1948

1948 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1945 1946 1947 - 1948 - 1949 1950 1951
దశాబ్దాలు: 1920లు 1930లు 1940లు 1950లు 1960లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Portrait Gandhi
మహాత్మాగాంధీ
అక్టోబర్ 16

అక్టోబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 289వ రోజు (లీపు సంవత్సరములో 290వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 76 రోజులు మిగిలినవి.

అర్చనా భట్టాచార్య

అర్చనా భట్టాచార్య Ph.D. (1975, నార్త్వెస్ట్రన్ విశ్వవిద్యాలయం), FASc, FNASc, FNA మరియు ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మాగ్నటిసం, నవి ముంబై యొక్క డైరెక్టర్. ఆమె పరిశోధనాంశాలు అయనోస్పిరిక్ ఫిజిక్స్, జియో మేగ్నటిజం, మరియు స్పేస్ వెదర్.

ఉస్మానియా విశ్వవిద్యాలయము

ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములోని ప్రధాన విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసఫ్ జా VII చే 1917లో స్థాపించబడింది. దీని స్థాపనకు సంబంధించిన ఫర్మానాను 1917, ఏప్రిల్‌ 26న జారీ చేశారు.

ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం. హైదరాబాదులోని ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా భాషగా మారింది.

కిన్నెర మాసపత్రిక

కిన్నెర ఒక తెలుగు మాసపత్రిక. ఇది 1948 సంవత్సరం నవంబరు నెలలో ప్రారంభమైనది. మద్రాసు నుండి వెలువడింది. దీనికి వ్యవస్థాపక సంపాదకులుగా పందిరి మల్లికార్జునరావు పనిచేశారు.

చందమామ

చందమామ సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. 1947 జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది.చందమామను బి.నాగిరెడ్డి - చక్రపాణి (వీరు తెలుగు, తమిళ భాషల్లో ఆణిముత్యాలవంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ విజయా సంస్థ వ్యవస్థాపకులు కూడా) 1947 జూలైలో ప్రారంభించారు . కేవలం 6 వేల సర్క్యులేషన్ తో మొదలైన చందమామ నేడు 2 లక్షల సర్క్యులేషన్‌తో అలరారుతోందని తెలుస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతం, ఎందుచేతనంటే, చందమామ ప్రకటనలమీద ఒక్క పైసాకూడ ఖర్చు చెయ్యదు. ఈ పత్రికకు 6 - 7 లక్షల సర్క్యులేషన్ సాధించవచ్చని అంచనా. టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్ లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు. రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు వంటి అద్భుత కావ్య రచనలు చేసి జ్ఞానపీఠ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ "చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా" అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థంచేసుకోవచ్చును.

జనవరి 30

జనవరి 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 30వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 335 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 336 రోజులు).

జాగృతి

జాగృతి తెలుగు వారపత్రిక. ఇది 1948 డిసెంబరు 18 తేదీన విజయవాడలో ప్రారంభమైనది. మహాత్మా గాంధీ హత్యానంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతాలను, జాతీయ భావాలను యువకులలో వ్యాపింపజేయడం ప్రధాన లక్ష్యంగా స్థాపించబడినది.

ఈ పత్రిక ప్రారంభంలో సంపాదకులు బుద్ధవరపు వెంకటరత్నం. ఆయన తరువాత 1953లో తూములూరి లక్ష్మీనారాయణ సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు. 1976లో పి.వేణుగోపాలరెడ్డి సంపాదకులైనారు. అతడు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు వి.రామమోహనరావు సంపాదకులుగా చేరారు.

జాగృతి సంస్థ చేసే విలక్షణమైన పనులలో పత్రికా రచయితలకు శిక్షణా తరగతులను నిర్వహించడం ముఖ్యమైనది. పెద్ద పత్రికలలో పనిచేస్తున్న సంపాదకులను ఆహ్వానించి వారిచేత ప్రసంగాలు చేయించేవారు. ఆంధ్రపత్రిక వలె జాగృతి దీపావళి సంచిక మరియు జూన్ నెలలో పరిశ్రమలకు సంబంధించిన విశేష సంచికలను ప్రచురిస్తున్నారు. ప్రతి సంచికలోను ఒక పేజీ నిండా సినిమా వార్తలను ప్రచురించడం ఒక ఆనవాయితీ.

