1915

1915 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1912 1913 1914 - 1915 - 1916 1917 1918
దశాబ్దాలు: 1890లు 1900లు - 1910లు - 1920లు - 1930లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

పాలగుమ్మి పద్మరాజు
పాలగుమ్మి పద్మరాజు

మరణాలు

1994

1994 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2011

2011 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2014

2014 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

అక్టోబర్ 21

అక్టోబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 294వ రోజు (లీపు సంవత్సరములో 295వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 71 రోజులు మిగిలినవి.

కొండా లక్ష్మణ్ బాపూజీ

నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ అదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969 మరియు 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు. సెప్టెంబర్ 21, 2012 నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించాడు.

గురజాడ అప్పారావు

గురజాడ అప్పారావు (1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. గానూ భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. ఆయనకు కవి శేఖర అనే బిరుదు కూడా ఉంది.

గోపాలకృష్ణ గోఖలే

గోపాలక్రిష్ణ గోఖలే (ఆంగ్లం : Gopal Krishna Gokhale), (హిందీ : गोपाल कृष्ण गोखले ) (మే 9, 1866 - ఫిబ్రవరి 19, 1915) భారత స్వాతంత్ర్య సమర యోధుడు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రముఖపాత్ర వహించాడు. గొప్ప సామాజిక సేవకుడు. 1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటిని ఏర్పాటుచేశాడు. బ్రిటీష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకున్ననూ భారతీయులలో జాతీయతాభావాన్ని పెంపొందించడానికి కృషిచేశాడు.

చండ్ర రాజేశ్వరరావు

చండ్ర రాజేశ్వరరావు (జూన్ 6, 1915 - ఏప్రిల్ 9, 1994) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. రాజేశ్వరరావు తీరాంధ్ర ప్రాంతపు సంపన్న కమ్మ రైతు కుటుంబంలో జన్మించాడు. 28 సంవత్సరాలకు పైగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి 1992లో ఆనారోగ్యకారణాల వల్ల విరమించుకున్నాడు. అంతర్జాతీయ కమ్యూనిస్టు దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను, శాంతి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళినందుకు రాజేశ్వరరావును `ఆర్డర్‌ ఆఫ్‌ లెనిన్‌' అవార్డు తో సోవియట్‌ యూనియన్‌, `ఆర్డర్‌ ఆఫ్‌ డెమిట్రోవ్‌' అవార్డుతో బల్గేరియా, అలాగే చెకోస్లోవేకియా, మంగోలియా దేశాలు అవార్డులతో సత్కరించాయి. దేశ సమైక్యతను కాపాడడం కోసం బాబ్రీ మసీదు ను మ్యూజియంగా కాపాడాలని, రాజీ ఫార్ములా ప్రతిపాదించాడు

