1935

1935 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1932 1933 1934 - 1935 - 1936 1937 1938
దశాబ్దాలు: 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

Vedantam satyanarayana sarma
వేదాంతం సత్యనారాయణశర్మ

మరణాలు

2001

2001 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2006

2006 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2016

2016 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2018

2018 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

ఆగష్టు 15

ఆగష్టు 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరములో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి.

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

కొమ్మూరి వేణుగోపాలరావు

కొమ్మూరి వేణుగోపాలరావు (సెప్టెంబరు 4, 1935 - అక్టోబరు 31, 2004) ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. ఇతడు పెంకుటిల్లు నవలా రచయితగా ప్రసిద్ధుడు. ఇతడు బెంగాలు రచయిత శరత్ చంద్ర ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశాడు. ఇతడు "ఆంధ్రా శరత్"గా పిలవబడ్డాడు. ఇతడు సుమారు 50 పైగా నవలలు రచించాడు. వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో హౌస్ సర్జన్, హారతి, వ్యక్తిత్వం లేని మనిషి నవలలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి ప్రేమ నక్షత్రం నవల సినిమాగా వచ్చింది. 1959 లో గోరింటాకు సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. ఈయన ఆకాశవాణి కోసం ఎన్నో నాటికలు రచించాడు. ఇవి కాకుండా కొన్ని మంచి కథలు కూడా రచించాడు. వాటిలో మర మనిషి కథను నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది.

తెలుగులో గొలుసు నవల అనే కొత్త ప్రక్రియను పురాణం సుబ్రహ్మణ్య శర్మ, గొల్లపూడి మారుతీరావు గార్లతో కలిసి మొదలుపెట్టాడు. దీనిని "ఇడియట్" అనే పేరుతో ఆంధ్ర జ్యోతి వారపత్రికలో 1968 లో ధారావాహికగా ప్రచురించారు.

వేణుగోపాలరావు విజయవాడలో 1935 సెప్టెంబరు 4 వ తేదీన జన్మించాడు.

కొమ్మూరి సెక్స్ ఎడ్యుకేషన్ కలిగించడానికి సృష్టి రహస్యాలు (1980) అనే సినిమాను నిర్మించాడు.

ఈయన 2004 అక్టోబరు 31 తేదీన పరమపదించాడు.

జనవరి 7

జనవరి 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 7వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 358 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 359 రోజులు).

జూలై 24

జూలై 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 205వ రోజు (లీపు సంవత్సరములో 206వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 160 రోజులు మిగిలినవి.

డిసెంబర్ 12

డిసెంబర్ 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 346వ రోజు (లీపు సంవత్సరములో 347వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 19 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1935

* ఈ సంవత్సరం ఏడు చిత్రాలు విడుదలయ్యాయి.

* ఎస్‌. రాజేశ్వరరావు చిన్నికృష్ణుడుగా నటించిన 'శ్రీకృష్ణలీలలు' విశేషాదరణ పొందింది.

* కన్నాంబ, శ్రీరామమూర్తి, పి.పుల్లయ్య తొలి చిత్రం అయిన హరిశ్చంద్ర కూడా బాగా ఆడింది.

అనసూయ (అరోరా)

హరిశ్చంద్ర

కృష్ణలీలలు (శ్రీకృష్ణలీలలు)

కుచేల

రాణి ప్రేమలత

సక్కుబాయి

కృష్ణ తులాభారం

పి.సుశీల

పి.సుశీల (పులపాక సుశీల) ప్రముఖ గాయకురాలు. ఐదు జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల, తన గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ మరియు సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. భాష ఏదయినా అద్భుత కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు.

సుశీల 1935లో విజయనగరంలో సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పి.ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు. తల్లి శేషావతారం. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడింది.

బాబాజీ

బాబాజీ ఒక భారతీయ సన్యాసి. బాబాజీ అనే పేరు 1861 మరియు 1935 సంవత్సరాల మధ్య కాలంలో ఆయనను కలిసిన లాహిరీ మహాశయులు మొదలైన వారు పెట్టిన పేరు. వీటిలో కొన్ని సమావేశాల గురించి, స్వీయ అనుభవం గురించి పరమహంస యోగానంద తన ఆత్మకథలో వివరించడం జరిగింది.. అలాగే యుక్తేశ్వర్ గిరి రచించిన ది హోలీ సైన్స్ అనే పుస్తకంలో బాబా గురించిన ప్రస్తావన ఉంది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India-RBI) భారతదేశపు కేంద్ర బ్యాంకు. ఈ బ్యాంకును 1935, ఏప్రిల్ 1 న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 ప్రకారము స్థాపించారు. స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావనం కోల్‌కతలో ఉండేది. తర్వాత ముంబాయి నగరంలో ఉంది. ప్రారంభంలో ఇది ప్రైవేటు అజమాయిషిలో ఉన్ననూ 1949లో జాతీయం చేయబడిన తర్వాత భారత ప్రభుత్వం అధీనంలో ఉంది.

