1951

1951 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1948 1949 1950 - 1951 - 1952 1953 1954
దశాబ్దాలు: 1930లు 1940లు - 1950లు - 1960లు 1970లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

మార్చి 4: తొలి ఆసియా క్రీడలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి.

జననాలు

G.M.C.Balayogi
జి.ఎం.సి.బాలయోగి

మరణాలు

1949

1949 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1952

1952 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1953

1953 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2001

2001 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ఎం. ఎస్. నారాయణ

ఎమ్. ఎస్. నారాయణ (ఏప్రిల్ 16, 1951 - జనవరి 23, 2015) గా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. వీరు ఇంతవరకు దాదాపు 700 చిత్రాలలో నటించారు. కొడుకు మరియు భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు.

కట్టమంచి రామలింగారెడ్డి

'సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి' (డిసెంబర్ 10, 1880 - ఫిబ్రవరి 24, 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించాడు. గైక్వాడ్‌ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా చేరాడు. 1909లో మైసూరులో విద్యాశాఖలో చేరి 1918 నుంచి 1921 వరకు విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించాడు. 1951లో అనారోగ్యంతో ఆయన మరణించాడు. ఇతడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించాడు. కవిత్వతత్వవిచారం, అర్థశాస్త్రం, ముసలమ్మ మరణము ఆయన రాసిన గ్రంథాల్లో పేరు గాంచినవి. ముసలమ్మ మరణము ఆంధ్రభాషాభిరంజని సంస్థ నిర్వహించిన పోటీలో బహుమాన కావ్యంగా నిలిచింది. అర్థ శాస్త్రంపై ఆయన రాసిన పుస్తకాలు ఆంధ్ర విజ్ఞానచంద్రికా గ్రంథమండలి వారు ప్రచురించారు.

గోపరాజు రశ్మి

గోపరాజు రశ్మి వాసవి మహిళా మండలి ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు. గోపరాజు సమరం యొక్క భార్య.

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (జనవరి 14, 1951 - జూన్ 19,2001 ) తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

తెలుగు సినిమా

తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. దక్షిణ భారతదేశంలో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన దుర్గా సినీటోన్ని నిడమర్తి సూరయ్య రాజమండ్రిలో స్థాపించాడు.

తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం మరియు తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక హైదరాబాదు లోని లలిత కళాతోరణంలో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మరియు చారిత్రక చిహ్నమైన లేపాక్షి నందిని స్ఫూర్తిగా తీసుకొనబడింది.

1940 లో విడుదలైన విశ్వమోహిని భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన మల్లీశ్వరి. ఈ చిత్ర్ం చైనా లోనూ 13 ప్రింట్లతో చైనీసు సబ్-టైటిళ్ళతో బీజింగ్లో 1953 మార్చి 14 లో విడుదలైనది. ఇదే 1951 లో విడుదలైన పాతాళ భైరవి 1952 జనవరి 24 న బొంబాయిలో జరిగిన మొట్టమొదటి ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలన చిత్రం. 1956 లో విడుదలైన తెనాలి రామకృష్ణ ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలింని గెలుచుకొన్న ఏకైక చిత్రం.

2005, 2006 మరియు 2008 సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్ని అధిగమించి దేశం లోనే అత్యధిక చిత్రాలని నిర్మించింది. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియోగా గిన్నీస్ బుక్ లో నమోదైనది. హైదరాబాదులో గల ప్రసాద్స్ ఐమ్యాక్స్ ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను. దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయి.

సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ గుర్తించిన ఉత్తమ వంద చిత్రాలలో మొదటి పది పాతాళ భైరవి (1951), మల్లీశ్వరి (1951), దేవదాసు (1953), మాయాబజార్ (1957), నర్తనశాల (1963), మరో చరిత్ర (1978), మా భూమి (1979), శంకరాభరణం (1979), సాగర సంగమం (1983), శివ (1989) మొదటి పది స్థానాలని దక్కించుకొన్నాయి.

సినిమా తెలుగు వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్య పరంగా రెండవ స్థానంలోనూ (ఇంచుమించు తమిళ సినీరంగానికి కుడియెడంగా) తెలుగు సినిమా వర్ధిల్లుతోంది.

గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే

అతి పెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ మన హైదరాబాద్ శివార్లలో ఉంది, నిర్మించింది రామోజీరావు

ఎక్కువ పాటలు (వివిధ భాషలలో) పాడిన గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 30' వేలకు పైగా

ఎక్కువ సినిమాలకి (వివిధ భాషలలో) దర్శకత్వం వహించిన దర్శకుడు దాసరి నారాయణ రావు (149 సినిమాలు)

ఎక్కువ సినిమాలు (వివిధ భాషలలో) నిర్మించిన నిర్మాత రామానాయుడు (100 సినిమాలకి పైగా)

అతి తక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు బ్రహ్మానందం (750 సినిమాలకి పైగా)

ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల (42 సినిమాలు) తెలుగు చలనచిత్ర సీమకు గొప్పదనం, గౌరవం, ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు.దక్షిణ భారతదేశంలో గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమని టాలీవుడ్ అని సంభోదిస్తారు. హాలీవుడ్ పేరుని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ మాదిరిగా తెలుగు+హాలీవుడ్ ధ్వనించేటట్టు ఈ పేరుని కూర్చారు. ఒక్కోసారి బెంగాలీ సినిమా పరిశ్రమని కూడా (టాలీగంజ్+హాలీవుడ్) టాలీవుడ్ గా సంభోదిస్తారు.

తెలుగు సినిమాలు 1951

ఈ యేడాది అత్యధికంగా 23 చిత్రాలు విడుదలయ్యాయి.* 'విజయా' వారి పర్వం ఈ సంవత్సరంతోనే ఆరంభం.

* అప్పటి అగ్రహీరో అక్కినేని ఐదు జానపద చిత్రాలలో నటించారు.

* విజయావారి 'పాతాళభైరవి' అత్యద్భుత విజయం సాధించి, తెలుగు సినిమా వసూళ్ళ సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచింది. మొదటి బ్యాచ్‌లో 13 ప్రింట్లతో

ఈ చిత్రం విడుదలై, తొలిసారిగా 10 కేంద్రాలలో శతదినోత్సవం, నాలుగు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని ద్విశతదినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా

నిలిచింది. భారీ ఖర్చుతో కళాత్మక, సాంకేతిక విలువల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా నిర్మాణ సరళినే మార్చివేసింది.హీరో పాత్రలకు

అతీంద్రియా శక్తులను ఆపాదించి చూపించడం ఈ చిత్రంతోనే ఆరంభమైంది.

* భానుమతి, యన్టీఆర్‌తో బి.యన్‌.రెడ్డి రూపొందించిన 'మల్లీశ్వరి' దేశవిదేశాల్లో కళాప్రియుల ప్రశంసలు అందుకుంది. నేటీకీ తెలుగు సినిమా కళాఖండాలలో

ఈ చిత్రం అగ్రతాంబూలం అందుకుంటూనే ఉంది. ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది.

* 'మల్లీశ్వరి' చిత్రం ద్వారా పరిచయమైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి తరువాతి కాలంలో తెలుగు సినిమా సాహితీవిలువలను పరిపుష్టం

చేయడంలో అగ్రస్థానంలో నిలిచారు.

* ఇదే యేడాది కాంతారావు, రాజనాల 'ప్రతిజ్ఞ' ద్వారా పరిచయమయ్యారు. కృష్ణకుమారి, డబ్బింగ్‌ రచయితగా శ్రీశ్రీ కూడా ఈ

యేడాదే సినిమా రంగంలో అడుగు పెట్టారు.

పశ్చిమ రైల్వే

భారత దేశంలోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన పశ్చిమ రైల్వే (Western Railway) దేశంలోనే అత్యధిక రద్దీ కల రైల్వే జోన్ లలో ముఖ్యమైనది. భారతదేశంలోని పశ్చిమానున్న ప్రముఖ నగరాలు ఈ రైల్వే జోన్ కిందికి వస్తాయి. ఈ జోన్‌లో 6 డివిజన్లు ఉన్నాయి. భావ్‌నగర్, ముంబాయి సెంట్రల్, రత్లాం, రాజ్‌కోట్, బరోడా, అహ్మదాబాదు డివిజన్లు కల పశ్చిమ రైల్వేకు ప్రధాన స్థావరం ముంబాయి.

పారుపల్లి రామక్రిష్ణయ్య

పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు (1883-1951) కర్ణాటక సంగీత విద్వాంసుడు. త్యాగరాజ శిష్యపరంపరకు చెందినవారు.

