1923

1923 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1920 1921 1922 - 1923 - 1924 1925 1926
దశాబ్దాలు: 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

NTR
ఎన్.టి.రామారావు

మరణాలు

1986

1986 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2014

2014 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2016

2016 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

అక్కినేని నాగేశ్వరరావు

అక్కినేని నాగేశ్వరరావు (సెప్టెంబర్ 20, 1923 – జనవరి 22, 2014) ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత. వరి చేలలో నుండి, నాటకరంగం ద్వారా కళారంగం లోకి వచ్చిన వ్యక్తి. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. అతడు నాస్తికుడు.

ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూసాడు. ఆ తరువాత సినిమాలకు పరిచయం చేసాడు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీజీవితానికి తెరలేచింది. అప్పటినుండి రకరకాల తెలుగు, తమి‌ళ సినిమాలలో 75సంవత్సరాల పైగా నటించాడు. ఎన్. టి. ఆర్ తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు.మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినిరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు.

ఆంధ్రా బ్యాంకు

భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకును 1923, నవంబరు 20 న ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో స్థాపించాడు. 1980లో ఈ బ్యాంకు జాతీయం చేశారు. 1981లో క్రెడిట్ కార్డు లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ బ్యాంకు పరిచయం చేసింది. 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. 2007లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది. 2007 సెప్టెంబర్ నాటికి ఈ బ్యాంకు 1,289 (గ్రామీణ-396, Semi-urban-376, పట్టణ-338, మెట్రో-179) బ్రాంచీలతో 99 ఎక్స్‌టెన్షన్ శాఖలతో, 37 శాటిలైట్ ఆఫీసులతో, 505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉంది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 1.372 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఋణాలలోకనీసం 50 శాతానికి తగ్గకుండా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్నబ్యాంక్ ఇది. దేశంలో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఇది ప్రధానమైనది.

ఆగష్టు 23

ఆగష్టు 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 235వ రోజు (లీపు సంవత్సరములో 236వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 130 రోజులు మిగిలినవి.

ఉస్మానియా విశ్వవిద్యాలయము

ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములోని ప్రధాన విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసఫ్ జా VII చే 1917లో స్థాపించబడింది. దీని స్థాపనకు సంబంధించిన ఫర్మానాను 1917, ఏప్రిల్‌ 26న జారీ చేశారు.

ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం. హైదరాబాదులోని ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా భాషగా మారింది.

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (మే 18, 1877 - జూలై 12, 1923)తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు. తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు.

జిల్లెళ్ళమూడి అమ్మ

జిల్లెళ్ళమూడి "అమ్మ" (మార్చి 28, 1923 - జూలై 12, 1985) గా పేరొందిన వీరి అసలు పేరు అనసూయ.

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు

కాంతారావుగా ప్రసిద్ధి పొందిన తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (1923 నవంబర్ 16- 2009 మార్చి 22) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత.

దివాకర్ల వేంకటావధాని

దివాకర్ల వేంకటావధాని (జూన్ 23, 1923 - అక్టోబరు 21, 1986) పరిశోధకుడు, విమర్శకుడు.

ద్విపాత్రాభినయం

ఒక ప్రదర్శన (సినిమా లేదా నాటకము) లో ఒకే నటుడు లేదా నటి రెండు పాత్రలను ధరించడాన్ని ద్విపాత్రాభినయం అంటారు. ఇది దక్షిణభారత సినీ రంగంలో బాగా ప్రాచుర్యం పొందిన ప్రక్రియ.

బహుశా ఈ సంప్రదాయం నాటకాలు వేసే కాలంలో వేర్వేరు పాత్రలు పోషించడానికి సరిపడా ప్రతిభ గల నటులు లేనప్పుడు అవసరార్ధం ప్రారంభమై ఉండ వచ్చును. ఇంకా మన జానపద కళారీతులలో ఒకే కథకుడు లేదా పాటగాడు వేర్వేరు పాత్రల సంభాషణలను వేర్వేరు హావభావాలతో చెప్పడం కూడా సర్వ సామాన్యం.

నాటకాలలో ఈ ప్రక్రియ వాడినప్పుడు ఇద్దరు పాత్రధారులూ ఒకేసారి రంగం మీదకి వచ్చే అవకాశం లేదు. ఒక పాత్ర ముగిసిన తరువాత అదే నటుడు మరొక పాత్ర ధరించేవాడు.

సినిమాలలో ఈ ప్రక్రియ విశేష నైపుణ్యాన్ని సంతరిచుకొంది. ఎందుకంటే ఒకే ఫ్రేములో రెండు పాత్రలనూ చూపే అద్భుతాన్ని ఛాయాగ్రాహకులు సాధించారు గనుక. తెలుగు సినిమాలలో ఇది దర్శకులకూ, నటులకూ, ప్రత్యేకించి ఛాయాగ్రాహకులకూ ఒక సవాలు అయింది. కొన్ని చోట్ల హీరోయిజాన్ని సమతుల్యం చేయడానికీ, మరి కొన్నిచోట్ల కథలో అనుకోని మలుపులు తిప్పడానికీ, కొన్నిచోట్ల నాయకుని ప్రతిభను బహుముఖంగా ప్రదర్శించడానికీ ఈ ప్రక్రియ వాడ బడింది. కవలపిల్లల పాత్రలు ఈ అభినయానికి పట్టుగొమ్మలైనాయి. తెలుగు దర్శకులు ఈ ప్రక్రియతో ఎన్నో ప్రయోగాలు చేశారు.

