1919

1919 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1916 1917 1918 - 1919 - 1920 1921 1922
దశాబ్దాలు: 1890లు 1900లు - 1910లు - 1920లు 1930లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

Vikram Sarabhai
విక్రం సారాభాయ్

మరణాలు

1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1974

1974 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1985

1985 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1986

1986 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2006

2006 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

అమృతా ప్రీతం

అమృతా ప్రీతం వినండి (1919 ఆగస్టు 31 - 2005 అక్టోబరు 31) భారతదేశపు రచయిత్రి. ఆమె పంజాబీ, హిందీ భాషలలో రచనలు చేసింది. ఆమె పంజాబీ భాషలో మొట్టమొదటి కవయిత్రి, నవలా రచయిత్రి, వ్యాసకర్త. 20వ శతాబ్దంలో ప్రముఖ కవయిత్రిగా కొనియాడబడింది. ఆమె భారత-పాకిస్తాన్ సరిహద్దుకు రెండు వైపులనూ సమానంగా ప్రేమించిన వ్యక్తి. ఆరు దశాబ్దాల జీవితంలో ఆమె సుమారు 100 పుస్తకాలను రచించింది. వాటిలో కవిత్వం, కల్పనా కథలు, జీవిత చరిత్రలు, వ్యాసాలు, పంజాబీ జానపద పాటల సేకరణ, స్వీయ చరిత్ర ఉన్నాయి. అవి ఇతర భారతీయ భాషలు, విదేశీయ భాషలలోనికి అనువదించబడ్డాయి.ఆమె రాసిన పదునైన కవిత "ఆజ్ ఆఖాన్ వారిస్ షా ను" 18వ శతాబ్దానికి చెందిన కవి, వారిస్ షా స్మృతిగా రాసిన విషాద గీతం. ఇందులో ఆమె భారత్ విభజన సమయంలో జరిగిన ఊచకోతపై వేదనను వ్యక్తీకరించింది. ఒక నవలా రచయిత్రిగా ఆమె గుర్తింపబడిన నవల "పింజర్" (బోను) (1950). దీనిలో ఆమె తన చిరస్మరణీయ పాత్ర "ప్యూరో"ను సృష్టించింది. ఈ పాత్ర ద్వారా మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస, మానవత్వానికి నష్టం కలిగించిన అంశాలను గూర్చి సంగ్రహంగా తెలియజేసింది. ఈ నవల 2003 లో "పింజర్" చలన చిత్రంగా రూపొందించబడి పురస్కారాన్ని గెలుచుకుంది.పూర్వపు బ్రిటిష్ ఇండియా 1947 లో భారతదేశం , పాకిస్తాన్ అనే స్వతంత్ర దేశాలుగా విడిపోయినపుడు, ఆమె భారతదేశానికి వలస వచ్చింది. అయితే పాకిస్తాన్‌లో మోహన్ సింగ్, శివ్ కుమార్ బటాల్వి వంటి సమకాలీయులతో పోలిస్తే ఆమెకు ఉన్న ప్రజాదరణ ఆమె జీవితాంతమూ కొనసాగింది.

పంజాబీ సాహిత్యంలో మహిళా గళాన్ని వినిపించే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపబడింది. 1956లో ఆమె రాసిన "సనెహాడ్" (సందేశాలు) అనే గొప్ప కవితకు గాను సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. ఈ పురస్కారాన్ని పొందిన మొదటి స్త్రీగా గుర్తింపబడింది. తరువాత ఆమె 1982లో "కాగజ్ తె కాన్వాస్" రచనకు గాను భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారమైన భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందింది. 1969 లో పద్మశ్రీ పురస్కారాన్ని చివరకు 2004 లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకుంది. అదే సంవత్సరంఆమె భారత అత్యున్నత సాహితీ పురస్కారమైన సాహిత్య అకాడమీను అందుకున్నది. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ను "ఇమ్మోర్టల్స్ ఆఫ్ లిటరేచర్" రచనకు అందుకుంది.

ఆఫ్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ లేదా అఫ్ఘనిస్తాన్ (Afġānistān) దక్షిణ మధ్య ఆసియాలోని, సముద్రతీరం లేని దేశం. ఈ దేశం ఆధికారిక నామం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్.

భౌగోళికంగా ఈ దేశాన్ని వివిధ సందర్భాలలో మధ్య ఆసియా దేశంగాను, మధ్యప్రాచ్య దేశంగాను, లేదా దక్షిణ ఆసియా దేశంగాను వ్యవహరించడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు దాని సరిహద్దు దేశాలతో జాతి, భాషా, భౌగోళిక సంబంధాలున్నాయి. దక్షిణాన, తూర్పున పాకిస్తాన్, పశ్చిమంలో ఇరాన్, ఉత్తర దిశలో తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, సుదూర ఈశాన్యంలో కొద్దిభాగం చైనా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్లో మానవ నివాసం ప్రాచీన శిలా యుగం నాటి నుంచి ఉంది. దక్షిణ ఆసియా, మధ్య ఆసియా, నైరుతి ఆసియాలను కలిపే ఆఫ్ఘనిస్తాన్ చారిత్రకంగా సిల్క్ రోడ్డులో ఒక ముఖ్యమైన స్థానం. వివిధ సంస్కృతుల మేళనానికీ, జాతుల వలసకూ ముఖ్యమైన మజిలీగా ఉంది. పరిసర రాజ్యాల దండయాత్రలకు దేశం తరచు గురయ్యేది. అలెగ్జాండర్, మౌర్యులు, అరబ్బులు, మంగోలులు, బ్రిటీష్ వారు, అలాగే ఇక్కడి రాజులు కూడా పరాయి రాజ్యాలను ఆక్రమించి సామ్రాజ్యాలు స్థాపించారు. 18వ శతాబ్దం మధ్యకాలంలో కాందహార్ కేంద్రంగా అహమ్మద్ షా దుర్రానీ విశాలమైన రాజ్యాన్ని స్థాపించాడు. కాని 19వ శతాబ్దంలో ఇది బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమయింది. ఆగస్టు 19, 1919 న మళ్ళీ స్వతంత్ర దేశము అయింది.

