విద్య

విద్య అనగా బోధన, మరియు నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యసన ల సమీకరణము. ఇంకనూ విశాలమైన భావంలో, పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడం. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం, సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజకీయం జేయడం. విద్య అనగా, వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవునికీ అంతర్-జ్ఞానాన్ని ప్రసాదించి వుంటుంది. దానిని వెలికి తీయడమే విద్య పని. విద్యారంగాలనేకం. మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రం మొదలగునవి.

AF-kindergarten
కిండర్ గార్టెన్ తరగతి గది, ఆఫ్ఘనిస్తాన్.

విధానాలు

Education index UN HDR 2007 2008
మానవ అభివృద్ధి రిపోర్టు 2007-2008 ల విద్యా సూచిక ప్రపంచ పటం చూపుతున్నది.

విద్యావిధానాలు, విద్య మరియు శిక్షణ లను ఇవ్వడానికి స్థాపించబడ్డాయి. ఇవి ప్రధానంగా పిల్లలు మరియు యువకుల కొరకు స్థాపించబడ్డాయి. పిల్లలకు యువకులకు, బోధనాంశాలను నిర్ధారించి, వారి విద్యాఫలితాలను, వారి జీవిత లక్ష్యాల కొరకు ప్రతిపాదింపబడుతాయి. వీటి వలన పిల్లలు, ఏమి నేర్చుకోవాలి?, ఎలా నేర్చుకోవాలి?, ఎందుకు నేర్చుకోవాలి? అనే ప్రశ్నలు సంధించుకొనేలా జాగ్రత్తలు తీసుకొని, వారికి విద్యా బోధన ఇవ్వబడుతుంది. బోధనా వృత్తి, ఇందుకు సర్వదా సహాయపడుతూ, పిల్లలలోని అన్ని రంగాల అభివృద్ధికొరకు సహాయపడుతూ, వారికి మంచి పౌరులుగా తీర్చి దిద్దడానికి ఎల్లవేళలా సిద్ధంగా వుంటుంది. ఈ బోధనా వృత్తి, విద్యా బోధన, బోధనాంశాలు, మూల్యాంకనము మొదలగు అంశాలపై ఆధారపడి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది.

విద్య ప్రాథమిక హక్కు

విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యా హక్కు చట్టం[1] చేశారు..ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టాల తరహాలో ఇది అమలౌతుంది. 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు 92 లక్షల మంది పాఠశాల చదువులకు వెలుపలే ఉండిపోతున్నారు. పాఠశాలల్లో చేరని, లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. పాఠశాల నిర్వహణ కమిటీ, లేదా స్థానిక ప్రభుత్వం పాఠశాల చదువులకు దూరంగా ఉండిపోతున్న ఆరేళ్లపైబడిన బాలిబాలికలందరినీ గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇప్పించి, పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాల్సి ఉంటుంది. ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్‌ను నిరాకరించటానికి వీల్లేదు. ప్రైవేటు పాఠశాలలు సైతం 25% సీట్లను బలహీన, పేద వర్గాలకు కేటాయించాలి.వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.నిధులను 55-45 నిష్పత్తిలో కేంద్రం రాష్ట్రాలు భరించాలి. ఆంధ్ర ప్రదేశ్ రా ష్ట్ర స్థాయిలో నియమ నిబంధనలు రూపొందించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ కృషి చేస్తుంది.

ప్రాథమిక విద్య

[[దస్త్రం:Teaching Bucharest 1842.jpg|thumb|right|బయలు ప్రదేశంలో ప్రాథమిక పాఠశాల. 1842 బుచారెస్ట్లో ఒక ఉపాధ్యాయుడు (ప్రీస్ట్) తరగతి నిర్వహిస్తూ hi ఇవ్వ బడు తుంది. భారతదేశం లోనూ మన ఆంధ్రప్రదేశ్ లోనూ ఐదు సంవత్సరములు నిండిన పిల్లలకు ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం తప్పని సరి. ఈ పాఠశాలలలో ఒకటి నుండి ఐదు తరగతులకు విద్యాబోధన జరుగుతుంది. ఇందులో మాతృభాష hi (తెలుగు, ఉర్దూ, తమిళం, ఒరియా, కన్నడ లేదా ఇతరములు), రెండవ భాషగా మాతృ భాష లేదా ఇతర భాష, ఇంగ్లీషు, గణితము, పరిసర విజ్ఞానాలు నేర్పబడుతాయి. మన రాష్ట్రంలో అనేక మాధ్యమాలలో ఈ విద్య అందజేయబడుచున్నది. ఉదాహరణకు, తెలుగు, ఆంగ్లము, ఉర్దూ, కన్నడము, తమిళము, ఒరియా, హిందీ, పంజాబీ, మరాఠీ మొదలగునవి.

