1917

1917 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1914 1915 1916 - 1917 - 1918 1919 1920
దశాబ్దాలు: 1890లు 1900లు - 1910లు - 1920లు 1930లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

తేదీలు తెలియనివి

జననాలు

Indira Gandhi in 1967
ఇందిరాగాంధీ

మరణాలు

2006

2006 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

అక్టోబర్ 19

అక్టోబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 292వ రోజు (లీపు సంవత్సరములో 293వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 73 రోజులు మిగిలినవి.

అసీమా ఛటర్జీ

అసీమా చటర్జీ (ఆంగ్లం : Asima Chatterjee; బెంగాళీ: অসীমা চট্টোপাধ্যায়) (సెప్టెంబరు 23, 1917 - నవంబరు 22, 2006) ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఈమె ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు ఫైటోమెడిసిన్ రంగాలలో అమూల్యమైన కృషిచేశారు. ఈమె నిర్వహించిన పరిశోధనలలో వింకా ఆల్కలాయిడ్లు మరియు మలేరియా మరియు ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి. ఈమె భారతదేశానికి చెందిన వైద్యసంబంధమైన మొక్కలు గురించి ఒక పుస్తకాన్ని రచించారు.

ఇందిరా గాంధీ

ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది..

మోతీలాల్ నెహ్రూ పేరుమోసిన న్యాయవాది. సంపదలకు నెలవైన ఆ ఇంటికి మోతీలాల్ ఇంగ్లీషు స్నేహితులు (బ్రిటిష్ వారు), స్వదేశీ స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. అతని కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ, కోడలు కమలా నెహ్రూ. కమలా నెహ్రూ సాంప్రదాయక కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం వల్ల అత్తవారింటికి అలవాటు పడటానికి మొదట్లో కొంచెం ఇబ్బంది పడింది. మోతీలాల్ కుటుంబంలోని వారు సవీన సాంప్రదాయానికి అలవాటు పడినవారు.

ఇందిరా ప్రియదర్శిని 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాదులోని ఆనంద్ భవన్ లో జన్మించింది. ఆమ మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు. మోతీలాల్‌కు మనుమరాలంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయన నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నాడు. అయినా తన వృత్తిని వదలలేదు. 1919లో పంజాబ్ లోని వైశాఖీ పండుగ జరుగుతున్న తరుణంలో బ్రిటిష్ వారు జలియన్ వాలా బాగ్‌లో జరిపిన మారణ కాండలో కొన్ని వేలమంది బలయ్యారు. ఈ సంఘటన మోతీలాల్ హృదయాన్ని కదిలించి వేసింది. వెంటనే తన వృత్తిని వదిలిపెట్టాడు. తన వద్ద ఉన్న ఖరీదైన విదేశీ వస్తులనన్నింటినీ తగులబెట్టాడు. ఖద్దరు దుస్తులను మాత్రమే ధరించడం మొదలు పెట్టాడు. తన కుమార్తెకు కాన్వెంట్ స్కూలు మానిపించాడు.

ఇలాంటి తరుణంలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ వారి ఇంటికి వచ్చాడు. నెహ్రూతో చాలా సేపు మాట్లాడాడు. ఇందిరకు వారు మాట్లాడుకున్నది ఏమిటో అర్థం కాకపోయినా ఇంటిలో జరిగే మార్పులకు ఒక చిన్ని ప్రేక్షకురాలిగా ఉంది. అది మొదలు వారి ఇల్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే వీరులకు తమ కార్యక్రమాలను రూపొందించుకునే కేంద్రంగా మారింది. ఆమె తల్లి, తండ్రి ఇద్దరూ స్వాంతంత్ర్యం కోసం కదనరంగంలోకి దూకారు.

చిన్నారి ఇందిర సైతం తన విదేశీ బొమ్మలను వదిలివేసింది. ఇప్పటి దాకా భోగ భాగ్యాలకు అలవాటు పడిన నెహ్రూలు కష్టాలను కోరి ఆహ్వానించినా ఆ కష్టాలను ధైర్యంగా ఎదురీది స్వాతంత్ర్య భారత చరిత్రలో వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. వారి వంశానికి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయము

ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములోని ప్రధాన విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసఫ్ జా VII చే 1917లో స్థాపించబడింది. దీని స్థాపనకు సంబంధించిన ఫర్మానాను 1917, ఏప్రిల్‌ 26న జారీ చేశారు.

ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం. హైదరాబాదులోని ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా భాషగా మారింది.

ఎం.జి.రామచంద్రన్

ఎంజీఆర్ లేదా పురచ్చి తలైవర్ (క్రాంతియుత నాయకుడు) గా ప్రసిద్ధి చెందిన మరుదూరు గోపాల రామచంద్రన్ (తమిళం: மருதூர் கோபால இராமச்சந்திரன்) (జనవరి 17, 1917 – డిసెంబర్ 24, 1987) తమిళ సినిమా రంగములో ప్రముఖ నటుడు మరియు 1977 నుండి ఆయన మరణించేంతవరకు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.

కమల్ రణదివె

కమల్ రణదివె (నవంబరు 11, 1917 - 2001) భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. ఈమె కాన్సర్ మరియు వైరస్ ల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసి ప్రసిద్ధి పొందారు. ఈమె భారత మహిళా శాస్త్రవేత్తల సంఘానికి స్థాపకురాలు. ఈమె 1982 లో పద్మభూషణ్ అవార్డును పొందారు. ఈ అవార్డు ఆమె లెప్రసీ రోగులపై చేసిన పరిశోధనకు గాను పొందింది. 1960 లో ఈమె భారత దేశంలో మొదటి టిష్యూ కాన్సర్ పరిశోధనా ప్రయోగశాలను బొంబాయిలో నెలకొల్పారు

కె.వి.మహదేవన్

1727 మార్చి 31 (1727-03-31)(వయసు 84)

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

చంపక్

చంపక్ (Champak) అనేది ఎనిమిది భారతీయ భాషలలో వెలువడుతున్న పిల్లల మాసపత్రిక. 'చంపక్' అంటే సుగంధపూరితమైన చంపకం లేదా సంపంగి పువ్వు. ఈ పత్రిక వ్యవస్థాపకులు విశ్వనాథ్ (1917-2002) . ఇది 1968 సంవత్సరం నుండి తెలుగు, ఇంగ్లీషు, గుజరాతీ, మరాఠీ, తమిళం, కన్నడం, మళయాళం మరియు హిందీ భాషలలో ఢిల్లీ నుండి ముద్రించబడుతున్నది (రిజిస్ట్రేషన్ నెం. RNI 32462) . ఈ పత్రికకు ఆన్ లైన్ ఎడిషన్ కూడా ఉన్నది కాబట్టి ఇంటర్నెట్లో చదువుకొనే వీలుంది. దీని ప్రస్తుత ఎడిటర్ మరియు పబ్లిషర్ పరేష్ నాథ్.ఈ పత్రికలో నీతిని బోధించే కథలతో బాటు తెనాలి రామకృష్ణ, పూలన్-గొయ్యి, చీకూ, ఐస్ క్రీమ్ మరియు నల్ల కోతి చిత్ర కథలు ప్రచురిస్తున్నారు. చంపక్ చేకర్స్, తేడా కనిపెట్టండి, ఏమిటో చెప్పండి?, అందమైన రంగులు నింపండి మొదలైన శీర్షికలు పిల్లల సృజనాత్మకతకు పదునుపెడతాయి.

జనవరి 12

జనవరి 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 12వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 353 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 354 రోజులు).

జనవరి 13

జనవరి 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 13వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 352 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 353 రోజులు).

జూన్ 27

జూన్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 178వ రోజు (లీపు సంవత్సరములో 179వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 187 రోజులు మిగిలినవి.

దుక్కిపాటి మధుసూదనరావు

దుక్కిపాటి మధుసూదనరావు (జూలై 17, 1917 - మార్చి 26, 2006) అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన ప్రముఖ తెలుగు నిర్మాత. దుక్కిపాటికి తెలుగు సినిమాతో 1940 నుంచే అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యుల్లో దుక్కిపాటి గారు ఒక్కరు. దుక్కిపాటి గారు 10-సెప్టెంబరు-1951 తేదీన అక్కినేని నాగేశ్వరరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.వి.ఎ.సూర్యారావు లతో కలసి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి, మొదటి ప్రయత్నంగా దొంగరాముడు సినిమాను తీశారు. తమ సంస్థ తీసే మొదటి సినిమాకు కె.వి.రెడ్డిగారే దర్శకత్వం వహించాలని ఉద్దేశించి రెండేళ్ళు కాచుకొని దొంగరాముడు సినిమా నిర్మించారు. 1937 సంవత్సరంలో సుశీలతో వివాహం అయ్యింది. వారికి నలుగురు ఆడపిల్లలు మరియు ఒక్క కుమారుడు కలిగారు.

