1938

1938 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1935 1936 1937 - 1938 - 1939 1940 1941
దశాబ్దాలు: 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

Kofi Annan
కోఫి అన్నన్

మరణాలు

1985

1985 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2019

2019 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

అట్లూరి పూర్ణచంద్రరావు

అట్లూరి పూర్ణచంద్రరావు తెలుగు, హిందీ చలనచిత్రాల నిర్మాత, కమ్యూనిస్టు నాయకుడు.

ఆంధ్రప్రభ

ఆంధ్రప్రభ ఒక ప్రముఖ తెలుగు దినసరి వార్తాపత్రిక. ఇది 1938 సంవత్సరం ఆగష్టు 15న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని రామనాథ్ గోయంకా మద్రాసులో ప్రారంభించారు . అప్పుడు ఖాసా సుబ్బారావు సంపాదకులుగా ఉన్నాడు. అతని తరువాత న్యాపతి నారాయణమూర్తి సంపాదకులైనాడు. 1942లో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కొంతకాలం విద్వాన్ విశ్వం సంపాదకత్వంలో ఆంధ్రప్రభ వెలిగిపోయింది. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల వెంకటేశ్వర రావు సంపాదకత్వానికి రాజీనామా చేశాడు. నార్ల సంపాదకులుగా పనిచేసిన సుమారు పదహారు సంవత్సరాలు ఆంధ్రప్రభ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.

ఆకాశవాణి

ఆలిండియా రేడియో (అధికారికముగా ఆకాశవాణి) (హిందీ: आकाशवाणी) భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి (బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క విభాగము. ఇది జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థైన దూరదర్శన్ యొక్క సోదర విభాగం.

ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉంది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం కూడా ఆకాశవాణి భవన్లో 6వ అంతస్తులో ఉంది.

ఆషా మాథుర్

ఆషా మాథుర్ భారతదేశానికి చెందిన మహిళా శాస్త్రవేత్త. ఈమె మెడికల్ మైక్రోబయాలజీ, వైరాలజీ మరియు ఇమ్యునాలజీ విభాగాలలో శాస్త్రవేత్త.

ఎక్కిరాల భరద్వాజ

ఆచార్య ఎక్కిరాల భరద్వాజ (అక్టోబర్ 30, 1938 - ఏప్రిల్ 12, 1989) ఒక ఆధ్యాత్మిక గురువు, రచయిత. విశేషించి ఆంధ్రదేశానికి షిరిడీ సాయిబాబా మాహాత్మ్యమును పరిచయము చేసి, గురు శుశ్రూష సంప్రదాయము పట్ల సరైన అవగాహనను ఇచ్చిన వ్యక్తిగా భరద్వాజ ప్రసిద్ధుడు. దత్త సంప్రదాయమును ప్రచారం చేసారు. షిరిడీకి వచ్చే భక్తులలో అధికులు దక్షిణాది వారంటే అందులో భరద్వాజ గారి కృషి చాలా ఉంది.

ఎస్. జానకి

ఎస్.జానకి (జ.ఏప్రిల్ 23,1938) గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి ప్రముఖ భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం, కన్నడ బాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు.

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు.

1957 లో విధియిన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన జానకి సెప్టెంబరు 2016 న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు.

ఏప్రిల్ 12

ఏప్రిల్ 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 102వ రోజు (లీపు సంవత్సరములో 103వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 263 రోజులు మిగిలినవి.

ఏప్రిల్ 23

ఏప్రిల్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 113వ రోజు (లీపు సంవత్సరములో 114వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 252 రోజులు మిగిలినవి.

కాశీనాథుని నాగేశ్వరరావు

కాశీనాథుని నాగేశ్వరరావు (1867 - 1938) పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఆయనను 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. దేశోధ్ధారక, విశ్వదాత అని ఆయనను అంతా గౌరవించేవారు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించింది.

నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం సంస్థలను ఆయన స్థాపించాడు. ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. ఆయన స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేడు.