మాధ్యమిక విద్య

సమకాలీన విద్యావిధానంలో, సెకండరీ విద్య, లేక మాధ్యమిక విద్య చాలా ప్రధానమైనది. ఉన్నత విద్యకు అసలైన పునాది ఇదే. మనదేశంలోని రాష్ట్రాలలో ఈ విద్యను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరియు ఇంటర్మీడియట్ విద్యా మండలివారు నిర్వహిస్తుంటారు. పాఠశాలల నిర్వహణ మరియు విద్యా సదుపాయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఉదాహరణకు జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్, మరియు పురపాలక సంఘం, కలుగజేస్తాయి. జిల్లాలో విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో విద్యావిధానమంతా అమలు పరచ బడుతుంది. ఏ భోషామాధ్యమపాఠశాలయైనా, యే యాజమాన్య పాఠశాలయైనా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్తుంది. ఈ విద్యావిధానంలో ప్రధానమైనవి పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు.

ఉన్నత విద్య

[[దస్త్రం:ClareCollegeAndKingsChapel.jpg|right|thumb|కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఒక ఉన్నత విద్యాకేంద్రం.]]

ఉన్నత విద్య ఉన్నత పాఠశాల విద్య తరువాత ప్రారంభమౌతుంది. మన దేశంలో విద్యా విధానం 10+2+3 విధానం. 10 అనగా సెకండరీ విద్య, 2 అనగా ఇంటర్మీడియట్ విద్య, 3 అనగా కాలేజి డిగ్రీ విద్య. కాలేజీ డిగ్రీని గ్రాడ్యుయేషన్ అని, దాని తరువాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అని వ్యవహరిస్తారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత రీసర్చ్ పోగ్రాంలు అయిన ఎం.ఫిల్. మరియు పి.హెచ్.డీ. డిగ్రీలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నత విద్యాశ్రేణిలోకి వస్తాయి.

ఈ విద్యలన్నీ వివిధ రంగాలలో వుండవచ్చు. ఉదాహరణకు, కళలు, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రం, గణితం, వాణిజ్యం, బోధన, సామాజిక శాస్త్రం, మానసిక శాస్త్రం, ఫిలాసఫీ, భాషలు, కంప్యూటర్ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వైద్య శాస్త్రం, న్యాయశాస్త్రం, ఇంజినీరింగ్ మరియు ఇతర రంగాలు.

వయోజన విద్య

వయోజనవిద్య అనేక దేశాలలో అవసరంగా మారింది. దీని కొరకు ప్రభుత్వాలు పాటు పడుతున్నాయి. సరైన సదుపాయాలు లేక, బాల్యంలో అభ్యసించలేక, పాఠశాల చదువును నోచుకోలేని వయోజనులకు, వారి తీరిక సమయాలలో అక్షరాభ్యాసం కల్పించడం, దీని ముఖ్యోద్దేశ్యం. ఈ వయోజన విద్య ఒక ప్రహసనంగా మారకుండా చూడడం ప్రతి పౌరుని విధి. సర్వ శిక్షా అభియాన్ అనే ఓ జాతీయ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అందరికీ విద్య కార్యక్రమాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి. నేషనల్ లిటరసీ మిషన్ లేదా జాతీయ అక్షరాస్యత మిషన్, ఈ కార్యక్రమాలన్నీ అనుసంధానిస్తుంది. 1990 దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు జిల్లాలలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టింది. చిత్తూరు జిల్లాలో అక్షర తపస్మాన్ అనేపేరు పెట్టి అక్షరాస్యతా కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు ఇంకో పౌరుడికి విద్యనేర్పాలి.

విద్యా విధానాలు

నియత విద్య
- పరిణామక్రియ ఆధారంగా, శారీరక వయస్సు మరియు మానసిక వయస్సు ల ఆధారంగా ఇవ్వబడు సాధారణ విద్యను నియత విద్య అంటారు. ఈ విద్య కొరకు విద్యార్థులు విద్యాకేంద్రాలకు వచ్చి అభ్యసిస్తారు. వీరికొరకు నిర్ధిష్టమైన విద్యాకార్యక్రమాలుంటాయి. అభ్యసనాంశాలు కర్రికులమ్, కాలపట్టికలు, బోధన, మూల్యాంకనము, పరీక్షలు, ఫలితాలు వుంటాయి. ఈ విద్య పూర్తికాలపు విద్య.
అనియత విద్య
- ఈ విద్య జీవిత కాలపు విద్య. శారీరక వయస్సు మరియు మానసిక వయస్సులకు అతీతంగా వుంటుంది. ఈ విద్యకు మంచి ఉదాహరణ దూరవిద్య . ఈ విద్యనందించు విద్యాలయాకు మంచి ఉదాహరణ :
సార్వత్రిక పాఠశాల
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
డా. బీ. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం
మౌలానా ఆజాద్ జాతీయ విశ్వవిద్యాలయం,