1970 దశకంనుండి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన అంతర్యుద్ధాలతోనూ, తీవ్రవాద కార్యకలాపాలతోనూ, విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయింది. దేశప్రజలు దారుణమైన ఇబ్బందులకు గురయ్యారు. 2001 తరువాత నాటో జోక్యంతో జరిగిన యుద్ధం తరువాత ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం అమెరికా సహకారంతో నడుస్తున్నది. అంతర్జాతీయ సహకారంతో పెద్దపెట్టున పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.

ఏప్రిల్ 16

ఏప్రిల్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 106వ రోజు (లీపు సంవత్సరములో 107వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 259 రోజులు మిగిలినవి.

కందుకూరి వీరేశలింగం పంతులు

కందుకూరి వీరేశలింగం (1848 ఏప్రిల్ 16 - 1919 మే 27 ) గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. సాహితీ వ్యాసంగంలోను కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు.మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలెదురైన ఆచరణలో పెట్టాడు.వీరూ మంచి వారు

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు. ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.

కేశవపంతుల నరసింహశాస్త్రి

ఆకాశవాణిలో సంస్కృత పరిచయం కార్యక్రమం ద్వారా తమ గంభీర స్వరంతో ' అమరవాణి ' ని వినిపించి, కే. ఎన్. శాస్త్రిగా తెలుగువారికి సుపరిచితులైన వ్యక్తే కేశవపంతుల నరసింహశాస్త్రి.

ఖిలాఫత్ ఉద్యమం

ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) ముస్లింలు, దక్షిణ ఆసియాలో ఉస్మానియా సామ్రాజ్యము పై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దుర్నీతినుండి కాపాడడానికి లేవనెత్తిన ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమం.

ఖిలాఫత్ ఉద్యమం మతసంబంధమయినప్పటికీ భారతదేశంలోని ఉదార జనబాహుళ్యం ఈ ఉద్యమానికి చేయూతనిచ్చింది. భారతదేశంలో దీని ప్రభావం ఎంత వరకు ఉండినదంటే, భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగమైపోయింది.

గడియారం రామకృష్ణ శర్మ

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీవేత్తలలో గడియారం రామకృష్ణ శర్మ ప్రముఖుడు. ఆయన 1919, మార్చి 6న అనంతపురంలో జన్మించాడు. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో స్థిరపడి రచయితగా మంచి పేరు సంపాదించాడు. ఆలంపూర్‌కు సంబంధించిన చరిత్రను తెలిపే పలు పుస్తకాలు అతని చేతి నుంచి వెలువడినాయి. మాధవిద్యారణ్య అనే పుస్తకం ఆయన రచించిన పుస్తకాలన్నింటిలో ప్రామాణికమైనది. ఆయన 2006, జూలైలో మరణించారు. ఆయన సాహితీ సేవలకు గుర్తింపుగా 2007 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (తెలుగు భాషలో) మరణానంతరం ప్రకటించారు .

ఆయన సాహితీవేత్తగానే కాకుండా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడుగానూ సుప్రసిద్ధుడు. స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నాడు. రామకృష్ణ శర్మ సంఘ సంస్కరణ అభిలాషి మరియు రంగస్థల నటుడు కూడా.

టంగుటూరి అంజయ్య

టంగుటూరి అంజయ్య (ఆగష్టు 16, 1919 - అక్టోబరు 19, 1986), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. ఈయన 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

ఆంజయ్య 1919, ఆగష్టు 16 న హైదరాబాదు లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది మెదక్ జిల్లా, భానూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాదు లో స్థిరపడింది. ఆంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నాడు. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల కూలీగా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు. కాంగ్రెసు పార్టీ కి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుండి రాష్ట్ర శాసన సభ కు ఎన్నికైనాడు.

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

నంబూరి హనుమంతరావు

నంబూరి హనుమంతరావు ప్రాచీన భారతీయ వైద్య పరిశోధకులు.

నవంబర్ 27

నవంబర్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 331వ రోజు (లీపు సంవత్సరములో 332వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 34 రోజులు మిగిలినవి.

మర్రి చెన్నారెడ్డి

మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 - డిసెంబర్ 2, 1996) రెండు పర్యాయాలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు.

వేదాంతం రాఘవయ్య

వేదాంతం రాఘవయ్య (1919 – 1971) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.

సర్వోత్తమ గ్రంథాలయం

సర్వోత్తమ గ్రంథాలయం విజవాడలో కల ఒక పురాతన గ్రంథాలయం. సర్వోత్తమ భవన్ అనే దానిలో కల ఈ గ్రంథాలయం విజయవాడ పట్టణానికి తూర్పున మచిలీపట్టణం మార్గంలో ఈనాడు ఆఫీసు ఎదురుగా ఉంది.

విషయ సూచిక

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.