వాణిజ్యం

వస్తువులు, సర్వీసు లేక ఈ రెండింటి స్వచ్ఛంద మార్పిడిని వాణిజ్యం (Trade) అంటారు. వర్తకం అనేది వ్యాపారం లేక లావాదేవిగా పిలవబడుతుంది. వాణిజ్యాన్ని అనుమతించే ఈ మొత్తం యంత్రాంగాన్నిమార్కెట్ అంటారు. వస్తుమార్పిడి వాణిజ్యం యొక్క అసలు రూపం, అనగా పరస్పరం వస్తువులు మరియు సేవలను ఇచ్చిపుచ్చుకొనే పద్ధతి. మరొక వైపు లోహాలు, విలువైన లోహాలు (పోల్స్, కాయిన్సు), బిల్, పేపర్ మనీ లాంటివి వస్తుమార్పిడి పద్ధతిలో భాగాలు. ఆధునిక వర్తకులు సాధారణంగా తమ మార్పిడికి నగదుని మాధ్యమంగా వినియోగిస్తున్నారు. దీని ఫలితంగా కొనుగోలు అనేది అమ్మకం లేక సంపాదన నుండి వేరుచేయబడింది. నగదు ప్రవేశం, (తరువాత క్రెడిట్, పేపర్ మనీ మరియు అభౌతికమైన నగదు) వ్యాపార లావాదేవీలను సులభంగా జరిపి వాపారాభివృద్ధికి తోడ్పడింది. ఇద్దరు వ్యాపారుల మధ్య జరిగే వాణిజ్యాన్ని ద్యైపాక్షిక వాణిజ్యమని మరియు ఇద్దరి కంటే ఎక్కువ మంది మధ్య జరిగే వ్యాపారాన్ని బహుళపక్ష వాణిజ్యం అని అంటారు.

Kaufmann-1568
జర్మనీ లోని వర్తకుడు, 16 వ శతాబ్దం

శ్రామిక విభజన మరియు వ్యక్తి ప్రత్యేకంగా వృద్ధిచేసిన వస్తువులతో వ్యాపారం ఆరంభమవుతుంది. ఎక్కువ మంది ఉత్పత్తి, వ్యాపారం మరియు ఇతర వస్తువుల ఉత్పత్తి కొరకు ప్రాముఖ్యత ఇస్తారు. భౌగోళిక అనుకూలతలకు అనుగుణంగా వివిధ ప్రాంతాల మధ్య వాణిజ్యం జరుగుతుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాలలోని భౌగోళిక అంశాలను బట్టి ఆ వస్తువును ఎక్కువగా ఉత్పతి చేయవచ్చు. ఈ విధంగా మార్కెట్ విలువలకు అనుగుణంగా రెండు ప్రాంతాల మధ్య వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది.

MercadodeSanJuandeDios
గువాదలాజరా లోని సం జుయన్ దే దివోస్ మార్కెట్, జాలిస్కో

రిటైలు వర్తకంలో వస్తువుల అమ్మకము లేక వ్యాపారం డిపార్టుమెంట్ స్టోర్స్, చిన్న షాపులులేక కియోస్క్ మరియు మెయిలు లాంటి నిర్దిష్టమైన ప్రదేశాలలో [1] వినియోగదారుడు చిన్న లేక పెద్ద మొత్తంలో ప్రత్యక్షంగా కొనుగోలు చేస్తాడు. రిటైల్ దారులకు, పరిశ్రమలకు, వాణిజ్య సంస్థలకు, వృతి రీత్యా వ్యాపారుదారులకు లేదా మరొక హొల్ సేల్ అమ్మకందారులకు మరియు వారి [2] అనుబంధ సేవలకు వస్తువులను అమ్మడం లేదా వ్యాపారం చేయడాన్ని హొల్ సేల్ వ్యాపారం అని అంటారు.

వ్యాపారులు లేదా ఇతర మార్కెట్ ఏజంట్లువాణిజ్య స్థలములో (మార్కెట్) క్రయవిక్రయాలు జరపడాన్ని కూడా వ్యాపారం లేదా వాణిజ్యం అని అనవచ్చు.