ప్రత్యామ్నాయ విద్య

ప్రత్యామ్నాయ విద్య అన్ని విద్యావిధానాలకు అతీతంగా, ప్రత్యేకమైన విద్యావిధానాన్ని కలిగిన విద్యా విధానం. ఈ విధానం ముఖ్య ఉద్దేశం, పాఠశాలనుండి వైదొలగేవారిని తగ్గించడం. దీనికొరకు సార్వత్రిక పాఠశాల (ఓపెన్ స్కూల్స్) విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఓపెన్ స్కూల్స్ లో చదివిన బాలబాలికలకు నేరుగా సాధారణ విద్యావిధాన స్రవంతిలో తీసుకొచ్చి అక్షరాస్యత మరియు విద్యను పెంపొందించడం, అసలైన ఉద్దేశం. ఇది చాలా మంచి ప్రయత్నం. మంచి ఫలితాలను కూడా ఇస్తున్నది.

బోధనాంశాలు

బోధనలో ముఖ్యమైనవి "బోధనాంశాలు" మరియ సహబోధానాంశాలు.

బోధనాంశాలు:భాష మరియు శాస్త్రాల అభ్యసన.

భాషకు ఉదాహరణ: 1. మాతృభాష, 2. ప్రాంతీయ భాష, 3. జాతీయ భాష, ఈ భాషలను నేర్చుకోవడం ముఖ్యం, ఈ సూత్రాన్నే త్రిభాషా సూత్రం అంటారు. ఈ భాషలతోబాటు అదనంగా అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషును నేర్పడం అవసరం. శాస్త్రాలకు ఉదాహరణ: గణితం, పరిసరాల విజ్ఞానం, సామాజిక శాస్త్రాలు, వగైరా.

సహ బోధనాంశాలు: శారీరక శ్రమలు, పోటీలు, కళలు మరియు ఇతర మార్గాల ద్వారా వైయక్తిక నిర్మాణం.[2]

విధానము

అభ్యసనా పద్దతులు

ఈ అభ్యసనా పద్దతులన్నీ విద్యార్థులకు అవసరం.[3][4] వీటికి ఉదాహరణ:

  • కదలిక ప్రధానం : ఈ పద్దతిలో విద్యార్థి తన చేతులకు పనిచెప్పి నేర్చుకుంటాడు.
  • దృశ్య ప్రధానం : ఈ పద్దతిలో విద్యార్థి వీక్షించి, గమనించి, ఏమి జరుగుతున్నది?, ఎలా జరుగుతున్నది?, ఎందుకు జరుగుతున్నది?, ఎప్పుడు జరుగుతున్నది? మున్నగు ప్రశ్నలు వేసుకొని నేర్చుకుంటాడు.
  • శ్రవణ ప్రధానం : ఈ పద్దతిలో విద్యార్థి విని, విషయసంగ్రహణ చేసుకుని నేర్చుకుంటాడు.

బోధన

ఉపాధ్యాయులకు బోధనా పద్దతులు అత్యవసరం. వీటికి ఉదాహరణ:

కిండర్ గార్టెన్ పద్దతి.
ప్రకృతి పద్దతి.
హ్యూరిస్టిక్ పద్దతి.
బేసిక్ పద్దతి.
ప్రాజెక్ట్ పద్దతి.
ప్రశ్న జవాబుల పద్దతి.
విశదీకరణ పద్దతి
డెమాన్స్ట్రేషన్ పద్దతి

సాంకేతిక విజ్ఞానం

విద్యలో ప్రధానంగా ప్రభావితం చేసే విషయం సాంకేతిక విజ్ఞానం. విద్యాభ్యాసంలో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, అభివృద్ధి చెందిన దేశాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆన్-లైన్ విద్య ఓ రకంగా దూరవిద్య. ఈ విధానంలో అభ్యసన మరియు అవగాహనల కొరకు ఓ ప్రత్యేక అనుకూల స్థితి కలుగుతుంది. ఇది చాలా లాభదాయకంగానూ నిరూపింపబడింది. దీని నష్టాలు కూడా నేటి ప్రపంచం గమనిస్తూవుంది. విద్యార్థులలో పాఠశాలల పట్ల అనాసక్తి, ఉపాధ్యాయుల పట్ల అనాదరణ, విద్యావిధానంపట్ల సరియైన పట్టు లేకుండాపోతున్నది. భౌతికంగా అభ్యసన జరుగుతున్నది కాని మానసికంగా విద్యాభ్యాసన జరగడంలేదు. విషయ సంగ్రహణ జరుగుతున్నది గాని, విషయ పరిజ్ఞానం పెంపొందింప బడడంలేదు. విద్యలో ఇదే కీలకం, ఇదియే లోపిస్తున్నది. అరిస్టాటిల్, సోక్రటీసు మరియు ప్లేటో లాంటి మేధావులకు నేటి లోకం జన్మనివ్వలేక పోతున్నది.