ఆయనకు విశ్వదాత, దేశోద్ధారక అనే బిరుదులు ఉన్నాయి. ఆయన తలచుకొంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవాడు. ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. అమృతాంజనం ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్థులకి వేతనాలుగా ఇచ్చేసేవాడు. ఆయన దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడా మెచ్చుకున్నాడు.

చెన్నై లోని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లోనే చారిత్రాత్మక శ్రీబాగ్‌ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

జిక్కి

జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (నవంబరు 3, 1938 - ఆగష్టు 16, 2004) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం, పంతులమ్మ (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి అప్పట్లో ప్రముఖగాయకుడైన ఏ.ఎమ్.రాజాను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ఆదిత్య 369 సినిమాలో జాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు

జూన్ 10

జూన్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 161వ రోజు (లీపు సంవత్సరములో 162వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 204 రోజులు మిగిలినవి.

జ్వాలాముఖి

జ్వాలాముఖి (ఏప్రిల్ 12, 1938 - డిసెంబర్ 14, 2008) ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకడు. విరసం సభ్యుడు. శరత్ జీవిత చరిత్రను 'దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు' పేరుతో హిందీ నుంచి అనువదించాడు.

తాతినేని చలపతిరావు

తాతినేని చలపతిరావు ప్రముఖ సంగీత దర్శకులు. చలపతిరావు 1938. జన్మస్థలం : కృష్ణాజిల్లా,ఉంగుటూరు మండలం నందమూరు. తల్లిదండ్రులు ద్రోణవల్లి మాణిక్యమ్మ, రత్తయ్య. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తాతినేని కోటమ్మ, కోటేశ్వరరావు

నలుగురు అక్కచెల్లెళ్లు. విద్యార్హత : బి.ఇ. (ఎలక్ట్రికల్).భార్యలు :అన్నపూర్ణమ్మ (గృహిణి),జమునా కుమారి (డాక్టర్).సంతానం : ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. 1. సతీష్ - సన్ టీవీ ఎడిటర్, 2. ప్రశాంత్ - దుబాయ్‌లో నెట్‌వర్కింగ్ ఇంజినీర్, 3. కవిత - వర్జీనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్.మరణం : ఫిబ్రవరి. 22 , 1994.

తెలుగు సినిమాలు 1938

ఈ సంవత్సరం అత్యధికంగా 14 చిత్రాలు విడుదలయ్యాయి.* గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన మాలపిల్ల సంచలన విజయం సాధించి, సమాజం మీద ప్రభావం చూపగలిగే మాధ్యమంగా సినిమాకు

గుర్తింపును తీసుకు వచ్చింది. అప్పటివరకు మన తెలుగు సినిమాలు నాలుగు ప్రింట్లతోనే విడుదలయ్యేవి. 'మాలపిల్ల' చిత్రం ఎనిమిది ప్రింట్లతో విడుదలయింది.

* కన్నాంబ, రామానుజాచార్యులతో హెచ్‌.యమ్‌.రెడ్డి రూపొందించిన గృహలక్ష్మి బాగా ప్రజాదరణ పొంది, మంచి వసూళ్ళు సాధించింది.

* రాజమండ్రి నిడమర్తి సూరయ్య స్టూడియోలో సి.పుల్లయ్య ఒకేసారి 'చమ్రియా' వారికి "సత్యనారాయణవ్రతం, కాసుల పేరు, చల్‌ మోహనరంగా"

అనే మూడు చిత్రాలను తీసిపెట్టారు.

గృహలక్ష్మి - చిత్తూరు నాగయ్య మొదటి చిత్రం

గులేబకావళి

జరాసంధ

మాలపిల్ల

కచ దేవయాని

మార్కండేయ

సత్యనారాయణ వ్రతం

కాసుల పేరు

చల్‌ మోహనరంగా

భక్త జయదేవ

చిత్రనళీయం

నవంబర్ 27

నవంబర్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 331వ రోజు (లీపు సంవత్సరములో 332వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 34 రోజులు మిగిలినవి.

యలమంచిలి హనుమంతరావు

యలమంచిలి హనుమంతరావు రేడియో హనుమంతరావుగా తెలుగు రాష్ర్టాల రైతులకు సుపరిచితుడైన వ్యక్తి.

శ్రీకాకుళం

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.