1921

1921 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1918 1919 1920 - 1921 - 1922 1923 1924
దశాబ్దాలు: 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి 27: అదివరకే ఉన్న 3 బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంకు ఏర్పాటుచేయబడింది.

జననాలు

Pvnarshimarao
పి.వి.నరసింహారావు

మరణాలు

1992

1992 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1999

1999 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2001

2001 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2003

2003 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2004

గ్రెగేరియను క్యాలాండరు లేదా గ్రెగేరియను కాలనిర్ణయ పట్టిక (లేదా గ్రెగేరియను పంచాంగము)లో 2004అనునది గురువారంతో మొదలవు లీపు సంవత్సరం.

ఆత్రేయ

ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 7, 1921 - సెప్టెంబర్ 13, 1989) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి. అత్రేయకి ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయము

ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములోని ప్రధాన విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసఫ్ జా VII చే 1917లో స్థాపించబడింది. దీని స్థాపనకు సంబంధించిన ఫర్మానాను 1917, ఏప్రిల్‌ 26న జారీ చేశారు.

ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం. హైదరాబాదులోని ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా భాషగా మారింది.

ఎమ్మెస్ రామారావు

ఎమ్మెస్ రామారావు (మార్చి 7, 1921 - ఏప్రిల్ 20, 1992) పూర్తిపేరు మోపర్తి సీతారామారావు. ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించాడు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన రామయణ భాగం సుందరకాండము ఎమ్మెస్ రామారావు సుందరకాండ గా సుప్రసిద్ధం. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండూ ఈయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

టి.వి.రాజు

తోటకూర వెంకట రాజు (టి.వి.రాజు) (జ: 1921 - మ: ఫిబ్రవరి 20, 1973) తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. ఈయన అంజలీదేవి నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు.

తోటకూర వెంకటరాజు రాజమండ్రి తాలూకా రఘుదేవపురంలో జన్మించాడు. స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్న పేరుతో రంగస్థల నటునిగా మద్రాసులో స్థిరపడ్డాడు.

నటించిన సినిమాలు : పల్లెటూరి పిల్ల (1950)లో గూఢచారిగా, పిచ్చి పుల్లయ్య (1953)లో న్యాయమూర్తిగా, బంగారుపాప (1954)లో డాక్టర్‌గా, పాండురంగ మహాత్మ్యం (1957)లో ‘కృష్ణా ముకుందా మురారి’ అనే పాటలో భక్తునిగా కనిపిస్తారు.

ధూళిపాళ సీతారామశాస్త్రి

ధూళిపాళ సీతారామ శాస్త్రి (సెప్టెంబర్ 24, 1922 - ఏప్రిల్ 13, 2007) తెలుగు నాటక రంగంలో మరియు తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామ శాస్త్రి. ధూళిపాళ పేరుచెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది. ఆ పాత్రకు అంతవరకు సి.ఎస్‌.ఆర్‌, లింగమూర్తి వంటివారు న్యాయం చేయగా, ధూళిపాళ ప్రత్యేక తరహా వాచకం, హావభావాలతో వారి సరనస చేశారు.

నవంబర్ 11

నవంబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 315వ రోజు (లీపు సంవత్సరములో 316వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 50 రోజులు మిగిలినవి.

నాగభూషణం (నటుడు)

చక్రవర్తుల నాగభూషణం (ఏప్రిల్ 19, 1921 - మే 5, 1995) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమాలలో ప్రత్యేకంగా సాంఘిక చిత్రాలలో ప్రతినాయకులకు గుర్తింపు తెచ్చిన నటుల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన నటుడు. విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతను.

పాములపర్తి వెంకట నరసింహారావు

పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.

మల్లిక్ (గాయకుడు)

మల్లిక్ గా రేడియో శ్రోతలకు పరిచితులైన కందుల మల్లికార్జునరావు (1921-1996) ప్రముఖ లలిత సంగీత స్వరకర్త.

వీరు 1921లో మచిలీపట్నంలో జన్మించారు. మచిలీపట్నంలో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో లలిత సంగీత స్వరకర్తగా (కంపోజర్) చేరి ఆ తరువాత విజయవాడ కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు. లలిత సంగీత విభాగంలో సీనియర్ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సినీరంగంలో కొంతకాలం పనిచేసి కీర్తి గడించారు. వెంపటి చినసత్యంగారితో కలిసి నృత్య నాటికలకు సంగీతం సమకూర్చారు. జానపద, లలిత సంగీత బాణీలలో తనదైన ముద్రవేసి పాడేవారు. స్వరపరచేవారు. లలిత సంగీతం ఆడిషన్ బోర్డు మెంబరుగా ఆకాశవాణికి సలహా సంప్రదింపులు అందించారు. భక్తిరంజని కార్యక్రమాలకు వీరు కొత్త ఒరవడి పెట్టారు.

అదిగో అల్లదిగో హరివాసము, తందనాన భళా తందనాన అన్నమయ్య కీర్తనలు వీరు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు. రజనీకాంతరావు గారి పర్యవేక్షణలో మదరాసు కేంద్రంలో లలితసంగీత విభాగంలో పనిచేసి తర్వాత విజయవాడకు బదిలీ అయ్యారు.

