1908

1908 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1905 1906 1907 - 1908 - 1909 1910 1911
దశాబ్దాలు: 1880లు 1890లు 1900లు 1910లు 1920లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

Khudiram Bose 1905 cropped
ఖుదీరాం బోస్
1980

1980 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1985

1985 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1994

1994 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2001

2001 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2006

2006 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ఆంధ్రపత్రిక

ఆంధ్రపత్రిక స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.

1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు.

1914 సంవత్సరంలో పత్రికను మద్రాసుకు తరలించారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికగా ఏప్రిల్ 1 వ తేదీన ప్రచురణ ప్రారంభమైనది. తెలుగు పంచాంగం ప్రకారం ఆనంద నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి నాడు ఆంధ్రదినపత్రిక జన్మించింది.

నాగేశ్వరరావు తరువాత శివలెంక శంభుప్రసాద్ ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలకు మరియు భారతికి సంపాదకులైనారు. ఆయన కాలంలోనే హైదరాబాదు మరియు విజయవాడ లలో ఆంధ్రపత్రిక ఎడిషన్లు ప్రారంభమైనాయి.

ఆగష్టు 27

ఆగష్టు 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 239వ రోజు (లీపు సంవత్సరములో 240వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 126 రోజులు మిగిలినవి.

బొద్దు పాఠ్యం

ఎల్.వి.ప్రసాద్

ఎల్.వి.ప్రసాద్ (జనవరి 17, 1908 - జూన్ 22, 1994) గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

చక్రపాణి

ఆలూరు వెంకట సుబ్బారావు (ఆగష్టు 5, 1908 - సెప్టెంబరు 24, 1975 ) (కలంపేరు చక్రపాణి) బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకడు.

జమలాపురం కేశవరావు

సర్దార్ జమలాపురం కేశవరావు (సెప్టెంబరు 3, 1908 - మార్చి 29, 1953), నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. హైదరాబాదు రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించాడు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’ గా పిలుచుకుంటారు.

నవంబర్ 8

నవంబర్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 312వ రోజు (లీపు సంవత్సరములో 313వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 53 రోజులు మిగిలినవి.

నార్ల వెంకటేశ్వరరావు

నార్ల వెంకటేశ్వరరావు (డిసెంబర్ 1, 1908 - ఫిబ్రవరి 16, 1985) తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. వీ.ఆర్.నార్లగా కూడా వీరు ప్రసిద్ధులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. హేతువాది గా, మానవతావాదిగా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల రచనలు అన్నీ కూర్చి ఇటీవలే "నార్ల రచనలు" పేరిట పలుభాగాలుగా వెలువరించారు నార్ల కుటుంబం వారు.

పర్వతనేని బ్రహ్మయ్య

పర్వతనేని బ్రహ్మయ్య (అక్టోబర్ 2, 1908 - జులై 20, 1980) ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్ (Chartered Accountant). పి. బ్రహ్మయ్య అండ్ కంపెనీ అను సంస్థను స్థాపించి దానికి దేశవ్యాప్తముగా గౌరవము సంపాదించి, ఆడిటింగ్ అనే వృత్తిలో వేలమందికి శిక్షణనిచ్చి చిరస్మరణీయుడయ్యాడు.

ఫిబ్రవరి 26

ఫిబ్రవరి 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 57వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 308 రోజులు (లీపు సంవత్సరములో 309 రోజులు) మిగిలినవి.

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి) (నవంబర్ 16, 1908 - నవంబర్ 8, 1977) ప్రముఖ సినీ దర్శక నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన మల్లీశ్వరి బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం. బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.

మగ్దూం మొహియుద్దీన్

మగ్దూం మొహియుద్దీన్ (ఫిబ్రవరి 4, 1908 - ఆగష్టు 25, 1969) స్వాతంత్ర్య సమరయోధుడు, మహాకవి, ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు.

మార్చి 23

మార్చి 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 82వ రోజు (లీపు సంవత్సరములో 83వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 283 రోజులు మిగిలినవి.

రావి నారాయణరెడ్డి

రావి నారాయణరెడ్డి, (జూన్ 5, 1908 - సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. ఆయన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా ఆయనను పేర్కొనవచ్చు.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.