1911

1911 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1908 1909 1910 1911 1912 1913 1914
దశాబ్దాలు: 1890లు 1900లు 1910లు 1920లు 1930లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

Lala Amarnath at Lord's 1936
లాలా అమర్‌నాథ్

మరణాలు

కడప

కడప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక నగరం. వైఎస్ఆర్ కడప జిల్లాకు ముఖ్య పట్టణం.కడప మండలానికి ప్రధాన కేంధ్రం.

ఇది పెన్నా నదికి 8 కి.మీ (5 మైళ్ళ) దూరంలో ఉంది. నగరానికి రెండు వైపులా నల్లమల అడవులు ఉండగా, ఒక వైపు పాలకొండలు గలవు. తిరుమల వెంకటేశ్వర స్వామికి గడప కావటంతో దీనికి ఆ పేరు వచ్చింది.

రామాయణం లోని నాల్గవ భాగమైన కిష్కింధకాండం ఇక్కడికి 20 కి.మీ (12 మైళ్ళు) గల ఒంటిమిట్టలో జరిగిందని నమ్మకం. గుడిలోకల ఆంజనేయ స్వామి గుడి కూడా రామాయణం లోని భాగమే అని నానుడి. రాముడు సీతని కనిపెట్టటంలో ఆంజనేయ స్వామి సహాయాన్ని అంగీకరిస్తూ, తన బాణం యొక్క మొనతో ఈ గుడిని కట్టినట్లు ప్రతీతి.

ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़) (Chhattisgarh), మధ్య భారత దేశములోని ఒక రాష్ట్రము. ఈ రాష్ట్రము 2000 నవంబర్ 1న మధ్య ప్రదేశ్లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. రాయ్‌పుర్ రాష్ట్రానికి రాజధాని.

ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒడిషా, ఈశాన్యాన జార్ఖండ్ మరియు ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

రాష్ట్రము యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానము అంచులలో ఉంది. గంగా నది యొక్క ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుతున్నది. సాత్పూరా శ్రేణులు యొక్క తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి యొక్క పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది మరియు దాని ఉపనదుల యొక్క మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము దక్కన్ పీఠభూమిలో గోదావరి మరియు దాని ఉపనది ఇంద్రావతి యొక్క పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.

ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాషలు మాట్లాడే గోండులకు ఆలవాలము.

దీనికి ఉత్తరాన మరియు దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రంలో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రంకు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దక్షిణాన, తూర్పున ఒడిషా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ మరియు ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.

ఛత్తీస్ గడ్ ముఖ్య భాష ఛత్తీస్ గడీ. ఇంతేకాకుండా హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు మరియు ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.

ఛత్తీస్ గడ్ లో 18 జిల్లాలు (డిస్ట్రిక్ట్స్) ఉన్నాయి. అవి బస్తర్, బిలాస్ పూర్, బీజాపూర్, దన్తెవాడ (దక్షిణ బస్తర్), దమ్తరి, దుర్గ్, జంజ్గీర్-చంప, జష్పూర్, కాంకేర్ (ఉత్తర బస్తర్), కవర్ద, కోర్బా, కొరియ, మహాసముంద్, నారాయణ్ పూర్, రాయ్ గడ్, రాయ్ పూర్, రాజ్ నంద్ గాంవ్ మరియు సర్గుజ.

వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సోలభ్యానికై విభజించబడ్డాయి.

జూన్ 3

జూన్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 154వ రోజు (లీపు సంవత్సరములో 155వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 211 రోజులు మిగిలినవి.

