విక్షనరీ

విక్షనరీ [1], వికీపీడియా యొక్క సోదర వెబ్ సైట్. ఈ పదం వికి, డిక్షనరి పదాలను కలుపగా తయారయ్యినది. ఇది తెలుగు పదాలను వివిధమైన వ్యాకరణ, వాడుక, నానార్ధ, వ్యతిరేఖార్థ లాంటి వివరణలతో నిక్షిప్తం చేసే మాధ్యమము (నిఘంటువు). అయితే పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు భాషలలో వుంటాయి. దీనిలో తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు లింకులుండటంవలన, మీకు ప్రపంచంలోని వికీ భాషలన్నిటిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలుండటంతో, దీనిని బహుభాష నిఘంటువుగా పేర్కొనవచ్చు. తెలుగు వికీపీడియాలో లాగా, ఇందులో ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు.

విక్షనరీ అభివృద్ధి

జులై 2005 లో ప్రారంభమైన తెలుగు విక్షనరీ, 34,751 పదాల పేజీలకు (2010 సెప్టెంబరు 17 న) విస్తరించింది. ఆగస్టు-అక్టోబరు 2007 మధ్యకాలంలోలో మాకినేని ప్రదీప్ కృషితో బ్రౌణ్య నిఘంటువుని (సుమారు 32,000 పదాలు) చేర్చుకొంది.

Te-Wiktionary-firstpage
తెలుగు విక్షనరీ ముఖ పత్ర తెరపట్టు

విక్షనరీ రూపము

Te-word-amma-Wiktionary
తెలుగు విక్షనరీ పేజి - అమ్మ

తెలుగు విక్షనరీలో పదాల పేజీని పరిశీలిస్తే మీకు వివిధ విభాగాలు కనపడతాయి. ఉదా: అమ్మ పదం తెరపట్టు చూడండి.

విక్షనరీలో పనిచేసే విధానం

కొత్త పదము చేర్చటం

ముందుగా మొదటి పేజిలో మీకు కావలసిన పదం కోసం వెతకండి. ఆ పదం లేకపోతే సృష్టించాలా అన్న సందేశం వచ్చి ఆ పదం విషయంలో వున్నపేజీలేవైనా వుంటే వాటిని చూపిస్తుంది. సృష్టించాలా అనే దానిపై నొక్కితే, మీకు ఖాళీ పేజీ కనపడుతుంది. దానిలో మీరు తెలుగు పదం చేర్చబోతుంటే {{ subst: కొత్త తెలుగు పదం}}, ఆంగ్ల పదం చేర్చబోతుంటే {{subst: కొత్త ఆంగ్ల పదం}} అని రాసి దాచండి, ఆ తరువాత మార్పులు చేయండి. దీనిని సులభంగా చేయాలంటే మీరు పదాల మూస అనే పేజీకి వెళ్లి మీరు సృష్టించ తలచిన పదాన్ని అన్వేషించండి . ఆ పదానికి పేజీ ముందే సృష్టించబడి ఉంటే ఆ పదము మీకు నీలిరంగులో వుంటుంది. లేదంటే ఎర్ర రంగులో కనపడే పదాన్ని నొక్కినపుడు కొత్త పేజీ సృష్టించాలా అనే సందేశం కనిపిస్తుంది. తరువాత కొత్త తెలుగు పదం అనే మూసలో ఆ పదాన్ని వ్రాసి ప్రక్కన ఉన్న సృష్టించు అనే బటన్ నొక్కండి. మీరనుకున్న పదానికి ప్రారంభ మూసతో సహా పేజీ సిద్ధం అవుతుంది. మీరు తగినట్లుగా మార్పులు చేసి భద్ర పరచితే చాలు. ఒక్కొక్క విభాగానికి సంబంధించిన వివరాన్ని క్రింద చూడండి. ఆంగ్ల పదాన్ని చేర్చేటప్పుడు వున్న తెలుగు పదానికి లింకు ఇస్తే చాలు. పరభాషా పదాల పూర్తి వివరాల కొరకు సంబంధిత విక్షనరీ చూడాలి.