భారతీయ సినిమాలలో తొలి ద్విపాత్రాభినయము 1923 లో విడుదలైన మూకీ చిత్రము, పత్నీ ప్రతాప్లో నటి, పేషన్స్ కూపర్ చేసినది.[1]

ద్విపాత్రాభినయాన్ని మరికాస్త విస్తరిస్తే మూడు, నాలుగు .. ఇలా ఎన్ని పాత్రలైనా ధరించవచ్చును. తమిళంలో శివాజీ గణేశన్ 9 పాత్రలు ఒకే సారి ధరించారు. తెలుగులో నందమూరి తారక రామారావు సినిమా దానవీరశూరకర్ణ ఈ విధమైన బహుపాత్రాభినయంలో ఒక మచ్చుతునక.

నందమూరి తారక రామారావు

తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.

నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు

నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు (జ.సెప్టెంబరు 15, 1923) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు మరియు రేడియో కళాకారులు.

నారదగిరి లక్ష్మణదాసు

నారదగిరి లక్ష్మణదాసు (సెప్టెంబరు 15, 1856 - ఆగష్టు 20, 1923) పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు వాగ్గేయకారుడు.

ఫిబ్రవరి 3

ఫిబ్రవరి 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 34వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 331 రోజులు (లీపు సంవత్సరములో 332 రోజులు) మిగిలినవి.

వీరమాచనేని మధుసూదనరావు

వి.మధుసుదనరావు లేదా వీరమాచనేని మధుసూదనరావు తెలుగు సినిమా దర్శకులు. ఇతడు కె.ఎస్.ప్రకాశరావు వద్ద చలనచిత్రీకరణ పాఠాలు నేర్చుకొని మొదటిసారిగా సతీ తులసి పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇతడు రాజధాని నగరంలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు. ఆయన తన 95వ ఏట, 2012 జనవరి 11న అనారోగ్యంతొ మరణించారు.

"విక్టరీ" నే యింటి పేరు చేసుకొన్న వి.మధుసూదన రావు గారు 1923 జులై 27 జన్మించి లో కృష్ణా జిల్లాలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. ఆ తరువాత మద్రాసు వెళ్లి ఐ.ప్రసాద్, తాతినేని ప్రకాశరావు వంటి వారి పరిచయంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1958 లో చదలవాడ కుతుంబరావు నిర్మించిన "సతీ తులసి" చిత్రం ద్వారా దర్శకుడయ్యారు. ఆ తరువాత వి.బి.రాజేంద్ర గారి "జగపతి" వారి "అన్నపూర్ణ" సినిమాకు దర్శకత్వం వహించగా అది 100 రోజులు ఆడి విజయవంతమయింది. 1962 లో సూపర్ స్టార్ కృష్ణని పరిచయం చేస్తూ "పదండి ముందుకు" తీశారు. తెలుగు పరిశ్రమకు మూల స్తంబాలైన ఎన్.టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లతో ఎన్నో విజయ వంతమైన చిత్రాలు తీశారు. శోభన్ బాబు, కృష్ణం రాజు, కృష్ణ వంటి రెండో తరం హీరోలతో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. ఒక దశలో జగపతి సంస్థకు మధుసూదనరావు గారే రెగ్యులర్ డైరక్టరు. నేటీ హీరోలు నాగార్జునని "విక్రం" ద్వారా, జగపతి బాబుని "సింహస్వప్నం" ద్వారా,రమేష్ బాబుని "సమ్రాట్" చిత్రం ద్వారా తెరకు పరిచయం చేశారు. అగ్ర శ్రేణి దర్శకులైన కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, పి.సి.రెడ్డి, గి.సి.శేఖర్,బోయిన సుబ్బారవు, వంశీ,శివ నాగేశ్వరరావు, మొకలైన వారు ఈయన దగ్గర శిష్యరికం చేసినవారే. మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చి మధు ఫిల్ం ఇనిస్టిట్యూట్ స్థాపించి ఎంతో మందిని నటులుగా తీర్చి దిద్దారు. 1964 లో తనతో పాటు ప్రజా నాట్య మండలిలో పనిచేసిన సరోజినిని ఆదర్శాలకు కట్టుబడి వివాహం చేసుకున్నారు. ఆమె తరువాత పూర్తిగా మహిళలతో సినిమా తీసి గిన్నిస్ రికార్డుకి ఎక్కారు. తెలుగు చలన చిత్ర సీమలో 50 సంవత్సరాలుగా కొనసాగుతూ నాలుగు భాషలలో కలిపి 71 చిత్రాలకు దర్శకత్వం వహించి "వీరమాచనేని"కి బదులు "విక్టరీ" నే ఇంటిపెరు చేసుకున్నారు.

సెప్టెంబర్ 15

సెప్టెంబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 258వ రోజు (లీపు సంవత్సరములో 259వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 107 రోజులు మిగిలినవి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.