వాణిజ్యము-చరిత్ర

మూస:Trade route

వాణిజ్యం అతిప్రాచీనకాలం నుండే సమాచార మార్పిడితో మొదలైంది. ఆధునికయుగయుగంలో ప్రవేశపెట్టబడిన నగదుకి ముందు ప్రాచీనకాలంలోని ప్రజలు వ్యాపారం కోసం వస్తు మార్పిడి పద్ధతిని అనుసరించేవారు. వారికి వ్యాపారమే ముఖ్యమైన ఆధారం. పీటర్ వాట్సన్ ప్రకారం వాణిజ్యానికి సుమారుగా 150, 000 [3] సం||ల సుదూర చరిత్ర ఉంది.

మానవచరిత్ర ఆరంభంతోనే వాణిజ్యం కూడా మొదలైందని చెప్పవచ్చు. రాతియుగంలో అబ్సిడియన్ (ఒక రకమైన నల్లరాయి) మరియు చెకుముకి రాళ్ళ మార్పిడి జరిగిందన్న ఆధారాలున్నాయి. నగల తయారీలో వాడే పదార్దాల కోసం క్రీ. పూ 3000 సం||లో ఈజిప్టుతో వ్యాపారం జరిగేది. మొదటిసారిగా లోమెసపుటోమియా లోని సుమేరియన్సుకు మరియు హరప్పా నాగరికతలోని సింధులోయ ప్రజల మధ్య సుదూర వాణిజ్యం జరిగిందని చెప్పవచ్చు. ఫినీషియన్సు ప్రసిద్ధిచెందిన సముద్ర వ్యాపారులు. వీరు కాంస్య ఉత్పత్తి కొరకు దాని ప్రధాన ముడిసరుకైన తగరం కొరకు మధ్యధరా సముద్రం మరియు ఉత్తరం చివర బ్రిటన్ వరకు ప్రయాణం చేసేవారు. దీని కొరకు వారు ప్రత్యేకమైన వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీటిని గ్రీకులు ఎంపోరియా అని పిలిచేవారు. గ్రీకు నాగరికత ప్రారంభం నుండి, 5 వ శతాబ్దంలో రోమ్ సామ్రాజ్య పతనం వరకు యూరప్ దేశానికి లాభదాయకమైన సుగంధద్రవ్యాల సరఫరా భారతదేశం మరియు చైనా లాంటి దూర ప్రాచ్య ప్రదేశాల నుండి జరపబడ్డాయి. రోమన్ సామ్రాజ్యం తన దేశ వాణిజ్యాభివృద్ధి మరియు శాశ్వత అస్తిత్వం కొరకు చర్యలు తీసుకొంది. రోమన్ సామ్రాజ్యం వాణిజ్యాభివృద్ధి కొరకు సముద్రపు దొంగతనాల నుండి కాపాడుకొనుటకు స్థిరమైన మరియు భద్రతా రవాణా ప్రమాణాలు పాటించేది.

రోమన్ సామ్రాజ్య పతనానంతరం సంభవించిన చీకటి యుగం, పశ్చిమ యూరప్ లోని వాణిజ్యాన్ని అస్థిరపరచి పశ్చిమ ప్రపంచం లోని వ్యాపారాన్ని చిన్నాభిన్నం చేసింది. అయినప్పటికీ ఆఫ్రికా, తూర్పు మధ్య దేశాలు, భారత్, చైనా మరియు తూర్పు దక్షిణ ఆసియా లాంటి దేశాలలో వాణిజ్యం సమృద్ధి గానే జరిగింది. పశ్చిమ భాగాన కొంత మేరకు వాణిజ్యం జరిగింది. ఉదాహరణకు జ్యుయిష్ వ్యాపారస్తులయిన రాధా నైట్స్ అనే ఒక మధ్య యుగపు వ్యాపార సంఘం లేక సమూహం (చరిత్రలో అంతర్భాగమైన వారు) యూరప్ లోని క్రిస్టియన్సుకు మరియు తూర్పున ఉన్న ముస్లింల మధ్య వాణిజ్యం జరిపేవారు.

