1818

1818 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1815 1816 1817 - 1818 - 1819 1820 1821
దశాబ్దాలు: 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

జననాలు

Karl Marx 001
Karl Marx 001
1817

1817 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1819

1819 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1820

1820 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1821

1821 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

అహ్మద్‌నగర్ జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో అహ్మద్‌నగర్ జిల్లా (హిందీ:अहमदनगर) ఒకటి. అహ్మద్‌నగర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. అహ్మద్‌నగర్ జిల్లా నాసిక్ డివిషన్‌లో భాగంగా ఉంది. (క్రీ.శ. 1496- 1696]] అహమ్మద్‌నగర్ సుల్తానేట్ రాజధానిగా ఉండేది. జిల్లాలో సిరిడీ సాయిబాబా ఆలయం ఉంది.

ఆగష్టు 1

ఆగష్టు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 213వ రోజు (లీపు సంవత్సరములో 214వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 152 రోజులు మిగిలినవి.

ఆగష్టు 13

ఆగష్టు 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 225వ రోజు (లీపు సంవత్సరములో 226వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 140 రోజులు మిగిలినవి.

ఏప్రిల్ 4

ఏప్రిల్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 94వ రోజు (లీపు సంవత్సరములో 95వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 271 రోజులు మిగిలినవి.

కార్ల్ మార్క్స్

కార్ల్ మార్క్స్ (మే 5, 1818 - మార్చి 14, 1883) జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్తవయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్లో జీవితం గడిపాడు. లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి తన చింతన అభివృద్ధి చేసుకుంటూ, పలు పుస్తకాలు ప్రచురించాడు. 1848 నాటి కరపత్రమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. తదుపరి కాలపు మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసింది.

సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు వంటివాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తున్నారు. మార్క్సిజం ప్రధానంగా మానవ సమాజాలు వర్గ పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాయని, పెట్టుబడిదారి వ్యవస్థలో ఇది సహజంగా పాలక వర్గాలకీ(బూర్జువాలుగా పేరొందాయి, ఉత్పత్తి సాధనాలను అదుపుచేస్తూంటాయి), శ్రామిక వర్గాలకీ (ప్రొలెటరేట్ గా పేరొందిన ఈ వర్గాలు తమ శ్రమశక్తిని వేతనం కోసం అమ్ముకుంటూంటాయి) నడుమ ఘర్షణగా పరిణమిస్తుంది. పరాయీకరణ, విలువ, వస్తు పూజ, మిగులు విలువ వంటి తన సిద్ధాంతాల ద్వారా మార్క్స్ పెట్టుబడిదారి వ్యవస్థ వినియోగదారి మనసత్తత్వం అభివృద్ధి చేయడం, సామాజిక అంతరాలు, శ్రమశక్తిని దోపిడీ చేయడం ద్వారా సామాజిక సంబంధాలు, విలువలను ఏర్పరుస్తోందని వాదించాడు. చారిత్రిక భౌతికవాదం అనే విమర్శనాత్మక దృక్పథాన్ని ఉపయోగించి, మార్క్స్ పునాది, పైనిర్మాణ సిద్ధాంతం (బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్ థియరీ)ని ప్రతిపాదించాడు. సమాజంలోని సాంస్కృతిక, రాజకీయ స్థితిగతులను, అలానే వాటి మానవ స్వభావపు భావనలను ప్రధానంగా నిగూఢమైన ఆర్థిక పునాదులే నిర్ధారిస్తాయని ఈ సిద్ధాంతం చెప్తోంది. ఈ ఆర్థిక విమర్శలు 1867 నుంచి 1894 వరకూ మూడు భాగాలుగా ప్రచురితమైన ప్రభావశీలమైన దాస్ కేపిటల్లో పొందుపరిచారు.

