1939

1939 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1936 1937 1938 - 1939 - 1940 1941 1942
దశాబ్దాలు: 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

Balu Mahendra
బాలు మహేంద్ర

మరణాలు

2002

2002 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2014

2014 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2016

2016 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2019

2019 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

అక్టోబర్ 1

అక్టోబరు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 274వ రోజు (లీపు సంవత్సరములో 275వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 91 రోజులు మిగిలినవి.

ఎల్. ఆర్. ఈశ్వరి

ఎల్. ఆర్. ఈశ్వరి ప్రముఖ నేపథ్య గాయని. ఈమె మద్రాసులో ఒక రోమన్ కాథలిక్ కుటుంబంలో డిసెంబరు 8వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు. ఈమె ఐదేళ్ళ వయసులో అతడు మరణించాడు. ఈమె తల్లి నిర్మల కుటుంబభారాన్ని మోసింది. ఆమె మంచి గాయని కావడంతో సినిమాలలో అవకాశం లభించినప్పుడల్లా కోరస్ బృందాలకు పాడింది. ఆ సమయంలో తల్లితో పాటు ఈమె కూడా రికార్డు స్టూడియోలకు వెళ్ళేది. ఆ సమయంలోనే ఈమెకు కూడా కొన్ని చిత్రాలకు కోరస్ బృందంలో పాడే అవకాశం వచ్చింది. ఈమె పూర్తి పేరు "లూర్డ్ మేరీ". ఈమె బామ్మ హిందూ కావడంతో "రాజేశ్వరి" అని పిలిచే వారు. ఈమె తన తల్లి, తండ్రి ఇరువైపుల బంధువులను తృప్తి పరచడానికి తన పేరును లూర్డ్ రాజేశ్వరిగా మార్చుకుంది. అప్పటికే తమిళ సినీరంగంలో ఒక రాజేశ్వరి గాయినిగా చలామణీలో ఉన్నందుకు తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్. ఆర్. ఈశ్వరిగా మార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు మరియు ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది.

ఈమెను మొదటగా కె.వి.మహదేవన్ గుర్తించి, "నల్ల ఇడత్తు సంబంధం" (1958) అనే తమిళ సినిమాలో మొదటి సారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కాని "పాశమలార్" (1961) సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా చెళ్ళపిళ్ళ సత్యం దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్ మరియు ఐటమ్ నంబర్లకు పాడింది. ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత మొదలైన నాట్యకత్తెలకు పాడింది. వీరే కాకుండా విజయలలిత, లక్ష్మి, సరిత వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసింది. ఈమె మొత్తం 14 భాషలలో పాడింది.

ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమే. పేదరికంలో జీవించిన ఈమె కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. అవివాహితగానే ఉండిపోయి, సమాజం నుండి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.

ఈమెకు తమిళనాడు ప్రభుత్వం 1984లో కళైమామణి అవార్డు ప్రదానం చేసింది.

ఓగిరాల రామచంద్రరావు

ఓగిరాల రామచంద్రరావు (సెప్టెంబర్ 10, 1905 - జూలై 17, 1957) పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. వాహిని వారి చిత్రాలెన్నింటికో ఈయన సంగీతం అందించారు. ఓగిరాల తెలుగు చలనచిత్రరంగంలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు, ఆయన మళ్ళీ పెళ్ళి (1939) చిత్రంలో వై.వి.రావుకి పాడారు. ఆయన శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939) చిత్రంలో శివుని వేషం వేశారు.

గొల్లపూడి మారుతీరావు

గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నాడు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

జనవరి 21

జనవరి 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 21వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 344 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 345 రోజులు).

జూన్ 30

జూన్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 181వ రోజు (లీపు సంవత్సరములో 182వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 184 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1939

ఈ యేడాది 12 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.* గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన రైతుబిడ్డ ఈసారీ సంచలనం సృష్టించింది. మూడు జిల్లాల్లో జమీందార్లు ఈ చిత్ర ప్రదర్శనను ఆపు చేయించారు.

అయినా రాత్రిపూట పొలాల్లో తెరలు కట్టి ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే జనం తండోపతండాలుగా వచ్చి చూడటం గురించి ఆ నాటి ప్రేక్షకులు నేటికీ కథలుగా చెప్పుకుంటారు.

* వాహినీ పతాకంపై బి.యన్‌.రెడ్డి తెరకెక్కించిన వందేమాతరం, వై.వి.రావు రూపొందించిన మళ్ళీ పెళ్ళి, పి.పుల్లయ్య

దర్శకత్వం వహించిన శ్రీ వేంకటేశ్వర మహత్యం, భానుమతి తొలి చిత్రం వరవిక్రయంకూడా ప్రజాదరణ పొందాయి.

* వందేమాతరం సినిమాలో మొదటిసారిగా నేపథ్య గానాన్ని వాడుకున్నారు. కానీ ఇది చిన్నపిల్లవానికి కావడం వల్ల దేవత సినిమాకు పాడిన

యెమ్.యెస్.రామారావు గారు మొదటి నేపథ్య గాయకుడిగా గుర్తింపు పొందారు.

జయప్రద

మహానంద

మళ్ళీ పెళ్ళి

పాండురంగ విఠల్

పాశుపతాస్త్రం

రాధాకృష్ణ

రైతుబిడ్డ

ఉష

వందేమాతరం

వరవిక్రయం --> భానుమతి తొలి చిత్రం

అమ్మ

బాలాజీ లేదా శ్రీ వేంకటేశ్వర మహత్యం

ఫిబ్రవరి 9

ఫిబ్రవరి 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 40వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 325 రోజులు (లీపు సంవత్సరములో 326 రోజులు) మిగిలినవి.

భాగ్యరెడ్డివర్మ

దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 - ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశాడు.

మార్చి 3

మార్చి 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 62వ రోజు (లీపు సంవత్సరములో 63వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 303 రోజులు మిగిలినవి.

రంగనాయకమ్మ

రంగనాయకమ్మ సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల 'పురుష వ్యతిరేకి'గానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల 'బ్రాహ్మణ వ్యతిరేకి' గానూ ఈమెకి పేరు.

ఆమె వ్రాసిన నవల స్వీట్ హోం.

రఘుపతి వేంకటరత్నం నాయుడు

ఆచార్య రఘుపతి వెంకటరత్నం నాయుడు ( అక్టోబరు 1, 1862 - మే 26, 1939) విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, బ్రహ్మర్షిగా ఆంధ్రప్రదేశ్ లో పేరుపొందిన వ్యక్తి. సంఘసంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులుతో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే.

రెండవ ప్రపంచ యుద్ధం

రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం (Second World War) అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం. రెండవది, 1939లో జర్మనీ దేశం పోలాండ్ పై జరిపిన దురాక్రమణ. రెండవ చైనా-జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తే, జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమయింది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాల పేరుతో రెండు ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేటట్లు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు పది కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమయిన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి (అనగా, సైనిక-పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలుపంచుకోవటం). ఆకారణంగా ఆయా దేశాల ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాలకోసమే వాడవలసి వచ్చింది.

సెప్టెంబర్ 23

సెప్టెంబర్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 266వ రోజు (లీపు సంవత్సరములో 267వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 99 రోజులు మిగిలినవి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.