డా.వెంపటి చిన సత్యంగారి బృందంలో ఎంతో కాలం గాత్రసహకారం అందించారు. ప్రముఖ నర్తకీమణులు రాజసులోచన,శోభానాయుడు,మంజుభార్గవి,చంద్రకళ, కొత్తపల్లి పద్మ, రత్నపాప మొదలగువారి నృత్యప్రదర్శనలకు గాత్రసహకారం అందించారు. శ్రీనివాస కల్యాణం, చండాలిక, శ్రీకృష్ణ పారిజాతం, మోహినీ భస్మాసుర, వాల్మీకి మొదలైన ఎన్నో నృత్య రూపకాలకు సంగీతం సమకూర్చారు.

మల్లిక్ బంగారుపాప, భాగ్యరేఖ, లవకుశ, వింధ్యరాణి, సంపూర్ణ రామాయణం, భక్త శబరి, జయభేరి, చరణదాసి చిత్రాలలొ పాడారు. తమిళ చలనచిత్రరంగంలో - నేపథ్యగాయకుడు మల్లిక్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రలేఖ అనే తమిళచిత్రానికి తొలిసారిగా నేపథ్యగానం చేశారు.

ఆయన మదరాసు, హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో 38 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి, 1981లో పదవీ విరమణ చేశారు.

1952 నుండి 1993 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించారు. ప్రతియేటా అన్నమాచార్య ఉత్సవాలలో పాల్గొన్నారు. - వెంకటేశ్వరునిపై అపార భక్తిప్రపత్తులు. అందుకేనేమో 1996 ఏప్రిల్ శనివారం 76వ ఏట విజయవాడలో ఆయన సునాయాస మరణం పొందారు.

మే 7

మే 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 127వ రోజు (లీపు సంవత్సరములో 128వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 238 రోజులు మిగిలినవి.

లావు బాలగంగాధరరావు

ఎల్‌బిజి గా ప్రసిద్ధి చెందిన లావు బాలగంగాధరరావు (ఆగస్టు 3, 1921 - మార్చి 28, 2003) భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. కమ్యూనిస్టు పార్టీ యొక్క అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగాను, పాలిట్‌బ్యూరో సభ్యునిగానూ, కేంద్రకమిటీ సభ్యునిగాను అనేక పర్యాయాలు పనిచేశాడు. ఈయన గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కాప్ర గ్రామంలో 1921, ఆగస్టు 3 న సుబ్రహ్మణ్యం, లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించాడు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహక ట్రస్టీగా పనిచేసిన బాలగంగాధరరావు, 2000 సంవత్సరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని గ్రంథాలన్నీ వరద నీటిలో మునిగిపోగా, హుటాహుటిన పునరుద్ధరణ మరియు పరిరక్షణా పనులకు, రెండు కోట్ల రూపాయలు ప్రోగు చేసి, రెండేళ్ళలోనే గ్రంథాలయాన్ని యాధాస్థితి తెచ్చేందుకు విశేష కృషి సలిపాడు.

శ్రీకాకుళం

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.

సత్యజిత్ రాయ్

సత్యజిత్ రాయ్ (మే 2 1921–ఏప్రిల్ 23 1992) భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. ఆతను ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించాడు. కలకత్తాలో ఒక ప్రముఖ బెంగాలీ కళాకారుల కుటుంబములో జన్మించిన సత్యజిత్ రాయ్ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ లోని విశ్వభారతి విద్యాలయము లోనూ చదివాడు. వ్యాపార కళాకారునిగా కెరీర్ ప్రారంబించిన రాయ్, లండన్ లో ఫ్రెంచి నిర్మాత జాన్ రెన్వాను కలిసాక, ఇటాలియన్ "నియోరియలిస్టు" సినిమా బైసికిల్ థీవ్స్ తరువాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు.

రాయ్ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే (కథాగమనము), కేస్టింగ్ (నట సారథ్యము), సంగీతము, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడము - వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. సినిమాలు తీయడమే కాక రాయ్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక "సందేశ్"ను చాలా ఏళ్ళు నిర్వహించాడు. అనేక అవార్డులు పుచ్చుకున్న రాయ్ 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నాడు.

1992లో, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఆస్కార్) సత్యజిత్ రాయ్కి అకాడమీ గౌరవ పురస్కారం (ఆస్కార్ అవార్డు) అందించారు. గౌరవ ఆస్కార్ పురస్కాన్ని అందుకున్న తొలి భారతీయునిగానూ, ఆపైన భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర రంగప్రముఖునిగానూ నిలిచారు. తాను మరణించేందుకు 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని స్వీకరించి, తన చలనచిత్ర జీవితంలో ఇది అత్యంత గొప్ప విజయంగా ప్రకటించారు..

సౌమనశ్య రామ్మోహనరావు

సౌమనశ్యమూర్తి రామ్మోహనరావు ఆకాశవాణి కళాకారుడు. ఆయన ఆకాశవాణి శ్రోతలకు పరిచితమైన కళాకారుడు మరియు దర్శకుడు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.