1946

1946 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1943 1944 1945 - 1946 - 1947 1948 1949
దశాబ్దాలు: 1920లు 1930లు - 1940లు - 1950లు 1960లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Chilakamarthi laxminarasimham
చిలకమర్తి లక్ష్మీనరసింహం
2014

2014 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2015

2015 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

ఆలె నరేంద్ర

ఆలె నరేంద్ర (ఆగష్టు 21, 1946 - ఏప్రిల్ 9, 2014) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు. భారత కేంద్ర ప్రభుత్వములో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన ప్రారంభంలో ఆ పార్టీ అగ్రనాయకులలో ఒకరు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర, అనుచరవర్గములో టైగర్‌గా ప్రసిద్ధులు. 2003 వరకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగములో చెప్పుకోదగిన పాత్ర పోషించిన నరేంద్ర 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నుండి బయటికి వచ్చి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఒక రాజకీయ వేదికను ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో తను స్థాపించన వేదికను కె.చంద్రశేఖరరావు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు.

2004 ఎన్నికలలో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తెరాస పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన నరేంద్ర, తెరాస యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటంతో కేంద్రమంత్రి అయ్యారు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత, ప్రత్యేక తెలంగాణ విషయమై తగిన చర్యలు తీసుకోవట్లేదని తెరాస కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు నరేంద్ర, ఇతర తెరాస మంత్రులతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు.

2008 జనవరిలో నరేంద్ర ఉత్తరప్రదేశ్ మహిళా ముఖ్యమంత్రి మాయావతి ఆధ్వర్యములోని బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి, 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనారు. అనంతర కాలంలో భారతీయ జనతా పార్టీలో చేరి పనిచేశారు.

కసిరెడ్డి వెంకటరెడ్డి

కసిరెడ్డి వెంకటరెడ్డి కవిగా, వక్తగా, వ్యాసకర్తగా, జానపద వాజ్మయ పరిశోధకుడిగా, ధార్మిక సామాజిక విజ్ఞాన వ్యాఖ్యాతగా వాసికెక్కాడు.

కొండవలస లక్ష్మణరావు

కొండవలస లక్ష్మణరావు (ఆగష్టు 10, 1946 - నవంబర్ 2, 2015) గారు సుప్రసిద్ధ తెలుగు నాటక మరియు చలనచిత్ర నటులు. వీరు మొదట నాటకరంగంలో లబ్ధ ప్రతిష్ఠులు. పిమ్మట ప్రసిద్ధ దర్శకులు వంశీ, తన ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంతో వీరిని తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయం చేసారు. సుమారు 200 సినిమాల్లో నటించారు.

గిరిబాబు

గిరిబాబు (జూన్ 8, 1946) గా ప్రసిద్ధిచెందిన యర్రా శేషగిరిరావు ప్రముఖ తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ఇతడు సుమారు 3 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటిస్తున్నాడు.ఇతను ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించాడు. ఇతని కుమారులు హాస్య నటుడు రఘు బాబు, బోసుబాబు.

గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 - అక్టోబర్ 1, 1946) ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది .

చిలకమర్తి లక్ష్మీనరసింహం

చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవాడు.

లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26 న పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.

జూలై 1

జూలై 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 182వ రోజు (లీపు సంవత్సరములో 183వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 183 రోజులు మిగిలినవి.

జూలై 4

జూలై 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 185వ రోజు (లీపు సంవత్సరములో 186వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 180 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 11

డిసెంబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 345వ రోజు (లీపు సంవత్సరములో 346వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 20 రోజులు మిగిలినవి.

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

తెలుగు సినిమాలు 1946

* ఈ యేడాది 10 చిత్రాలు విడుదల అయ్యాయి.

* సినిమాల నిడివిపై అంతకు ముందు (1945లో) జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

* నాగయ్య రూపొందించిన త్యాగయ్య బ్రహ్మాండమైన విజయం సాధించింది.

* సారథి వారి గృహప్రవేశం, ప్రతిభావారి ముగ్గురు మరాఠీలు మంచి ప్రజాదరణ పొందాయి.

* తెలుగు సినిమా పరిణామక్రమంలో ప్రధాన భూమిక పోషించిన గూడవల్లి రామబ్రహ్మం, బళ్ళారి రాఘవ ఈ యేడాదే అమరులయ్యారు.

* ఎస్వీ.రంగారావు వరూధిని చిత్రం ద్వారా చలన చిత్రరంగ ప్రవేశం చేశారు

* గృహప్రవేశం చిత్రం ద్వారా ఎల్వీ.ప్రసాద్ దర్శకులయారు

భక్త తులసీదాస్

ధృవ

గృహప్రవేశం

నారద నారది

ఇది మా కథ

రిటర్నింగ్ సోల్జర్

సేతుబంధనం

ముగ్గురు మరాఠీలు

త్యాగయ్య

వరూధిని

వనరాణి

బళ్ళారి రాఘవ

బళ్ళారి రాఘవ (ఆగష్టు 2, 1880 - ఏప్రిల్ 16, 1946) తెలుగు నాటకరంగ ప్రముఖులు. ప్రముఖ న్యాయవాది అయినా నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభతో రాణించాడు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం వెచ్చించిన 1946, ఏప్రిల్ 16 న మరణించాడు.

మదన్ మోహన్ మాలవ్యా

మదన్ మోహన్ మాలవ్యాా (డిసెంబర్ 25, 1861 - నవంబరు 12, 1946) భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు. ఆయన "మహాత్మా"గా కూడా గౌవరింపబడ్డాడు.

మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం. ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు"కు ఒక వ్యవస్థాపకుడు. ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక లీడర్ పత్రికను స్థాపించారు. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన భారతరత్నకు డిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు.

రమాప్రభ

రమాప్రభ (జ: మే 5, 1946) తెలుగు సినిమా నటి. ఈమె దాదాపు 1400కు పైగా దక్షిణ భారతదేశపు సినిమాలలో నటించింది.

చిత్తూరు జిల్లా, వాల్మీకిపురానికి (దీని పాతపేరు వాయల్పాడు) చెందిన ఈ నటి చిన్నతనం నుంచే నటన మీద మక్కువతో ఆ వైపు మరలింది. తండ్రి కృష్ణదాస్‌ ముఖర్జీ గూడూరులో మైకా వ్యాపారం చేశారు. హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన, ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి నటుల జోడీగా నటించింది. ప్రముఖ నటుడు శరత్‌ బాబును పెళ్ళాడి 14 సంవత్సరాల తరువాత విడాకులు తీసుకుంది. సినిమాల్లోకి రాకముందు తమిళ నాటకరంగంలో నాలుగువేలకు పైగా రంగస్థల ప్రదర్శనలిచ్చారు.

విజయనిర్మల

విజయనిర్మల (ఫిబ్రవరి 20, 1946 - జూన్ 27, 2019) తెలుగు సినిమా నటి, దర్శకురాలు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె మొదటి పెళ్ళి ద్వారా సినీ నటుడు విజయ నరేష్ కి తల్లి, నటి జయసుధకు ఈమె పిన్నమ్మ.

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా బాలు అని పిలిచే ఈయన 1946 జూన్ 4 న అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామములో (ప్రస్తుతము ఈ గ్రామము తమిళనాడు రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.