సంస్కృతి

సంస్కృతి (లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ Cultura, ఫ్రెంచ్, ఆంగ్లం Culture, జర్మన్, స్వీడిష్ Kultur) అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం కల్చుర లేదా కొలెరె అనేవి "పండించడం" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి.[1] ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు మరియు నిర్మాణాలు మరియు వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.[2]

ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును.[3] ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి

Hasht-Behesht Palace ney and Tar
ఇరాన్కు చెందిన ఫర్‌హంగ్ సంస్కృతి, ఇరానియన్ నాగరికతకు చిహ్నం. పర్షియన్ సంగీతకారిణులు (అష్ట-స్వర్గాల సౌధం లోగల పెయింటింగ్ చిత్రం)
Gobustan ancient Azerbaycan full
అజర్‌బైజాన్‌లో క్రీ.పూ. 10,000 సంవత్సరాలనాటి రాతి చెక్కడాలు - గోబుస్తాన్

సంస్కృతి నిర్వచనం

ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి.[4] ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి.[5] వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అని మానవ శాస్త్రజ్ఞులు భావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.

1874లో సామాజిక పురా శాస్త్రము గురించి వ్రాస్తూ టైలర్ సంస్కృతిని ఇలా వర్ణించాడు - "సంస్కృతి" లేదా "నాగరికత"ను విస్తారమైన జాతిపరమైన అంశంగా భావిస్తే, ఆ జాతి లేదా సమాజపు సంక్లిష్టమైన జ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతికత, చట్టం, ఆచారాలు మరియు సమాజంలో భాగస్తుడైనందున వ్యక్తికి సంక్రమించే అలవాట్లు, నైపుణ్యత, అవకాశం - అన్నింటినీ కలిపి సంస్కృతి అనవచ్చును. ("సంస్కృతి లేదా నాగరికత, దాని విస్తృత ఎథ్నోగ్రాఫిక్ కోణంలో తీసుకున్న, జ్ఞానం, నమ్మకం, కళ, నీతులు, చట్టం, ఆచారం కలిగి సంక్లిష్ట మొత్తంగా ఉంటుంది మరియు ఏ ఇతర సామర్థ్యాలు మరియు అలవాట్లు సమాజంలో సభ్యుడిగా మనిషికి సొంతం") [6]

ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు (సమూహపు) సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే.[7] ఇంకా సంస్కృతిని చాలా విధాలుగా విర్వచించారు. 1952లో ఆల్ఫ్రెడ్ క్రోబర్ మరియు క్లైడ్ క్లుఖోన్ అనే రచయితలు తమ[8] సంకలనంలో "సంస్కృతి"కి 161 నిర్వచనాలను సేకరించారు

భారతీయ సంస్కృతి

ప్రపంచదేశాలలో భారతీయ సంస్కృతికి విశిష్టమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతి సనాతనమైనది

తెలుగువారి సంస్కృతి (తెలుగుదనం)

పుట్టింటి సారె
పుట్టింటి సారె
తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పండుగలు

వినాయకచవితి, ఉగాది, ఏరువాక, అట్ల తద్దె, భోగి, సంక్రాంతి, కనుమ, బోనాలు, bathukamma, graama devathala poojalu, తెలుగు నెలలు పండుగలు, దీపావళి

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Harper, Douglas (2001). Online Etymology Dictionary.
  2. Findley, Carther Vaughn and John Alexander Rothney (2006). Twentieth-century World. Sixth edition, p. 14. ISBN 978-0-618-52263-7.
  3. Williams, Raymond. Keywords, "Culture"
  4. [[:en:Raymond Williams|]] (1976) en:Keywords: A Vocabulary of Culture and Society. Rev. Ed. (NewYork: Oxford UP, 1983), pp. 87-93 and 236-8.
  5. John Berger, Peter Smith Pub. Inc., (1971) Ways of Seeing
  6. Tylor, E.B. 1874. Primitive culture: researches into the development of mythology, philosophy, religion, art, and custom.
  7. UNESCO. 2002. [1] Universal Declaration on Cultural Diversity.
  8. Culture: A Critical Review of Concepts and Definitions అనే Kroeber, A. L. and C. Kluckhohn, 1952. Culture: A Critical Review of Concepts and Definitions.

బయటి లింకులు

అష్టవిధ నాయికలు

150అష్టవిధ నాయికలు (Ashta-Nayika) భరత ముని రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొనిన ఎనిమిది రకాల నాయికలను కలిపి ప్రయోగించే పదం. ఈ ఎనిమిది రకాల నాయికలు ఎనిమిది వివిధములైన మానసిక అవస్థలను తెలియజేస్తుంది. వీనిని భారతీయ చిత్రకళలోను, సాహిత్యం, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్యాలలో ప్రామాణికంగా పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా

ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.