సోగాడియన్సు సుయాబ్ మరియు తలాస్ ప్రాంతాలను తమ ముఖ్య స్థావరాలుగా చేసుకొని తూర్పు పశ్చిమ వాణిజ్య మార్గము అనగా సిల్క్ రోడ్ను క్రీ. శ 4 వ శతాబ్దం నుండి 8 వ శతాబ్దం వరకు తమ ఆధిపత్యం చలాయించారు. వీరు మధ్య ఆసియాకి చెందిన ముఖ్యమైన బిడారు వర్తక సమూహం.

వైకింగ్సు మరియు వెరంగైన్స్ 8 నుండి 11 శతాబ్దం వరకు స్కాండినావియా దేశాలకు సముద్రప్రయాణం చేసేవారు. వైకింగ్సు పశ్చిమ యూరప్ కు మరియు వారంగైన్స్ రష్యాకు సముద్రయానం చేశారు. హాన్సెటిక్ లీగ్ నగరాల మధ్య వ్యాపారం కోసం ఏర్పడ్డ ఏక స్వామ్య సంస్థ. 13 మరియు 17 శతాబ్దాల మధ్యలో ఈ సంస్థ ఉత్తర యూరప్ మరియు బాల్టిక్ ప్రాంతాలను తన ఆధీనంలో ఉంచుకుంది.

1498 లో వాస్కోడీగామా ఆఫ్రికా ఖండాన్ని దాటి కాలికట్ చేరి యూరప్ సుగంధ వ్యాపారానికి మార్గదర్శకుడయ్యాడు. దీనికి ముందు ఇండియా నుండి యూరప్ కు సుగంధద్రవ్యాల రవాణా ముస్లిం అధికారం ప్రత్యేకించి ఈజిప్టు ద్వారా నియంత్రించబడింది. ఈ సుగంధద్రవ్యాల వ్యాపారం యూరప్ లోని అన్వేషణ యుగానికి ప్రోత్సాహం ఇవ్వడమే గాక ఆర్థికంగా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించి పెట్టింది. యూరోప్ నుండి తూర్పు ప్రపంచానికి తీసుకు వచ్చిన కొన్ని మసాలా దినుసులు వాటి బరువును బట్టి అత్యంత విలువైన వస్తువులుగా కొన్నిసార్లు బంగారంతో సమానంగా చూసేవారు.

16 వ శతాబ్దంలో హాలాండ్ స్వేచ్చా వాణిజ్యానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండి వస్తువినిమయానికి ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఈస్ట్ ఇండీస్ వ్యాపారం పైన 16 వ శతాబ్దంలో పోర్చుగల్, 17 వ శతాబ్దంలో నెదర్లాండ్స్, 18 వ శతాబ్దంలోబ్రిటీష్ వాళ్ళు అధికారం చలాయించారు. స్పానిష్ సామ్రాజ్యం అట్లాంటిక్ మరియుఫసిఫిక్ మహాసముద్రాలలో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు.

Wojciech Gerson - Gdańsk in the XVII century
17 వ శతాబ్దం లోని డాన్జింగ్

1776 ఆడమ్ స్మిత్ ఆన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆప్ఫ్ ద వెల్త్ ఆప్ఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇది వ్యాపార సంబంధమైన విషయాలను విమర్శించి, దేశాల మధ్య ఆర్థిక ప్రత్యేకీకరణకేవలం లాభాల గురించే ఆలోచ్స్తూ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేస్యమైన లాభాన్ని తలిపిస్తుంది మార్కెట్ పరిమాణాన్ని బట్టి శ్రామిక విభజన జరుగుతుంది. పెద్ద దేశాలలో మార్కెట్ పరిమాణం పెద్దగా ఉంటుంది, అటువంటప్పుడు శ్రామిక విభజన సమర్ధవంతంగా జరిగి ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. స్మిత్ ప్రకారం ఎగుమతి, దిగుమతి డూపరి చేత నియంత్రించబడి ఆ దేశం లోని పరిశ్రమలకు నష్టం వాటిల్లేలా చేస్తుంది

1799 లో ఒకప్పుడు ప్రపంచం లోనే అతి పెద్ద కంపెనీ అయిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వేచ్చా వాణిజ్యంలో పోటీ ఎక్కువ కావడం వలన దివాలా తీయడం జరిగింది.