దక్కన్ పీఠభూమి

దక్కన్ పీఠభూమి (ఆంగ్లం : Deccan Plateau), ఇంకనూ ద్వీపకల్ప పీఠభూమి, మహాద్వీపకల్ప పీఠభూమి అనీ అంటారు. భారత్ లోని పెద్ద పీఠభూమి. ఈ పీఠభూమి దక్షిణభారతాన్నంతటినీ ఆక్రమించింది. దీని ఎలివేషన్ ఉత్తరభాగాన 100 మీటర్లు, దక్షిణాన 1000 మీటర్లు గలదు. ఇది పర్వత శ్రేణుల్లో ప్రారంభమై, ఎనిమిది రాష్ట్రాలలో వ్యాపించియున్నది. భారత ఉపఖండంలోని అంతర్భాగంలో త్రికోణాకృతిలో సముద్రతీరం వరకూ వ్యాపించియున్నది. ఈ పీఠభూమి మధ్యభారతంలోనూ మరియు దక్షిణ భారతంలోనూ వ్యాపించియున్నది. దీని పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు సరిహద్దులు కల్గివున్నది. ఈ కనుమల మధ్య ఎత్తుగా ఏర్పడిన భూభాగం ఈ పీఠభూమి. ఈశాన్యాన వింధ్య పర్వతాలు సత్పురా పర్వతాలు ఉన్నాయి. ఉత్తర పర్వత శ్రేణులు, ఉత్తరానగల నదీమైదానప్రాంతాలనుండి ఈ పీఠభూమికీ వేరు చేస్తున్నాయి. ఈ పీఠభూమి విశాలంగా వ్యాపించియున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర మరియు కర్నాటక, మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాకు చెందిన భాగాలు. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రపంచంలోనే నిలకడ కలిగి, అధిక ద్రవ్యరాశి గలది. అనేక పెద్ద నదులను కలిగివున్న ప్రాంతం.దక్కన్ అనే పేరు ప్రాకృత పదమైన దక్ఖిన్, సంస్కృతపదమైన दक्षिण దక్షిణ నుండి ఆవిర్భవించింది.

నవంబర్ 10

నవంబర్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 314వ రోజు (లీపు సంవత్సరములో 315వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 51 రోజులు మిగిలినవి.

నాశిక్ జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 37 జిల్లాలలో నాసిక్ జిల్లా (హిందీ:) ఒకటి. నాసిక్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 15,530 చ.కి.మీ.

నిజాం

హైదరాబాదు రాజ్యము యొక్క పాలకుల పట్టము నిజాం ఉల్ ముల్క్ లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ఆలా హజ్రత్ అని, నిజాం సర్కార్ అని సంబోధిస్తారు. వీరి వంశము వారు1724 నుండి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు.

పి. పుల్లయ్య

పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 - మే 29, 1987) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి తెలుగు సినీనటి పి.శాంతకుమారి.

బాబర్

బాబరు (ఆంగ్లం : Babur), (ఫిబ్రవరి 14, 1483 - జనవరి 5, 1531). (పర్షియన్ :ﻇﻬﻴﺮ ﺍﻟﺪﻳﻦ محمد بابر ) ; ఇతని బిరుదనామములు - అల్ సుల్తాన్ అల్-ఆజమ్ వల్ లాహ్ ఖాన్ అల్-ముకఱ్రం జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాద్షాహ్ ఘాజీ, కాగా ఈతను 'బాబర్' నామముతోనే సుప్రసిద్ధుడయ్యాడు. బాబర్ 'మధ్య ఆసియా' కు చెందిన వాడు. దక్షిణాసియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను తండ్రివైపున తైమూర్ లంగ్ ('తైమూర్ లంగ్డా') మరియు తల్లి వైపున చెంఘీజ్ ఖాన్ ల వంశాలకు చెందినవాడు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ, భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించగలిగాడు.

బులంద్‌షహర్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో బులంద్‌షహర్ జిల్లా (హిందీ:बुलन्दशहर ज़िला) (ఉర్దూ:بلند شہر ضلع) ఒకటి. బులంద్‌షహర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

బేతుల్

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో బేతుల్ జిల్లా (హిందీ:) ఒకటి. బేతుల్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. బేతుల్ జిల్లా నర్మదాపురం డివిషన్‌లో భాగంగా ఉంది.

భారతదేశ నకలు హక్కుల చట్టం

నకలుహక్కు చట్టం 1957 (Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు మరియు సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది.

ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు మరియు ఒప్పందాలకు అనుగుణంగా ఉంది. 1886 బెర్నే సమావేశం (1971 పారిస్ లో మార్చినట్లుగా),1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం మరియు 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశంలో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం (WIPO Copyrights Treaty (WCT) ) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT) లకు అనుగుణంగా ఉంది.

