1930

1930 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1927 1928 1929 1930 1931 1932 1933
దశాబ్దాలు: 1910లు 1920లు 1930లు 1940లు 1950లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

Gandhi at Dandi 5 April 1930
ఉప్పు సత్యాగ్రహం

జననాలు

మరణాలు

2013

2013 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

ఇరివెంటి కృష్ణమూర్తి

తెలంగాణా ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఇరివెంటి కృష్ణమూర్తి (1930 - 1989) ఒకడు.

ఉప్పు సత్యాగ్రహం

ఉప్పు సత్యాగ్రహం (ఆంగ్లం : The Salt Satyagraha) మహాత్మా గాంధీచే ప్రారంభించి సాగించిన అహింసాత్మక శాసనోల్లంఘన ఉద్యమం, ఇది బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా జరిగింది. ఉప్పుపై పన్ను చెల్లించుటకు నిరాకరించి, మార్చి 12, 1930 న చేపట్టిన "దండి యాత్ర" నే ఉప్పు సత్యాగ్రహంటారు. సంపూర్ణ స్వరాజ్యం కొరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాల సరమే ఈ ఉప్పు సత్యాగ్రహం. దీనిలో ప్రధానమైన గాంధీ యాత్ర సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమై దండి వరకూ సాగింది. ఈ యాత్రలో వేలకొద్దీ భారతీయులు పాల్గొన్నారు. గాంధీగారి అహింసాత్మక ప్రతిఘటన విజయాలలో ఇదొక పుష్పమాలిక. కోట్ల భారతీయులపై బ్రిటిష్ రాజ్ వేసే ఉప్పు-పన్నుకు వ్యతిరేకంగానే కాక దానిని ప్రతీకగా వినియోగించుకుని మొత్తం భారతీయులపై బ్రిటీషర్ల అన్యాయమైన పరిపాలనపై ఒక శాంతియుత పోరాటం.ఈ సత్యాగ్రహం ప్రారంభానికి కొన్నిరోజులకు ముందే బ్రిటిష్ వారు గాంధీని మార్చి 5, 1930 న అరెస్టు చేశారు. ఈ ఉప్పుసత్యాగ్రహం గురించి ప్రపంచానికి తెలిసినపుడు, ప్రపంచం దృష్టియంతా ఈ సత్యాగ్రహం వైపున ఆసక్తిగా వుండినది. ఈ సత్యాగ్రహం దాదాపు ఒక సంవత్సరకాలం వుండినది. మహాత్మాగాంధీని జైలునుండి విడుదల చేశాక, వైశ్రాయ్ అయిన లార్డ్ ఇర్విన్తో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సంభాషణలు మొదలయ్యాయి. ఈ సత్యాగ్రహం మూలంగా దాదాపు 80,000 వేలకు పైగా భారతీయులు కారాగారాల పాలయ్యారు. ఈ ఉద్యమం బ్రిటిష్ రాజ్య అరాచక విధానాలు తేటతెల్లమైనాయి. మరియు లక్షలకొద్దీ భారతీయులు స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.

ఏప్రిల్ 14

ఏప్రిల్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 104వ రోజు (లీపు సంవత్సరములో 105వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 261 రోజులు మిగిలినవి.

ఏప్రిల్ 19

ఏప్రిల్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 109వ రోజు (లీపు సంవత్సరములో 110వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 256 రోజులు మిగిలినవి.

ఏప్రిల్ 6

ఏప్రిల్ 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 96వ రోజు (లీపు సంవత్సరములో 97వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 269 రోజులు మిగిలినవి.

కె.విశ్వనాథ్

కళాతపస్వి గా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. 2016లో ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు.

గోపరాజు లవణం

గోపరాజు లవణం (అక్టోబరు 10 1930 - ఆగష్టు 14, 2015), గోరా కుమారుడు, హేతువాది మరియు నాస్తికుడు. సంఘం, ది ఎథీస్ట్ (The Atheist) మరియు నాస్తికమార్గం పత్రికల సంపాదకుడు. భారత నాస్తిక కేంద్రం (విజయవాడ) డైరెక్టర్.

తెలుగు కథ

తెలుగు కథ లేదా కత (Telugu Story) తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం. ఆంధ్ర దేశంలో చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం బాగా అలవాటు. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. తెలుగులోను మరియు ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి సుమారు నూరేళ్ళయింది. ఈ నూరేళ్ళలో సుమారు లక్షకు పైగా కథలు రచించబడినట్లుగా ఒక అంచనా. ఇవి ఎక్కువగా దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. కొన్ని కథా సంకలనాలు ప్రత్యేకంగా ముద్రించబడుతున్నాయి. ఈ కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువుగా నడుస్తాయి. ఇతర సాహిత్య ప్రక్రియలన్నింటికన్నా కథకి ఆదరణ ఎక్కువ.

పిఠాపురం నాగేశ్వరరావు

పిఠాపురం నాగేశ్వరరావు (మే 5, 1930 - మార్చి 5, 1996) ప్రముఖ సినీ సంగీత దర్శకులు.

తెలుగు సినీ జగత్తులో మాధవపెద్ది - పిఠాపురం లను జంట గాయకులు అంటారు. పిఠాపురం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1930 మే 5 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశ్వనాధం - అప్పయమ్మ గార్లు. అసలు వీరి ఇంటిపేరు పాతర్లగడ్డ, కానీ, 'చిత్తూరు' నాగయ్య లాగా, నాగేశ్వరరావుగారు కూడా తమ ఊరిపేరునే తన ఇంటిపేరు చేసుకున్నారు.