Berber Trade with Timbuktu 1300s
టింబుక్తుతో బర్బర్ వ్యాపారం, 1853

1817 లో డేవిడ్ రికార్డో, జేమ్స్ మిల్ మరియు రాబర్ట్ టారెంసు తమ ప్రసిద్ధి చెందిన కంపారిటివ్ అడ్వాంటేజ్ లో స్వేచ్చా వాణిజ్యం గురుంచి వివరిస్తూ కేవలం లాభంతో నడుస్తున్న పరిశ్రమలకు మరియు బలహీనంగా ఉన్న పరిశ్రమలకు ఇది ఎంతో లాభదాయకం అని వివరించారు. రికార్డో తన ప్రిన్సిపుల్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్ అనే పుస్తకంలో ఈ సిద్ధాంతాన్ని మరింత సమర్ధవంతంగా వివరించి ఆర్థిక శాస్త్రంలో ఇప్పటికీ ప్రామాణిక సిద్ద్దాంతంగా పరిగణించారు:

ఒక అసమర్ధుని ఉత్పత్తి దారుడు తన వస్తువులను దేశానికి పంపడం వలన ఆ దేశం మరింత సమర్ధవంతంగా వస్తువులను ఉత్పత్తి చేయడమే గాక ఆ రెండు దేశాలకు లాభాన్ని తెచ్చి పెడతాయి.

19 వ శతాబ్దం మధ్యలో స్వేచ్చా వాణిజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం. ఈ పరిస్థితి ఆయా దేశాలు తమ స్వప్రయోజనం కోసం తమ సరిహద్దులు నిర్ణయించి, దిగుమతి కొరకు దారులు నిర్ణయించింది.

జాన్ స్టువార్ట్ ప్రకారం ఒకే దేశం తన టారిఫ్ మరియు ఆర్థిక విధానం లోని ఇచ్చిపుచ్చుకొనే లాంటి వాటి ద్వారా వాణిజ్య ప్రమాణాలను నిర్ణయించి ఏక స్వామ్య శక్తితో అంతర్జాతీయ మార్కెట్ విలువను అధీనంలో ఉంచుతుంది. రికార్డో మరియు ఇతరులు దీనిని ముందుగానే సూచించారు. స్వేచ్చా వాణిజ్యం మీద పూర్తిగా ఆధారపడకుండా దేశాల మధ్య పరస్పర ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటికీ ప్రయోజనకరంగా ఉంటాయి. మిల్ సిద్ధాంతం ప్రకారం కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు పూర్తిగా అభివృద్ధి చెందే వరకు వాటినికాపాడే బాధ్యత ప్రభుత్వాణిది. కొన్ని సం||ల వరకు ఈ సిద్ధాంతాన్ని చిన్న పరిశ్రమలు అనుసరించాయి. చాలా దేశాలు పారిశ్రామికీకరణ మరియు బ్రిటీష్ఎగుమతిదారులకు పోటీ కోసం ఈ విధానాన్ని అనుసరించాయి. మిల్టన్ మరియు ఫ్రైడ్ మాన్ ప్రకారం కొన్ని సందర్భాలలో టారిఫ్ కేవలం సొంత దేశానికి లాభం చేకూర్చి [4] ప్రపంచ దేశాలకు ఎటువంటి లాభం ఒనగూరదు.

1929 నుండి 1930 మధ్యలో గొప్ప ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ కాలంలో వాణిజ్యం తోపాటుగా ఇతర ఆర్థిక ప్రగతికి ఆడ్డంకి ఏర్పడింది.