ఈ పత్రిక 1999లో స్వర్ణోత్సవం జరుపుకొని జాగృతి స్వర్ణ జయంతి స్మృతి మంజూషను ప్రచురించారు.

డిసెంబర్ 18

డిసెంబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 352వ రోజు (లీపు సంవత్సరములో 353వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 13 రోజులు మిగిలినవి.

తెలంగాణ

శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలీంచిన ఏరియా త్రిలింగ దేశం కాలగమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 44వ నెంబరు (శ్రీనగర్-కన్యాకుమారి) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 కన్యాకుమారి-వారణాసి మరియు జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 నిజామాబాదు-జగదల్‌పూర్ హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-నిజామాబాదు-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ప్రముఖ కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి, సహజకవి బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలంలో శ్రీసీతారామాలయం, బాసరలో జ్ఞానసరస్వతీ దేవాలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.

నిజాం

హైదరాబాదు రాజ్యము యొక్క పాలకుల పట్టము నిజాం ఉల్ ముల్క్ లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ఆలా హజ్రత్ అని, నిజాం సర్కార్ అని సంబోధిస్తారు. వీరి వంశము వారు1724 నుండి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు.

ఫిబ్రవరి 28

ఫిబ్రవరి 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 59వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 306 రోజులు (లీపు సంవత్సరములో 307 రోజులు) మిగిలినవి.

మహాత్మా గాంధీ

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్ (CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.

మే 14

మే 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 134వ రోజు (లీపు సంవత్సరములో 135వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 231 రోజులు మిగిలినవి.

వనపర్తి జిల్లా

వనపర్తి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది.

కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో వనపర్తి రెవెన్యూ డివిజన్ కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనివే.

వాణిశ్రీ

వాణిశ్రీ (జ.1948, ఆగష్టు 3, నెల్లూరు) 1960 మరియు 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయనీ ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి మరియు జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార.

ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్ళి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు మరియు ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది.

శశి వధ్వా

శశి వధ్వా (జూలై 20 1948) న్యూఢిల్లీ లోని ఆలిండియా మెడికల్ సైన్సెస్ కు డీన్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె భారత్- పాక్ విభజన తరువాత పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె ఐదుగురు సోదరసోదరీమణులు ఉన్నారు. ఉన్నారు. దేశంపునర్నిర్మాణం చేయవలసిన పరిస్థితిలో ఉన్న కాలంలో కూడా ఆమె తల్లి తండ్రులు చదువుకు ముఖ్యత్వం గ్రహించి అది వారి సంతానానికి ఇవ్వాలని అనుకున్నారు. ఆమె తల్లి కుటుంబ చక్కగా నిర్వహణ చూస్తుండగా

ఆమె తండ్రి తీవ్రంగా పిల్లల చదువుకు అవసరమైన ప్రోత్సాహం ఇస్తూ ఉండేవాడు. ఆయన పిల్లలకు మాథ్స్ బోధిస్తూ ఉండేవాడు.

సెప్టెంబర్ 25

సెప్టెంబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 268వ రోజు (లీపు సంవత్సరములో 269వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 97 రోజులు మిగిలినవి.

హైదరాబాద్ రాజ్యం

ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రం హైదరాబాద్ మరియు బేరార్. మహారాష్ట్ర లోని ప్రస్తుత విదర్భ యొక్క ప్రాంతం ఈ బేరార్, ఇది 1903 లో సెంట్రల్ ప్రావిన్సెస్ లతో విలీనం చేయబడి, సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బేరార్ గా రూపొందింది. దక్షిణమధ్య భారత ఉపఖండంలో ఉన్న ఈ హైదరాబాద్ రాష్ట్రం 1724 నుండి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది. 1947 లో భారతదేశం యొక్క విభజన సమయంలో హైదరాబాద్ నిజాం, కొత్తగా ఏర్పడిన భారతదేశంలో గాని లేదా పాకిస్తాన్లో గాని చేరనని తన ఉద్దేశాన్ని ప్రకటించారు.

ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రంగా (హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం) మరియు మహారాష్ట్ర యొక్క మరాఠ్వాడ ప్రాంతంగా విభజించబడింది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.