1931

1931 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1928 1929 1930 - 1931 - 1932 1933 1934
దశాబ్దాలు: 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Statues of Bhagat Singh, Rajguru and Sukhdev
భగత్‌సింగ్,రాజ్‌గురు,సుఖ్‌దేవ్‌ల విగ్రహాలు
2011

2011 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2015

2015 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఆంధ్ర విశ్వకళా పరిషత్ లేదా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University), భారతదేశంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది.

ఈ విశ్వవిద్యాలయం 1926లో ఏర్పడింది. మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పడింది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ యొక్క ఆదర్శ విశ్వవిద్యాలయము రూపులో తీర్చిదిద్దబడింది.

తర్వాత 1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము ఏర్పడింది. ఆతర్వాత, 1967లో గుంటూరు లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయముగా అవతరించింది. దీని పేరును ఆచార్య నాగార్జునుని పేరిట 2004 లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయము గా మార్చారు.

ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణము (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

విశ్వవిద్యాలయానికి విశాఖపట్టణం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల లోను, తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ లోను, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం లోను, విజయనగరం జిల్లాలో విజయనగరం లోను ఆ కేంద్రాలు ఉన్నాయి. కాని, 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయమును ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ఆ విధంగా, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. కాని అనుబంధ కళాశాలలకు సంబంధించి కొంత కుదించుకు పోయినా, విశ్వవిద్యాలయ ప్రాంగణములో దాని ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. నాక్ (NAAC) సంస్థ " ఎ " గ్రేడుతో అనుబంధం ఇవ్వడం దీనికి తార్కాణం.

ఆగష్టు 14

ఆగష్టు 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 226వ రోజు (లీపు సంవత్సరములో 227వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 139 రోజులు మిగిలినవి.

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి.

తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.

భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు.

ఏప్రిల్ 7

ఏప్రిల్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 97వ రోజు (లీపు సంవత్సరములో 98వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 268 రోజులు మిగిలినవి.

ఓషో

రజినీష్ చంద్రమోహన్ జైన్ (డిసెంబరు 11, 1931 - జనవరి 19, 1990). 1960లలో ఆచార్య రజినీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్‌ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్‌మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్‌లో గల నర్సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న కుచ్‌వాడాలో 11.12.1931న జన్మించాడు.19.1.1990 న మరణించాడు.

చాట్ల శ్రీరాములు

చాట్ల శ్రీరాములు (డిసెంబరు 5, 1931 - డిసెంబర్ 18, 2015) ప్రముఖ తెలుగు నాటకరంగ నిపుణుడు మరియు సినిమా నటుడు.

తెలుగు సినిమాలు 1931

ఇది తెలుగు సినిమాకు జన్మ దినోత్సవ సంవత్సరం. 1931 సెప్టెంబరు 15న విజయవాడలో మారుతీ, కాకినాడలో క్రౌన్‌, మద్రాస్‌లోని గెయిటీ, మచిలీపట్నంలోని

మినర్వా టాకీసుల్లో విడుదలైన తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' దర్శకుడు హెచ్‌.యమ్‌.రెడ్డి తెలుగువారే అయినా, ఆ చిత్ర నిర్మాత, ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ

అధినేత ఆర్దెషీర్‌ ఇరానీ. ఆయన తెలుగువారు కాదు. 1931 ప్రారంభంలో మాటలైనా, పాటలైనా పూర్తిగా సెట్‌లోనే రికార్డు చేసేవారు. ఎక్కడ ఏ శబ్దం ఉన్నా- అది

రెండు ఛానళ్లలో ఫిల్మ్‌మీదే రికార్డయ్యేది. అందుకే- పాటలు పాడగలిగే నటీనటులు ఉంటే, మరొక వంక కెమెరాను చూస్తూ ఒక మైక్‌లో పాడుతోంటే, కెమెరా పరిధిలోకి

రాని విధంగా రెండో మైక్‌లో వాద్యబృందంవారి మ్యూజిక్‌ ఉండేది.

1931 చలన చిత్రాల జాబితాభక్తప్రహ్లాద

థామస్ అల్వా ఎడిసన్

థామస్ అల్వా ఎడిసన్ (ఫిబ్రవరి 11, 1847 – అక్టోబర్ 18, 1931) మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.

ఆయన 1000 పేటెంట్లకు హక్కులు కలిగి ఉన్నాడు. 1889లో పారిస్లో గొప్ప వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. అందులో ప్రదర్శించబడ్డ వస్తువుల్లో తొంభై శాతానికి పైగా థామస్ ఎడిసన్ కు చెందినవే.

ఫిబ్రవరి 16

ఫిబ్రవరి 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 47వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 318 రోజులు (లీపు సంవత్సరములో 319 రోజులు) మిగిలినవి.

బి. పద్మనాభం

పద్మనాభం ( ఆగస్టు 20, 1931 - ఫిబ్రవరి 20, 2010) ప్రముఖ తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఈయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో "ద్రౌపదీ వస్త్రాపహరణం", "వందేమాతరం", "సుమంగళి", శోభనావారి "భక్త ప్రహ్లాద" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.

మార్చి 23

మార్చి 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 82వ రోజు (లీపు సంవత్సరములో 83వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 283 రోజులు మిగిలినవి.

ముళ్ళపూడి వెంకటరమణ

ముళ్ళపూడి వెంకటరమణ (జూన్ 28, 1931 - ఫిబ్రవరి 24, 2011) ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది.

బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి సినిమాలకు రచయిత. 1995లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ నుండి రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకొన్నాడు.

శ్రీకాకుళం

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.

షావుకారు జానకి

షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి (జ. 1931 డిసెంబరు 12) అలనాటి రంగస్థల, సినీ కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో 370 కి పైగా సినిమాల్లో నటించింది. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు. ఈమె రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్ మొదలైన నటుల సరసన కథానాయికగా నటించింది. ఈమె చెల్లెలు కృష్ణకుమారి కూడా సినీ నటి.

సింగిరెడ్డి నారాయణరెడ్డి

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

సినిమా

సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది.

సినిమాలో ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయి. కళ, నటన, పర్వవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రూపు దిద్దుకొంటుంది. కొంత నిజం, కొంత ఊహ, కొంత మాయాజాలం అన్నీ సినిమా తెరపైన ఆడే పాత్రలను ప్రేక్షకుల సమాజంలో భాగస్వాములుగా చేస్తాయి.

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సినిమాలు భారత దేశంలో తయారవుతున్నాయి. సినిమా ప్రభావం భారతీయులపైన, ప్రత్యేకించి తెలుగువారిపైన బాగా ఎక్కువ.

సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ

సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ (ఫిబ్రవరి 14, 1931 - సెప్టెంబరు 29, 2008) హైదరాబాదు నగరానికి చెందిన రాజకీయనాయకుడు. మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.