ప్రకృతి (మాసపత్రిక)

ప్రకృతి ఒక సచిత్ర సహజ వైద్య మాసపత్రిక. దీనిని 1930 మరియు 1940లలో బెజవాడ నుండి ప్రకృతిచికిత్సానిపుణులు ఎ.అక్బరల్లీ సాహెబు గారు స్వీయ సంపాదకీయంలో వెలువరించారు. ఇది 1939లో 21వ సంపుటముగా పేర్కొనబడినది కావున ఈ పత్రిక సుమారు 1918 ప్రాంతంలో ప్రారంభించబడియుండును.

ప్రతివాది భయంకర శ్రీనివాస్

పి.బి.శ్రీనివాస్ (సెప్టెంబరు 22, 1930 - ఏప్రిల్ 14, 2013) (పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్) ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు. ఈయన తన మాతృభాష అయిన తెలుగులో కంటే కన్నడ, తమిళ చిత్రాలలో ఎక్కువ పాటలు పాడాడు. ఆయన హిందీ, మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడాడు. కన్నడ నటదిగ్గజం రాజ్‌కుమార్‌కు ఈయన ఎన్నో గీతాలు ఆలపించాడు. ఈయన తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృత భాషలలో దిట్ట. ఈయన ఎన్నో గజళ్లు వ్రాసాడు. ఈయన గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది. ఈయన మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడాడు. ఆయన సుమారు 3000 లకు పైగా పాటలు పాడాడు.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ

మంగళంపల్లి బాలమురళీకృష్ణ (జూలై 6, 1930 - నవంబర్ 22, 2016) ప్రఖ్యాత కర్ణాటక సంగీత గాయకుడు, వయొలిన్ విద్వాంసుడు, వాగ్గేయకారుడు, సినీ సంగీత దర్శకుడు, గాయకుడు. ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ ఆయన ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నాడు. ఆయన వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్లను వంటి బిరుదులను పొందాడు. ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నాడు. చెన్నై లోని తన స్వగృహంలో, మధ్యాహ్న భోజనం తరువాత నిద్రించి నిద్రలోనే అనాయాస మరణం పొందాడు.

మన్నవ బాలయ్య

మన్నవ బాలయ్య గుంటూరు జిల్లా వైకుంఠపురం (అమరావతి) శివారు గ్రామం చావపాడు లో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో జన్మించాడు. బాలయ్య మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశాడు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్‌గా పనిచేశాడు.

మార్చి 12

మార్చి 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 71వ రోజు (లీపు సంవత్సరములో 72వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 294 రోజులు మిగిలినవి.

మార్చి 30

మార్చి 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 89వ రోజు (లీపు సంవత్సరములో 90వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 276 రోజులు మిగిలినవి.

ముమ్మడివరం పెద్దబాలయోగి

ఆధునికయుగంలో ప్రజల మధ్య ఉంటూనే నిత్యం తపస్సమాధిలో ఉండిపోయిన యోగి. పాలేరుగా పని చేస్తూ పదహారేళ్లకు ఆకస్మికంగా సమాధి స్థితి పొందారు. అప్పట్నుంచి ఆయన జీవితంలో నిద్రాహారాలకు ప్రాముఖ్యం లేదు. ఆయనను చూడడానికి వచ్చే భక్తుల సహాయంతో ఒక ధ్యాన మందిరం కట్టించారు. అందులోనే ఆయన ధ్యానం చేసుకునేవారు. చాలా అరుదుగా మాట్లాడేవారు. శివరాత్రి నాడు మాత్రం ఉదయం నుంచి అర్థరాత్రివరకు భక్తులకు దర్శనం ఇచ్చేవారు. భక్తులు ఎన్నో లీలలను ఆయనకు ఆపాదించారు. సమాధి స్థితిలో ఎవరికీ తెలియకుండానే తనువు చాలించారు.

శివకుమార స్వామీజీ

డా॥శ్రీశ్రీశ్రీ శివకుమార స్వామీజీ కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఉన్న శ్రీసిద్ధగంగ మఠానికి మఠాధిపతి. ఈయనే శ్రీసిద్దగంగ ఎజ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. 1907 ఏప్రిల్ 1 న జన్మించిన ఈయన వయస్సులో శతాధికులు. 1930 లో విరక్తాశ్రమంలోకి ప్రవేశించబడ్డారు. స్వామీజీ మాగడి తాలూకలోని వీరపూరలో పుట్టారు. ఆయనొ వీరపుర మరియు నాగవళ్లిలో ప్రాధమిక విద్యను కలిగి ఉన్నారు. అతను సెకండరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ హైస్కూల్ తుమకూరు, బెంగుళూరు యూనివర్సిటీ నుండి పూర్వ విశ్వవిద్యాలయము మరియు డిగ్రీని సెంట్రల్ కాలేజ్, బెంగళూరులో పూర్తి చేసారు. ఈ సమయములో (1927-1930) రావు బహదూర్ ధర్మప్రవర్ధ గుబ్బి తోటదప్ప హాస్టల్ లో బసచేశారు. ఆయనొక ఆంగ్ల కళాశాలలో చదివారు, అయినప్పటికీ కన్నడ మరియు సంస్కృతంలో నిష్ణాతులు. సాంప్రదాయంగా సంస్కృతంతో పాటూ ఆధునికంగా విజ్ఞానాన్ని చదివించే ఎన్నో విద్యాసంస్థలను ఈయన స్థాపించారు. అందువలనే అన్ని వర్గాలవారూ ఈయన్ని గౌరవిస్తారు.ఈయన చేసిన మానవతావాద పనులకు కర్ణాటక విశ్వవిద్యాలయం ఈయన్ని గౌరవ డాక్టరేట్ తో 1965లో సత్కరించింది. 107 ఏళ్ళ వయసులో కూడా ఈయన సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2015లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.