మార్క్స్ ప్రకారం, రాజ్యాల ప్రజలందరి సాధారణ ఆసక్తులకు అనుగుణంగా నడుస్తున్నట్టుగా చూపించుకున్నా, నిజానికి పాలకవర్గం ఆసక్తులకు అనుగుణంగా నడుస్తాయి. గత సామాజిక ఆర్థిక వ్యవస్థల్లాగానే పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత సమస్యలు స్వయం వినాశనానికి దారితీసి, దాని స్థానంలో కొత్త వ్యవస్థ ఐన సామ్యవాదం ఏర్పడుతుందని ఊహించారు. మార్క్స్ అభిప్రాయంలో పెట్టుబడిదారీ వ్యవస్థలోని వర్గ వైరుధ్యాలు దాని అస్థిరతకు, సంక్షోభానికి గురయ్యే లక్షణానికి కొంత కారణమై క్రమంగా కార్మిక వర్గం వర్గ చైతన్యాన్ని సాధించడానికి దారితీస్తుంది, ఇది వారు రాజకీయ ఆధిపత్యాన్ని సాధించేందుకు, చివరకు ఉత్పత్తిదారుల స్వేచ్ఛా సంఘటితంగా ఏర్పడే ప్రభుత్వం ద్వారా వర్గ రహిత, కమ్యూనిస్టు సమాజం స్థాపనకు దారితీస్తుంది. మార్క్స్ కార్మిక వర్గం పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి, సామాజిక ఆర్థిక విముక్తి తీసుకువచ్చేందుకు సంఘటిత విప్లవ చర్య చేపట్టాలని వాదిస్తూ క్రియాశీలకంగా దాని ఆచరణ కోసం పోరాడారు.కార్ల్ మార్క్స్ మానవ చరిత్రలోకెల్లా అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు, ఆయన కృషి, సిద్ధాంతం అటు ప్రశంసలు, ఇటు విమర్శలు కూడా విస్తృతంగా పొందింది. ఆర్థిక శాస్త్రంలో ఆయన కృషి శ్రమ గురించి, దానికీ పెట్టుబడికీ ఉన్న సంబంధం గురించి ప్రస్తుత అవగాహనకీ, తత్ సంబంధితమైన ఆర్థిక ఆలోచనకీ చాలావరకూ పునాదిగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులు, కార్మిక సంఘాలు, కళాకారులు, రాజకీయ పార్టీలు మార్క్స్ ఆలోచనాధార, తాత్త్వికత, కృషిలకు ప్రభావితం అయ్యాయి, చాలామంది ఆయన ఆలోచనను స్వీకరించడమో, మార్పుచేసుకోవడమో చేశారు. మార్క్స్ ని సామాన్యంగా ఆధునిక సామాజికశాస్త్ర నిర్మాతల్లో ఒకరిగా పేర్కొంటారు.మార్క్స్ మరణించేంతవరకూ ఆయన భావాలు ప్రధానంగా వ్యాప్తి చెందకపోయినా, ఆయన మరణానంతరం వాటి ప్రభావం విస్తరించింది. రష్యన్ విప్లవం మొదలుకొని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక విప్లవాలు మార్క్సిజం సిద్ధాంతం పునాదిగా చేసినట్టు ప్రకటించుకున్నాయి. 20వ శతాబ్దిలో అనేక దేశాలు మార్క్సిస్టు దేశాలుగా తమను ప్రకటించుకున్నాయి.

వ్లాదిమిర్ లెనిన్, మావో జెడాంగ్, ఫిడెల్ కాస్ట్రో, సాల్వడార్ అలెండె, జోసిప్ బ్రొజ్ టిటో, క్వామె క్రుమా సహా ఎందరో 20వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రపంచ నాయకులు మార్క్స్ తమపై గాఢ ప్రభావం చూపాడని పేర్కొన్నారు.

కోతులగోకవరం

కొట్టులగొకవరం పశ్చిమ గోదావరి జిల్లా, లింగపాలెం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన లింగపాలెం నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 973 ఇళ్లతో, 3551 జనాభాతో 1395 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1818, ఆడవారి సంఖ్య 1733. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1921 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587964.పిన్ కోడ్: 534462.

చుక్కలవారి లక్ష్మీపురం

చుక్కలవారి లక్ష్మీపురం, విశాఖపట్నం జిల్లా, నక్కపల్లి మండలానికి చెందిన గ్రామము.

ఇది మండల కేంద్రమైన నక్కపల్లి నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 948 ఇళ్లతో, 3594 జనాభాతో 734 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1776, ఆడవారి సంఖ్య 1818. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 331 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 15. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 586448.పిన్ కోడ్: 531081.

తెలుగు సంవత్సరాలు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

తోంక్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్రంలోని 33 జిల్లాలలో తోంక్ జిల్లా ఒకటి. గత భారతీయ మరియు రాజస్థాన్ రాజాస్థానలలో ఇది ఒకటిగా ఉండేది. తోంక్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉండేది. జిల్లా ఉత్తర సరిహద్దులో జైపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో సవై మాధోపూర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో కోట జిల్లా, దక్షిణ సరిహద్దులో బుంది జిల్లా, నైరుతీ సరిహద్దులో భిల్వార జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో అజ్మీర్ జిల్లా ఉన్నాయి.

