శతాబ్దము

శతాబ్దము లేదా శతాబ్ది (Centuary) అనేది 100 సంవత్సరములకు సమానమైన ఒక కాలమానము. ప్రస్తుతం మనము క్రీ.శ. 21 వ శతాబ్దం (2001 - 2100) లో ఉన్నాం.

శతాబ్ది కాలం జీవించిన ప్రముఖులు

వివిధ దేశాలలో వీరి సంఖ్య

Country Centenarians (year) Centenarians (year) Centenarians (year) Centenarians (year) Percent over 65 Rate Per Mln People
కెనడా 3,795 (2006) [1] 3,125 (2001) - - 13%
చైనా 17,800 (2007) [2] - - - 7.9% 13.4
ఫ్రాన్స్ 20,115 (2008) [3] 8,000 (2000) - -
జపాన్ 36,276 (2008) [4] 32,295 (2007) [5] 1,000 (1981) 153 (1963) 22.3% 284.0
దక్షిణ కొరియా 961 (2005) [6] - -
అమెరికా 50,454 (2000) 37,306 (1990) - - 13% 200.2
ఇంగ్లండు 9,330 (2007) [7] 8,370 (2005) 7,100 (6-2002) 100 (1911) 16% 169.8

శతాబ్ది కాలం పూర్తిచేసుకున్న సంస్థలు

ప్రపంచం

భారతదేశం

ఆంధ్ర ప్రదేశ్

మూలాలు

  1. 2001 Census: Age and sex profile: Canada
  2. China News 2007-12-14
  3. Centenarians in France: more French living past 100 | Web in France Magazine
  4. BBC News
  5. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; search.japantimes.co.jp అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. www.korea.net 2006-06-21
  7. National Statistics Online - Product - Mid-2002 to Mid-2007 Estimates of the very elderly (including centenarians) (experimental)
ఆతుకూరి మొల్ల

ఆతుకూరి మొల్ల (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణము గా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణమును రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయము (16వ శతాబ్దము) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమనీయమైనది.

ఇడ్లీ

ఇడ్లీ (ఆంగ్లం: Idli or Idly) దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు మరియు బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు. మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.

సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి చట్నీ లేదా సాంబారు లేదా కారంపొడిగానీ, పచ్చడితో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి. అంతే కాకుండా, ఇడ్లీలు ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.

ఎలకూచి బాలసరస్వతి

ఎలకూచి బాలసరస్వతి జన్మతః పాలమూరు జిల్లా వాడు కాకపోయినా, కాకలుదీరిన కవిగా ఘనతికెక్కినది మాత్రం పాలమూరు జిల్లాకు చెందిన జటప్రోలు సంస్థానములోనే. నెల్లూరు జిల్లా పొదిలి తాలుకాలోని ఎడవిల్లి అగ్రహారం వీరి జన్మస్థానం. ఇతడు క్రీ.శ పదునారవ శతాబ్దము చివరను పదునేడు పుర్వార్థమున ఉండినట్లు చారిత్రక ఆధారములున్నవి. వీరు కొంత కాలం విజయనగరంలో గడిపారు. తరువాత తెలంగాణలోని పర్తియాల సంస్థానానికి చేరుకొని రాజా జూపల్లి వెంకటాద్రి దగ్గర కొంత కాలం పనిచేసి, సురభి ముమ్మడి మల్లానాయుడి కాలంలో జటప్రోలు సంస్థానానికి చేరుకోని వారి కుమారుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు.

ఎల్లోరా గుహలు

ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కి.మీ. దూరములో ఉంది. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు మరియు సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి.

మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటి నిర్మాణం కాలం క్రీ.పూ 600 నుంచి 800 మధ్య ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీ.పూ 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీ.పూ 800-1000. ఈ గుహలన్నీ పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి.