చరిత్ర

Laurentius de Voltolina 001
బొలోనా విశ్వవిద్యాలయం ఇటలీ, ఓ ఊహాచిత్రం.

విద్య యొక్క చరిత్ర, ప్రాచీన కాలంనుండి మనకు లభిస్తున్నది. ప్రాచీన కాలంలో, పర్ణశాలలు, కుటీరాలు ఋషుల ఆశ్రమాలు, ఆశ్రమ కేంద్రాలు విద్యాభ్యాసం కొరకు కేంద్రాలుగా విలసిల్లేవి. ఈ కేంద్రాలలో సకల శాస్త్రాలూ బోధింపబడేవి. ఉదాహరణకు: ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, రాజనీతి, భాష, యుద్ధవిద్యలు, సంస్కృతి, చదరంగం, కుస్తీ, విలువిద్య, భూగోళం, జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రము మున్నగునవి నేర్పేవారు.

ఫిలాసఫీ

విద్య మరియు తత్వము పరస్పర మూలాలు గలిగినవి. తత్వము "జ్ఞాన ఉద్దేశ్యము, ________ప్రకృతి విద్య మరియు విద్య యొక్క ఆదర్శము. దీని ఉప ఉద్దేశ్యాలు, మనో తత్వము, మనోజ్ఞాన ప్రకృతి సిద్ధాంతం, మరియు మానవ విషయాలు, సమస్యలూ మరియు విద్యా-సమాజాల మధ్య సంబంధ బాంధవ్యాలు.

తత్వము యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు :

* జ్ఞాన సమపార్జన.
* జ్ఞాన సమపార్జనకొరకు ప్రకృతి సిద్ధాంతాలు.
* మానవ మరియు సమాజ కళ్యాణం.

మానసిక శాస్త్రం

FinnGerberBoydZaharias2005
అమెరికాలోని ఒక తరగతి. ఇందులో తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల పిల్లలు వస్తారు.[5]

విద్యా మానసిక శాస్త్రము, నేటి విద్యావిధానంలో విద్యార్థులు ఎలా జ్ఞానం సంపాదిస్తారు అనేవిషయంపై చర్చిస్తుంది. విద్యాభ్యాసంలో పిల్లల మానసిక ప్రవృత్తులు, సమస్యలు, వైయుక్తిక భేదాలు, పరివర్తన, నడవడికలు మున్నగు వాటి గురించి చర్చిస్తుంది.

దీని ముఖ్య విషయాలు, పిల్లల మానసిక శాస్త్రము మరియు సామాజిక మానసిక శాస్త్రము.

ఆర్థిక శాస్త్రం

ఓ సమాజం ఆర్థికంగా నిలదొక్కుకోగలగాలి, లేదా అభివృధ్ధి చెందాలి అంటే, విద్య అత్యవసరం. సిద్ధాంతాల ప్రకారం, అభివృద్ధిచెందిన దేశాల కంటే, పేద దేశాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతాయి. కారణం, అభివృద్ధి చెందిన దేశాలు ప్రయోగాత్మకంగా ఉపయోగించిన విధానాలు. కానీ కొందరు ఆర్థిక వేత్తలు దీన్ని అంగీకరించక ఇలా వాదిస్తారు, "అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతూనే వుంటాయి, వాటికున్న వనరులలాంటివి. పేద దేశాలు పేద దేశాలు గానే వుండి పోతాయి వాటికున్న వనరులలాంటివి", అని.

సామాజిక శాస్త్రం

Graduates in tertiary education-thousands
రష్యాలో అకాడెమిక్ గ్రాడ్యుయేట్లు, ఇతర ఐరోపా దేశాల కంటే ఎక్కువ.

విద్యా సామాజిక శాస్త్రము ప్రకారం, సామాజిక విద్యా సంస్థలు మరియు విద్యావిధానాలు మరియు వాటి ఫలితాలు పరస్పరం ఆధారపడివుంటాయి. కాని సమాజానికి చెందిన బలహీనతలనుండి సమాజాన్ని రక్షించాలంటే, కేవలం విద్య మాత్రమే మార్గం. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం సమాజ నిర్మాణమే. గురజాడ అప్పారావు చెప్పినట్లు "దేశమంటే మట్టి కాదోయ్; దేశమంటే మనుషులోయ్", దేశం బాగుపడాలంటే పౌరులు లేదా మనుషులు బాగుపడాలి, అప్పుడే సమాజం బాగుపడుతుంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలు

అభివృద్ధి చెందుతున్న దేశాలలోని తీవ్ర సమస్యలలో ప్రధానమైనది నిరక్షరాస్యత. ఈ నిరక్షరాస్యతకు మూలం అవిద్య. దీన్ని రూపుమాపుటకు సరైన సాధనం మరియు మార్గం 'విద్య'.