వ్యాకరణ విశేషాలు

దీనిలో భాషా భాగం, వ్యుత్పత్తి, వచనం వుంటాయి. వ్యాకరణ ఉప విభాగంలో పదం విభక్తి లేక లింగము లేక నామవాచకమో విశేషణం లేక ఇలా ఆపదం ఏ వ్యాకరణ విభాగానికి చెందినదో వ్రాయాలి. వ్యుత్పత్తి ఉప విభాగంలో పదం యొక్క మూల రూపము దాని మార్పులు ఇవ్వాలి. సాధారణంగా మాతృ భాషా పదాలకు మూలాలు భాషా పండితులు కానివారికి మూలాలు అంత సులభంగా తెలియవు. సరైన వనరులు భాషా పుస్తకాలు సంప్రదించి రాయవచ్చు. బహువచనము లేక ఏక వచనము అనే విభాగంలో ఆ పదము యొక్క వచన రూపం వ్రాయాలి.

అర్ధ వివరణ

దీనిలో పదానికి తగిన అర్ధవివరణ వ్రాయాలి.

పదాలు

దీనిలో నానార్ధాలు, సంబంధిత పదాలు, వ్యతిరేక పదాలు ఉంటాయి. నానా అర్ధాలులో పదానికి ఉండే ఇతర అర్ధాలు సమాన అర్ధాలు వ్రాయాలి. సంబంధిత పదాలులో ఆ పదానికి సంబంధించిన పదాలు వ్రాయాలి. వ్యతిరేక పదానికి ఆ పదానికి ఉండే వ్యతిరేక పదం వ్రాయాలి. నానార్ధాలు ఉపవిభాగంలో ఇతర సమానార్ధాలు వ్రాయాలి. ఇందులో ప్రాంతీయ, మాండలికాల భిన్న రూప పదాలు వ్రాయ వచ్చు. కూడా వ్రాయవచ్చు. ఉదా;- కోస్తా ప్రాంతంలో ప్రాంతంలో చిన్న బిడ్డ, పసి బిడ్డ అనేది కొంచం పడమట తెలుగు ప్రదేశాలలో సన్న బిడ్డ అంటారు. అలాంటివి నానార్ధాలులో పేర్కొన వచ్చు. అలాగే పదానికి వివిధ విభక్తి రూపాలు, వివిధ విశేషణ రూపాలు పేర్కొన వచ్చు. ఉదా: రాముడు, రాముడితో, రాముని, రాముడి వలన, రాముడే, రాముడి వంటి, రామునిలా, రాముడేనా, రాముడా ఇలా ఒకే పదం విభక్తి కారణంగా వివిధ రూపాలు మారుతుంటాయి. వాటిని సంబంధిత పద విభాగంలో పేర్కొన వచ్చు. అలాగే విశేషణం వలన మారే రూపాలు.

పద ప్రయోగాలు

ఇక్కడ పదాన్ని వాక్యాలలో, పద్య పాదాలలో, పాదాలలో, జానపదాలతో, సామెతలతో ప్రయోగిస్తూ ఉదహరించాలి.

అనువాదాలు

ఇది సమగ్రంగా తయారైతే ఎక్కువ ఉపయోగంగా వుండే విభాగం. ఇందులో ఆ పదానికి ఇతర భాషలో అర్ధాలు తెలిసిన వారు వాటిని చేర్చ వచ్చు. అర్ధాల ప్రక్కన బ్రాకెట్ లో ఇతర భాషా ఉచ్ఛారణ తెలుగులో వ్రాయాలి. ఇక్కడ దిద్దుబాటులో ఆ భాషలకు లింకులు ముందే తయారుగా ఉంటాయి. వాటి మధ్య ఆ భాషా పదాన్ని వ్రాసినప్పుడు అది నేరుగా అయా భాషలలో ఆ పదం ఉన్న పేజీకి తీసుకు వెళుతుంది. అంతర వికీలు లింకులు బాట్లతో కూడా సృష్టించవచ్చి కాబట్టి ఈ విషయం చర్చ కొనసాగించాల్సి ఉంది.

మూలాలు వనరులు

ఇక మూలాలు, వనరులు అనగా మీకు ఎక్కడ ఆ పదం అర్ధంతో తారసపడింది తెలపండి. ఉదా: నకలు హక్కులు తీరిపోయిన నిఘంటువులలో, లేక అనుమతి పొందిన తరువాత ఇతర నిఘంటువులలోని వివరాలు చేర్చేటప్పుడు ఆ నిఘంటువు వివరాలను వనరులలో వ్రాయండి.

బయట లింకులు

తెవీకీలో ఆ పదంతో వ్యాసం వుంటే లింకులు ఇవ్వాలి.