ఇందులో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. మూడు మతాల భావ సంగమం ఇది. ఎల్లోరాని అక్కడి స్థానికులు వేరులిని అని పిలుస్తారు. ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు-అక్టోబరు మధ్య కాలం అనువైనది. కాని విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే-జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు.

ఒడియా భాష

ఒరియా (ଓଡ଼ିଆ oṛiā), భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే భారతీయ భాష. ఒరియా కూడా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణముగా ఒడియా అని అంటారు. ఒరియా ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వము తూర్పు భారతదేశములో మట్లాడుతున్న మాగధి లేదా పాళీ అనే ప్రాకృత భాష నుండి నేరుగా ఉద్భవించినదని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన బెంగాళీ, అహోమియా (అస్సామీ) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై పర్షియన్ మరియు అరబిక్ భాషల ప్రభావము చాలా స్వల్పము.

ఒరియాకు 13వ శతాబ్దము నుండి ఘనమైన సాహితీ వారసత్వము ఉంది. 14వ శతాబ్దములో నివసించిన సరళ దాస్, ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు. 15వ మరియు 16వ శతాబ్దములలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవములోకి వచ్చాయి. ఆ కాలములో ప్రసిద్ధి చెందిన కవులలో ఉపేంద్ర భంజ కూడా ఒకడు. ఆధునిక యుగములో ఒరియాలో విశిష్ట రచనలు చేసినా వారిలో ఫకీర్ మోహన్ సేనాపతి, మనోజ్ దాస్, కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, మరియు గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.

ఒరియా సాంప్రదాయకముగా బౌద్ధ మరియు జైన మతాలచే ప్రభావితమైనది. ఒరియాను ఒరియా లిపిలో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒడిషాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒడిషా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.

కాకతీయులు

కాకతీయులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాలను క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు . శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.

కాకతీయులు దుర్జయ వంశస్థులుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు ధరించారు.వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్లు).

కాళిదాసు

కాళిదాసు ఒక సంస్కృత కవి మరియు నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు మరియు నాటకములు చాలావరకు హిందూ పురాణ మరియు తత్త్వ సంబంధముగా రచించాడు. రఘువంశము, కుమార సంభవము, మేఘసందేశం అనే మూడు మహాకావ్యాలు, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము అనే మూడు నాటకాలు ఆయన రచనల్లో పేరు గాంచినవి. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు.

కొచ్చి

కొచ్చిన్ లేదా కొచ్చి (మలయాళం: കൊച്ചി) కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకుళం జిల్లా లోని అతిపెద్ద నగరం.మరియు ఒక రేవు పట్టణం. తరచూ కొచ్చిన్ ని ఎర్నాకుళం అనే వ్యవహరిస్తూ ఉంటారు. కొచ్చి జనాభా 601, 574. కేరళ రాష్ట్రంలోనే అత్యంత జనసాంద్రత గల పట్టణం కొచ్చి.

రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురము (ట్రివేండ్రం) కి ఉత్తర దిశగా 220 కి.మీ (137 మై) దూరంలో, రాష్ట్రంలోని పెద్ద నగరాలలో తృతీయ స్థానంలో ఉన్న కోజిక్కోడ్కి దక్షిణ దిశగా 180 కి.మీ (112 మై) గా ఏర్పడి ఉంది. అరేబియా సముద్రపు మహారాణిగా పిలువబడే కొచ్చి 14వ శతాబ్దము నుండే సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి అనుకూలంగా నిలచి ప్రాముఖ్యత సంతరించుకొన్నది. 1503 లోనే పోర్చుగీసు సాంరాజ్యము యొక్క భాగమై, భారతదేశంలో మొట్టమొదటి ఐరోపా దేశస్థుల మజిలీ అయినది. 1530 లో పోర్చుగీసు గోవాకి వారి కార్య కలాపాలని తరలించేవరకూ కొచ్చి యే వారి మజిలీ. పిమ్మట డచ్, బ్రిటీష్ రాజ్యాలు కొచ్చిని అభివృద్ధి చేశాయి.