ప్రాపంచీకరణ

మనం ఈ రోజు అవలంబిస్తున్నవన్నీ ఐరోపా వాసుల విద్యావిధానాన్నే. విద్య, ఐరోపా మరియు అమెరికా వాసులు ప్రవచించిందే విద్య అనే మూఢ విశ్వాసాలనుండి ప్రపంచం బయట పడాలి. ఆసియాకూడా విజ్ఞాన ఖని. అందులోనూ భారత్, చైనా మరియు అరేబియా, విద్యా విజ్ఞానాలకు పుట్టినిల్లు. ప్రపంచానికి మన కాంట్రిబ్యూషన్ ఏపాటిది అని తెలియజేయాలంటే, మన పురాతన, జ్ఞాన సంపన్నుల గూర్చి శోధన అవసరం. నికోలస్ కోపర్నికస్ ప్రపంచానికంతటికీ తెలుసు కాని ఆర్యభట్ట మన దేశంలో మనవారిలో కొందరికే తెలుసు. దీనికి కారణం, మనవారందించిన విజ్ఞానాన్ని మనం ఇంకా శోధించి, పొడిగించి ప్రపంచానికి అందివ్వక పోవడమే.

ఇతర విషయాలు

విద్య పరమార్ధం విజ్ణానమే కాని ఉద్యోగం కాదు. అయితే నేడు దేశంలో విద్య యొక్క నిర్వచనం, పరమార్ధం మారిపోతున్నది. పూర్వం విద్యార్థులు విజ్ణాన సముపార్జన కోసం విద్యను అభ్యసించేవారు. నేటి విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఇది బహు దురదృష్టకరము. మనిషి బ్రతుకడానికి వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం అను మూడు రకాలుగా ఉంది. విద్య వలన ఈ మూడింటినీ సమర్ధవంతంగా నిర్వర్తించవచ్చును. రైతులకు విద్య తోడైతే తమ వ్యవసాయ వృత్తిలో అధ్బుతంగా రాణించవచ్చును. పదిమందిలో దూసుకువెళ్ళిపోయి, ధైర్యం, స్వశక్తి మీద నమ్మకం ఉన్నవారు వ్యాపారం చేసుకొనేవారికి విద్య అండగా ఉంటుంది. ఇక ఉద్యోగం అనేది అతి హీన పరిస్థితుల్లో తినడానికి లోటు లేకుండా చేసుకొనే పనిగా చెప్పవచ్చు. అయితే నేటి అధ్యాపకులు తమ విద్యార్థులకు సమకాలీన సమాజ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కాకుండా కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నారు. దీని వలన దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. చదువుకి, సంపాదనకి సంబంధం లేదని, సంపాదనకి కావాల్సింది తెలివితేటలు, చదువు లేనివారు సైతం కోట్లు సంపాదిస్తున్నారు అని, పదిమందికీ జీతాలిచ్చే ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయినా కనీసం నెలజీతం తీసుకొనే దిగువస్థాయి అవకాశం విద్యవల్ల దక్కుతుంది అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రహించవలసియున్నది.

పూర్తి వ్యాసం కొరకు ఉద్యోగం చూడండి.

ఆంధ్ర ప్రదేశ్ లో విద్య

ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ లో విద్య

ఇవీ చూడండి

మూలాలు

  1. రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ విద్యా హక్కు పేజి
  2. Examples of subjects...
  3. Dunn and Dunn
  4. Biographer of Renzulli
  5. Finn, J. D., Gerber, S. B., Boyd-Zaharias, J. (2005). Small classes in the early grades, academic achievement, and graduating from high school. Journal of Educational Psychology, 97, 214-233.

బయటి లింకులు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
అక్షరాస్యత

అక్షరాస్యత (ఆంగ్లం : literacy) సాంప్రదాయికంగా, భాషాఉపయోగం చేయడానికి, చదవడం, వ్రాయడం, వినడం మరియు మాట్లాడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం.. నవీన దృక్ఫదంలో సమాచారం (communication) కొరకు కావలసిన నాలుగు మూల వస్తువులైనటివంటి నైపుణ్యాలు చదవడం, వ్రాయడం, వినడం మరియు మాట్లాడడం నేర్చుకునే విధానమే "అక్షరాస్యత". యునెస్కో వారి నిర్వచనం : గుర్తించడం (identify), అర్థం చేసుకోవడం (understand), పాల్గొనడం (interpret), సృష్టించడం (create), వార్తాలాపన (communicate), లెక్కంచడం (compute) మరియు ముద్రించిన మరియు వ్రాయబడిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడం "అక్షరాస్యత".క్రింది పట్టిక, భారతదేశం మరియు పొరుగుదేశాలలోగల మధ్యవయస్కుల మరియు యౌవనుల అక్షరాస్యతను సూచిస్తున్నది. గణాంకాలు 2002లో తీయబడినవి.