భూమి

సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సౌరవ్యవస్థలోని గ్రహాల్లో, సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారాను, ఇతర ఆధారాల ద్వారానూ పరిశీలిస్తే, భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది. భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై - ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూసంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు.

భూమి భ్రమణాక్షం దాన్ని పరిభ్రమణ కక్ష్యాతలానికి లంబంగా కాక, వంగి ఉంటుంది. ఈ కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి చంద్రుల గురుత్వ శక్తుల పరస్పర ప్రభావాల కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతున్నాయి. ఈ శక్తుల కారణంగానే భూమి తన కక్ష్యలో స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణం వల్లనే భూ భ్రమణ వేగం క్రమేపీ తగ్గుతోంది. భూమి, సౌరవ్యవస్థలో అత్యంత సాంద్రత కలిగిన గ్రహం. సౌరవ్యవస్థలోని నాలుగు రాతి గ్రహాల్లోనూ (టెరెస్ట్రియల్ ప్లానెట్స్) ఇది అతి పెద్దది. భూగోళపు బయటి పొరను ఫలకాలుగా (టెక్టోనిక్ ప్లేట్లు) విభజించవచ్చు. ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా కదులుతూ ఉన్నాయి. భూమి ఉపరితలం దాదాపు 71 శాతం నీటితో కప్పబడి ఉంది. మిగిలిన భాగంలో ఖండాలు, ద్వీపాలూ ఉన్నాయి. వీటిలో కూడా నదులు, సరస్సులు మొదలైన రూపాల్లో నీరు ఉంది. జీవానికి అవసరమైన ద్రవరూపంలోని నీరు సౌరవ్యవస్థలోని వేరే ఏ గ్రహంలోనూ లేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు బాగా వేడిగా గాని, బాగా చల్లగా గానీ ఉంటాయి. అయితే పూర్వం అంగారక గ్రహంపై ద్రవరూపంలో నీరు ఉండేదని నిర్ధారించారు. ఇప్పుడు కూడా అక్కడ నీరు ఉండే అవకాశాలు ఉన్నాయి.

భూమి ధ్రువాల్లో అధిక భాగాన్ని మంచు కప్పేసి ఉంటుంది. అంటార్కిటికా మంచు ఫలకం, ఆర్కిటిక్ సముద్రపు మంచు పలకలూ ఇందులో భాగం. భూమి అంతర్భాగంలో ఇనుముతో కూడిన కోర్ (గర్భం), దాని చుట్టూ ద్రవ ఇనుముతో ఉండే బాహ్య గర్భం ఉన్నాయి. ఈ ద్రవ ఇనుము కారణంగా భూమికి అయస్కాంత శక్తి ఏర్పడింది. బాహ్య గర్భం వెలుపల మ్యాంటిల్ ఉంటుంది. ఇదే టెక్టోనిక్ ప్లేట్లకు చలనం కలిగిస్తుంది.

భూమి ఏర్పడిన తొలి 100 కోట్ల సంవత్సరాల్లోపే సముద్రాల్లో జీవం ఉద్భవించింది. ఈ జీవం భూ వాతావరణాన్ని, భూ ఉపరితలాన్నీ ప్రభావితం చేసింది. దాంతో ఏరోబిక్, ఎనరోబిక్ జీవాలు తామరతంపరగా వృద్ధి చెందాయి. కొన్ని భూభౌతిక ఆధారాల ప్రకారం, 410 కోట్ల సంవత్సరాల కిందటే భూమిపై జీవం ఉద్భవించింది. అప్పటి నుండి, సూర్యుని నుండి భూమి ఉన్న దూరం, భూమి భౌతిక లక్షణాలు వగైరాలు జీవులు వృద్ధి చెందటానికి కారణమయ్యాయి. భూమి చరిత్రలో, జీవ వైవిధ్యం దీర్ఘ కాలాల పాటు వృద్ధి చెందింది. కొన్ని సార్లు జీవులు సామూహికంగా అంతరించి పోయాయి. ఇప్పటి వరకూ భూమిపై జీవించిన జీవజాతుల్లో 99% వరకూ అంతరించి పోయాయి. ప్రస్తుతం ఉన్న జీవజాతుల సంఖ్యపై అంచనాలు వివిధాలుగా ఉన్నాయి; చాల జాతులను ఇంకా గుర్తించలేదు. 760 కోట్ల పైచిలుకు మానవులు భూమిపై నివసిస్తూ, భూమి జీవావరణంపై, దాని సహజవనరులపై ఆధారపడి ఉన్నారు. మానవులు అనేక సమాజాలు, సంస్కృతులను ఏర్పరచారు. రాజకీయంగా ప్రపంచంలో 200 సార్వభౌమిక రాజ్యాలున్నాయి.