పూణె జిల్లా

పూణే జిల్లా : (पुणे जिला) (پونے ضلع ) - (Pune (District)) భారత్ లోని మహారాష్ట్ర జిల్లాలలోని ఒక జిల్లా. పూణే నగరం దీని పరిపాలనా నగరం. దీని జనాభా 9,426,959, భారత్ లోని 640 జిల్లాలలో అధిక జనాభాగల జిల్లాల ప్రకారం నాలుగవ స్థానం ఆక్రమిస్తుంది. మొత్తం జనాభాలో నగరప్రాంత జనాభా 58.08% ఉంది. ప్రస్తుతం పూణే అర్బన్ ప్రాంత జనాభా 50 లక్షలను దాటుతోంది.

మధ్య ప్రదేశ్

మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) (హిందీ:मध्य प्रदेश) - పేరుకు తగినట్లే భారతదేశం మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని నగరం భోపాల్. ఇంతకు పూర్వం దేశంలో వైశాల్యం ప్రకారం మధ్యప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా ఉండేది. కాని 2000 నవంబరు 1 న మధ్యప్రదేశ్‌లోని కొన్నిభాగాలను వేరుచేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.

మరాఠా సామ్రాజ్యం

మరాఠా సామ్రాజ్యం (Marathi|मराठा साम्राज्य మరాఠా సామ్రాజ్య ; మహ్‌రాట్ట అని కూడా ప్రతిలిఖించవచ్చు) లేదా మరాఠా సమాఖ్య అనేది నేటి భారతదేశం యొక్క నైరుతి దిక్కున ఒకప్పుడు విలసిల్లిన ఒక మహా సామ్రాజ్యం. 1674 నుంచి 1818 వరకు ఉనికిలో ఉన్న ఈ సామ్రాజ్య శోభ ఉచ్ఛస్థితిలో కొనసాగిన సమయంలో 2.8 మిలియన్ km² పైగా భూభాగాన్ని తన వశం చేసుకోవడం ద్వారా దక్షిణాసియాలో అత్యంత ఎక్కువ భాగాన్ని ఆక్రమించిన సామ్రాజ్యంగా వర్థిల్లింది. శివాజీ భోంస్లే ద్వారా ఈ సామ్రాజ్య స్థాపన మరియు సుసంఘటితం జరిగింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణానంతరం మరాఠా సామ్రాజ్య ప్రధాన మంత్రులైన పేష్వాల పాలన కింద ఈ సామ్రాజ్యం మరింత గొప్పగా అభివృద్ధి చెందింది. 1761లో మరాఠా సైన్యం మూడవ పానిపట్టు యుద్ధంలో ఓడిపోవడం ఈ సామ్రాజ్య విస్తరణకు అడ్డుకట్టగా పరిణమించింది. అటుపై ఈ సామ్రాజ్యం మరాఠా రాష్ట్రాల సమాఖ్య రూపంలోకి విడిపోవడమే కాకుండా ఆంగ్లో-మరాఠా యుద్ధాల కారణంగా చివరకు 1818లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో భాగమైపోయింది.

ఈ సామ్రాజ్య భూభాగంలో పెద్ద భాగం తీర ప్రాంతంగా ఉండడమే కాకుండా, కన్హోజీ అంగ్రే లాంటి వారి నిర్థేశకత్వంలో శక్తివంతమైన కమాండర్ల ద్వారా ఈ ప్రాంతం రక్షింపబడేది. విదేశీ నౌకాదళ నౌకలను ప్రత్యేకించి పోర్చుగీస్ మరియు బ్రిటిష్ వారి నౌకలను సముద్రం దాటి రానీయకుండా చూడడంలో వారు అత్యంత విజయం సాధించారు. తీర ప్రాంతాల రక్షణ మరియు భూ-ఆధారిత దుర్గాలను నిర్మించడమన్నది మరాఠాల రక్షణ వ్యూహం మరియు ప్రాంతీయ సైనిక చరిత్రకు చాలా కీలకమైన అంశాలుగా పరిణమించాయి.