మానవతా వాది అయిన రాజేశ్వరరావు పార్టీ కార్యాలయాలలో పనిచేసే చిన్న కార్యకర్తలను సైతం ఆప్యాయంగా పలకరించేవాడు. కారుగానీ, కార్యదర్శిగాని లేకుండానే పని నిర్వహించారు ఢిల్లీ లో వేసవిలో ఉష్ణోగ్రత భరించరానంత ఉన్నప్పటికీ కూలర్‌ కాని, ఎముకలు కొరికే చలి ఉన్నా హీటర్‌ కానీ వాడలేదు. పార్టీ క్యాంటీన్‌లో వాలంటీర్లతో కలిసే భోజనం చేసేవాడు. "నాకు ఆస్తిపాస్తులు లేవు. నేను ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరి నుంచీ ఏమీ తీసుకోలేదు" అనేవాడు. పంచె కాలిపైకి కట్టి, నెత్తికి తలగుడ్డ చుట్టి గ్రామీణ ప్రజలతో కలిసిపోవడం ఆయన నైజం. గ్రాంథిక భాష వాడడు. ఎదుటివారు తన వైఖరిని, విధానాలను విమర్శించినా చాలా ఓపికతో వినేవాడు. మహిళలు సభలకు హాజరయ్యేందుకు వీలుగా రాత్రి వేళల్లో సమావేశాలు పెట్టవద్దని సూచించేవాడు. హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగితే వెంటనే స్పందించి స్వయంగా వెళ్ళేవాడు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఐక్య కార్యాచరణ ముందుకు సాగాలని కోరుకునేవాడు. రాజేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ 1994 ఏప్రిల్ 9న మరణించాడు. ఆయన స్మారకార్ధం హైదరాబాదు శివార్లలోని కొండాపూర్‌లో ఉన్న చండ్ర రాజేశ్వరరావు‌ ఫౌండేషన్‌లో కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీశ్రీ 1947లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న చండ్రరాజేశ్వరరావును అనుసరించి ఎన్నికల సభల్లో పాల్గొనేవారు. ఈ సమయంలో చండ్ర రాజేశ్వరరావు నంద్యాల రాజకీయ సభలో శ్రీశ్రీని మొట్టమొదటి సారి మహాకవి అన్నారు, ఆ తర్వాత సాహిత్యలోకంలోనూ, సాధారణ ప్రజల్లోనూ కూడా శ్రీశ్రీకి మహాకవి అన్న బిరుదు స్థిరపడిపోయింది.1969-73లలో జరిగిన వేర్పాటువాద ఉద్యమాల గురించి ఆయన రాసిన వ్యాసలను చండ్ర రాజేశ్వరరావు వ్యాసావళి-1969-73 వేర్పాటువాద ఉద్యమాలు పుస్తకం రూపంలో తెచ్చారు.

చిర్రావూరి లక్ష్మీనరసయ్య

చిర్రావూరి లక్ష్మీనరసయ్య తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, ఖమ్మం పట్టణానికి పర్యాయపదమైన పాలనాదక్షుడు..

జనవరి 23

జనవరి 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 23వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 342 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 343 రోజులు).

జూన్ 6

జూన్ 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 157వ రోజు (లీపు సంవత్సరములో 158వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 208 రోజులు మిగిలినవి.

పాకాల తిరుమల్ రెడ్డి

పాకాల తిరుమల్ రెడ్డి (జనవరి 4, 1915 - అక్టోబర్ 21, 1996) చిత్రకళారంగంలో పి.టి.రెడ్డి గా చిరపరిచితుడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో పి.టి.రెడ్డి ముఖ్యుడు. ఆరు దశాబ్దాలుగా చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన తెలంగాణ చిత్రకారుడాయన.

పాలగుమ్మి పద్మరాజు

పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత, (జూన్ 24, 1915 - ఫిబ్రవరి 17, 1983) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి పొందిన గాలివాన కథా రచయిత.హేతువాది .ఎం.ఎన్.రాయ్ భావాల ప్రచారకుడు.

ఫిబ్రవరి 5

ఫిబ్రవరి 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 36వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 329 రోజులు (లీపు సంవత్సరములో 330 రోజులు) మిగిలినవి.

వట్టికోట ఆళ్వారుస్వామి

వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు. ఆయన రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, కమ్యూనిస్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, మరియు ప్రచారకుడు. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడు. తెలుగులో రాజకీయ నవలలకు ఆద్యుడు.

వడ్డాది సౌభాగ్య గౌరి

వడ్డాది సౌభాగ్య గౌరి మహిళా సమాజ సేవకురాలు. విజయవాడలో నాస్తిక కేంద్ర వ్యవస్థాపకులు గోరా గారి సోదరి.

విద్వాన్ విశ్వం

విద్వాన్ విశ్వం (అక్టోబర్ 21, 1915 - అక్టోబర్ 19, 1987) గా చిరపరచితుడైన మీసరగండ విశ్వరూపాచారి విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందినవాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం .

శ్రీకాకుళం

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.

సెప్టెంబర్ 21

సెప్టెంబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 264వ రోజు (లీపు సంవత్సరములో 265వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 101 రోజులు మిగిలినవి.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.