1943

1943 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1940 1941 1942 - 1943 - 1944 1945 1946
దశాబ్దాలు: 1920లు 1930లు - 1940లు - 1950లు 1960లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

జననాలు

Yeddyurappa
యడ్యూరప్ప

మరణాలు

1940

1940 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1941

1941 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1944

1944 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1946

1946 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

అక్టోబర్ 2

అక్టోబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 275వ రోజు (లీపు సంవత్సరములో 276వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 90 రోజులు మిగిలినవి.

ఆరుద్ర

తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.

ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో, తర్వాత విజయనగరంలో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెనై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి 'కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ, chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీకి వేలువిడిచిన మేనల్లుడు. ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.

ఆర్ జె హాంస్-గిల్

ఆర్ జె హాంస్-గిల్ 1943 పంజాబు రాష్ట్రంలోని మోహీ (లూధియానా) లో జన్మించింది. ఆమె తండ్రి గర్షర్ సింఘ్ హాంస్. ఆమె తండ్రి గ్రమీణ ప్రాంతాలలో పనిచేయడానికి నియమించబడిన డాక్టర్. అందువలన ఆమె లూధియానా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో బాల్యాన్ని గడిపింది. ఆమె తల్లి గురుదీప్ కౌర్ గృహిణి. ఆమె వివాహం కరస్పాండెంస్ ద్వారా తరువాత చదువును కొనసాగించింది. ఆమె తండ్రికి తరచుగా బదిలీ కావడం స్థిరంగా ఒక ప్రదేశంలో ఉండలేకపోవడం ఆమెకు కొంత అసౌకర్యం కలిగిస్తూ ఉండేది. అయినప్పటికీ వారు తరచుగా మంచిమంచి ప్రదేశాలకే తరలివెళుతూ ఉండేవారు.

ఇళయరాజా

ఇళయరాజా (జూన్ 2 1943లో జ్ఞానదేశికన్ అనే పేరుతో జన్మించారు) భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇళయరాజా భారతదేశంలోని, చెన్నైలో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈయన తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు.ఇళయరాజా గారి నేపథ్య సంగీతంకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన పాశ్చాత్య ఆర్కెస్ట్రా లలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలు కూడా ప్రజలకు అప్పుడప్పుడు ఆయన ఇచ్చే సంగీత కచేరీల ద్వారా సుపరిచితమే. ఇలాంటి ప్రయోగాలకు ఈయన హంగరీలో ప్రఖ్యాత "బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రా"ని వాడేవారు.

1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి "సింఫనీ"ని కంపోస్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేసారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఈయనే. జనాలకు ఈయన "మేస్ట్రో " అని సుపరిచితం. 2003 లో న్యూస్ ఛానల్ "బీ.బీ.సి" నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి 1991 లో వచ్చిన మణిరత్నం "దళపతి" సినిమాలో "అరె చిలకమ్మా" పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. 2013 లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఏన్.ఏన్-ఐ.బీ.ఏన్. వాళ్ళు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు. భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012 లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం మరియు 2014 లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు. 2015 లో గోవాలో జరిగిన 46వ "ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా"లో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో గౌరవించారు 2018 లో భారత ప్రభుత్వం ఈయనను "పద్మవిభూషణ్" పురస్కారంతో సత్కరిచింది.

జనవరి 15

జనవరి 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 15వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 350 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 351 రోజులు).

జిక్కి

జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (నవంబరు 3, 1938 - ఆగష్టు 16, 2004) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం, పంతులమ్మ (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి అప్పట్లో ప్రముఖగాయకుడైన ఏ.ఎమ్.రాజాను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ఆదిత్య 369 సినిమాలో జాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

త్రిపురనేని రామస్వామి

'కవిరాజుగా ప్రసిద్ధి చెందిన 'త్రిపురనేని రామస్వామి (జనవరి 15, 1887 - జనవరి 16, 1943) న్యాయవాది మరియు ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త. ప్రసిద్ధ కవి రాజుగా పిలువబడే అతను హేతువాదం మరియు మానవతావాదం తెలుగు కవిత్వం మరియు సాహిత్యాల్లో లోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు. త్రిపురనేని రామస్వామి 1887 జనవరి 15 న కృష్ణా జిల్లా, అంగలూరు గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు.

రామస్వామి అప్పటికే భారతదేశంలో ప్రచారంలో ఉన్న సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలలో పాల్గొనినారు.రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రనడే, దయానంద సరస్వతి మొదలైనవారి ఆదర్శాలను ప్రజలలోనికి తీసుకురావడానికి ఉద్యమించిన వారిలో రామస్వామి ఒకరు.

దేవిక

దేవిక (Devika) (1943 - మే 2, 2002) ఒక తెలుగు సినిమా నటి. 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.

భక్త పోతన (1943 సినిమా)

ప్రసిద్ధ తెలుగు కవి పోతన జీవితం ఇతివృత్తంగా వెలువడిన సినిమా ఇది. చిత్తూరు నాగయ్య నటజీవితంలో ఒక కలికితురాయిగా ఈ సినిమాను చెప్పుకోవచ్చును. పోతన వ్యక్తిత్వంలో భాగమైన భక్తి, వినయం, పాండిత్యం - అన్నింటినీ నాగయ్య చక్కగా చూపించారు. ఇదే సినిమా మళ్లీ 1966లో వచ్చినప్పుడు అందులో నాగయ్య వేదవ్యాసునిగా నటించాడు.

భానుమతీ రామకృష్ణ

భానుమతీ రామకృష్ణ (సెప్టెంబరు 7, 1926 - డిసెంబరు 24, 2005) ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు. మల్లీశ్వరి, మంగమ్మ గారి మనవడు ఆమె నటించిన ప్రముఖ చిత్రాలు. ఒంగోలులో జన్మించింది. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, మరియు ఎడిటరు అయిన పి. ఎస్. రామకృష్ణారావును వివాహమాడింది. తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారీ దంపతులు. భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966 లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది.

మే 1

మే 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 121వ రోజు (లీపు సంవత్సరములో 122వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 244 రోజులు మిగిలినవి.

విజ్ఞాన సర్వస్వము

విజ్ఞాన సర్వస్వము లేదా విజ్ఞాన కోశము (ఆంగ్లం: Encyclopedia) అనగా అన్ని విషయాల గురించి లేదా ఒక రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒక చోట చేర్చిన వ్రాతప్రతుల సముదాయం. ఇందులో సమాచారం వ్యాసాలుగా విభజిస్తారు. దీన్ని ఉపయోగించడానికి అనువుగా కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తారు.

సెప్టెంబర్‌ 2

సెప్టెంబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 245వ రోజు (లీపు సంవత్సరములో 246వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 120 రోజులు మిగిలినవి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.