1907

1907 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1904 1905 1906 - 1907 - 1908 1909 1910
దశాబ్దాలు: 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

జననాలు

Bezawada Gopal Reddy
బెజవాడ గోపాలరెడ్డి
1905

1905 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1971

1971 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1974

1974 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1984

1984 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1987

1987 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1997

1997 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2003

2003 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

జూన్ 23

జూన్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 174వ రోజు (లీపు సంవత్సరములో 175వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 191 రోజులు మిగిలినవి.

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

పండిత్ నరేంద్రజీ

పండిత్ నరేంద్రజీ ఏప్రిల్ 10, 1907న హైదరాబాదులో జన్మించాడు. చిన్నతనంలోనే ఆర్యసమాజ్ పట్ల ఆకర్షితుడైనాడు. ఆర్యసమాజ్ యొక్క మంత్రిగా, ఉపాధ్యక్షునిగా పనిచేశాడు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఇతను హైదరాబాదు ఉక్కుమనిషిగా పేరుపొందాడు. హైదరాబాదులో ఆర్యసమాజ్ కార్యక్రమాలకు నరేంద్రజీ విశేషకృషే కారణం.1938లోనే నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు 3 సంవత్సరాలు మన్ననూరు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన పిదప వైదిక దర్శనం పత్రికను నిర్వహించాడు. ఈ పత్రికద్వారా నిజాం నిరకుశత్వాన్ని తీవ్రంగా నిరసించాడు. దీనితో పత్రిక మూతపడింది మరియు ఆస్తులన్నీ జప్తు అయ్యాయి. అయిననూ నరేంద్రజీ తన లక్ష్యాన్ని మార్చుకోలేదు. బలవంతపు మతమార్పిడులు జరిపితే అర్యసమాజం ద్వారా మళ్ళీ హిందూమతంలోకి ఆహ్వానించాడు.

1942 నుండి 1945 వరకు ఆర్యసమాజీయులను ఏకం చేసి ముందుకు నడిపించడానికి నిజాం రాజ్యంలోని పలుప్రాంతాలలో ఐదు ఆర్యసమాజ సభలు నిర్వహించబడ్డాయి. నరేంద్రజీ 1942లో ఉద్గిర్లో జరిగిన మొదటి సమావేశంలో సమావేశపు కార్యదర్శిగా పనిచేయటమే కాకుండా ఆ తర్వాత సభల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నాడు.హైదరాబాదు రాజ్యం భారత యూనియన్ లో విలీనం కావడానికి తీవ్రంగా కృషిచేశాడు. 1947లో మరోసారి జైలుకు వెళ్ళవలసి వచ్చింది. నూతి శంకరరావు లాంటి పోరాటయోధులు కూడా ఇతని ఉపన్యాసాలకు ప్రభావితులైనారు. నిజాం నవాబు పైనే బాంబు విసిరిన నారాయణరావు పవార్ కూడా నరేంద్రజీ శిష్యుడే. 1948 సెప్టెంబరులో నిరంకుశ నిజాం పాలన అంతమై హైదరాబాదు భారత యూనియన్ లో కలిసిన పిదప నరేంద్రజీ హైదరాబాదు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనాడు. 1952లో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు. 1975లో రాజకీయాలకు స్వస్తిచెప్పి సన్యాసం స్వీకరించాడు. సెప్టెంబరు 24, 1976 నాడు మరణించాడు.

బులుసు వెంకట రమణయ్య

బులుసు వెంకట రమణయ్య (డిసెంబరు 24, 1907 - మే 25, 1989) జననం విశాఖజిల్లా విజయనగరందగ్గర రామతీర్థంలో. జన్మదినం డిసెంబరు 24, 1907. విజయనగరం సంస్కృత కళాశాలలో చదువుకున్నారు. కాశీ విశ్వ విద్యాలయంలో అలంకారశాస్త్రంలో 1930-32లో పరిశోధన చేసేరు.మద్రాసులో కెల్లెట్ హైస్కూలులో ప్రధానాంధ్ర అధ్యాపకులుగా పని చేసేరు. “రావు” అన్న కలంపేరుతో ప్రసిద్ధపత్రికలలో కథలు ప్రచురించేరు.

బెజవాడ గోపాలరెడ్డి

స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి (ఆగష్టు 7, 1907 - మార్చి 9, 1997). పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రదేశ్కు గవర్నరు గాను మరియు రాజ్యసభ సభ్యుడు (1958-1962) గా కూడా పనిచేసాడు.

మల్లెల శ్రీరామ మూర్తి

మల్లెల శ్రీరామ మూర్తి. (1907 - 1983) తొలినాటి గ్రంథాలయోధ్యమ ప్రముఖులలో ఒకరు.

మహాదేవి వర్మ

మహాదేవి వర్మ ( జ: ఏప్రిల్ 27, 1907 - మ: సెప్టెంబర్ 11, 1987 ) ప్రసిద్ధ ఆధునిక హిందీ కవయిత్రులలో ఒకరు. హిందీ సాహిత్యంలో ఛాయవాద యుగానికి మూల స్తంభాలుగా భావించబడే నలుగురు సాహిత్యకారులలో ఆమె ఒకరు. ఆధునిక హిందీ కవిత్వంలో ఆమె సేవలకు గాను ఆమెను ఆధునిక మీరా అని కూడా అంటారు. ప్రముఖ కవి సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా ఈమెను విశాల హిందీ మందిరపు సరస్వతిగా అభివర్ణించాడు.స్వాతంత్ర్యానికి పూర్వపు భారతదేశంలోనూ, స్వతంత్ర భారతదేశంలోనూ నివసించిన ఈమె బహుళ సమాజంలో పనిచేస్తూనే భారతదేశంలో అంతర్లీనంగా ఉన్న ఉద్వేగాలను, ఆక్రోదనలను చూసి, పరిశీలించి, అంధకారాన్ని పోగొట్టే దృష్టిని ఇవ్వటానికి ప్రయత్నించిన కవుల్లో ఒకర్తె. ఈమె కవితలే కాకుండా ఈమె చేపట్టిన సమాజోద్ధరణా పనులు, మహిళాచైతన్యం కోసం చేసిన కృషి ఈ దృష్టితోనే ప్రభావితమైనవి. ఈమె మానసిక క్షోభను ఎంత హృద్యంగా వర్ణించిందంటే దీపశిఖలో అది ప్రతి మనిషి యొక్క వేదనగా అందరి హృదయాలను హత్తుకుంది. అది పాఠకులనే కాకుండా సమీక్షకులను కూడా లోతుగా ప్రభావితం చేసింది.

