1936

1936 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1933 1934 1935 - 1936 - 1937 1938 1939
దశాబ్దాలు: 1910లు 1920లు 1930లు 1940లు 1950లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

సావిత్రి కొమ్మారెడ్డి
సావిత్రి

మరణాలు

Sri Vasudasa swamy Vavilikolanu subbarao
వావిలికొలను సుబ్బారావు
2012

2012 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2014

2014 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2016

2016 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2019

2019 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఆంధ్ర విశ్వకళా పరిషత్ లేదా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University), భారతదేశంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది.

ఈ విశ్వవిద్యాలయం 1926లో ఏర్పడింది. మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పడింది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ యొక్క ఆదర్శ విశ్వవిద్యాలయము రూపులో తీర్చిదిద్దబడింది.

తర్వాత 1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము ఏర్పడింది. ఆతర్వాత, 1967లో గుంటూరు లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయముగా అవతరించింది. దీని పేరును ఆచార్య నాగార్జునుని పేరిట 2004 లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయము గా మార్చారు.

ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణము (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

విశ్వవిద్యాలయానికి విశాఖపట్టణం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల లోను, తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ లోను, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం లోను, విజయనగరం జిల్లాలో విజయనగరం లోను ఆ కేంద్రాలు ఉన్నాయి. కాని, 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయమును ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ఆ విధంగా, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. కాని అనుబంధ కళాశాలలకు సంబంధించి కొంత కుదించుకు పోయినా, విశ్వవిద్యాలయ ప్రాంగణములో దాని ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. నాక్ (NAAC) సంస్థ " ఎ " గ్రేడుతో అనుబంధం ఇవ్వడం దీనికి తార్కాణం.

ఆగష్టు 1

ఆగష్టు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 213వ రోజు (లీపు సంవత్సరములో 214వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 152 రోజులు మిగిలినవి.

కె. చక్రవర్తి

చక్రవర్తి గుంటూరు జిల్లా , తాడికొండ మండలం, పొన్నెకల్లు వాస్తవ్యుడు . ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త. ఆయన 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. 1936 సెప్టెంబరు 8వ తేదీన జన్మించాడు. ప్రాథమిక విద్య పొన్నెకల్లు. గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ. ఆయన మేనమామ కుమార్తె అయిన రోహిణి దేవిని వివాహం చేసుకొని 1958లో కుటుంబంతో మద్రాసు చేరాడు. ఈయన రెండవ కుమారుడు శ్రీ కూడా తెలుగు సినిమా సంగీతకారుడిగా విశేశంగా రాణించాడు.

కె.ఎస్.ఆర్.దాస్

కె.ఎస్.ఆర్.దాస్ (జనవరి 5, 1936 - జూన్ 8, 2012)) తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. మోసగాళ్ళకు మోసగాడు, యుగంధర్ లాంటి యాక్షన్ చిత్రాలకు ఈయనే దర్శకుడు.

కొరాపుట్

కొరాపుట్ (Koraput) ఒడిషా రాష్ట్రంలోని పట్టణం మరియు కొరాపుట్ జిల్లా కేంద్రం. జైపూర్ సంస్థానం మరియు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకి వాయువ్య (North West) సరిహద్దుగా ఉంది.

జనవరి 29

జనవరి 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 29వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 336 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 337 రోజులు).

తెలుగు సినిమాలు 1936

ఈ యేడాది 12 చిత్రాలు వెలుగు చూశాయి.* పోటీ చిత్రాలుగా వచ్చిన ద్రౌపదీ మానసంరక్షణం విమర్శకుల ప్రశంసలు మాత్రమే పొందిన పరాజయం పాలుకాగా, ద్రౌపదీ వస్త్రాపహరణం హిట్‌గా నిలిచింది.

* పి.వి.దాస్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మాయాబజార్ కూడా ప్రజాదరణ చూరగొంది.

* ఇదే యేడాది వచ్చిన వీరాభిమన్యు ద్వారా కాంచనమాల వెండితెరకు పరిచయమైంది.

* తెలుగులో తొలి సాంఘిక చిత్రంగా ప్రేమవిజయం ఇదే సంవత్సరం రూపొందింది. అయితే ఆ నాటి పౌరాణిక చిత్రాల నడుమ ఆ సినిమా విజయం సాధించలేకపోయింది.

* రాజమండ్రికి బెందిన ఆంధ్ర సినీ టోన్ వారిచే రాజమండ్రిలోనే నిర్మించబడీన సంపూర్ణ రామాయణం, ఆంధ్రలో నిర్మించిన మొదటి చిత్రంగా నిలిచింది.

అనసూయ ( ఈస్టిండియా)

కబీర్

లంకాదహనం

మాయాబజార్

మోహినీ భస్మాసుర

ప్రేమవిజయం - మొదటి సాంఘిక చిత్రం

సంపూర్ణ రామాయణం

సతీ తులసి

వీరాభిమన్యు

సులోచన

ద్రౌపదీ మానసంరక్షణం

ద్రౌపదీ వస్త్రాపహరణం

దగ్గుబాటి రామానాయుడు

డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (జూన్ 6, 1936 - ఫిబ్రవరి 18, 2015) తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. ఇతను 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు. అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాడాయన. అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్‌ సభ్యునిగానూ రాణించాడు. ఇతను 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికైనాడు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు.సెప్టెంబర్ 9, 2010న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది. 2015 ఫిబ్రవరి 18న హైదరాబాదులో కాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు.

నవంబర్ 17

నవంబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 321వ రోజు (లీపు సంవత్సరములో 322వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 44 రోజులు మిగిలినవి.

ఫిబ్రవరి 9

ఫిబ్రవరి 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 40వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 325 రోజులు (లీపు సంవత్సరములో 326 రోజులు) మిగిలినవి.

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.

రామోజీరావు

చెరుకూరి రామోజీరావు భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు మరియు ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనములో ప్రపంచములోనే అతిపెద్ద సినిమా స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

వావిలికొలను సుబ్బారావు

ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు (జనవరి 23, 1863 - ఆగష్టు 1, 1936) ప్రముఖ రచయిత, గ్రాంథికవాది. కందుకూరి వీరేశలింగం పంతులు తర్వాత, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్యకాలంలో పనిచేశారు. భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. ధర్మసమాజాన్ని స్థాపించారు. రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి "ఆంధ్ర వాల్మీకి" బిరుదు పోందారు. ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా విరాళాలను పోగు చేశారు, టెంకాయ చిప్ప శతకాన్ని రచించారు.

ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి రూప్యములు

వేన వేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వాని లో

దాచుకొనక ధరణి జాపతి కర్పించి ధన్యవైతి

కర్మ గుణపణిముల కుప్ప ! టెంకాయ చిప్ప! "గిడుగు వారి వ్యావహారిక భాష వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరి మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడింది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు గ్రాంధికభాష పరిరక్షణ కోసం ఉద్యమం లేవదీసారు.

వేటూరి సుందరరామ్మూర్తి

వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (జనవరి 29, 1936 - మే 22, 2010) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.

హరనాథ్

బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు (సెప్టెంబర్ 2, 1936 - నవంబర్ 1, 1989) తెలుగు సినిమా కథానాయకుడు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.