గణితము

గణిత శాస్త్రం, లెక గణితం (గ్రీకు భాష యందు μάθημα máthēma, "జ్ఞానం, అధ్యయనం, నేర్చుకొను") అనగా పరిమాణములు, సంఖ్యలు, నిర్మానములు, స్థలాలు మరియు మార్పుల యొక్క నైరూప్య అధ్యయనము. దానికి సాధారణంగా అంగీకరింపబడిన నిర్వచనము లేదు.

గణిత శాస్త్రవేత్తలు క్రమాలను అన్వేషించి, వాటితో కొత్త ప్రతిపాదనలను రూపొందించుతారు. వారు ఆ ప్రతిపాదన యొక్క సత్యాన్ని లేక అసత్యాన్ని గణితశాస్త్ర ఆధరాలతో నిర్ధారిస్థారు. ఎప్పుడైతే గణిత నిర్మాణములు వాస్తవానికి మంచి నమూనాలు అవుతాయో, అప్పుడు గణిత తార్కికం ప్రకృతి యొక్క అంతర్దృష్టి లేక అంచనాలు అందించగలుతాయి. నైరూప్యత మరియు తర్కం యొక్క వాడుకతో గణిత శాస్త్రం లెక్కించుట, గననము, కొలత, మరియు భౌతిక వస్తువుల యొక్క ఆకారకదలికల క్రమబద్ధమైన అధ్యాయనము నుంచి అభివృద్ధి చెందినది. ఆచరణాత్మక గణితము లిఖిత రుజువులు ఉన్నప్పట్టి నుంచి మానవ కార్యకలాపముగా ఉనికిలో ఉంది. కొన్ని కఠిన గణిత సమస్యలు పరిష్కరించడానికి కావల్సిన పరిశోధన కోసము సంవత్సరాలు లేక శతాబ్దాలు కుడా పట్టువదలని విచారణ అవసరం అవుతుంది.

గ్రీకు గణిత శాస్తాలలో మొట్టమొదటిగా కఠినమైన వాదప్రతివాదనలు కనిపిస్తాయి, ముఖ్యముగా యూక్లిడ్ యొక్క ఎలిమెంట్స్లో. జుసెప్పె పెయానో (కి.శ. 1858 - కి.శ. 1932), డేవిడ్ హిల్బెర్ట్ (కి.శ. 1862 - కి.శ. 1943) మరియు చివరి 19వ శతాబ్దంలో సిద్ధాంతాలతో కూడిన వ్యవస్థలపై మార్గదర్శకత్వము వహించిన ఇతరులప్పటి కాలము నుంచి తగినట్టుగా ఎంచుకున్న సిద్ధాంతాలు మరియు నిర్వచనాలు నుంచి కఠినమైన మినహాయింపులతో[డిడక్షన్స్] స్థాపించిన సత్యాలుగా గణిత పరిశోధనని చూడడం ఆచరం అయ్యింది. పునరుజ్జీవన కాలము వరకు గణిత శాస్త్రం యొక్క అభివృద్ధి సాపేక్షంగా నెమ్మదిగా సాగినా, సరికొత్త శాస్త్రీయ ఆవిష్కరణలతో సంకర్షణ చెందుతూ గణిత శాస్త్రం యొక్క నున్నుతన పద్ధతులు గణిత ఆవిష్కరణలు వెగంగా పెరగడానికి దారి తీసాయి, అది ప్రస్తుత కాలం వరకు కుడా సాగుతుంది.