వర్గాలు

పదం ఏ వర్గంలో చేరుతుందో వ్రాయాలి. ఉదా: కంప్యూటర్, మీట లాంటి పదాలను సమాచార సాంకేతిక పదాలు వర్గంలో చేర్చితే, సమాచార సాంకేతిక పదకోశం తయారీలో సహాయంగా వుంటుంది.

ఇతరాలు

చివరిగా ఎడిట్ పేజీలో మీకు అందుబాటులో ఉన్న సాంకేతిక సహాయంతో ఆ పదానికి చిత్రాన్ని చేర్చగలిగితే భాష తెలియని వారికి కూడా పదమేమిటో అర్ధం ఔతుంది. ఇది చాలా ఉపయోగకరం. చిత్రాలు ఇప్పటికే లేక పోతే మీరే వికీలో ప్రవేశ పెట్టి (అప్లోడ్) పేజీలో చేర్చ వచ్చు. ఇతర వీకీల నుండి చేర్చ వచ్చు. అయితే సభ్యులు తమకు తెలిసిన ఏ విభాగంలోఅయినా వ్రాయ వచ్చు పూర్తిగా వ్రాయాలన్న నియమం ఏమీ లేదు.

పద సేకరణ

విక్షనరీలో సాధారణంగా నిత్య జీవితంలో మన వాడే పదాలను చేర్చాలి. ప్రస్తుతం వాడుకలో లేని పదాలు మన ఇళ్ళల్లో పెద్ద వారు వాడుతుంటారు వాటిని చేర్చి అర్ధాలను వివరిస్తే మరుగున పడుతున్న పదాలు వెలుగులోకి వస్తాయి. జానపదులలో, పల్లె సీమల్లో కొన్ని చిత్రమైన పదాలు వాడుకలో ఉంటాయి. వాటిని కూడా ఇక్కడ చేర్చ వచ్చు. పల్లె సీమల్లో విభిన్నతలు అధికంగా ఉంటాయి. వాటిని చిత్రాలతో ఉదహరిస్తే బాగుంటుంది. పల్లె పదాల్లో అమాయకత్వం, సహజత్వం ఎక్కువ అటువంటి పదాలను చేర్చ వచ్చు. కుల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటిని కూడా చేర్చ వచ్చు. సంస్కృతి, సంప్రదాయాల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటినీ చేర్చ వచ్చు. వ్యవసాయానికి సంబంధించి అనేక పదాలు ఉంటాయి వాటినీ చేర్చ వచ్చు. ఇలా విభిన్న పదాలను చేర్చ వచ్చు.వార్తా పత్రికలు, అంతర్జాల అభివృద్ధి వలన కొన్ని కొత్త పదాలు సృష్టింపబడతాయి. వాటిని కూడా పేర్కొన వచ్చు. ఇలా మన పరిసరాలను గమనిస్తే అనేకానేక పదాలు వినిపిస్తాయి. వాటన్నింటినీ ఇక్కడ నిక్షిప్తం చేయవచ్చు.

విక్షనరీ గణాంకాలు

ఇవీ చూడండి

  • తెలుగు విక్షనరీ అభివృద్ధి, టి సుజాత, తెవికీ వార్త, 2010 సెప్టెంబరు 24

వనరులు

  1. విక్షనరీ సైటు
అక్షరాస్యత

అక్షరాస్యత (ఆంగ్లం : literacy) సాంప్రదాయికంగా, భాషాఉపయోగం చేయడానికి, చదవడం, వ్రాయడం, వినడం మరియు మాట్లాడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం.. నవీన దృక్ఫదంలో సమాచారం (communication) కొరకు కావలసిన నాలుగు మూల వస్తువులైనటివంటి నైపుణ్యాలు చదవడం, వ్రాయడం, వినడం మరియు మాట్లాడడం నేర్చుకునే విధానమే "అక్షరాస్యత". యునెస్కో వారి నిర్వచనం : గుర్తించడం (identify), అర్థం చేసుకోవడం (understand), పాల్గొనడం (interpret), సృష్టించడం (create), వార్తాలాపన (communicate), లెక్కంచడం (compute) మరియు ముద్రించిన మరియు వ్రాయబడిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడం "అక్షరాస్యత".క్రింది పట్టిక, భారతదేశం మరియు పొరుగుదేశాలలోగల మధ్యవయస్కుల మరియు యౌవనుల అక్షరాస్యతను సూచిస్తున్నది. గణాంకాలు 2002లో తీయబడినవి.