దేవులపల్లి రామానుజరావు

దేవులపల్లి రామానుజరావు ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు. ఆంధ్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు. ఆయన తెలంగాణలో శోభ, గోల్కొండ పత్రికలకు సంపాదకుడిగా, సురవరం ప్రతాపరెడ్డి తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు. సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాదించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్, సిండికేట్ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, కేంద్ర సాహిత్య అకాడమీలలో మూడు దశాబ్ధాలకు పైగా ప్రగాడ అనుబంధాలేర్పరచుకుని తెనుగు భాషా, రచనల పరివ్యాప్తికి మిక్కిలి కృషి చేశారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు.ఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ భాషా ప్రవీణుడు, వక్త మరియు పరిశోధకుడు. తెలుగు సంస్కృతి మీద మెండుగా అభిమానం ఉన్నవాడు.

నవంబర్ 11

నవంబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 315వ రోజు (లీపు సంవత్సరములో 316వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 50 రోజులు మిగిలినవి.

నవంబర్ 22

నవంబర్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 326వ రోజు (లీపు సంవత్సరములో 327వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 39 రోజులు మిగిలినవి.

బూర్గుల రంగనాథరావు

కథా రచయితగా, కవిగా పేరుగాంచిన బూర్గుల రంగనాథరావు అక్టోబరు 12, 1917న జన్మించాడు. హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కుమారుడుడైన రంగనాథరావు బి.ఎ., ఎల్.ఎల్.బి. వరకు అభ్యసించారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం పొందారు. వీరు పలు గ్రంథాలు రచించడమే కాకుండా ఆకాశవాణి నుంచి వీరి చాలా కథలు, నాటికలు ప్రసారమయ్యాయి. సత్య సాయిబాబాపై రామకృష్ణారావు రచించిన శతకము "పుష్పాంజలి"లో పద్యాలు చేర్చి శతకం పూర్తిచేశారు. రంగనాథరావు 2007లో మరణించారు.

బైతుల్-ముఖద్దస్

బైతుల్-ముఖద్దస్, బైత్-అల్-ముఖద్దస్ (అరబ్బీ: مسجد قبة الصخرة, మస్జిద్ ఖుబ్బత్ అస్-సఖరా (టర్కీ : కుబ్బెతుస్-సహ్రా) ఇస్లాం లోని ఒక పుణ్యక్షేత్రం. ఇది జెరూసలేం లోని మస్జిద్ ల సమూహాలలో ముఖ్యమైన మస్జిద్. దీని నిర్మాణం 691 లో పూర్తయింది. ఇది ఇస్లాం లోని ప్రపంచంలోనే అత్యంత పురాతన కట్టడం.

మొదటి ప్రపంచ యుద్ధం

మొదటి ప్రపంచ యుద్ధం , గ్రేట్ వార్ , లేదా వార్ టు ఎండ్ ఆల్ వార్స్ గా పిలువబడే మొదటి ప్రపంచ యుద్ధం ( WWI లేదా WW1 ) ఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం 28 జూలై 1914 నుండి 11 నవంబరు 1918 వరకు కొనసాగింది. చరిత్రలో అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా 60 మిలియన్ల మంది యూరోపియన్లు సహా 70 మిలియన్ల మంది సైనిక సిబ్బంది పాల్గొన్నారు . తొమ్మిది మిల్లియన్మంది మనుషులు మరియు ఏడు మిలియన్ పౌరులు యుద్ధంలో (అనేక జాతుల యొక్క బాధితులతో సహా) మరణించారు , యుద్ధనౌకలు ' సాంకేతిక మరియు పారిశ్రామిక ఆడంబరంతీవ్రతరం చేశాయి, మరియు వ్యూహాత్మక ప్రతిష్టంభన కందక యుద్ధానికి దారితీసింది. ఇది చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఘర్షణలలో ఒకటి మరియు ప్రధాన రాజకీయ మార్పులకు దారితీసింది, ఇందులో అనేక దేశాలలో విప్లవాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత మాత్రమే వివాదాస్పద ప్రత్యర్థులు ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి.