రాయి

భూగోళ శాస్త్రంలో రాయి (సంస్కృతం: శిల; ఆంగ్లం: Rock) ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఘనమైన ఖనిజాలు.

భూమి యొక్క కఠినమైన బాహ్య పొరను లిథోస్ఫియర్ (Lithosphere), శిలలతో తయారయివుంటుంది. సామాన్యంగా శిలలు మూడు రకాలున్నాయి: అవి అగ్నిమయ, అవక్షేప, మరియు రూపాంతర ప్రాప్త శిలలు. శిలల శాస్త్రీయ విభాగాన్ని శిలాశాస్త్రం లేదా పెట్రాలజీ (Petrology) అంటారు; ఇది భూగోళ శాస్త్రంలోని విభాగము.

రాయ్ బరేలి

రాయ్ బరేలీ పట్టణం మరియు మునిసిపాలిటీ. ఇది రాయ్ బరేలీ జిల్లా ముఖ్యపట్టణం. ఈ పట్టణం రైల్ కోచ్ పరిశ్రమ కలిగిఉంది. షాజహాన్ సమయంలో నిర్మించిన అనేక పురాతన మసీదులు ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో రాయ్ బరేలి జిల్లా (హిందీ:रायबरेली ज़िला) (ఉర్దు : ائے بریلی ضلع) ఒకటి.

రాయ్ బరేలి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. రాయ్ బరేలి జిల్లా లక్నో డివిషన్‌లో భాగంగా ఉంది.

షాజహాన్

షహాబుద్దీన్ ముహమ్మద్ షాహ్ జహాఁ (ఆంగ్లం : Shabuddin Mohammed Shah Jahan) పూర్తి పేరు అల్ హజ్రత్ అబుల్-ముజాఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్ షాజహాన్ (బిరుదు : అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్-ఖాఖాన్ అల్-ముకర్రం, అబుల్-ముజఫ్ఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్, సాహిబే ఖిరానే సాని, షాహ్ జహాఁ I పాద్షాహ్ గాజి జిల్లు'ల్లాహ్ [ఫిర్దోస్-ఆషియాని]) (ఇంకనూ షాహ్ జహాఁ, షాజెహాన్, షాజహాన్, షాజహాను అని కూడా పలుకుతారు. (ఉర్దూ : شاه ‌جهان), జననం జనవరి 5, 1592 ; మరణం జనవరి 31, 1666. మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి, 1628 నుండి 1658 వరకూ భారతదేశాన్ని పరిపాలించాడు. షాజహాన్ పదము పర్షియన్ భాషా పదము, అర్థం ; షాహ్ "రాజు", జహాఁ "ప్రపంచం", "ప్రపంచపు రాజు". బాబరు, హుమాయూన్, అక్బరు మరియు జహాంగీరు ల తరువాత ఇతను ఐదవ మొఘల్ చక్రవర్తి.

జహాంగీరు తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని కాలం 'మొఘల్ సామ్రాజ్యంలో స్వర్ణయుగం' అని భావిస్తారు. తాను అక్బరును ఆదర్శంగా తీసుకున్నాడని ప్రతీతి.

సుల్తాన్‌పూర్ (ఉత్తర ప్రదేశ్)

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో సుల్తాన్‌పూర్ (ఉత్తర ప్రదేశ్) జిల్లా (హిందీ: सुलतानपुर ज़िला) (ఉర్దు:سلطان پور ضلع)ఒకటి. సుల్తాన్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. సుల్తాన్‌పూర్ జిల్లా ఫైజాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది.

సెప్టెంబర్ 28

సెప్టెంబర్ 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 271వ రోజు (లీపు సంవత్సరములో 272వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 94 రోజులు మిగిలినవి.

సెయోని

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో సెయోని జిల్లా (హిందీ:) ఒకటి. సెయోని పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.