1912

1912 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1909 1910 1911 - 1912 - 1913 1914 1915
దశాబ్దాలు: 1890లు 1900లు 1910లు 1920లు 1930లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

Papayya sastry(karunasri)
జంధ్యాల పాపయ్యశాస్త్రి

మరణాలు

నిర్మాణాలు

థామస్‌ అండ్రూస్‌ అనే వ్యక్తి టైటానిక్‌ పేరుతో సకల సౌకర్యాలు ఉన్న ఒక అద్భుతమైన నౌకను నిర్మించాడు.

1984

1984 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1994

1994 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2004

గ్రెగేరియను క్యాలాండరు లేదా గ్రెగేరియను కాలనిర్ణయ పట్టిక (లేదా గ్రెగేరియను పంచాంగము)లో 2004అనునది గురువారంతో మొదలవు లీపు సంవత్సరం.

2006

2006 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2007

2007 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ఆదుర్తి సుబ్బారావు

ఆదుర్తి సుబ్బారావు (డిసెంబరు 16, 1912 - అక్టోబరు 1, 1975) ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత మరియు నిర్మాత.

కమలా సొహోనీ

కమలా సొహోనీ (1912–1998) భారత దేశానికి చెందిన జీవరసాయన శాస్త్రవేత్త. ఈమె భారతదేశంలో శాస్త్రీయరంగాలలో పి.హెచ్.డి పొందిన మొట్టమొదటి మహిళ.

గోపరాజు సరస్వతి

సరస్వతి గోరా (1912–2006) భారతీయ సామాజిక ఉద్యమకారిణి. ఆమె సంఘసేవిక, మతాతీత మానవతావాది. ఆమె నాస్తిక కేంద్రానికి అనేక సంవత్సరాలపాటు ప్రసిద్ధ నాయకురాలిగా యున్నారు.ఆమె అస్పృస్యత మరియు కుల వ్యవస్థ పై అనెక కార్యక్రమాలను, ఉద్యమాలను చేసారు.

గోరా

గోరా గా ప్రసిద్ధి చెందిన గోపరాజు రామచంద్రరావు (నవంబరు 15, 1902 - జూలై 26, 1975) సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. గోరా నవంబరు 15, 1902 న ఒడిషా లోని ఛత్రపురంలో పుట్టారు. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబ నియంత్రణ, వీటితో పాటు అప్పటి తెలుగు సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే.

జంధ్యాల పాపయ్య శాస్త్రి

జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగస్టు 4, 1912 - జూన్ 21, 1992) 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు.

కరుణశ్రీ గారి అత్యంత ప్రముఖ కావ్యాలు "పుష్పవిలాపము" మరియు "కుంతి కుమారి" అని అనవచ్చును. ఈయన కవితాత్రయము అయిన 'ఉదయశ్రీ', 'విజయశ్రీ', మరియు 'కరుణశ్రీ' అత్యధిక ముద్రణలు కలిగి, ఎనలేని ఖ్యాతి గాంచినవి. పై మూడింటిని తన సున్నిత హృదయము, తర్కమునకుప్రతీక అయిన తన మెదడు, మరియు తన విలువైన జీవితమని అభివర్ణిస్తారు. ఈ మూడు రచనలు, కరుణశ్రీ గారి ప్రకారము సత్యం, శివం, మరియు సుందరం యొక్క రూపాంతరాలుగా పరిగణిస్తారు.

ఈయన కవిత్వము పాఠకులని ఆత్మజ్ఞాన శిఖరాంచులనే కాక సమాజాంతరళాలలోని దుఃఖాన్ని, వాటికి కారణాలని, పరిష్కార మార్గాలని కూడా చూపుతాయి. మనుషులలో ఉత్తమ మార్పుకై, సమాజములో శాంతికై, నైతిక విలువ అను సంపద్వృద్ధికై తన కవిత్వాన్ని వినియోగించారు. ఆందునే ఈనాటికి వారి పద్యాలు జనుల నోటిలో నానుతూనే ఉన్నాయి.

తకళి శివశంకర పిళ్ళై

తకళి శివశంకర పిళ్ళై(మలయాళం:തകഴി ശിവശങ്കര പിള്ള)(17 ఏప్రిల్ 1912 - 10 ఏప్రిల్ 1999) ప్రముఖ మలయాళ నవలా రచయిత మరియు కథా రచయిత. ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన శివశంకర పిళ్ళై భారతీయ సాహిత్య రంగంలో ప్రసిద్ధి పొందారు. ఆయన సుమారు 600 లఘు కథలు మరియు నవలలు వ్రాసారు. ఆయన ప్రముఖ రచనలలో "కాయర్" మరియు "చెమ్మీన్(నవల) ప్రసిద్ధమైనవి.