ఆర్థిక మాంద్యానికి ముఖ్యమైన కారణం స్వేచ్చా వాణిజ్యం జరగాకపోవాడమని చాలా మంది అభిప్రాయపడ్డారు. అమెరికాలో రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆర్థిక మాంద్యం తొలిగిపోయింది అంతేకాక ఈ యుద్ధం తరువాత 1944 లో 44 దేశాలు ఆర్థిక మాంద్యాన్ని నివారించడానికి బ్రెట్టన్ వుడ్స్ఒప్పందం పై సంతకాలుచేసి దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలిగించాలని నిర్ణయించారు. . ఈ ఒప్పందం వివిధ నియమాలను, సంస్థలను అనగా అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు ఇంటర్నేషనల్ బ్యాంకు ఫర్ రీకన్ స్ట్రక్షన్ అండ్ డవలప్మెంట్ (తరువాత ఇది ప్రపంచ బ్యాంకు మరియు బ్యాంకు ఫర్ ఇంటర్ నేషనల్ సెటిల్ మెంట్ గా రెండుగా విభజించబడింది) ఏర్పాటు చేసి అంతర్జాతీయంగా రాజకీయ మరియు ఆర్థిక క్రమశిక్షణ కోసం పాటుపడుతున్నాయి. 1946 లో కొన్ని దేశాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించిన తరువాత ఈ సంస్థలు ఎంతో సమర్ధవంతంగా పనిచేశాయి. 1947లో 23 దేశాలు స్వేచ్చా వాణిజ్యాన్ని వృద్ధి చేయడానికి సాధారణ టారిఫ్ మరియు ట్రేడ్ ఒప్పందం పైన సంతకాలు చేసాయి.

తరువాత 20 వ శతాబ్దం చివరిలో మరియు 21 వ శతాబ్దం మొదలులో స్వేచ్చా వాణిజ్యం పురోగమనం చెందింది.

 • 1992లో యూరోపియన్ యునియన్ అంతర్గత వాణిజ్యం కొరకు తన వస్తువులు మరియు శ్రామికుల పై అడ్డంకులను తొలిగించింది
 • 1994 జనవరి 1లో ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (NAFTA) అమలులోకి వచ్చింది.
 • 1994లో GATT మరాక్ ఒప్పందం WTO ఏర్పాటు ఆవశ్యకత గురించి వివరించింది.
 • 1995 జనవరి 1 లో స్వేచ్చా వాణిజ్యం కొరకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడి ఈ సంస్థలోని సభ్య దేశాలు దేశాలు పరస్పరం సహకరించుకొనే వీలు కల్పించింది.
 • 2002 లో EC యూరోపియన్ యూనియన్ గా మార్పుచెంది ఎకనమిక్ అండ్ మానేటరి యూనియన్ (EMU) ను ఏర్పాటుచేసి యురోని ప్రవేశపెట్టడం ద్వారా, 2007 జనవరి 1 కల్లా 13 సభ్యత్వం కలిగిన దేశాలు ఒకే మార్కెట్ గా ఏర్పడి పరస్పరం సహకరించుకుంటున్నాయి .
 • 2005 లో సెంట్రల్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి వచ్చింది. ఇందులో అమెరికా మరియు డొమినికన్ రిపబ్లిక్ సభ్య దేశాలు.

ద్రవ్యం-అభివృద్ధి

పూర్వం వస్తువులను నికరమైన విలువగా గుర్తించేవారు. నికర విలువగల ఏ వస్తువునైననూద్రవ్యవస్తువు అనవచ్చు. చారిత్రక ఆధారాల ప్రకారం పందులు, ముత్యపుచిప్పలు, తిమింగలదంతాలు మరియు పశువులను నికర విలువగల వస్తువులుగా గుర్తించేవారు. మధ్యయుగ ఇరాక్ లో బ్రెడ్ ను ద్రవ్య వినిమయంగా ఉపయోగించేవారు. మేక్సికోలో మాంటిజుమా కాలంలో కోకోవా బీన్స్ ను ద్రవ్య వినిమయంగా ఉపయోగించేవారు. [1]