అద్దంకి

అద్దంకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పట్టణము (నగర పంచాయితీ) మరియు మండల కేంద్రము. రెడ్డిరాజుల తొలిరాజధానిగా ప్రఖ్యాతి. తొలి తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది.

ఒంగోలు

ఒంగోలు నగరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లా యొక్క ముఖ్య పట్టణము మరియు ఒంగోలు మండలానికి కేంద్రము.

ఒడిషా

ఒడిషా లేదా ఒరిస్సా (Orissa) (ଓଡ଼ିଶା) భారతదేశం తూర్పు తీరాన ఉన్న రాష్ట్రం. దీని వైశాల్యం 60,162 చ.మైళ్ళు (1,55,820 చ.కి.మీ.). 2001 లెక్కల ప్రకారం జనాభా 3,67,06,920. November 4, 2011 న ఈ రాష్ట్రం యొక్క పేరును ఒడిషాగా మారుస్తూ భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

ఒడిషాకు ఉత్తరాన ఝార్ఖండ్ రాష్ట్రం, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలున్నాయి. తూర్పున బంగాళాఖాతం సముద్రమున్నది.

కోణార్క, పూరి, భువనేశ్వర్లు ప్రసిద్ధి చెందిన మందిరాలు గల పట్టణాలు. ఒరియా ప్రధాన భాష. ఒరిస్సా పేరును ఒడిషా గా, ఒరియాను ఒడియాగా మార్చడానికి కేంద్రం ఆమోదించింది.

కాకరపర్తి భావనారాయణ కళాశాల

కాకరపర్తి భావనారాయణ కళాశాల విజయవాడలోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉంది. ఈ కళాశాల కాకరపర్తి భావనారాయణ గారిచే స్థాపించబడింది. కళాశాల స్థాపనలో ఉసిరిక జగన్మోహన రావు, కొప్పురవూరి సత్యనారాయణ మరియు ఇతరులు పాలుపంచుకున్నారు. 1964 నవంబరు 6వ తేదీన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి మరియు ముఖ్య మంత్రి గారిచే కళాశాల స్థాపనా పనులను ప్రారంభించారు, కళాశాల విస్తీర్ణం దాదాపు 9.6 ఎకరాలు. జూన్ 1965 నుండి కళాశాల పనులను ప్రారంభించారు. కళాశాల 220 విద్యార్థులతో, 15మంది ఉపాధ్యాయులతో ప్రారంభించబడింది. కళాశాలకు మొదటగా ఎస్. సుందరం గారు ప్రధానోపధ్యాయులుగా పనిచేసారు.

గ్రంథాలయము

ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయము అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి గ్రంథాలయ పితామహుడు అనే పేరు పొందినవాడు అయ్యంకి వెంకట రమణయ్య. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.

చిత్తూరు

చిత్తూరు, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక నగరం . ఆంధ్ర ప్రదేశ్ కు దక్షిణాన, ఫోన్నై నది లోయలో, బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉంది.చిత్తూరు ద్రవిడ ప్రాంతం, ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడ భాషలు మాట్లాడుతారు ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. ఇది ధాన్యము, చెరకు, మామిడి, మరియు వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనెగింజలు మరియు బియ్యం మిల్లింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి.