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

పన్నాలాల్ పటేల్

పన్నాలాల్ పటేల్ (ఆంగ్లం: Pannalal Patel; గుజరాతీ: પન્નાલાલ પટેલ) (1912 మే 7 - 1989 ఏప్రిల్ 6) ప్రముఖ గుజరాతీ భాషా రచయిత. ఆయన సాహిత్యకృషికి గాను ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందారు.

పసుపులేటి కన్నాంబ

కన్నాంబ ప్రసిద్ధ రంగస్థల నటి, గాయని. చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ.

బి.నాగిరెడ్డి

బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (డిసెంబర్ 2, 1912 - ఫిబ్రవరి 25, 2004) తెలుగు సినీనిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

బీహార్

బీహార్ (बिहार) భారతదేశపు తూర్పుభాగాన ఉన్న ఒక రాష్ట్రము. రాజధాని పాట్నా.

బీహార్‌కు ఉత్తరాన నేపాల్ దేశము సరిహద్దున్నది. పశ్చిమాన ఉత్తర ప్రదేశ్, దక్షిణాన ఝార్ఖండ్, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి. బీహార్ రాష్ట్రం హిందీ మాట్లాడే ప్రాంతపు మధ్యనుంది. సారవంతమైన గంగానదీ మైదానం బీహార్‌లో విస్తరించి ఉంది.

వానమామలై వరదాచార్యులు

వానమామలై వరదాచార్యులు (ఆగష్టు 16, 1912 - అక్టోబరు 31, 1984) , తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముఖ పండితుడు, రచయిత.

వెల్దుర్తి మాణిక్యరావు

వెల్దుర్తి మాణిక్యరావు ( 1912 - సెప్టెంబరు 28, 1994) నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు.

హెచ్.సి.హెడా

హరీష్ చంద్ర హెడా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, హైదరాబాదు రాజ్యంలోని మారాఠీ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు, భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు మరియు మూడు పర్యాయాలు నిజామాబాదు నియోజకవర్గం నుండి లోక్‍సభకు ఎన్నికై 1952 నుండి 1967 వరకు లోక్‍సభలో నిజామాబాదుకు ప్రాతినిధ్యం వహించాడు.

హరీష్ చంద్ర 1912, అక్టోబరు 14న అప్పటి హైదరాబాదు రాజ్యంలోని ఉస్మానాబాదు జిల్లాలోని శిరాఢోన్ గ్రామంలో ఒక మార్వాడీ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి బాల్ ముకుంద్ హెడా. ఈయన విద్యాభ్యాసం ఉస్మానాబాద్, గుల్బర్గా, హైదరాబాదులలో సాగింది. 1936లో స్వాతంత్ర్య సమరయోధురాలు గ్యాన్ కుమారీ హెడాను వివాహమాడాడు. న్యాయవాద పట్టా పొంది 1939 నుండి 1942 వరకు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడు.

1930లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తత్త్వశాస్త్రం, న్యాయశాస్త్రాలలో పట్టభద్రుడైన హెడా 1938లో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రేసు మరియు ఆర్య సమాజం ఏర్పాటు చేసిన సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. క్విట్ ఇండియా ఉద్యమకాలంలోనూ హైదరాబాదు విమోచనోద్యమంలోనూ పాల్గొని జైలుకెళ్ళాడు. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్ల సన్నిహిత సహచరుడైన హెడా, 1949లో ప్రొవిన్షియల్ పార్లమెంటుకు, ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చెయ్యడానికి ఏర్పడిన రాజ్యాంగసభకు ఎన్నికయ్యాడు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో నిజామాబాదు లోక్‍సభ నియోజకవర్గం నుండి సోషలిస్టు అభ్యర్థి అయిన కాశీనాథరావు ముకాల్పర్ను ఓడించి పార్లమెంటు సభ్యుడయ్యాడు. ఆ తరువాత 1957లోనూ, 1962లోనూ స్థానిక అభ్యుర్ధులైన జి.రాజారాం మరియు ఎం.నారాయణ రెడ్డిలను ఓడించి తిరిగి లోక్‍సభకు ఎన్నికయ్యాడు. అయితే 1967 ఎన్నికలలో ఎం.నారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.హెడా మార్క్సిజం, గాంధేయవాదంపై అనేక వ్యాసాలు వ్రాశాడు. గాంధీజీస్ నౌఖాలీ పద్ యాత్ర (1946), ఆన్ ద హైసీస్ (1958) మరియు ఎన్నికలు ఇన్ బ్రిటన్ (1960) అనే మూడు పుస్తకాలను ప్రచురించాడు.ఈయన 2002, ఆగస్టు 28న తొంభై ఏళ్ల వయసులో హైదరాబాదులో అస్వస్థతతో మరణించాడు. ఈయన సతీమణి గ్యాన్ కుమారీ హెడా కూడా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సర్వోదయ ఉద్యమ నాయకురాలు, గాంధీ స్మృతి అధ్యక్షురాలు. వీరి ఏకైక సంతానమైన కుమారుడు శరద్ హెడా న్యూజెర్సీలో స్థిరపడ్డాడు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.