దీని ముఖ్యపట్టణం ఆదిలాబాద్..బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు అదిలాబాదును 'ఎడ్లవాడ' అని పిలిచే వారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోక ముందు, ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 20% కలిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంపన్న జిల్లాలలో ఇది ఒకటి. తెలంగాణ 11 జిల్లాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో ఇది ఆదిలాబాద్ జిల్లాకు పరిపాలనా కేంద్రం.

ఆదివారము

ఆదివారము (Sunday) అనేది వారములో శనివారమునకు, సోమవారమునకు మధ్యలో ఉంటుంది. కొన్ని దేశ, సంస్కృతులలో ఇది వారాంతములో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు. ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం ఇది వారంలో ఆఖరి రోజు కాగా, చాలా సంప్రదాయాలు, సంస్కృతుల్లో ఇది వారంలో మొదటిరోజు.

తెలుగు - ఆదివారము అనే పదము ఆదిత్య వారము నుంచి పుట్టినది.

సంస్కృతము-భానువారము అని పిలుస్తారు

భారత దేశములోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో రవివార్గా పిలువబడుతుంది.

ఒంగోలు

ఒంగోలు నగరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లా యొక్క ముఖ్య పట్టణము మరియు ఒంగోలు మండలానికి కేంద్రము.

కర్నూలు జిల్లా

కర్నూలు దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జిల్లా. జిల్లాలో ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన, ప్రపంచంలోకెల్లా పెద్దదైన, వన్యమృగ సంరక్షణ కేంద్రం (శ్రీశైలం - నాగార్జునసాగర్) ఉంది. ఎప్పుడో అంతరించి పోయిందని భావించబడిన బట్టమేక పిట్ట ఇటీవల జిల్లాలోని రోళ్ళపాడు వద్ద కనిపించడంతో ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. అక్టోబరు 2, 2009న భారీ వర్షాలు మరియు హంద్రీ, తుంగభద్ర నదుల వరద నీటివల్ల కర్నూలు పట్టణంలో వందల ఇళ్ళు మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

మధ్వాచార్యులు అయిన రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం కర్నూలు జిల్లాలోదే. మంత్రాలయం తుంగభద్రా నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రం. అహోబిలంలో నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ నరసింహస్వామిని నవరూపాలుగా కొలుస్తారు. మహానందిలో నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడి కోనేరులో అన్ని కాలాల్లోను నీరు ఒకే మట్టంలో ఉంటుంది. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం ఈజిల్లాలోదే. ఇక్కడ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవాలయాలు ఉన్నాయి. కృష్ణా నదిపై ఇక్కడ నిర్మించబడ్డ ఆనకట్ట దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. లక్షలాది ఎకరాలకు నీరందించడమే కాక, విద్యుదుత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ప్రధాన వనరుగా ఉంది.

కోల్‌కాతా

కోల్‌కాతా (బెంగాళీ: কলকাতা) భారత దేశములోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని. ఇది తూర్పు భారత దేశములోని హుగ్లీ నది తూర్పు తీరముపై ఉంది. 2011 జనాభాగణాంకాలను అనుసరించి ఈ నగర జనాభా ప్రధాన నగరము 50 లక్షల జనాభా కలిగిఉన్నది కానీ చుట్టుపక్కల మహానగర పరిసర ప్రాంతాలను కలుపుకొని 1.4 కోట్ల జనాభా ఉంది. భారతీయ ప్రధాన నగరాలలో ఈ నగర జనసాంద్రత మూడవ స్థానంలో ఉంది. 2008 గణాంకాలను అనుసరించి ఈ నగరం కుటీర పరిశ్రమల ద్వారా పొందుతున్న ఆదాయం దక్షిణఆసియా దేశాలలో మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో ముంబయ్ ఢిల్లీ నగరాలు ఉన్నాయి. భారతీయ రాష్ట్రాలలో ఒకటి అయిన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత. హుగ్లీ నది తూర్పుతీరంలో ఉన్న ఈ నగరం తూర్పుభారతదేశానికి సాంస్కృతిక, వాణిజ్య మరియు విద్యా కేంద్రంగా విలసిల్లుతుంది. భారతీయ రేవుపట్టణాలలో ఇది పురాతనమైనది అలాగే అధికంగా ఆదాయాన్ని అందిస్తున్న రేవులలో ఇది ప్రధానమైనది. అభివృద్ధి చెందుతున్న దేశంలోని అభివృద్ధి చేందుతున్న నగరంగా కోల్‌కత నగరం గుర్తించతగినంతగా శివారుప్రాంతం లోని జనాభా పెరుగుదల, వాహన రద్దీ, పేదరికం, అధిక జనసాంద్రత మరియు ఇతర చట్టపరమైన సాంఘిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది.