పి.ఆదినారాయణరావు

పెనుపాత్రుని ఆదినారాయణరావు (ఆగష్టు 21, 1914 - జనవరి 25, 1991) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నిర్మాత. ఇతడు భార్య, సుప్రసిద్ధ నటి అంజలీదేవి పేరుతో స్థాపించిన అంజలీ పిక్చర్స్ అధినేత.

భారతదేశ నకలు హక్కుల చట్టం

నకలుహక్కు చట్టం 1957 (Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు మరియు సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది.

ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు మరియు ఒప్పందాలకు అనుగుణంగా ఉంది. 1886 బెర్నే సమావేశం (1971 పారిస్ లో మార్చినట్లుగా),1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం మరియు 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశంలో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం (WIPO Copyrights Treaty (WCT) ) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT) లకు అనుగుణంగా ఉంది.

మధ్య రైల్వే

సెంట్రల్ రైల్వే భారతీయ రైల్వేలు లోని 17 మండలాల్లో అతిపెద్ద వాటిల్లో ఒకటి . దీని ప్రధాన కార్యాలయం ముంబై వద్ద ఛత్రపతి శివాజీ టెర్మినస్ (గతంలోని విక్టోరియా టెర్మినస్) ఉంది. భారతదేశంలో ఇది మొట్టమొదటి ప్రయాణీకుల రైలు మార్గము (లైన్) గా కలిగిన, ఈ మార్గము 1853 ఏప్రిల్ 16 న బాంబే నుండి థానే వరకు ఆరంభించబడింది.

మధ్య రైల్వే మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక పెద్ద భాగాన్ని మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో చిన్న భాగం, కర్ణాటక రాష్ట్రంలో కొంత ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఈ రైల్వే జోన్ 1951, నవంబరు 5 న గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేతో సహా, గ్వాలియర్ మాజీ రాచరిక రాష్ట్రం యొక్క సింధియా స్టేట్ రైల్వే, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే, వార్ధా కోల్ స్టేట్ రైల్వే మరియు ధోల్పూర్ రైల్వేలు వంటి అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వేలను ఒక చోట చేర్చడము ద్వారా ఏర్పడింది.

మధ్య రైల్వే జోన్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ఎక్కువ భాగాలు మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని దక్షిణ భాగం ప్రాంతం లతో ఏర్పడటము వలన భౌగోళికంగా, ట్రాక్ పొడవు మరియు సిబ్బంది పరంగా భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోనుగా అవతరించింది. ఈ ప్రాంతాలు తదుపరి ఏప్రిల్, 2003 సం.లో కొత్త పశ్చిమ మధ్య రైల్వే జోనుగా ఏర్పాటు అయ్యింది.

లింగ పురాణం

లింగ పురాణం హిందూమతం పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇందులో ప్రధానంగా శైవ సంప్రదాయాల గురించి వివరించబడింది. దీని రచయితను గురించి, రాయబడిన కాలం గురించి స్పష్టమైన వివరాలు లేవు. ఒక అంచనా ప్రకారం దీనిని క్రీ.పూ 5 నుంచి 10 వ శతాబ్దం మధ్యలో రాసి ఉండవచ్చు. ఈ గ్రంథం అనేక భిన్నమైన పాఠాంతరాల్లో లభ్యమౌతూ ఉంది. కాల గమనంలో అనేక మార్పులకు లోనవుతూ వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం గ్రంథం 163 అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది.

శరత్ బాబు

శరత్ బాబు ఒక విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు (కె.ప్రభాకర్‌, కె.బాబూరావు) సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు.

హీరోగా వీరి తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం, తర్వాత కన్నెవయసులో నటించారు. అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు.

సోమదత్త సిన్హా

సోమదత్తా సిన్‌హా 1951 జన్మించిన భారతీయ శాస్త్రవేత్త . భారతదేశంలోని ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) మొహాలీలో జీవశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా ప్రస్తుతం పనిచేస్తున్నారు.. ఆమె గణిత మరియు గణన జీవశాస్త్రం మరియు కాంప్లెక్స్ సిస్టమ్స్ శాఖలలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా జీవ వ్యవస్థలలో స్పాషియో టెంపరల్ వ్యవస్థ గూర్చి పనిచేస్తున్నారు. ఈమె భారతదేశం లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మరియు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు ఫెలోగా కూడా ఉన్నారు .

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.