రిజర్వ్ బ్యాంకుకు అధిపతి గవర్నర్ . ఇతనిని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని పిలుస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సాధారణంలో ఆర్థిక నైపుణ్యం కల వ్యక్తులను ఈ బ్యాంకు అధిపతులుగా నియమించబడతారు.మన్‌మోహన్ సింగ్ గతంలో రిజర్వ్ బ్యానికి గవర్నర్ గా పనిచేసారు. రిజర్వ్ బ్యంకుకు ప్రస్తుత గవర్నర్ Shakti Kanth das 25th govarnar of RBI

ujjith patel nunchi పదవీ బాధ్యతలు స్వీకరించారు. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

మందాడి ప్రభాకర రెడ్డి

మప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి (అక్టోబర్ 8, 1935 -నవంబర్ 26, 1997) ప్రముఖ తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. 37 ఏళ్ల కెరీర్‌లో 472కు పైగా సినిమాల్లో నటించాడు. కార్తీక దీపం వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు. హైదరాబాదు లోని మణికొండలో ఈయన స్మారకార్ధం డా.ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరుపెట్టారు.

రాజబాబు

తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు ప్రముఖ హాస్యనటునిగా వెలిగిన రాజబాబు (అక్టోబరు 20, 1935 - ఫిబ్రవరి 14, 1983) "శతాబ్దపు హాస్య నటుడి"గా ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి.

రాజసులోచన

రాజసులోచన (ఆగష్టు 15, 1935 - మార్చి 5, 2013) అలనాటి తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి, భరత నాట్య నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు భార్య. ఈమె విజయవాడలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది, కానీ విద్యాభ్యాసం అంతా తమిళనాడులో జరిగింది.

రాజసులోచన తండ్రి భక్తవత్సలం నాయుడుకు మద్రాసుకు బదలీ కావడంతో, రాజసులోచన చిన్న వయసులోనే అక్కడకు వెళ్ళిపోయారు. చెన్నైలోని ట్రిప్లికేన్‌ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది. అక్కడి తోపు వెంకటాచలం చెట్టి వీధిలో 1939లో స్థాపించిన ప్రసిద్ధ శ్రీసరస్వతీ గాన నిలయంలో ఆమె నాట్యం నేర్చుకున్నది. కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి సరస్వతీ గాన నిలయంలో నాట్యం నేర్చుకున్నది. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించింది. అది ఇప్పటికీ నడుస్తున్నది.

వెలుదండ రామేశ్వరరావు

వెలుదండ రామేశ్వర రావు మహబూబ్ నగర్ జిల్లా, బిజినపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన కవి. వీరు 27.07.1935 లో జన్మించారు. కనక రత్నమ్మ, వెలుదండ నారాయణ రావు వీరి తల్లిదండ్రులు. ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా 40 సంవత్సరాల పాటు బోధన చేసి, ఎంతో మంది శిష్యులను తీర్చిదిద్దారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అద్వితీయమైన పాండిత్యం కలవారు. ఆయుర్వేద, హోమియోపతి వైద్య విధానాలలో కూడా వీరిది అందె వేసిన చెయ్యి. వీరు చాలా రచనలు చేశారు. వాటిలో కొన్ని ముద్రితం, కొన్ని అముద్రితం. శ్రీ కుసుమ హరనాథ, శ్రీ రామకృష్ణ ప్రభ, గైర్వాణి, ఆంధ్రప్రదేశ్ వంటి పత్రికలలోనూ వీరి రచనలు వచ్చాయి.

సావిత్రి (నటి)

నిశ్శంకర సావిత్రి (డిసెంబరు 6, 1935 - 1981 డిసెంబర్ 26) తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు. అభిమానులచేత మహానటిగా కీర్తింపబడింది. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న ఆమెను పెంచి పెద్దచేశాడు. చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే ప్రముఖ హిందీ నటుడు పృథ్వీ రాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందింది. తమిళ నటుడు జెమిని గణేశన్ ను పెళ్ళి చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.