ఈ యుద్ధం ప్రపంచంలోని ఆర్ధిక గొప్ప శక్తులలో , రెండు ప్రత్యర్థి కూటములలో సమావేశమయింది:మిత్రరాజ్యాలు ( రష్యా సామ్రాజ్యం యొక్క ట్రిపుల్ ఎంటెంట్ , ఫ్రెంచ్ థర్డ్ రిపబ్లిక్ మరియు గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ యొక్క యునైటెడ్ కింగ్డం ) జర్మనీ మరియు ఆస్ట్రియా-హంగరీ యొక్కసెంట్రల్ పవర్స్ . జర్మనీ మరియు ఆస్ట్రియా- హంగరీలతో పాటుగా ట్రిపుల్ అలయన్స్లో ఇటలీసభ్యుడు అయినప్పటికీ, సెంట్రల్ పవర్స్లో చేరలేదు, ఎందుకంటే ఆస్ట్రియా-హంగరీ సంధి యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా దాడి చేసింది. ఈ కూటములు పునఃవ్యవస్థీకరణ చేయబడ్డాయి మరియు విస్తరించబడ్డాయి, ఎందుకంటే ఎక్కువ దేశాలు యుద్ధంలోకి ప్రవేశించాయి: ఇటలీ, జపాన్మరియు యునైటెడ్ స్టేట్స్ మిత్రరాజ్యాలు చేరాయి, ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు బల్గేరియాసెంట్రల్ పవర్స్లో చేరాయి.

ఈ యుద్ధానికి ట్రిగ్గర్ ఆస్ట్రియాకు చెందిన ఆర్క్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్యగా ఉంది , ఆస్ట్రియా-హంగరీ సింహాసనంకు వారసుడు, 28 జూన్ 1914 న సారజేవోలో యుగోస్లావ్ జాతీయవాద గవ్రిలో ప్రిన్సిపట్ చేత. ఈ దౌత్యపరమైన సంక్షోభాన్ని ఆస్ట్రియా-హంగేరికి అంత్య సెర్బియా రాజ్యం , మరియు అంతకుముందు దశాబ్దాల్లో ఏర్పడిన అంతర్జాతీయ పొత్తులు కూడా ఉపయోగించబడ్డాయి.వారాలలోనే ప్రధాన శక్తులు యుద్ధంలో ఉన్నాయి మరియు ఈ సంఘర్షణ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.

జులై 24-25 జూలైలో రష్యా సైన్యం పాక్షిక సమీకరణకు ఆదేశించిన మొదటిది, మరియు జూలై 28 న ఆస్ట్రియా-హంగరీ సెర్బియాపై యుద్ధం ప్రకటించింది, జులై 30 న రష్యా సాధారణ సమీకరణను ప్రకటించింది. డిసెంబరు 1 న రష్యాపై యుద్ధం ప్రకటించాలని జర్మనీ నిరాకరించడానికి రష్యాకు ఒక అల్టిమేటం సమర్పించింది. తూర్పు ఫ్రంట్లో మించి ఉండటంతో, పశ్చిమాన రెండవ ద్వారం తెరవడానికి రష్యా తన ట్రిపుల్ ఎంటెంట్ మిత్రపక్షాన్ని కోరింది. నలభై సంవత్సరాల క్రితం 1870 లో,ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధం రెండవ ఫ్రెంచ్ సామ్రాజ్యం ముగిసింది మరియు ఫ్రాన్స్ అల్సిసే-లోరైన్ప్రావిన్సులను ఒక ఏకీకృత జర్మనీకి అప్పగించింది. ఆ ఓటమిపై తీవ్రత మరియు అల్సాస్-లారైన్ను తిరిగి పొందాలనే నిర్ణయం సులభమైన ఎంపిక కొరకు రష్యా యొక్క అభ్యర్ధనను ఆమోదించింది, కాబట్టి ఫ్రాన్స్ ఆగష్టు 1 న పూర్తిగా సమీకరణ ప్రారంభమైంది మరియు ఆగస్టు 3 న జర్మనీ ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించింది. ఫ్రాన్స్ మరియు జర్మనీ మధ్య సరిహద్దు భారీగా రెండు వైపులా బలపర్చబడింది, ష్లిఫ్ఫెన్ ప్లాన్ ప్రకారం, జర్మనీ తరువాత తటస్థమైన బెల్జియం మరియు లక్సెంబర్గ్లుఉత్తరం నుండి ఫ్రాన్స్ వైపు వెళ్లడానికి ముందు యునైటెడ్ కింగ్డమ్కు జర్మనీపై యుద్ధం ప్రకటించటానికి దారితీసింది. బెల్జియన్ తటస్థత ఉల్లంఘన. ప్యారిస్పై జర్మన్ మార్చ్ మార్న్ యుద్ధంలో నిలిపివేయబడిన తరువాత, 1917 వరకు తక్కువగా మార్చబడిన కందక రేఖతో , పశ్చిమయుద్ధతంత్రం ఘర్షణ పోరాటంలో స్థిరపడింది. తూర్పు ఫ్రంట్లో , రష్యన్ సైన్యం ఆస్ట్రో-హంగేరియన్లకు వ్యతిరేకంగా ఒక విజయవంతమైన ప్రచారం నిర్వహించింది, కానీ జర్మన్లు తనేన్బర్గ్ మరియు మస్యూరియన్ లేక్స్ యుద్ధాల్లో తూర్పు ప్రుస్సియా దండయాత్రను ఆపివేశారు. నవంబరు 1914 లో, ఒట్టోమన్ సామ్రాజ్యం సెంట్రల్ పవర్స్లో చేరింది, ఇది కాకసస్ , మెసొపొటేమియా మరియు సీనాయిల్లోప్రారంభ సరిహద్దులను ప్రారంభించింది. 1915 లో, ఇటలీ మిత్రరాజ్యాలు చేరింది మరియు బల్గేరియా సెంట్రల్ పవర్స్లో చేరింది; రోమేనియా 1916 లో మిత్రరాజ్యాలు చేరింది, అలాగే 1917 లో యునైటెడ్ స్టేట్స్ చేసింది.