Roman denarius in silver (Maximinus)-transparent
రోమన్ డెనారియాస్

వస్తువుల మరియు సేవల విస్త్రుత మార్పిడి కోసం ప్రామాణికమైన ద్రవ్యం ప్రవేశపెట్టబడింది. మొదటిదశలో నిర్దిష్టమైన విలువలను సూచించడానికి లోహాలతో తయారు చేయబడిన ద్రవ్యాన్ని మరియు వస్తువులను సూచించడానికి చిహ్నాలను ఉపయోగించేవారు. ఈ పద్ధతి దాదాపు 1500 సం||లు సారవంతమైన ప్రాంతాలలో వాణిజ్యాభివృద్ధికి దోహదం చేసింది.

నాణేలను అధ్యయనం చేసే శాస్త్రవేత్తల ప్రకారం ఒకప్పుడు నాణేలను కొన్ని సమాజాలు పెద్దఎత్తున వినియోగించేవారు. అయినప్పటికీ వీరి నాణేలు విలువైన లోహంతో తయారుచేయబడింది కాదు[5].

పూర్వం స్పార్టలో తమ దేశ పౌరులు విదేశీ వాణిజ్యం జరపకుండా నాణేలను ఇనుముతో తయారుచేసేవారు.

ప్రస్తుత పరిణామాలు

దోహా చర్చలు

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన దోహా చర్చల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలిగించి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలోసజావుగా వ్యాపారం జరగడం. అభివృద్ధి చెందిన G20 దేశాల కూటమి మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య కొని విషయాలలో చర్చల ప్రతిష్టంభన కొనసాగుతుంది. ముఖ్యంగావ్యవసాయసంబందిత సబ్సిడీ విషయంలో నిర్ణయాలు తీసుకోవడం అతి కష్టంగా ఉంటుంది. కానీ వ్యాపారం సజావుగా జరగడానికి మరియు సమర్ధవంతమైన వ్యాపారం కొరకు ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి.

దోహా చర్చలు దోహా, ఖతార్లో ప్రారంభమై కాన్కన్, మెక్సిగో, జెనీవా, స్విట్జర్లాండ్, పారిస్, ఫ్రాన్స్ మరియు హాంగ్ కాంగ్ వంటి నగరాలలో చర్చలు జరిగాయి.

చైనా

1978 లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలో భాగంగా ఒక సరికొత్త ప్రయోగం చేసింది. ఇంతకముందు చైనా అమలుచేసిన సోవియట్ తరహా కేంద్రీకృత ఆర్థిక యోజనకు బదులు వ్యవసాయం, వ్యవసాయ సంబందిత పనులు మరియు కొన్ని సం||ల తరువాత పట్టణదుకాణాదారులు మరియు శ్రామికుల పై నిషేధాన్ని సరళీకృతం చేసింది కేంద్రీకృత మార్కెట్ వ్యవస్థకు ప్రాముఖ్యత ఇవ్వడం వలన లోపాలను సవరించి ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వాణించి, ముఖ్యంగా రైతులను భాగస్వామ్యం చేయడం ఉత్పత్తి పెరుగుదలకు కారణమైంది. దీని ఫలితంగా సౌత్ ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో నాలుగు (తరువాత ఐదు) ప్రత్యేక ఆర్థిక మండలులు ఏర్పడ్డాయి.

ఈ సంస్కరణ ఫలితంగా ఉత్పత్తిలో పెరుగుదల, నాణ్యమైన, భిన్నమైన, ధర మరియు డిమాండ్ లలో అభివృద్ధి ఉందని నిరూపించబడింది. వాస్తవంగా, 1978 నుండి 1986 మధ్యలో ఆర్థిక వ్యవస్థ అత్యున్నత వృద్ధికి చేరి మరలా 1994, 2003లో ఎక్కువగా వృద్ధి చెందింది. 1978 ఆర్థిక సూచీ ప్రకారం 1987, 1996, మరియు 2006లో జాతీయ తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది. 1978 లో నమోదైన వృద్ధి కంటే 2008 లో నమోదైన వృద్ధి 16. 7 రెట్లు మరియు అంతకంటే ముందు 12. 1 రెట్లు ఎక్కువ వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ వాణిజ్యం మరింత అభివృద్ధిని సాధించి ప్రతి నాలుగున్నర సం||లలో రెట్టింపు అయింది. 1998 లో మొత్తం వాణిజ్యం 1978 కంటే దాటిపోయింది 2009 మొదటి త్రైమాసికంలో వ్యాపారం 1998 లో జరిగిన వ్యాపారం కంటే దాటిపోయింది. 2008 లో చైనా మొత్తం యొక్క మొత్తం వ్యాపారం $2. 56 ట్రిలియన్ లకు చేరింది.