ఈమె ఖరీబోలీ హిందీ మాండలికంలో వ్రాసిన కవితల్లో అప్పటివరకు కేవలం భృజ్‌ భాషలోనే సంభవమని అనుకొన్నంత మృదువైన శబ్దాలను పలికించింది. దీని కోసం ఆమె తన సమయంలో వాడకంలో ఉన్న సంస్కృత మరియు బెంగాళీ భాషలలోని మృదువైన పదాలను ఎన్నుకొని వాటికి హిందీ తొడుగులు తొడిగింది. సంగీతంతో పరిచయముండటం వల్ల ఈమె పాటల నాథ సౌందర్యం, లయబద్దమైన వ్యంజనాల శైలి అనితరసాధ్యమైనది. అధ్యాపకురాలిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి పదవీ విరమణ చేసే కాలానికి ప్రయాగ మహిళా విద్యాపీఠం యొక్క ప్రధానాచార్యులైంది. ఈమెకు బాల్యవివాహమైనా జీవితం మొత్తం అవివాహిత మాదిరిగానే గడిపింది. ప్రతిభావంతమైన కవయిత్రి మరియు గద్య రచయితైన మహాదేవి వర్మ సాహిత్య, సంగీతాల్లో నైపుణ్యంతో పాటు చక్కటి చిత్రకారిణి మరియు సృజానాత్మక అనువాదకురాలు కూడా. ఈమెకు హిందీ సాహిత్యంలోని అన్ని పతిష్టాత్మకమైన పురస్కారాలను అందుకొన్న గౌరవము దక్కింది. భారత సాహిత్యాకాశంలో మహాదేవివర్మ ధ్రువతారగా వెలుగుతున్నది. గత శతాబ్దంలో అత్యంత లోకప్రియమైన మహిళా సాహిత్యకారిణిగా మహాదేవివర్మ వెలుగొందింది. 2007లో ఈమె జన్మ శతాబ్ది ఉత్సవాలు జరుపబడినవి.

మార్చి 23

మార్చి 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 82వ రోజు (లీపు సంవత్సరములో 83వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 283 రోజులు మిగిలినవి.

లక్కోజు సంజీవరాయశర్మ

గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 - డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.

శివకుమార స్వామీజీ

డా॥శ్రీశ్రీశ్రీ శివకుమార స్వామీజీ కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఉన్న శ్రీసిద్ధగంగ మఠానికి మఠాధిపతి. ఈయనే శ్రీసిద్దగంగ ఎజ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. 1907 ఏప్రిల్ 1 న జన్మించిన ఈయన వయస్సులో శతాధికులు. 1930 లో విరక్తాశ్రమంలోకి ప్రవేశించబడ్డారు. స్వామీజీ మాగడి తాలూకలోని వీరపూరలో పుట్టారు. ఆయనొ వీరపుర మరియు నాగవళ్లిలో ప్రాధమిక విద్యను కలిగి ఉన్నారు. అతను సెకండరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ హైస్కూల్ తుమకూరు, బెంగుళూరు యూనివర్సిటీ నుండి పూర్వ విశ్వవిద్యాలయము మరియు డిగ్రీని సెంట్రల్ కాలేజ్, బెంగళూరులో పూర్తి చేసారు. ఈ సమయములో (1927-1930) రావు బహదూర్ ధర్మప్రవర్ధ గుబ్బి తోటదప్ప హాస్టల్ లో బసచేశారు. ఆయనొక ఆంగ్ల కళాశాలలో చదివారు, అయినప్పటికీ కన్నడ మరియు సంస్కృతంలో నిష్ణాతులు. సాంప్రదాయంగా సంస్కృతంతో పాటూ ఆధునికంగా విజ్ఞానాన్ని చదివించే ఎన్నో విద్యాసంస్థలను ఈయన స్థాపించారు. అందువలనే అన్ని వర్గాలవారూ ఈయన్ని గౌరవిస్తారు.ఈయన చేసిన మానవతావాద పనులకు కర్ణాటక విశ్వవిద్యాలయం ఈయన్ని గౌరవ డాక్టరేట్ తో 1965లో సత్కరించింది. 107 ఏళ్ళ వయసులో కూడా ఈయన సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2015లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

సి.యస్.ఆర్. ఆంజనేయులు

సి.యస్.ఆర్. ఆంజనేయులు (చిలకలపూడి సీతారామాంజనేయులు) (జూలై 11, 1907 - అక్టోబరు 8, 1963) ప్రముఖ రంగస్థల, సినిమా నటుడు.

సురభి కమలాబాయి

సురభి కమలాబాయి (1907 - 1971) తొలి తెలుగు సినిమా నటీమణి, గాయని. ఈమె 1931లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రము భక్తప్రహ్లాద లో లీలావతి పాత్ర ధరించింది.

20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.