చెన్నై

చెన్నై (ఆంగ్లం : Chennai), పలకడం , (తమిళం : சென்னை, చెన్నై), (తెలుగు : చెన్నపట్నం) భారత దేశములోని తమిళనాడు రాష్ట్ర రాజధాని. ఇది భారత దేశములోని నాలుగవ పెద్ద మహానగరం. చెన్నై నగరము బంగాళా ఖాతము యొక్క తీరమున ఉంది. చెన్నై పూర్వపు పేరు మద్రాసు. ఇది తమిళనాడు రాష్ట్ర రాజధాని. 1953 వరకు ఆంధ్రకు కూడా రాజధాని. మద్రాసు రాజధానిగా వుండే ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచాడు. మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం అన్నాడు శ్రీరాములు. ఈ మహానగరము బంగాళాఖాతం కోరమాండల్ దక్షిణ తీరములో ఉంది. 2007 జనాభా గణాంకాల ప్రకారం చెన్నై నగర జనాభా 70.6 లక్షలు ఉండవచ్చునని అంచనా. ఈ ప్రపంచములోనే 34వ మహానగరమైన చెన్నైకి 375 సంవత్సరాల చరిత్ర ఉంది. భారత దేశములో వాణిజ్య మరియు పరిశ్రమల పరంగా చెన్నై నగరము మూడవ స్థానంలో నిలుస్తుంది. అంతే కాదు ఈ నగరములో ఉన్న దేవాలయాల నిర్మాణశైలి చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నృత్యానికి చెన్నై నగరము కేంద్రబిందువు. భారతదేశములోని వాహన నిర్మాణ (ఆటో మొబైల్) పరిశ్రమలు అన్నీ చెన్నై నగరంలో కేంద్రీకరించబడి ఉన్నాయి. అన్ని వాహననిర్మాణ పరిశ్రమలు ఉండడం వల్ల ఈ నగరాన్ని డెట్రాయిట్ ఆఫ్ ఆగ్నేయా ఆసియా అని కూడా పిలుస్తారు. ఔట్ సోర్సింగ్ కూడా చాలా మటుకు చెన్నై నగరము నుండి జరుగుతోంది. ఈ నగరము బంగాళా ఖాతం తూర్పుతీరం వెంబడి ఉండడం వల్ల ఈ నగరానికి 12 కి.మీ. బీచ్ రోడ్ ఉన్నది దీనినే మెరీనా బీచ్ అని పిలుస్తారు. ఈ నగరములో క్రీడల పోటీలు కూడా నిర్వహించడానికి ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధికి చెందిన ఏ.టి.పి. టెన్నిస్ పోటీలు, చెన్నై ఓపెన్ టెన్నీస్ పోటీలు నిర్వహించబడతున్నాయి. గిండీ జాతీయ వన్యప్రాణి సంరక్షణాలయం ఈ నగర పొలిమేర్లలోనే ఉంది. వన్యప్రాణీ సంరక్షణాలయాలు మహానగరాల పొలిమేర్లలో ఉండటం ప్రపంచములోనే అరుదు. అమెరికాలో కొలరాడో రాష్ట్రములో ఉన్న డెన్వర్ నగరములో కూడా వన్యప్రాణీ సంరక్షణాలయం నగర పొలిమేర్లలో ఉండడంవళ్ల చెన్నైని డెన్వర్ తో పోలుస్తారు. చెన్నైని డెన్వర్ కి సోదర నగరముగా చెబుతారు.

జూనియర్ కళాశాల

జూనియర్ కళాశాల (Junior college - జూనియర్ కాలేజీ) అనే పదం వివిధ దేశాల్లో వివిధ విద్యా సంస్థలను సూచిస్తుంది.

పంజాబ్

పంజాబ్ (ਪੰਜਾਬ) (Punjab) భారతదేశంలో వాయువ్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన జమ్ము-కాష్మీరు, ఈశాన్యాన హిమాచల్ ప్రదేశ్, దక్షిణాన హర్యానా, నైఋతిలో రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ దేశపు పంజాబు రాష్ట్రము ఉంది.

'పంజ్' - అంటే ఐదు, 'ఆబ్' - అంటే నీరు. ఈ రెండు పదాలనుండి 'పంజాబు' పదం వచ్చింది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ - అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తూ దానిని సశ్యశ్యామలం చేస్తున్నాయి. సారవంతమైన నేల, పుష్కలమైన నీరు, కష్టించే జనులు - వీరంతా కలిసి పంజాబును దేశపు వ్యవసాయంలో అగ్రభాగాన నిలుపుతున్నారు. పారిశ్రామికంగా కూడా పంజాబు మంచి ప్రగతి సాధిస్తున్నది.

పద్మభూషణ్ పురస్కారం

పద్మ భూషణ్ పురస్కారము జనవరి 2, 1954లో నెలకొల్పబడింది. ఈ పురస్కారమును భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన భారతీయ పౌరులకు బహూకరిస్తారు. భారత రత్న, పద్మ విభూషణ్ తర్వాత ఈ పురస్కారమునకు ప్రాముఖ్యతలో మూడవ స్థానం ఉంది.

పాఠశాల

పాఠశాల (ఆంగ్లం : School) అనగా విద్యాలయం. ఇక్కడ పిల్లలకు విద్యనూ బోధిస్తారు. విద్యనూ అబ్యసించే వారిని విద్యార్ధులు అని, విద్యనూ బోదించేవారును ఉపాద్యాయులు అని అంటారు. పూర్వం విద్యాలయాల లో మహర్షులు, ఋషిలు విద్యనూ భోదించేవారు.

పులివెందుల

పులివెందుల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పట్టణం.

లండన్

లండన్ (London) మహానగరం యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క రాజధాని మరియు ఇంగ్లాండ్ లోనే అతి పెద్ద నగరం. ఇప్పటి లండన్, పురాతన లండన్ మరియు దాని చుట్టూ ఏర్పడ్డ నగరాల సముదాయం.

రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరం ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాలలో ఒకటిగా భాసిల్లుతోంది. రాజకీయంగా, వైజ్ఞానికంగా, విద్య, వినోదం, కళలు, ఫ్యాషన్, మరియు ప్రసార మాధ్యమాల్లో ప్రపంచ దేశాలపై దీని ప్రభావం వల్ల ప్రపంచంలో ఒక మహానగరంగా విరాజిల్లుతోంది. ఇది ప్రపంచంలో కెల్లా విస్తీర్ణములో అతి పెద్ద నగరము.

7.5 మిలియన్ల జనభాతో యూరోప్ యూనియన్లోనే అత్యధిక జనాభాగల నగరంగా గుర్తించబడింది. మెట్రోపాలిటన్ జనాభా సుమారు 12 నుంచి 14 మిలియన్లు. నగరంలో నివసించే ప్రజలు వివిధ జాతుల, మతాల, సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడి పౌరులు దాదాపు 300 భాషలు మాట్లాడుతారు.

ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు మరియు ఒక నౌకాయన కేంద్రంతో ఇది ప్రధాన అంతర్జాతీయ రవాణాకేంద్రం కూడా. అంతేకాక అతి పెద్ద పౌర విమానయాన కేంద్రం కూడా. లండన్ లోని హీత్రూ విమానాశ్రయం అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణికులను చేరవేసే కేంద్రం.

వైఎస్‌ఆర్ జిల్లా

కడపజిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన జిల్లా. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, తెలుగు జాతీయ కవి వేమన, తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, మరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల, మహోన్నతమైన యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, అయ్యలరాజు రామభద్రుడు ఈ జిల్లాకు చెందినవారే. ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానం 1885లో కడప జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ' నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. ఈ జిల్లా బెరైటీస్ (ముగ్గురాయి) గనులు, బండలకు ప్రసిద్ధి చెందింది.పూర్వం ఈ జిల్లాకు హిరణ్యదేశంని పేరు ఉంది. ఈ ప్రదేశం పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గండికోట పెమ్మసాని నాయకులు, నిజాం నవాబులు, సిద్ధవటం నుంచి పరిపాలించిన మట్లి రాజులు, కడప నవాబులచే పరిపాలించ బడింది. Map

వైద్య కళాశాల

వైద్య కళాశాలు (Medical Colleges) ప్రపంచ వ్యాప్తంగా వైద్య విద్య (Medical Education) ను అందించి వైద్యుల్ని సుశిక్షితుల్ని చేసే విద్యాలయాలు (Educational Institutions). వీటిని అనుబంధంగా కొన్ని పెద్ద వైద్యశాలలు (Hospitals) ఉంటాయి.

సాధారణంగా వైద్య కళాశాలలు వైద్యంలో డిగ్రీ కోర్సును, మాస్టర్స్ కోర్సును, పి.హెచ్.డి. సదుపాయాన్ని అందజేస్తాయి. ఇంతే కాకుండా వైద్యవిద్యకు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, లాబొరేటరీ టెక్నాలజీ వంటి కోర్సులను కూడా బోధిస్తాయి. వైద్య కళాశాలలకు అనుబంధంగా హాస్పిటల్ ద్వారా వైద్య సదుపాయం కూడా ఉంటుంది. వైద్యవిద్యలో బోధించే కొన్ని విద్యావిభాగాలు (సబ్జెక్టులు) - హ్యూమన్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఇమ్యునాలజీ, ప్రసూతి వైద్యం (ఆబ్స్‌టెట్రిక్స్ మరియు గైనకాలజీ), ఎనస్తీషియాలజీ, అంతర్గత వైద్యం (ఇంటర్నల్ మెడిసిన్), కుటుంబ వైద్యం, శస్త్రచికిత్స (సర్జరీ), జెనిటిక్స్, పాథాలజీ (రోగ నిర్ధారక శాస్త్రం). ఇవే కాకుండా గుండె, కన్ను, ముక్కు, చెవి, చర్మం, మెదడు, మానసిక ప్రవృత్తి వంటి విషయాలకు సంబంధించిన విద్యాబోధనలకై ప్రత్యేక విభాగాలుంటాయి.

వ్యవసాయం

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార మరియు ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి (Agriculture) అంటారు.

వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం మరియు సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది.

ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే.

హైదరాబాదు

హైదరాబాదు, తెలంగాణ రాజధాని.ప్రస్తుతంఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని, హైదరాబాదు జిల్లా, రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం. హైదరాబాద్ కి మరో పేరు భాగ్యనగరం. హస్తకళలకు, నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానాన్ని ఆక్రమిస్తుంది.హైదరాబాదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు, సికింద్రాబాద్లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాదుకు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన 370 అధికరణ సవరణ తర్వాత హైదరాబాద్ ను కూడా యూనియన్ టెరిటరీ చేయాలని హైదరాబాద్ వాసులు కోరుతున్నారు .[1]

విద్య, ఉపాధి
విద్య
ఉపాధి

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.