గెలీలియో గలిలై (కి.శ. 1564 - కి.శ. 1642) "ఈ విశ్వము యొక్క భాషని నెర్చుకొని అందులోని గుణాలతో పరిచయాన్ని పెంచుకోమో, అప్పటి వరకు మనము దాన్ని చదవలేము. ఈ విశ్వము ఒక గణిత బాషలో రచించబడినది, దాని అక్షరాలు త్రిభుజాలు, వృత్తాలు మరియు ఇతర రేఖాగణిత రూపాలు. గణితము లేనియడల ఈ విశ్వాన్ని అర్ధము చేసుకొనుట మనవ సాధ్యము కాదు. ఇవి లేకుంటే, ఒక చీకటి చిక్కుల దారిలో తిరుగుతున్నట్టే" అని అన్నారు. కార్ల్ ఫ్రెడ్రిక్ గాస్ (కి.శ. 1777 - కి.శ. 1855) గణిత శాస్త్రాన్ని "విజ్ఞానాల యొక్క రాణి" అన్నారు. బెంజమిన్ పెయర్స్ (కి.శ. 1809 - కి.శ. 1880) గణిత శాస్త్రము గూర్చి "అవసరమైన పరిష్కారాలకి అవసరమైన విజ్ఞానము" అని అన్నారు. డేవిడ్ హిల్బెర్ట్ గణిత శాస్త్రము గురించి "మనము యాదృచ్చికాల గురించి కాదు మాట్లాడేది. గణితము అసలు యాదృచ్చికంగా నిర్దేశించిచుకున్న నియమాలుతో నిర్ణయించబడేది కాదు. అది, ఒక అంతర్గత అవసరాన్ని కలిగియున్న సంభావిత వ్యవస్థే తప్ప ఇంకో రకముగా చుడలేము" అని అన్నారు. అల్బెర్ట్ ఐన్స్టీన్ (కి.శ. 1879 - కి.శ. 1955) "గణిత నియమాల వాస్తవికత వరకు వస్తే, అవి ఖచ్చితం కావు; వాటి ఖచ్చితత్వానికి వస్తే, ఆవీ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోవు" అని వ్యాఖ్యానించారు.

గణిత శాస్త్రం అనేక రంగాలలో ముఖ్యమైనది, అందులో ప్రకృతి శాస్త్రాలు, ఇంజనీరింగు, వైద్యము, ఆర్థిక-ద్రవ్య శాస్త్రలు మరియు సామాజిక శాస్త్రాలు. అనువర్తిత గణిత శాస్త్రం[అప్ప్లైడ్ మ్యాథెమాటిక్స్] సరికొత్త గణిత విభాగాలకి దారి తీసింది, అందులో గణాంకాలు[స్టాటిస్టిక్స్] మరియు ఆట సిద్దాంతము[గేం థియరి] లంటివి ఉన్నాయి. గణిత శాస్త్రవేత్తలు స్వచ్ఛ గణితముతో[ప్యూర్ మ్యాథెమాటిక్స్] కుడా పని చేస్తారు, అందులో గణితాన్ని దాని కోసం చెయ్యడము తప్ప వేరే అనువర్తిత[ప్రాక్టికాలిటి] ఆలోచన ఉండదు. అనువర్తిత గణితానికి మరియు స్వచ్ఛ గణితానికి నిశ్చితమైన విశదీకరణము లేదు. తరచూ స్వచ్ఛ గణితానికి ఆచరణాత్మక ఉపయోగాలు కనుగొనబడతాయి.

గౌడ

గౌడ కులములో ముఖ్యముగా రెండు రకాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా

పాలించిన వారు (కౌండిన్యులు) మరియు

కల్లు గీత వారు.కౌండిన్యులు (గౌడులు) క్రీ.శ.12వ శతాబ్దము నుండి చాళుక్య చక్రవర్తుల ఆధీనంలో దక్షిణ భారత దేశంలోని ముఖ్య ప్రాంతాలను పాలించారు. వారిలో చెప్పుకోదగిన వాడు కన్నడ దేశాన్ని పాలించిన కెంపె గౌడ.

ఈయన 1513-1569 మధ్య కాలంలో జీవించాడు. భారతదేశంలో ప్రముఖ నగరమైన బెంగుళూరు (1537లో) ఈయన స్థాపించినదే. కెంపె గౌడ వంశీకులు 18వ శతాబ్దము వరకు కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్య ప్రాంతాలను పాలించారు.

