1933

1933 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1930 1931 1932 - 1933 - 1934 1935 1936
దశాబ్దాలు: 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

Velcheru narayana rao
వేల్చేరు నారాయణరావు

మరణాలు

1987

1987 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2011

2011 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2013

2013 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2014

2014 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2019

2019 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

అనీ బిసెంట్

అనీ బిసెంట్, (1847 అక్టోబర్ 1 - 1933 సెప్టెంబర్ 20) ప్రముఖ బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత. ఆమె వాక్పటిమ కలిగిన స్త్రీ.

అనీ వుడ్ బిసెంట్ ఐరిష్ జాతి మహిళ. లండను లోని క్లఫామ్ లో, 1847 అక్టోబరు 1 న జన్మించింది. 1933 సెప్టెంబరు 20 న తమిళనాడు లోని అడయారు లో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత, వక్త. ఈమె ఐర్లాండ్, భారతదేశాల స్వాతంత్ర్యం, స్వయంపాలన కొరకు పోరాడింది. స్వయం పాలన ఉద్యమం స్థాపించింది.

తల్లి ధార్మిక స్వభావి. తండ్రి డా. విలియం ఫేజ్ గొప్ప విద్వాంసుడు. 1867 డిసెంబరులో తన 19 వ ఏట, తల్లి కోరికమేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ ని అనిబిసెంట్ పెళ్ళి చేసుకుంది. అంతవరకూ అనీగా పిలవబడిన ఆమె వివాహముతో అనీ బిసెంట్ గా మారింది. ఈమె 1874 లో ఇంగ్లాడులోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరింది. లా అండ్ రిపబ్లిక్ లీగ్ ని స్థాపించి పోలీసు అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవచేసింది.

ఆమెకు భర్తతో మతపరమైన విభేదాలు కలిగడంతో విడిపోయారు. తరువాత ఆమె జాతీయ సామ్యవాద సంఘానికి ప్రముఖ ఉపన్యాసకురాలుగా వ్యవహరించింది. ఆమెకు చార్లెస్ బ్రాడ్‌లాఫ్‍తో సన్నిహిత మైత్రి కుదిరింది. 1887 లో వారిరువురు రచయిత చార్లెస్ నోల్టన్ పుస్తకం బర్త్ కంట్రోల్ ప్రచురణ విషయంలో విచారణను ఎదుర్కొన్నారు. ఈ అపకీర్తి వారికి ప్రాబల్యం కలిగించింది. 1880లో బ్రాడ్‍లాఫ్, నార్తాంప్టన్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికైయాడు.

1880లో అనీ బిసెంట్ "హెలెనా బ్లావట్‍స్కీ"ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్యజ్ఞానం వైపు మళ్ళింది. ఆమె దివ్యజ్ఞానం సమాజంలో సభ్యత్వం స్వీకరించి, ఉపన్యాసకురాలిగా విజయం సాధించింది. దివ్యజ్ఞాన సమాజం బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. 1898లో కేంద్రీయ హిందూ కళాశాల స్థాపనకు సహకరించింది. 1902 లో అమె " కో-ఫ్రీమసోంరీ లీ డ్రాయిట్ హ్య్జమన్ "ను ఇంగ్లాండులో స్థాపించింది. తరువాత కొద్ది సంత్సరాలలో ఈ తరహా నిర్మాణాలు బ్రిటన్ సామ్రాజ్యమంతటా స్థాపించింది. 1907లో ఆమె దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలైంది.

మే యూనియన్ ని స్థాపించి కార్మికులకోసం పోరాడింది. 1898 జూలై 7న బనారస్ లోని ఒక చిన్న ఇంట్లో తాను కలలుగన్న విద్యాసౌధాన్ని ప్రారంభించి, దానిని అలహాబాదు విశ్వవిద్యాలయంగా పేర్కొంది. బాలగంగాధర తిలక్ 1895 లో ప్రస్తావించిన "స్వయంపాలన"ను 1914 లో అనీ బిసెంట్ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్ధులను చేయసాగింది. దీనికి సంబంధించిన కామన్ వెల్త్ అనే వార పత్రికను ఆమె ప్రారంభించినది. 1915 లో ఈమె హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడంఅనే పుస్తకాన్ని వ్రాసింది. భారతదేశ స్వాతంత్ర్యం గురించి వివరించింది.

ఆమె భారత రాజకీయాలలో ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్‍లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో హోం రూల్ లీగ్ స్వాతంత్ర్యోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. యుద్ధానంతరం ఆమె భారతీయ స్వాతంత్ర్య పోరాటం, దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలు రెంటినీ 1933లో మరణించే వరకు కొనసాగించింది.

ఈమె రచించిన లెక్చర్ ఆన్ పొలిటికల్ సైన్స్ పుస్తకంలో పాశ్చాత్య, భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి పరిష్కృతం కాగలిగే సూచనలను ఇచ్చినది. 1917లో అనీ బిసెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించబడింది. ఎన్నోరకాల ప్రాతిపదికలతో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించించినది. న్యూ ఇండియాఅనే దినపత్రిక ఈమెదే. ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోషియేషన్ను స్థాపించినది. ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించినది. 80సంవత్సరాల వయసులో బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్, చికాగో ప్రపంచ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించినది. 1933 సెప్టెంబర్ 20న ఆమె తుదిశ్వాస విడిచినది.

అమర్త్యా సేన్

అమర్త్య కుమార్ సేన్ (జ. నవంబరు 3 1933, శాంతినికేతన్, భారతదేశం) భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు మరియు political liberalism లలో చేసిన విశేష కృషికి నోబెల్ బహుమతి లభించింది. సంక్షేమ రంగంలో విశేష కృషి చేసినందులకు అతనికి 1998లో ఈ ఉన్నతమైన బహుమతి లభించింది.