మార్చ్ 1917 లో రష్యన్ ప్రభుత్వం కూలిపోయింది మరియు నవంబరులో ఒక విప్లవం తరువాత మరింత సైనిక ఓటమి కారణంగా రష్యన్లు బ్రెట్స్ట్-లిటోవ్స్క్ ఒప్పందం ద్వారా సెంట్రల్ పవర్స్తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు , దీనికి జర్మన్లు ​​గణనీయమైన విజయాన్ని అందించారు. 1918 వసంతకాలంలో పశ్చిమ ఫ్రంట్ వెంట ఒక అద్భుతమైన జర్మన్ దాడి తర్వాత, మిత్రరాజ్యాలు విజయవంతంగా పోరాడుతూ , జర్మనీలను విజయవంతమైన దాడుల వరుసలో నడిపించాయి.నవంబరు 4, 1918 న, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం యుద్ధ విరమణకు అంగీకరించింది, మరియు జర్మనీ, విప్లవకారులతో తన సొంత ఇబ్బందులను ఎదుర్కొంది , నవంబరు 11, 1918 న యుద్ధనౌకకు మిత్రరాజ్యాల విజయానికి ముగింపును అంగీకరించింది.

యుద్ధం ముగిసిన వెంటనే లేదా జర్మనీ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం మరియు ఒట్టోమన్ సామ్రాజ్యం ఉనికిలో లేనంత వరకు నిలిచిపోయాయి. జాతీయ సరిహద్దులు పునర్నిర్వహించబడ్డాయి, 9 స్వతంత్ర దేశాలు పునరుద్ధరించబడ్డాయి లేదా సృష్టించబడ్డాయి మరియు జర్మనీ యొక్క కాలనీలు విజయం సాధించినవారిలో పాల్గొన్నారు.1919 పారిస్ పీస్ కాన్ఫరెన్స్ సమయంలో, బిగ్ ఫోర్ (బ్రిటన్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇటలీ) ఒప్పందాల వరుసలో తమ నిబంధనలను విధించాయి. అటువంటి వివాదం యొక్క పునరావృతాన్ని నివారించే లక్ష్యంతో లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. ఈ ప్రయత్నం విఫలమైంది, ఆర్థిక మాంద్యం, పునరుద్ధరించబడిన జాతీయత, బలహీనపడిన వారసత్వ రాష్ట్రాలు, మరియు అవమానకరమైన భావాలు (ముఖ్యంగా జర్మనీలో) చివరకు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో దోహదపడింది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.