన్నీస్ బుక్ లో నమోదైనది. హైదరాబాదులో గల ప్రసాద్స్ ఐమ్యాక్స్ ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను. దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయి.

సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ గుర్తించిన ఉత్తమ వంద చిత్రాలలో మొదటి పది పాతాళ భైరవి (1951), మల్లీశ్వరి (1951), దేవదాసు (1953), మాయాబజార్ (1957), నర్తనశాల (1963), మరో చరిత్ర (1978), మా భూమి (1979), శంకరాభరణం (1979), సాగర సంగమం (1983), శివ (1989) మొదటి పది స్థానాలని దక్కించుకొన్నాయి.

సినిమా తెలుగు వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్య పరంగా రెండవ స్థానంలోనూ (ఇంచుమించు తమిళ సినీరంగానికి కుడియెడంగా) తెలుగు సినిమా వర్ధిల్లుతోంది.

గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే

అతి పెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ మన హైదరాబాద్ శివార్లలో ఉంది, నిర్మించింది రామోజీరావు

ఎక్కువ పాటలు (వివిధ భాషలలో) పాడిన గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 30' వేలకు పైగా

ఎక్కువ సినిమాలకి (వివిధ భాషలలో) దర్శకత్వం వహించిన దర్శకుడు దాసరి నారాయణ రావు (149 సినిమాలు)

ఎక్కువ సినిమాలు (వివిధ భాషలలో) నిర్మించిన నిర్మాత రామానాయుడు (100 సినిమాలకి పైగా)

అతి తక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు బ్రహ్మానందం (750 సినిమాలకి పైగా)

ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల (42 సినిమాలు) తెలుగు చలనచిత్ర సీమకు గొప్పదనం, గౌరవం, ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు.దక్షిణ భారతదేశంలో గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమని టాలీవుడ్ అని సంభోదిస్తారు. హాలీవుడ్ పేరుని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ మాదిరిగా తెలుగు+హాలీవుడ్ ధ్వనించేటట్టు ఈ పేరుని కూర్చారు. ఒక్కోసారి బెంగాలీ సినిమా పరిశ్రమని కూడా (టాలీగంజ్+హాలీవుడ్) టాలీవుడ్ గా సంభోదిస్తారు.

తెలుగు సినిమాలు 1952

* ఈ యేడాది 24 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

* యన్టీఆర్‌ మూడు చిత్రాల్లోనూ, అక్కినేని ఒక చిత్రంలోనూ నటించారు.

* విజయావారి పెళ్ళి చేసి చూడు ఘనవిజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. హాస్య ప్రధానంగా రూపొందే చిత్రాలకు ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌గా

నిలిచింది. సాంఘిక చిత్రాల హవా మొదలయింది కూడా ఈ చిత్రంతోనే. అంతవరకు మధ్య వయసున్న సాంఘిక హీరో పాత్రల చుట్టూ పరిభ్రమించిన

తెలుగు సినిమా ఈ చిత్ర విజయంతో యుక్తవయసు హీరో పాత్రలకు నాంది పలికింది. ఇప్పటికీ అదే పంథా సాగుతోంది.

* లక్ష్మీరాజ్యం నిర్మించిన దాసి, సావిత్రి హీరోయిన్‌గా తొలిసారి నటించిన పల్లెటూరు కూడా విజయం సాధించి, శతదినోత్సవాలు జరుకున్నాయి.

* ఈ యేడాది అక్కినేని నటించిన ఏకైక చిత్రం భరణీవారి ప్రేమ పరాజయం పాలయింది.

ఆకలి (డబ్బింగ్)

ఆడబ్రతుకు

ఆదర్శం

అత్తింటి కాపురం

చిన్న కోడలు

చిన్నమ్మ కథ

దాసి

ధర్మదేవత

కాంచన

మానవతి

మరదలు పెళ్ళి

పల్లెటూరు

పేదరైతు

పెళ్ళిచేసి చూడు

ప్రజాసేవ

ప్రేమ

ప్రియురాలు

రాజేశ్వరి

సంక్రాంతి

సాహసం

సవతిపోరు

సింగారి

శాంతి

శ్రీనివాస కళ్యాణం

ముగ్గురు కొడుకులు

టింగురంగ

నల్గొండ జిల్లా

నల్గొండ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రం నల్గొండ.