బిజాపూర్‌కు చెందిన అదిల్‌షా మరియు మొఘల్ రాజు ఔరంగజేబులతో జీవితకాలం పాటు గొరిల్లా యుద్ధం సాగించిన తర్వాత రాయ్‌గఢ్ రాజధానిగా 1674లో శివాజీ ది గ్రేట్ ఒక స్వతంత్ర మరాఠా (హిందూ) సామ్రాజ్యాన్ని స్ధాపించాడు. 1680లో శివాజీ మరణించే నాటికి అది ఒక పెద్ద సామ్రాజ్యంగా ఉన్నప్పటికీ, రక్షణ విషయంలో దుర్లభంగా మారిన ఆ సామ్రాజ్యం దాడికి అనువైనదిగా మారింది. 1681 నుంచి 1707 వరకు జరిగిన విజయవంతం కాని 27 సంవత్సరాల యుద్ధం కారణంగా మొఘలులు ఈ సామ్రాజ్యాన్ని ఆక్రమించ లెక పొయరు. శివాజీ మనుమడైన షాహు 1749 వరకు చక్రవర్తిగా పాలన సాగించాడు. షాహూ తన పరిపాలన కాలంలో, కొన్ని నిర్థిష్టమైన షరతులతో ప్రభుత్వాధిపతిగా మొదటిసారిగా పేష్వాను నియమించడం జరిగింది. షామరణం తర్వాత, శివాజీ వారసులు వారి ప్రధాన కేంద్రమైన సతారా నుంచి నామమాత్రపు పాలన సాగించినప్పటికీ, 1749 నుండి 1761 వరకు ఈ సామ్రాజ్య విషయంలో పేష్వాలే వాస్తవ నాయకులుగా మారారు. పేష్వాలకు మరియు వారి సర్దార్‌ల (సైనిక కమాండర్లు) కు మధ్య అంతర్గత సంబంధాలు క్షీణించనంత వరకు భారత ఉపఖండంలోని ఒక పెద్ద భూభాగాన్ని కలిగిన మరాఠా సామ్రాజ్యం, 18వ శతాబ్దం వరకు బ్రిటిష్ దళాలను సముద్రం దాటి రానీయకుండా నిరోధించగలిగింది, అయితే అటుతర్వాత వీరి మధ్య ఏర్పడిన గొడవల కారణంగా కమాండర్ల సంఖ్య క్రమంగా తగ్గిపోవడమన్నది సామ్రాజ్య పతనానికి దారితీసింది.

[] షాహు మరియు పేష్వా బాజీ రావ్‌ Iల సారథ్యంలో 18వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యం కీర్తి ఉన్నత స్థితికి చేరింది. అయితే, 1761లో మూడవ పానిపట్టు యుద్ధంలో ఓడిపోవడంతో వాయువ్య దిశగా సామ్రాజ్య విస్తరణకు అడ్డుకట్ట పడడంతో పాటు పేష్వాల అధికారాన్ని తగ్గించి వేసింది. 1761లో పానిపట్టు యుద్ధంలో కోలుకోలేని దెబ్బ తగిలిన తర్వాత, పేష్వాలు రాజ్యంపై పట్టు కోల్పోవడం నెమ్మదిగా ప్రారంభమైంది. ఇదే అదనుగా షిండే, హోల్కర్, గైక్వాడ్, పంట్‌ప్రతినిథి, నాగ్‌పూర్‌కు చెందిన భోంస్లే, భోర్‌కు చెందిన పండిట్, పట్‌వర్ధన్, మరియు నెవల్కర్ లాంటి అనేకమంది మరాఠా సామ్రాజ్య సైనికాధిపతులు తమ అధికార పరిధికి తామే రాజులుగా మారాలనే తమ కోరికను నెరవేర్చుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, పానిపట్టు యుద్ధం ముగిసిన పదేళ్ల తర్వాత, మాథవ్‌రావ్ పేష్వా ఆధిపత్యం కింద ఉత్తర భారతదేశంలో మరాఠా అధికారం తిరిగి స్థాపించబడింది. మాథవ్‌రావ్ మరణం తర్వాత, 'పెంటర్చీ'లో కొలువైన రాజకీయ శక్తికి సంబంధించిన ఐదు మరాఠా రాజవంశాల కారణంగా మరాఠా సామ్రాజ్యం విడిపోవడానికి అనువుగా ఉన్న సమాఖ్యగా రూపుదాల్చింది. పూణే పేష్వాలు; మాల్వా మరియు గాల్వియర్‌లకు చెందిన సింథియాలు (వాస్తవంగా వీరిని "షిండేలు" అంటారు) ; ఇండోర్‌కు చెందిన హోల్కర్‌లు; నాగ్‌పూర్‌కు చెందిన భోంస్లేలు; మరియు బరోడాకు చెందిన గైక్వాడ్‌లు ఇందులో భాగంగా మారారు. మరోవైపు సింథియా మరియు హోల్కర్‌ల మధ్య చోటు చేసుకున్న పోరు 19వ శతాబ్దం ప్రారంభంలో సమాఖ్య సంబంధాను దెబ్బతీయడమే కాకుండా మూడుసార్లు జరిగిన ఆంగ్లో-మరాఠా యుద్ధాల్లో భాగంగా బ్రిటిష్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలతో వీరు తలపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో భాగంగా 1818లో చివరి పేష్వా అయిన బాజీ రావు IIను బ్రిటిష్ వారు ఓడించారు. 1947లో స్వతంత్ర భారతదేశం అవతరించే వరకు కొన్ని మరాఠా రాజ్యాలు స్వతంత్ర ప్రిన్సియలీ స్టేట్స్ రూపంలో కొనసాగినప్పటికీ, పేష్వాల అంతంతోటే ఒకప్పటి మరాఠా సామ్రాజ్యంలోని సింహభాగం బ్రిటిష్ ఇండియాలో భాగమైపోయింది.