తమిళ భాష

తమిళం లేదా అరవం (தமிழ் = తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతనమైన భాష. దక్షిణ భారతదేశం, శ్రీలంక, సింగపూర్ లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. తమిళం దక్షిణ భారత దేశంలో తెలుగు తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడుతారు.ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడబడే భాషల వరుసలో తమిళం 15వ స్థానంలో ఉంది.

తమిళనాడు

తమిళనాడు భారతదేశపు దక్షిణాన ఉన్న ఒక రాష్ట్రము. కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, పుదుచ్చేరిలు దీని సరిహద్దు రాష్ట్రాలు. తమిళనాడుకు ఆగ్నేయాన సముద్రంలో శ్రీలంక ద్వీపమున్నది. శ్రీలంకలో గణనీయమైన తమిళులున్నారు..తమిళనాడు అధికార భాష తమిళ్.

తమిళనాడు రాజధాని చెన్నై. 1996కు ముందు దీని అధికారికనామము 'మద్రాసు'. ఇంకా కోయంబత్తూరు, కడలూరు, మదురై, తిరుచిరాపల్లి, సేలం, తిరునల్వేలి తమిళనాట ముఖ్యమైన నగరాలు.

తమిళనాడు బహుముఖంగా ప్రాముఖ్యత సంతరించుకున్న రాష్ట్రం. సంప్రదాయాలనూ, ఆధునికతనూ కలగలిపిన సమాజం. సాహిత్యము, సంగీతము, నాట్యము తమిళనాట ఈనాటికీ విస్తారమైన ఆదరణ కలిగి ఉన్నాయి. పారిశ్రామికంగానూ, వ్యాపార రంగంలో, సినిమా రంగంలో, వ్యవసాయంలో, విద్యలోనూ కూడా గణనీయమైన అభివృద్ధి సాధించింది. దేశరాజకీయాలలో తమిళనాడు కీలకమైన పాత్ర కలిగిఉన్నది.

తెలుగు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో హిందీ, తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది. మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.

వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును' ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌' గా వ్యవహరించారు. కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. తెలుగు అక్షరమాల కన్నడ భాష లిపిని పోలియుంటుంది. తెలుగు భాషలోని చాలా పదాలు, పద శబ్దాలు కూడా కన్నడ భాషను పోలియుంటాయి.

దశాబ్దము

దశాబ్దము లేదా దశాబ్ది అనేది 10 సంవత్సరములకు సమానమైన ఒక కాలమానము. దీన్ని దశకం అని కూడా అంటారు. తెలుగులో దీన్ని పదేళ్ళు అని కూడా అనవచ్చు. సంస్కృతంలో అబ్దము, అబ్ది అంటే ఒక సంవత్సరం, దశ అంటే పది. వందేళ్ళను శతాబ్దము, శతాబ్ది అని, వెయ్యేళ్ళను సహస్రాబ్దం, సహస్రాబ్ది అనీ అంటారు.

ధూర్జటి

ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు.

ఇతనిని పెద్ద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు.

ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు.

ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్రదేశములో ప్రచారములో ఉన్నవి.

పింగళి సూరనామాత్యుడు

పింగళి సూరన్న / పింగళి సూరన ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు.

శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు.

ఈయన రాఘవపాండవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు[మూలాలు తెలుపవలెను]. కళాపూర్ణోదయాన్నితెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు[మూలాలు తెలుపవలెను]. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.

ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)

గిరిజా కళ్యాణం

గరుడ పురాణం (తెనుగించాడు)

రాఘవపాండవీయం

కళాపూర్ణోదయం - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు.