17వ శతాబ్దపు చివరి సమయంలో మొగల్ సామ్రాజ్య బెంగాల్ రాజ్యప్రతినిధి పాలనలో ప్రస్తుత కోల్ కత ప్రదేశంలో ఉన్న మూడు గ్రామాలు ఉండేవి. 1690లో బెంగాల్ నవాబు ఈస్టిండియా కంపనీకి వ్యాపార అనుమతి ఇచ్చిన తరువాత కంపనీ ఈ ప్రదేశాన్ని

బలమైన రేవుపట్టణంగా అభివృద్ధి పరచింది. 1756లో కొల్ కత నగరం నవాబు సిరాజ్ ఉద్ దులాహ్ చేత ఆక్రమించబడింది. తరువాతి సంవత్సరమే ఈస్టిండియా కంపనీ ఈ నగరాన్ని తిరిగి స్వాధీనపరచుకుని 1772 నాటికి పూర్తి సామ్రాజ్యాధిపత్యం కూడా సాధించింది. మొదట ఈస్టిండియా కంపనీ తరువాత బ్రిటిష్ సామ్రాజ్యపాలనలో కొల్ కత 1911 వరకు భారతదేశ రాజధానిగా ఉంటూ వచ్చింది. ఈ నగర భౌగోళిక పరమైన అసౌకర్యాలు, బెంగాలులో సమైగ్ర స్వతంత్ర ఉద్యమం తీవ్రరూపందాల్చడం వంటి పరిణామాల కారణంగా రాజధాని కొత్త ఢిల్లీకి బదిలీ చేయబడింది. ఈ నగరం స్వాతంత్ర్యోద్యమంలో కేంద్రస్థానం అయింది. ఆ సమయంలో ఈ నగరం ఉద్రక్త రాజకీయాలలో ఉంటూ వచ్చింది. 1947 స్వతంత్రం వచ్చిన తరువాత ఆధునిక భారతదేశంలో కొల్ కత విద్య, వితజ్ఞానం, సంస్కృతి మరియు రాజకీయలలో పలు దశాబ్ధాల కాలం ఈ నగరం ప్రధానకేంద్రంగా అభివృద్ధి చెందింది.

2000 నుండి ఈ నగరం వేగవంతంగా ఆర్థిక ప్రగతిని సాధించింది.

భారతదేశంలో 19-20 శతాబ్దాల మధ్యకాలంలో బెంగాల్ శిల్పశైలి మరియు మతవిశ్వాసం సంప్రదాయకంగా విభిన్నమైన సంస్కృతికి బెంగాల్ కేంద్రస్థానం అయింది. కోల్ కతలో ప్రాంతీయ సంప్రదాయరీతులను నాటకాలు, కళ, చలనచిత్రాలు మరియు సాహిత్యం రూపాలలో ప్రదర్శించే ఏర్పాట్లు జరగడం వలన అత్యధికమైన అభిమానులను సంపాదించుకుంది. భారతదేశంలో నోబుల్ బహుమతి అందుకున్న వారిలో పలువురు కొల్ కతలో జన్మించిన వారే. వీరు కళారంగంలోనూ, విజ్ఞానరంగంలోనూ మరియు ఇతర

రంగాలలోనూ నోబుల్ బహుమతి అందుకున్నారు. కొల్ కత నగరంలో తయారు చేయబడుతున్న చలనచిత్రాలకు జాతీయస్థాయి గుర్తింపు ఉంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అకాడమీ ఆప్ ఫైన్ ఆర్ట్స్, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, క్రికెట్ గ్రౌండ్స్ వంటివి కెల్ కతలో ఉన్నాయి. మిగిలిన భారతీయ నగరాలకంటే ప్రత్యేకంగా కెల్ కత ఫుట్ బాల్ సంబంధిత క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంది.

నెల్లూరు

నెల్లూరు భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు అయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క ముఖ్య పట్టణము, మండలము, లోక్‌సభ, శాసన సభ నియోజక వర్గము కూడాను. నెల్లూరు వరి సాగుకు, ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయం ఉంది. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం). అంతేకాక ప్రాచీనమైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఉంది. రాష్టృంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెల్లూరు నగరం ఒకటి. జనాభా సుమారు 6 లక్షలు.

