1945

1945 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1942 1943 1944 - 1945 - 1946 1947 1948
దశాబ్దాలు: 1920లు 1930లు - 1940లు - 1950లు 1960లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

తేదీ వివరాలు తెలియనివి

మరణాలు

2015

2015 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

అక్టోబర్ 10

అక్టోబర్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 283వ రోజు (లీపు సంవత్సరములో 284వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 82 రోజులు మిగిలినవి.

అక్టోబర్ 24

అక్టోబర్ 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 297వ రోజు (లీపు సంవత్సరములో 298వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 68 రోజులు మిగిలినవి.

అక్టోబర్ 7

అక్టోబర్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 280వ రోజు (లీపు సంవత్సరములో 281వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 85 రోజులు మిగిలినవి.

అక్టోబర్ 9

అక్టోబర్ 9, గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 282వ రోజు (లీపు సంవత్సరములో 283వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 83 రోజులు మిగిలినవి.

ఆగష్టు 6

ఆగష్టు 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ (gorgeon calander)ప్రకారము సంవత్సరములో 218వ రోజు (లీపు సంవత్సరములో 219వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 147 రోజులు మిగిలినవి.

ఆగష్టు 9

ఆగష్టు 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 221వ రోజు (లీపు సంవత్సరములో 222వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 144 రోజులు మిగిలినవి.

ఆదిభట్ల నారాయణదాసు

అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (ఆగష్టు 31, 1864 - జనవరి 2, 1945) (Ajjada Adibhatla Narayana Dasu) ప్రముఖ హరికథా కళాకారుడు,సంగీతం,సాహిత్యం మరియు న్రుత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని స్రుజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు.సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.

ఐక్యరాజ్య సమితి

ఐక్యరాజ్య సమితి (ఆంగ్లం: United Nations) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా మరియు ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.

కోట శ్రీనివాసరావు

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1945, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు.ఇతని పేరు కోట ప్రసాద్.ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

జయప్రకాశ్ రెడ్డి

జయప్రకాశ్ రెడ్డి ప్రముఖ తెలుగు నటుడు. రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి. ఈయన ఎక్కువగా ప్రతినాయక మరియు హాస్య పాత్రలను పోషిస్తుంటాడు.

తెలుగు సినిమాలు 1945

ఈ యేడాది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆంక్షల కారణంగా కేవలం ఐదు సినిమాలే విడుదలయ్యాయి.* వాహినీ వారి స్వర్గసీమ సూపర్‌హిట్‌ అయి విజయవాడ, బెంగుళూరులలో వంద రోజులకు పైగా ప్రదర్శితమై తొలి తెలుగు శతదినోత్సవ చిత్రంగా నిలచింది.

ఈ చిత్రంలోనే ఘంటసాల పూర్తి స్థాయి గాయకుడయ్యారు.

* ఇదే సంవత్సరం గూడవల్లి రామబ్రహ్మం మాయాలోకం కూడా విడుదలై మంచి వసూళ్ళు సాధించి, హిట్‌గా నిలిచింది.

* ఈ యేడాది గూడవల్లి దక్షిణభారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

* ఆ యేడాది వచ్చిన చిత్రాలన్నీ ప్రభుత్వ ఉత్తర్వును అనుసరించి 11 వేల అడుగుల లోపు నిడివితో నిర్మితమయ్యాయి.

మాయాలోకం

మాయామశ్చీంద్ర

పాదుకా పట్టాభిషేకం ( జెమిని)

స్వర్గసీమ

వాల్మీకి

ప్రజాశక్తి

ప్రజాశక్తి హైదరాబాదులోని ప్రజాశక్తి సాహితీ సంస్థచే ప్రచురించబడుతున్న తెలుగు దినపత్రిక. ఇది స్వాతంత్ర్యోద్యమ కాలములో 1942లో మద్రాసులో కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికగా ఆవిర్భవించింది.. 1945 నుండి ఈ పత్రిక విజయవాడనుండి ప్రతిదినము ప్రచురించడం ప్రారంభమయ్యింది. అనతికాలములోనే బ్రిటీషు ప్రభుత్వ ఆగ్రహానికి గురై 1948లో నిషేధించబడింది. 1969లో వారపత్రికగా తిరిగి ప్రారంభమైనది. 1981లో దినపత్రికగా మారి 2014వ సంవత్సరము వరకు 10 సంచికలకు ఎదిగినది. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిన తరువాత మార్కిస్టు -లెనినిస్టు భావజాల సమూహానికి పత్రికగా కొనసాగుతున్నది.

ముట్నూరి కృష్ణారావు

ముట్నూరి కృష్ణారావు (1879 - 1945) ప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, కృష్ణా పత్రిక సంపాదకుడు. ఈయన 1907 నుండి 1945లో మరణించేవరకు నాలుగు దశాబ్దాల పాటు కృష్ణా పత్రిక సంపాదకునిగా తెలుగు సాహితీ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు.

మే 23

మే 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 143వ రోజు (లీపు సంవత్సరములో 144వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 222 రోజులు మిగిలినవి.

రెండవ ప్రపంచ యుద్ధం

రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం (Second World War) అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం. రెండవది, 1939లో జర్మనీ దేశం పోలాండ్ పై జరిపిన దురాక్రమణ. రెండవ చైనా-జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తే, జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమయింది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాల పేరుతో రెండు ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేటట్లు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు పది కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమయిన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి (అనగా, సైనిక-పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలుపంచుకోవటం). ఆకారణంగా ఆయా దేశాల ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాలకోసమే వాడవలసి వచ్చింది.

శారద

తాడిపర్తి శారద (జ. జూన్ 25, 1945) తెలుగు, మలయాళ సినిమా నటి. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. శారద, 1996లో 11వ లోక్‌సభకు తెనాలి నియోజవర్గము నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైనది. బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద మూడు సార్లు ఊర్వశి అవార్డును అందుకొని ఊర్వశి శారదగా ప్రసిద్ధి చెందినది.

సుభాష్ చంద్రబోస్

'నేతాజీ' సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.

జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు.

బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.