1926

1926 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1923 1924 1925 - 1926 - 1927 1928 1929
దశాబ్దాలు: 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

జననాలు

Bal Thackeray at 70th Master Dinanath Mangeshkar Awards (1) (cropped)
బాల్ థాకరే
1984

1984 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1996

1996 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2012

2012 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2018

2018 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

అన్నవరపు రామస్వామి

పారుపల్లి రామకృష్ణయ్య శిష్యులలో బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు ప్రసిద్ధులు. అన్నవరపు రామస్వామి 1926, ఆగష్టు 7 న సోమవరప్పాడులో జన్మించారు. తండ్రి పెంటయ్య ప్రముఖ నాదస్వర విద్వాంసులు. అన్నయ్య అన్నవరపు గోపాలం మృదంగ విద్వాంసుడుగా చాలా కాలం ఆకాశవాణిలో కళాకారులుగా పనిచేసి పదవీ విరమణ చేసి మరణించారు.

ఐదు దశాబ్దాల కాలంలో రామస్వామి వాయులీన విద్వాంసులుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఆయన వయోలిన్ పై సహకరించని ప్రముఖ కళాకారులు లేరు. సహకార వాద్యంగానే గాక స్వతంత్రంగా కచేరీలు చేసి రసజ్ఞఉల మన్ననలు ఖండ ఖండాంతరాలలో పొందారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1948 నవంబరులో చేరారు. అప్పటి కింకా విజయవాడ కేంద్రం ప్రారంభం కాలేదు. N. S. రామచంద్రన్ గారు వీరిని, కృష్ణమాచార్యులను, దండమూడిని సెలక్టు చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. వీరు కళాకారులుగా 1986 వరకు పనిచేశారు. ఆయన యిప్పుడు ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ వాద్యకారుడు.

అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, శ్రీలంక, సింగపూరు, మలేషియా, బెహరిన్, దుబాయ్, మస్కట్ వంటి అనేక దేశాలలో పర్యటించి కచేరీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ ఫెలోగా ఎంపికయ్యారు. విజయవాడ, రాజమండ్రి, భీమవరాలలో కనకాభిషేకము, సువర్ణఘంటా కంకణం పొందారు. 1986 లో వీరి షష్టిపూర్తి మహోత్సవాలు వైభవంగా విజయవాడలో జరిపారు.

నాద సుధార్ణవ, వాయులీన కళాకౌముది, వాద్యరత్న, కళా సరస్వతి వంటి బిరుదులతో ఆంధ్రదేశం ఆయనను సత్కరించింది. గురుకుల పద్ధతిలో ఆయన వద్ద ఎందరో శిష్యులు విద్య నభ్యసించి ప్రసిద్ధులయ్యారు. గాత్రంలోను, వయొలిన్, వీణ, వేణువు, క్లారినెట్ వంటి కళలలో ఆయన వద్ద ఎందరో శిక్షణ పొందారు. అందులో ప్రపంచం సీతారాం ప్రముఖులు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఆంధ్ర విశ్వకళా పరిషత్ లేదా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University), భారతదేశంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది.

ఈ విశ్వవిద్యాలయం 1926లో ఏర్పడింది. మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పడింది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ యొక్క ఆదర్శ విశ్వవిద్యాలయము రూపులో తీర్చిదిద్దబడింది.

తర్వాత 1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము ఏర్పడింది. ఆతర్వాత, 1967లో గుంటూరు లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయముగా అవతరించింది. దీని పేరును ఆచార్య నాగార్జునుని పేరిట 2004 లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయము గా మార్చారు.

ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణము (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

విశ్వవిద్యాలయానికి విశాఖపట్టణం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల లోను, తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ లోను, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం లోను, విజయనగరం జిల్లాలో విజయనగరం లోను ఆ కేంద్రాలు ఉన్నాయి. కాని, 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయమును ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ఆ విధంగా, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. కాని అనుబంధ కళాశాలలకు సంబంధించి కొంత కుదించుకు పోయినా, విశ్వవిద్యాలయ ప్రాంగణములో దాని ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. నాక్ (NAAC) సంస్థ " ఎ " గ్రేడుతో అనుబంధం ఇవ్వడం దీనికి తార్కాణం.

ఎక్కిరాల కృష్ణమాచార్య

ఎక్కిరాల కృష్ణమాచార్య (ఆగష్టు 11, 1926 - మార్చి 17, 1984) ఆంధ్రప్రదేశ్కు చెందిన రచయిత. ఆయన శిష్యులు ఆయనను మాస్టర్ ఇ. కె. అని పిలుచుకుంటుంటారు.

జనవరి 14

జనవరి 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 14వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 351 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 352 రోజులు).

జి.వరలక్ష్మి

గరికపాటి వరలక్ష్మి (సెప్టెంబర్ 13, 1926 - నవంబర్ 26, 2006) అందరికీ జి.వరలక్ష్మిగా సుపరిచితురాలైన అలనాటి రంగస్థల, సినిమా నటి.

1940ల నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది.

జూన్ 25

జూన్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 176వ రోజు (లీపు సంవత్సరములో 177వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 189 రోజులు మిగిలినవి.

నవంబర్ 17

నవంబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 321వ రోజు (లీపు సంవత్సరములో 322వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 44 రోజులు మిగిలినవి.

నవంబర్ 25

నవంబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 329వ రోజు (లీపు సంవత్సరములో 330వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 36 రోజులు మిగిలినవి.

మహా శ్వేతాదేవి

మహా శ్వేతాదేవి (జనవరి 14, 1926 - జూలై 28, 2016) ( (బెంగాలీ: মহাশ্বেতা দেবী ) పశ్చిమ బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత మరియు సామాజిక కార్యకర్త.

ఆమె 1926లో ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకాలో జన్మించింది. ఆమె తండ్రి మనిష్ ఘటక్ కూడా కవి మరియు నవలా రచయిత. తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత మరియు సామాజిక కార్యకర్త.

మార్చి 11

మార్చి 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 70వ రోజు (లీపు సంవత్సరములో 71వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 295 రోజులు మిగిలినవి.

శ్రీకాకుళం

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.

శ్రీసాధన పత్రిక

రాయలసీమ ప్రాంతంలో రాజకీయ చైతన్యం కలిగించే ఆశయంతో శ్రీసాధన పత్రిక అనే రాజకీయ వారపత్రిక ప్రారంభించబడింది. ప్రతి శనివారం వెలువడే ఈ పత్రిక తొలి సంచిక 1926 ఆగస్టు 14వ తేదీ వెలువడింది. పప్పూరు రామాచార్యులు దీని వ్యవస్థాపకుడు. సంపాదకుడు.

సత్య సాయి బాబా

సంబంధిత పేరుగల మరికొన్ని వ్యాసాల కోసం అయోమయ నివృత్తి పేజీ సాయిబాబా చూడండి.

సత్య సాయి బాబా (నవంబరు 23, 1926 - ఏప్రిల్ 24, 2011) భారతీయ ఆధ్యాత్మిక గురువు.

సెప్టెంబర్ 13

సెప్టెంబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 256వ రోజు (లీపు సంవత్సరములో 257వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 109 రోజులు మిగిలినవి.

సెప్టెంబర్ 23

సెప్టెంబర్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 266వ రోజు (లీపు సంవత్సరములో 267వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 99 రోజులు మిగిలినవి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.