పంజాబ్

పంజాబ్ (ਪੰਜਾਬ) (Punjab) భారతదేశంలో వాయువ్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన జమ్ము-కాష్మీరు, ఈశాన్యాన హిమాచల్ ప్రదేశ్, దక్షిణాన హర్యానా, నైఋతిలో రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ దేశపు పంజాబు రాష్ట్రము ఉంది.

'పంజ్' - అంటే ఐదు, 'ఆబ్' - అంటే నీరు. ఈ రెండు పదాలనుండి 'పంజాబు' పదం వచ్చింది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ - అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తూ దానిని సశ్యశ్యామలం చేస్తున్నాయి. సారవంతమైన నేల, పుష్కలమైన నీరు, కష్టించే జనులు - వీరంతా కలిసి పంజాబును దేశపు వ్యవసాయంలో అగ్రభాగాన నిలుపుతున్నారు. పారిశ్రామికంగా కూడా పంజాబు మంచి ప్రగతి సాధిస్తున్నది.

పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్ (West Bengal, পশ্চিমবঙ্গ, Pôščim Bôngô) భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యాన అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం సముద్రమూ, వాయువ్యాన ఒడిషా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము

'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము' భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది డిసెంబరు 2 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య మరియు లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది.

ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క తొమ్మిది కోస్తా ప్రాంతపు జిల్లాల్లో ఒకటి.

ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణము ఒంగోలు. ఒంగోలు జిల్లా ఫిబ్రవరి 2,1970వ తేదీన, నెల్లూరు, కర్నూలు మరియు గుంటూరు జిల్లాల యొక్క కొంత భాగముల నుండి ఆవిర్భవించింది. తరువాత డిసెంబర్ 5,1972వ తేదీన, జిల్లాలోని కనుపర్తి గ్రామములో పుట్టిన గొప్ప దేశభక్తుడు మరియు ఆంధ్ర నాయకుడైన, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది.

స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఈ జిల్లాలో జరిగిన చీరాల పేరాల ఉద్యమం పేరుగాంచింది. భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన ఎర్రాప్రగడ,సంగీత విద్వాంసుడు త్యాగరాజు, శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారే. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. ప్రకాశంజిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు.

బంగ్లా భాష

బంగ్లా లేదా బెంగాలీ భారత ఉపఖండములోని తూర్పు భాగమునకు చెందిన ఒక ఇండో-ఆర్యన్ భాష. బంగ్లా మాగధీ పాకృతం, పాలీ మరియు సంస్కృతముల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి మరియు స్థాయి ఉన్నాయి.

బెంగాలీని స్థానికంగా దక్షిణ ఆసియాలోని తూర్పు ప్రాంతమైన బెంగాల్లో మాట్లాడుతారు (ప్రస్తుత బంగ్లాదేశ్ మరియు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. 23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. (ప్రపంచ భాషలలో 5వ లేదా 6వ స్థానములో ఉన్నది).

బంగ్లాదేశ్ లో బంగ్లా ప్రాథమిక భాష మరియు భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.. అస్సామీతో పాటు బెంగాలీ, ఇండో-ఇరానియన్ భాషలలో భౌగోళికముగా అత్యంత తూర్పునకు వ్యాపించి ఉన్న భాష.

భారత దేశం

భారత గణతంత్ర రాజ్యము నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో రెండో స్థానం కలిగి వుంది, వైశాల్యములో ప్రపంచంలో ఏడవది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి (పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది.

దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారుల పైన ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన (అరేబియా సముద్రము అరేబియా సముద్రం), మరియు తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్[1] దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరికతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము) జన్మనిచ్చింది. 18 వ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా స్వాధీనం చేసుకోవడంతో భారతదేశం బ్రిటిష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ నుండే పాలించబడింది. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం చేసిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1947లో బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందింది.

భారత ఆర్థిక వ్యవస్థ నామమాత్ర GDP మరియు కొనుగోలు శక్తి తుల్యత (PPP) ద్వారా మూడవ అతిపెద్ద ద్వారా ప్రపంచ పదకొండో స్థానంలో ఉంది. 1991 లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది.భారత దేశాన్ని కొత్తగా పారిశ్రామీకరణ జరిగిన దేశంగా భావిస్తారు. అయితే, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, పోషకాహార లోపం, మరియు తగని ప్రజా ఆరోగ్య సవాళ్లను ఎదుర్కుంటూ ఉంది. ఒక అణ్వాయుధ మరియు ప్రాంతీయ శక్తి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైన్యం కలిగి ఉంది. ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. భారతదేశం 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య రాజ్యాంగ గణతంత్రం. భారతదేశం ఒక, బహుభాషా, మరియు బహుళ జాతి సొసైటీ. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశము.