పూర్వం నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది.నల్గొండ జిల్లాకు ఉత్తరాన యాదాద్రి జిల్లా, ఈశాన్యాన సూర్యాపేట జిల్లా,దక్షిణాన గుంటూరు జిల్లా, తూర్పున కృష్ణా జిల్లాలు, పశ్చిమాన శంషాబాద్ మండలం, నైఋతిన నాగర్ కర్నూలు జిల్లాలు సరిహద్దులు. ఉద్యమాల పురిటిగడ్డగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో కమ్యూనిస్టులు, దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన కోదాటి నారాయణరావు, ప్రముఖ గాంధేయవాది రావి నారాయణరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు పులిజాల రంగారావు, ఆర్యసమాజ ప్రముఖుడు నూతి విశ్వామిత్ర, కమ్యూనిస్టు యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి,ఆరుట్ల రామచంద్రా రెడ్డి,బీమ్ రెడ్డి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం. నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే.1952 ఎన్నికల్లో 12 నియోజకవర్గ లలో 12 కమ్యూనిస్ట్ నాయకులే గెలిచారు.ప్రముఖ కవి, కమ్యూనిస్ట్ యోధుడు మగ్దుo మొహిణిద్దీన్ హుజుర్నగర్ మొదటి mla.అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి గారు సీపీఐ నుండి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ గెలిచాడు. నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ లు వేలాది ఎకరాల భూమిని ప్రజలకు పంచి సాయుధ పోరాట నికి ఊపిరి పోశారు.

నవంబర్ 24

నవంబర్ 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 328వ రోజు (లీపు సంవత్సరములో 329వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 37 రోజులు మిగిలినవి.

పరమహంస యోగానంద

పరమహంస యోగానంద (జనవరి 5, 1893 — మార్చి 7, 1952) బెంగాల్కు చెందిన ఒక యోగి. ఆయన జన్మనామం ముకుంద లాల్ ఘోష్. ఆయన రాసిన ఒక యోగి ఆత్మకథ అనే ఆధ్యాత్మిక రచన అనేక ప్రతులు అమ్ముడై సంచలనం సృష్టించింది.

పాడిపంటలు (పత్రిక)

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రచురించే తెలుగు మాసపత్రిక పాడిపంటలు. ఇది 1952 లో మొదలైంది.

పొట్టి శ్రీరాములు

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.

మంచు మోహన్ బాబు

మంచు మోహన్ బాబు (జ. మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.

మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. రజినీకాంత్కు సన్నిహితుడు.

మహబూబ్‌నగర్ పురపాలక సంఘము

మహబూబ్‌నగర్ పట్టణ పాలక సంస్థ అయిన మహబూబ్‌నగర్ పురపాలక సంఘము జిల్లాలోని 11 పురపాలక/నగర పంచాయతీలలో పెద్దది. 1952లో మూడవశ్రేణి పురపాలక సంఘంగా ఏర్పడింది. 1959లో రెండోగ్రేడుగా, 1983లో మొదటి గ్రేడుగా, 2004లో స్పెషల్ గ్రేడుగా అప్‌గ్రేడ్ చెందింది. 2012లో సమీపంలోని 10 పంచాయతీలు ఈ పురపాలక సంఘం పరిధిలో చేర్చి సెలెక్షన్ గ్రేడు పురపాలక సంఘంగా మార్చారు. దీన్ని నగరపాలక సంస్థగా చేయాలనే ప్రతిపాదనను కూడా ప్రభుతానికి పంపిననూ వాస్తవరూపం దాల్చలేదు.

మార్చి 7

మార్చి 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 66వ రోజు (లీపు సంవత్సరములో 67వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 299 రోజులు మిగిలినవి.

రాజ్యసభ

భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. దీని సభ్యుల సంఖ్య 250. ఇందులో 12 స్థానాలకు వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారిని రాష్ట్రపతి నామినేటు చేస్తారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి రెండేళ్ళకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

రాజ్యసభకు సభాపతి (చైర్మను) గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. సభ్యుల నుండి ఒకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు. లోక్‌సభ వలె రాజ్యసభ రద్దు కావడం అనేది ఉండదు. లోక్‌సభ వలెనే రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించి, రాజ్యసభ నిర్ణయాన్ని తోసిరాజనే అధికారం లోక్‌సభకు ఉంది. ఇతర బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్యా వివాదం తలెత్తినపుడు రెండు సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాల్లో రెండు సభల్లోనూ అంగీకారం పొందితేనే అది సాధ్యపడుతుంది. రాజ్యసభలో ఏదైనా విషయంపై ఓటింగు జరిపినపుడు, సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినపుడు, సభాపతి తన నిర్ణాయక ఓటును వేస్తారు.

రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే అధికారం ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం వీరికి ఓటేసే అధికారం లేదు.

రాజ్యసభ తన మొదటి సమావేశాన్ని 1952 మే 13 న నిర్వహించింది.

శ్రీకాకుళం

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.