సచ్చిదానంద రౌత్రాయ్

సచ్చిదానంద రౌత్రాయ్ (1916–2004) ఒరియా భాషకు చెందిన కవి, నవలా రచయిత, లఘు కథా రచయిత. ఈయనకు 1986 లో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈయన "సాచీ రౌత్రాయ్"గా సుపరిచితులు.[1]

సచ్చిదానంద రౌత్రాయ్
పుట్టిన తేదీ, స్థలం 1916 మే 13
గురుజంగ్, ఖొద్రా
మరణం2004 ఆగస్టు 21 (వయసు 88)
కటక్
కలం పేరుసచీ రౌతర
రచనా రంగంకవిత్వం
గుర్తింపునిచ్చిన రచనలుపల్లిశ్రీ
పురస్కారాలుజ్ఞానపీఠ పురస్కారం

జీవితం

రౌత్రాయ్ మే 13, 1916ఖుర్దాకు దగ్గరలో గల గురుజంగ్లో జన్మించారు.[2] ఈయన బెంగాల్ లో విద్యాభ్యాసం చేశారు. ఈయన గొల్లపల్లిలో రాజకుటుంబానికి చెందిన రాకుమారిని వివాహమాడారు.[1]

రౌత్రాయ్ తన 11 యేండ్ల వయసు నుంచే రచనా ప్రస్థానాన్ని ప్రారంభ్హించారు.[1] పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమ భావాలు ఉన్నాయన్న కారణంగా ఆయన రచనలలో కొన్నింటిని బ్రిటిష్ రాజులు నిషేధించారు.

ఆయన కటక్లో ఆగష్టు 21, 2004 లో మరణించారు.[1]

సాహితీ సేవ

రౌత్రాయ్ తన రచనా వ్యాసాంగాన్ని 1932లో " పథేయ " (తొలి కవిత) తో ప్రారంభించాడు. 1943లో బాజీ రౌత్ అనే కవిత ప్రచురణతో రౌత్రాయ్ ఒరియా పాఠకులలో చాలా ప్రాచుర్యం పొందాడు. ఈ దీర్ఘ కవిత, బ్రిటీషు పోలీసులను తన్న చిన్న పడవలో బ్రాహ్మణి నది ఆవలి ఒడ్డుకు చేర్చటానికి నిరాకరించినందుకు, వారి బుల్లెట్లకు బలైన పడవనడిపే అబ్బాయి యొక్క వీరమరణాన్ని కీర్తిస్తుంది. రౌత్రాయ్ కవితా ఝరి అనర్గళంగా సాగింది. ఈయన దాదాపు ఇరవై దాకా కవితా సంపుటాలను ప్రచురించాడు. ఈయన పట్టణపు యువతి యొక్క వేదనను, కష్టాలను చిత్రిస్తూ వ్రాసిన ప్రతిమా నాయక్ ఎంత ప్రాచుర్యం పొందిందో, ఒరిస్సా గ్రామీణ జీవితంపై వ్రాసిన పల్లిశ్రీ', కూడా అంతే ప్రాచుర్యం పొందింది. ఈయన ప్రజా కవులుగా పేరుపొందిన రచయితల కోవకు చెందుతాడు[1]

రౌత్రాయ్ మతసంబంధమైన విషయాలపై కూడా కొన్ని కవితలు ప్రచురించాడు.

అవార్డులు - గుర్తింపులు

 • 1962 : పద్మశ్రీ [1]
 • 1963 : సాహిత్య అకాడమీ అవార్డు - "కవితా 1962"కు వచ్చింది.[3]
 • 1965 : సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు [1]
 • 1986 : జ్ఞానపీఠ్ అవార్డు [4]
 • 1988 : లైఫ్ టైం ఫెలోషిప్ (కేంద్రసాహిత్య అకాడమీ)
 • 1986 : "మహాకబి" సమాన్ - రూర్కెలా,
 • 1988 : కటక్ ప్రెసిడెంట్ - నిఖిల్ భరత్ కబితా సమ్మేళన్
 • 1997 : సాహిత్య భారతి అవార్డు.