మధ్య ప్రదేశ్

మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) (హిందీ:मध्य प्रदेश) - పేరుకు తగినట్లే భారతదేశం మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని నగరం భోపాల్. ఇంతకు పూర్వం దేశంలో వైశాల్యం ప్రకారం మధ్యప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా ఉండేది. కాని 2000 నవంబరు 1 న మధ్యప్రదేశ్‌లోని కొన్నిభాగాలను వేరుచేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.

రాజస్థాన్

రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు. మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)

రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశము థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం. అందువల్ల అది ఎడారిగా మారింది. మరొప్రక్క దట్టమైన అడవులతో గూడిన రణథంబోర్ నేషనల్ పార్క్ (పులులకు సంరక్షణాటవి), ఘనా పక్షి ఆశ్రయము, భరత్ పూర్ పక్షి ఆశ్రయము ఉన్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరం.

వరంగల్ పట్టణ జిల్లా

వరంగల్ పట్టణ జిల్లా, భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.

ఈ జిల్లా పరిపాలన కేంద్రం వరంగల్ పట్టణం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో లోగడ ఉన్న వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు.ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది.

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం విజయనగరం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. ఈ జిల్లా 1979 జూన్ 1 తేదీన ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారము విజయనగరం జిల్లా యొక్క జనాభా 22,45,100. ఈ జిల్లా సరిహద్దులు శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాలు, ఒడిషా రాష్ట్రం మరియు బంగాళా ఖాతము.

శ్రీలంక

శ్రీలంక (ఆధికారికంగా డెమోక్రటిక్ సోషలిష్టు రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక)ను 1972కు పూర్వం సిలోను అనేవారు. భారతదేశ దక్షిణ తీరప్రాంతానికి 31 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేశం దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం. హిందూ మహాసముద్రంలో ఆణిముత్యంగా ప్రసిద్ధి చెందింది. జనాభా సుమారుగా 2 కోట్లు. ఇది ఉన్న ప్రదేశం మూలంగా పశ్చిమ ఆసియాకు మరియు ఆగ్నేయ ఆసియాకు నౌకాయాన కేంద్రంగా నిలిచింది. ప్రాచీన కాలం నుంచి బౌద్ధ మతము నకు మరియు సంప్రదాయానికి కేంద్ర బిందువు. కానీ నేడు ఇతర మతాలైన హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం ప్రజలు మరియు ఇతర జాతుల వారు 25% శాతం వరకూ ఉన్నారు. జనాభాలో సింహళీయులే అధికంకాగా ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తమిళులు మైనారిటీలో అధిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొన్ని ముస్లిం తెగల వారు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.

టీ, కాఫీ, రబ్బరు, మరియు కొబ్బరి కాయల ఎగుమతులకు శ్రీలంక ప్రసిద్ధి గాంచింది. అభివృద్ధి చెందుతున్న ఆధునిక వాణిజ్య వ్యవస్థ, ప్రకృతి అందాలు సముద్ర తీర ప్రాంతాలు, మరియు అడవులు ఘనమైన సంస్కృతి మరియు నాగరికతలు దీనిని పర్యటక కేంద్రంగా నిలుపుతున్నాయి. రెండు వేల సంవత్సరాలపాటు చిన్న రాజ్యాలుగా పాలింపబడిన శ్రీలంకకు, 16వ శతాబ్దం మొదటి భాగంలో పోర్చుగీసు వారి రాకతో విదేశీయుల రాక ఆరంభమైంది. 1815వ సంవత్సరంకల్లా బ్రిటిష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పై దాడిచేసేందుకు సంకీర్ణ దళాలకు శ్రీలంక ప్రధాన స్థానంగా ఉపయోగపడింది. జాతీయ రాజకీయ ఉద్యమం మూలంగా 20వ శతాబ్దం మొదటి భాగంలో 1948 లో స్వాతంత్ర్యం సిద్ధించింది. అప్పటి నుంచి శ్రీలంక గణతంత్ర రాజ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈశాన్య ప్రాంతంలో పొంచిఉన్న తమిళ పులులు.

సికింద్రాబాద్

సికింద్రాబాద్‌, తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు జంట నగరంగా ప్రసిద్ధి పొందింది.

హుస్సేన్ సాగర్ జలాశయం ఈ రెండు నగరాలను వేరు చేస్తుండగా, కరకట్ట ఈ రెండు నగరాలను కలుపుతుంది. జంట నగరాలుగా పిలువబడినప్పటికీ ఈ రెండింటి మధ్య సాంస్కృతిక పరమైన వ్యత్యాసం ఉంది.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.