ఆరు

6 (ఆరు) ఐదు తరువాత, ఏడుకు ముందూ వచ్చే సంఖ్య.

ఓం

చూడండి - ఓంకారం (అయోమయ నివృత్తి) పేజీ

ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.

ఇదొక ఏకాక్షర మంత్రము.

జన సాంద్రత

జనసాంద్రత (ఆంగ్లంలో Population density) ఒక, జనాభా కొలమాన విధానము. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభాను జనసాంద్రతగా పరిగణిస్తారు.

నటన

నటన (Acting) నటి లేదా నటుడు చేయు పని. ఇది రంగస్థలం, సినిమా, దూరదర్శన్ లేదా కథా కాలక్షేపాలలో ఒక వ్యక్తి మరొకరిని అనుకరించడం. ఇది ప్రాచీనకాలం నుండి బహుళ ప్రాచుర్యం పొందిన కళ.నటనను కొందరు వృత్తిగా స్వీకరించి తమ జీవితాల్ని అంకితం చేస్తే మరికొందరు దానినొక అలవాటుగా చేస్తున్నారు. నటులు ప్రదర్శించే దృశ్య ప్రదర్శనలను నాటిక మరియు నాటకం అంటారు.

గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం) మరియు అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్థ్యం).

అయితే మరికొంతమంది నిజ జీవితంలో నటిస్తుంటారు. దీని మూలంగా ఆత్మవంచనతో వీరు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతారు. తత్త్వవేత్తలు మనిషిని ఒక నటుడిగా మరియు ఈ ప్రపంచాన్ని ఒక రంగస్థలంగా సరిపోలుస్తారు.

పక్షము

పక్షము;-అనగా 15 [రోజులకు](లేదా కచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి:

1.'శుక్ల పక్షం' (అమావాస్య నుంచి పున్నమి వరకు)రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెలుపు అని అర్థం)

2.'కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నలుపు అని అర్థం).

పది

పది (10) ఒక సరి సహజ సంఖ్య, దీని ముందు తొమ్మిది (9) తర్వాత పదకొండు (11) వస్తాయి.

పాఠశాల

పాఠశాల (ఆంగ్లం : School) అనగా విద్యాలయం. ఇక్కడ పిల్లలకు విద్యనూ బోధిస్తారు. విద్యనూ అబ్యసించే వారిని విద్యార్ధులు అని, విద్యనూ బోదించేవారును ఉపాద్యాయులు అని అంటారు. పూర్వం విద్యాలయాల లో మహర్షులు, ఋషిలు విద్యనూ భోదించేవారు.

మిరప

మిరపను ఇప్పుడు ప్రపంచమంతా పండిస్తున్నారు. "కేప్సికమ్" అనే జీనస్ కు చెందిన ఈ మిరప అనేక రూపాలలో లభ్యమవుతుంది. చిలీ పెపర్ అనే మిరపకు పుట్టిల్లు అమెరికా కాగా, లాంగ్ పెపర్ అనేది మన భారత ఉపఖండానికి చెందినది. ఈ మిరపను భారతీయులు ఆయుర్వేదంలో వాడిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇది ఘటుగా ఉంటది. వాసన చూస్తే తుమ్ములోస్తవి. తింటే హా హా అనాలి. ఇది లేకుంటే అంతా సప్పసప్పన.

మెడ

తల నుండి మొండెంను వేరుచేసే భాగాన్ని మెడ (Neck) అంటారు. ఇది దవడ ఎముక నుండి ఛాతీ పైభాగం వరకు ఉంటుంది.

స్వరపేటిక మరియు థైరాయిడ్ గ్రంథులు ఇక్కడి ముఖ్య భాగాలు.

మెడ నొప్పి అనేది ఒక సాధారణమైన సమస్య.

మొక్క

ఎంత పెద్ద వృక్షమైనా మొక్కగానే మొదలవుతుంది. తెలుగు భాష ప్రకారంగా మొక్క పదం మొలక యొక్క పొట్టి పేరు.

వార్తాపత్రిక

తెలుగు వార్తా పత్రికలలోలో దాదాపు 9 రకాల దినపత్రికలు, ఐదారు పక్షపత్రికలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి

వికీపీడియా

వికీపీడియా వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీ అనగా అనేక మంది సభ్యుల సమష్టి కృషితో సులభంగా వెబ్ సైటును సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఇది 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్లచే ప్రారంభించబడింది. అప్పటి నుంచి అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.

విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం (ఆంగ్లం: University) అనగా ఉన్నత విద్యాభ్యాసం మరియు పరిశోధనలు జరిపే విద్యాలయం. ఈ విశ్వవిద్యాలయాలు అన్ని రకాల డిగ్రీలను ఇస్తాయి. విశ్వవిద్యాలయంనే ఆంగ్ల పదమైన యూనివర్సిటీతో కూడా వ్యవహరిస్తుంటారు.

వీపు

వీపు (Back) మన శరీరంలో ఛాతీకి మరియు ఉదరానికి వెనుకవైపున ఉండే భాగం.

శక్తి

శక్తి అనేది ఇంగ్లీషు లోని ఎనర్జీ (energy) కి సమ ఉజ్జీ అయిన తెలుగు మాట. పందొమ్మిదవ శతాబ్దారంభానికి పూర్వం ఇంగ్లీషులో energy అన్న మాట లేనే లేదు. థామస్‌ యంగ్ అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు ఈ మాటని ప్రవేశపెట్టేడు. గ్రీకు భాషలో energia అంటే పని. ఆ మాటని energy గా మార్చి దానికి ఒక నిర్ధిష్టమైన అర్ధాన్ని ఇచ్చేడు ఆయన. అంతకు పూర్వం vis viva అనే మాట వాడేవారు; అంటే living force లేదా 'జీవన బలం' అని అర్ధం.

ఈ ప్రపంచం (world, univesre) లో ఏ సంఘటన (event) జరిగినా లేక జరగాలన్నా దానికి కావలసిన శక్తి లభించాలి. ఈ ప్రవచనం (statement) భౌతిక ప్రపంచ మూల సూత్రాలలో (fundamental principles) ప్రథమ సూత్రంగా పరిగణించవచ్చు. విశ్వగతి అంతా శక్తి మీదనే ఆధారపడి ఉందని శాస్త్రవేత్తల నమ్మకం. అందుకనే శక్తిని విశ్వ ప్రబోదకం (prime mover of the universe) అని వర్ణించవచ్చు.

సముచిత వినియోగం

సముచిత వినియోగం (Fair use) అనేది కాపీరైట్ చట్టం ప్రకారం కృతికర్తలకు ఆ కృతుల ఫలితాన్ని అనుభవించడానికి కల్పించబడే హక్కుకు పరిమితి మరియు మినహాయింపు. అమెరికా కాపీరైట్ చట్టంలో సముచిత వినియోగం అనేది చట్టవిధానం. దీని వలన హక్కుదారులనుండి అనుమతి పొందకుండా కాపీరైట్ హక్కులున్న కృతులను వాడుకోవడానికి వీలుకల్పిస్తుంది. వ్యాఖ్యానానికి, శోధనాయంత్రాలకు, విమర్శలకు, వార్తానివేదికలకు, పరిశోధనకు, బోధనకు, గ్రంథాలయ నిల్వలకు మరియు మేధోపరమైన వినియోగానికి దీనివలన వీలుంది. నాలుగు అంశాలతోకూడిన తుల్య పరీక్ష ప్రకారం నకలుహక్కులు విషయాన్ని చట్టపరంగా మరియు అనుమతి లేకుండా వేరొక కృతిలోవాడడం వీలవుతుంది.

సముచిత వినియోగ మనేది అమెరికాలో ప్రారంభమైంది. అటువంటి విధానాలు ఇతర దేశాల చట్టాలలో ఉన్నాయి. ఇది సాంప్రదాయమైన భద్రతా కవాటాలలో ఒకటి.

సాంద్రత

సాంద్రత (ఆంగ్లం Density) పదార్ధాల భౌతిక లక్షణము. ఈ సాంద్రతను ద్రవ్యరాశి (Mass), ఘనపరిమాణం (Volume) నుండి గణిస్తారు. దీని సంకేతం ρ (గ్రీకు అక్షరం rho).

వివిధ పదార్ధాలు వివిధ సాంద్రతలను కలిగువుంటాయి. సాంద్రత లోహాల స్వచ్ఛత, ఉత్ప్లవనగుణం మొదలైన వానిని నిర్దేశిస్తుంది.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.