ఇవికూడా చూడండి

మూలాలు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Sachidananda Routray passes away". The Hindu. 2004-08-22. Retrieved 2008-11-06. Cite web requires |website= (help)
 2. "SACHI ROUTRAY". orissadiary.com. 2012. Retrieved 23 May 2012. Sachi Routray was born in Gurujang near Khurda on May 13, 1916.
 3. "Sahitya Akademi Awards 1955-2007 (Oriya)". Sahity Akademi. Retrieved 2008-11-06. Cite web requires |website= (help)
 4. "Jnanpith Laureates". Bharatiya Jnanpith. Retrieved 2008-11-06. Cite web requires |website= (help)

బయటి లంకెలు

1986

1986 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

జ్ఞానపీఠ పురస్కారం

భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యున్నతమైనది. దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు. వాగ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార పత్రం, పదకొండు లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం. 1961లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా 1965లో మలయాళ రచయిత జి శంకర కురుప్‌కు వచ్చింది. భారతీయ అధికార భాషలలో దేనిలోనైనా రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు. ఐతే ఒక భాషాసాహిత్యానికి ఈ పురస్కారం లభించిన తర్వాత మూడేళ్ళపాటు ఆ భాషాసాహిత్యాన్ని ఈ పురస్కారానికి పరిశీలించరు.

1982కు ముందు, ఏదైనా ఒక రచనకు గాను సంబంధిత రచయితకు ఈ పురస్కారం ఇచ్చేవారు. అప్పటినుండి, భారతీయ సారస్వతానికి చేసిన సేవకు కూడా ఈ బహుమతిని ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కన్నడ రచయితలు అత్యధికంగా ఎనిమిదిసార్లు ఈ పురస్కారం అందుకున్నారు. హిందీ రచయితలు ఆరుసార్లు అందుకున్నారు.

పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1960-1969)

పద్మశ్రీ పురస్కారం భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం. 1960-1969 మధ్యకాలంలో ఈ బిరుదు పొందినవారు:

bgcolor=#edf3fe

ప్రతిభా రాయ్

ప్రతిభా రాయ్ ప్రముఖ ఒరియా సాహిత్యవేత్త. ఆమె అత్యుత్తమ భారతీయ సాహిత్య పురస్కారాల్లో ఒకటిగా పేరొందిన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందింది.

రంజని తెలుగు సాహితీ సమితి

రంజని గత 50 ఏళ్లకు పైగా తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న సంస్థ. ఇధి 1961 లో ప్రారంభమైంది.

హైదరాబాదులోని అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆఫీసులోని ఉద్యోగులు మాత్రమే దీనిలో సభ్యులైనా సాహితీ సేవలో మాత్రం సాహితీమిత్రలందరిని కలుపుకుంటుంది.

రంజని ప్రధాన కార్యక్రమాలు : పుస్తక / పత్రికా ప్రచురణ, సాహితీ కార్యక్రమాల నిర్వహణ, వచన కవితలు, పద్యకవితలు, కథల పోటీల నిర్వహణ, యువ సాహితీ వేత్తలకు ప్రోత్సాహం.

సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు

సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు స్నేహ శాంతుల కోసం అత్యున్నత సేవలనందించిన భారతీయులకు ప్రదానం చేయబడింది. ఈ అవార్డును ఇండో సోవియట్ సంబంధాలలో భాగంగా సోవియట్ లాండ్ పక్షపత్రిక జవహర్ లాల్ నెహ్రూ సంస్మరణార్థం నెలకొల్పింది. ఈ అవార్డు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారంగా పరిగణించబడింది.

1965–1985
1986–2000
2001–ప్రస్తుతం వరకు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.