ఆగష్టు 6

ఆగష్టు 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ (gorgeon calander)ప్రకారము సంవత్సరములో 218వ రోజు (లీపు సంవత్సరములో 219వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 147 రోజులు మిగిలినవి.

ఇందుకూరి రామకృష్ణంరాజు

రాజశ్రీ (ఆగష్టు 31, 1934 - ఆగస్టు 14, 1994) తెలుగు సినిమా లలో అనువాద రచనలో ప్రముఖులు.

ఖుర్దా రోడ్ - విశాఖపట్నం రైలు మార్గము

ఖుర్దా రోడ్ - విశాఖపట్నం రైలు మార్గము (Khurda Road–Visakhapatnam section) ఒరిస్సా లోని ఖుర్దా రోడ్ రైల్వే స్టేషను మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్లను కలుపుతున్న రైలు మార్గము. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఒక భాగము.

ఖుర్దా రోడ్ - విశాఖపట్నం భారత తూర్పు భాగములో ధ ప్రాంతానికి మరియు ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర భాగం లో విస్తరించిఉంది.మహానది ,చిలక సరస్సు ,నాగవళీ నది,వంశధార నదుల మీదుగా ఉంది.విశాఖపట్నం 1933 లో రేవుపట్నం గా మారడంతో ఈ మార్గము తాలుకు ప్రాధాన్యం పెరిగింది.ద.

చక్రధారి శతకము

శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ చక్రధారి శతకం. "చక్రధారీ!" అనే మకుటంతో ఈ పద్యాలను పింగళి వేంకట సుబ్రహ్మణ్య కవి రచించారు.

ఈ శతకం గుండవరపు మల్లికార్జునరావు గారి ద్రవ్యసహాయముతో 1933 సంవత్సరంలో బెజవాడలోని వాణీ ముద్రాక్షరశాల యందును మరియు 1935 సంవత్సరంలో గుంటూరు వాణీ ముద్రాక్షరశాల యందు ముద్రించబడింది.

చెళ్ళపిళ్ళ సత్యం

చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు.

డిసెంబర్ 15

డిసెంబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 349వ రోజు (లీపు సంవత్సరములో 350వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 16 రోజులు మిగిలినవి.

తెలుగు సినిమాలు 1933

* ఈ యేడాది తెలుగు నాట తొలిసారి పోటీ చిత్రాలు రూపొందాయి.

* ఇంపీరియల్‌ సంస్థ (బొంబాయి), ఈస్ట్‌ ఇండియా సంస్థ (కలకత్తా) ఒకే ఇతివృత్తంతో రామదాసు అనే పేరుతో చెరొక చిత్రాన్ని నిర్మించాయి.

* సావిత్రి పేరుతో రెండు చిత్రాలు పోటీగా రూపొందాయి. వీటిలో ఓ చిత్రాన్ని సి.పుల్లయ్య దర్శకత్వంలో ఈస్ట్‌ ఇండియా సంస్థ, మరో చిత్రాన్ని

బి.వి.రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలిమ్స్‌ కంపెనీ నిర్మించాయి.

* ఈస్ట్‌ ఇండియా సంస్థ నిర్మించిన సావిత్రి, రామదాసు రెండు చిత్రాలూ ప్రజాదరణ చూరగొన్నాయి.

* ఇదే యేడాది ఆంధ్రదేశంలో తొలి శాశ్వత‌ సినిమా థియేటర్‌ను నిర్మించిన పోతిన శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈలపాట రఘురామయ్య నటించిన

పృధ్వీపుత్ర, చింతామణి విడుదలయ్యాయి.

చింతామణి

పృధ్వీపుత్ర

రామదాసు (కృష్ణా ఫిలిమ్స్)

రామదాసు (ఈస్టిండియా ఫిలిమ్స్)

సావిత్రి(కృష్ణా ఫిలిమ్స్)

సావిత్రి(ఈస్టిండియా)

నగేష్

సి.కె.నగేష్ (సెప్టెంబర్ 27, 1933 — జనవరి 31, 2009) దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు. పలు తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించాడు. తెలుగులో ఆయన ఆఖరి చిత్రం కమల్ హాసన్ నటించిన దశావతారం. నవ్విస్తూనే ఏడిపించేవారాయన. అందుకే ఆయన అభిమానులు ఆయన్ని దక్షిణాది చార్లీ చాప్లిన్గా అభివర్ణిస్తుంటారు.

బాపు

బాపు (డిసెంబరు 15, 1933 - ఆగష్టు 31, 2014) తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.

రమేష్ నాయుడు

పసుపులేటి రమేష్ నాయుడు (జూన్ 27, 1933 - సెప్టెంబర్‌ 3, 1987) 1970వ మరియు 80వ దశకములో సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. ఆయన సృష్టించిన పాటలు రాశి తక్కువైనా వాసి ఎక్కువ. ఆయన సంగీతము సమకూర్చిన మేఘసందేశం చిత్రంలోని పాటలు సంగీతపరంగా చాలా ప్రసిద్ధి గాంచినవి.

వాసిరెడ్డి సీతాదేవి

వాసిరెడ్డి సీతాదేవి (ఆంగ్లం: Vasireddy Seethadevi) (డిసెంబర్ 15, 1933 - ఏప్రిల్ 13, 2007) ప్రసిద్ధ తెలుగు నవలా మరియు కథా రచయిత్రి..

సెప్టెంబర్ 8

సెప్టెంబర్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 251వ రోజు (లీపు సంవత్సరములో 252వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 114 రోజులు మిగిలినవి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.