ప్రభావతీప్రద్యుమ్నం

మక్కా

మక్కా లేదా మక్కాహ్ (అరబ్బీ : مكّة المكرمة) 'మక్కతుల్-ముకర్రమా' ఇస్లామీయ పవిత్ర నగరం. ఇది సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో, చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో గలదు. ఈనగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన మస్జిద్-అల్-హరామ్ (పవిత్ర మసీదు) గలదు. ఈ మసీదులోనే పరమ పవిత్రమైన కాబా గృహం గలదు. హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇచటనే చేరి హజ్ సాంప్రదాయం లోని 'కాబా గృహం చుట్టూ ఏడు తవాఫ్ (ప్రదక్షిణ) లు' చేస్తారు.

జనాభా 1,294,167 (2004 గణాంకాలు). జెద్దా నుండి 73 కి.మీ. ఎర్ర సముద్రము నుండి 80 కి.మీ. ఇరుకైన లోయప్రాంతంలో గలదు. సముద్రానికి 910 అడుగల ఎత్తునగలదు. ముస్లింలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా హజ్ యాత్ర కొరకు ఈ నగరానికి విచ్చేస్తారు. ఈ నగరంలో వేలాది ముస్లిమేతర కుటుంబాలు కుడా నివసిస్తున్నాయి. కానీ, నగరంలోని కాబాలో ప్రవేశం మాత్రం ముస్లిమేతరులకు నిషిద్ధం.

రొడ్డం

రొద్దం (ఆంగ్లం: Roddam), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లా, రొడ్డం మండలం లోని గ్రామం. పిన్ కోడ్ : 515123.

పెనుగొండ నుండి పది మైళ్ళ దూరంలో ఉన్న రొడ్డం గ్రామం జిల్లాలోనే అత్యంత ప్రాచీన గ్రామాలలో ఒకటి. ఇది క్రీ.శ 4వ శతాబ్దము నుండి 7వ శతాబ్దము మధ్యకాలంలో స్థాపించబడినదని అంచనా. ఇక్కడ పెన్నానది ఒడ్డున స్థానికులు రుద్ర పాదం అని పిలిచే ఒక శిలపైన కట్టిన గుడి ఉన్నది. పశ్చిమ చాళుక్యుల కాలంలో రొద్ద (రొద్దం) నొళంబవాడికి ప్రాంతీయ రాజధానిగా ఉన్నది. క్రీ.శ.992లో రెండవ తైలాపుడు చోళ రాజరాజును ఓడించిన తర్వాత రొద్దంలో స్థావరమేర్పరచినట్టు బళ్ళారి జిల్లాలోని కొగలి శాసనాలు తెలుపుతున్నవి. ఆహవమల్ల మొదటి సోమేశ్వరుడు రొద్దం ప్రాంతీయ రాజధానిగా నొళంబవాడిని పాలించినట్టు శాసనాలలో తెలుస్తున్నది.రొద్దం గ్రామానికి పూర్వ నామము రౌద్రపురము అని పేరున్నట్లుగా తెలుస్తున్నది. .. దాని ఆధారము 17.9.1927 నాటి సాధన పత్రిక.... 9వ పుటలో నున్న ఒక వార్త. *http://sreesadhanapatrika.blogspot.in/2014/12/2-5-17-09-1927.htmlఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2311 ఇళ్లతో, 10164 జనాభాతో 5505 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5073, ఆడవారి సంఖ్య 5091. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1418 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 64. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595339.పిన్ కోడ్: 515 123.

సాంస్కృతిక పునరుజ్జీవనం

ఐరోపాలో మధ్యయుగము తరువాత, రిఫార్మేషన్ ముందు (సుమారు 14 - 16వ శతాబ్దాల మధ్య) జరిగిన కాలాన్ని రెనసాన్స్ (ఫ్రెంచిలో పునర్జన్మ) అంటారు. ముఖ్యవైఖరుల లో

మూలముల నుండి శాస్త్ర అధ్యయనము

విజ్ఞాన శాస్త్రము ముందంజ వేయుట

చిత్రలేఖనములో దృష్టి (perspective) పెరుగుట

నాగరికమైన, పోపు సంబధమైన సంరక్షకత్వము పెరగడము

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.