వారన్ హేస్టింగ్సు

వారన్ హేస్టింగ్సు జీవిత కాలం 1732-1818. కార్యకాలం 1750-1785. క్రీ.శ 1599 లో స్థాపించినప్పటినుండి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అనువ్యాపార సంస్ధకి పది-పదిహేను సంవత్సరముల కొకమారు ఇంగ్లండులోని బ్రిటిష్ ప్రభుత్వము సన్నదులు (పట్టా) ద్వారా ( ఉదాహరణకు 1661,1676,1686 చేసిన సన్నదులు.1686 లో శాసన నిర్మాణాధికారము ఇచ్చారు,1767 లో అమలుచేసిన కంపెనీ పట్టా చట్టం) ఇత్యాతులు వ్యాపారనిర్వాహణ నిమిత్తం అన్న ఆర్భాటంతో అనేక పరిపాలనాధికారములను క్రమేణా కలిగించారు. ఇవన్నీ బ్రిటిష్ రాజ్యతంత్రములోభాగములే. 1773 లో ఇంకా అధిక మోతాదులో అధికారమిస్తూ రెగ్యులేటింగ్ చట్టం అని అమలుచేశారు. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టము యొక్కఉద్దెశ్యము భారతదేశమును ఇంగ్లండు రాణీగారి పేర పరిపాలించే బ్రిటిష్ పార్లమెంటు పరిపాలనా పరిధిలోకి తీసుకుచ్చి బ్రిటిష్ వలసరాజ్య స్థాపనబలపరచటమే. ఆ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీకి కలకత్తాలో గవర్నర్ జనరల్ పదవి కలుగచేసి (చూడు బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్ ) బ్రిటన్ దేశ రాజ్యప్రతినిధినిగా నియమించటం జరిగింది. పరిపాలనా సంఘ (గవర్నింగ్ కౌన్సిల్ ) సభ్యత్వం నలుగురినే చేశారు. ఆ చట్టప్రకారం బీహారు ఒరిస్సా రాష్టములు గూడా గవర్నర్ జనరల్ పరిపాలనాధికారంలోకి వచ్చినవి. అంతే కాక మద్రాసు, బొంబాయి రాష్ట్ర గవర్నర్లులుపై తనిఖీకి అధికారము, రాజ్యపాలిత ఇతర అధికారములు ఇవ్వబడ్డాయి. కలకత్తాలో సుప్రీంకోర్టు నియమించబడింది. ఆ చట్టముక్రింద అప్పటిలోకలకత్తాలో గవర్నరు గానున్న వారన్ హేస్టింగ్సు (WARREN HASTINGS) మొట్టమొదటి గవర్నర్ జనరల్ పదవిలో 1773 నుండి 1785 దాకా బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెని వారిద్వారా బ్రిటిష్ వలసరాజ్యమును పరిపాలించాడు.

షోలాపూర్ జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో షోలాపూర్ జిల్లా ఒకటి. షోలాపూర్ నగరం జిల్లా కేంద్రంగా ఉంది. షోలాపూర్ రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భీమా మరియు సీనా నదీమైదానాల మద్య ఉంది. జిల్లా మొత్తానికి భీమానది నుండి నీటిపారుదల వసతి లభిస్తుంది..

షోలాపూర్ జిల్లా బీడి ఉత్పత్తికి ప్రసిద్ధిచెందింది. బీడి పరిశ్రమ అభివృద్ధితో జిల్లాలోని కుండల్సంగం, కర్మల మరియు బర్షి ప్రాంతాలు పారిశ్రామికంగా మరియు విద్యాపరంగా అభివృద్ధి చెందింది.

అక్కల్‌కోట మల్లికార్జునఆలయంలో ప్రతిరోజూ అనేకమంది లింగాయత భక్తులు శివుని ఆరాధిస్తుంటారు.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.