1991 లో PRC ప్రభుత్వం వాణిజ్యాభివ్రుద్ధి కోసం ఏర్పడ్డ ఆసియా ఫసిఫిక్ ఎకనమిక్ కో ఆపరేషన్లో చేరింది. 2001 లో ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కూడా చేరింది. ఇది కూడా చూడవచ్చు: ఎకానమీ ఆఫ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా.

అంతర్జాతీయ వాణిజ్యం

మూస:Trade bloc

దేశాల మధ్య వస్తువుల మరియు సేవలను ఇచ్చిపుచ్చుకొనే ప్రక్రియను అంతర్జాతీయ వాణిజ్యం అంటారు. ఎక్కువ దేశాలలో, GDPకి ఇది ముఖ్య భాగంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతర్జాతీయ వ్యాపారం ప్రస్తుతమే కాకుండా గడచిన శతాబ్దాలలో (సిల్క్ రోడ్, ఆంబర్ రోడ్ చూడవచ్చు) కూడా ఎక్కువగా జరిగింది. పారిశ్రామికీకరణ, అధునాతన రవాణా వ్యవస్థ, ప్రపంచీకరణం, బహుళ జాతి సంస్థలు మరియు ఆవుట్ సోర్సింగ్ లాంటివి వృద్ధి చెందడం వలన వీటి యొక్క ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ ప్రాముఖ్యత పెరిగింది. నిజానికి అంతర్జాతీయ వాణిజ్యం "ప్రపంచీకరణ" అనే పదంతో పిలవబడి తన యొక్క వ్యాపకతను అభివృద్ధి చేసుకొంది.

ఉన్ముఖ ఎగుమతి పారిశ్రామికీకరణ పద్ధతిని అవలంబించిన సౌత్ కొరియా మరియు చారిత్రకంగా అదే పద్ధతికి దగ్గరగా ఉన్న ఇండియా (అయినప్పటికీ 2005 లా తన ఆర్థిక వ్యవస్థను ప్రారంభించింది) లాంటి దేశాల పోల్చినట్లైతే మనం వాణిజ్యాభివృద్ధిని చూడవచ్చు. గడచిన 50 సం||లలో ఇండియా కంటే సౌత్ కొరియా ఆర్థిక నిబంధనలను నిర్ణయించడంలో వృద్ధి చెందింది, అయినప్పటికీ ఈ అభివృద్ధి ప్రభావవంతమైన రాష్ట్ర సంస్థల ద్వారా చేయవలసి వచ్చింది.

ఒక దేశం మరొక దేశం పై క్రమశిక్షణా చర్యలలో భాగంగా వాణిజ్య అనుమతిని నిరాకరిస్తుంది. ఈ విధంగా దేశాల మధ్య వాణిజ్యాన్ని నిరోధించడంవలన విపరీతమైన నష్టాలను చవి చూడడం జరుగుతుంది. ఉదాహరణకు క్యూబా మీద దాదాపు 40 ఏళ్ళ పాటుఅమెరికా ఇటువంటి ఆంక్షలు విదించింది.

అయినప్పటికీ దేశాల మధ్య కొంత వరకు వాణిజ్య ప్రతిబందకాలు ఏర్పడినప్పటికీ, అంతర్జాతీయ వ్యాపారం దేశ ప్రుభుత్వ కోటా మరియు నిబంధనలు, ముఖ్యంగా టారిఫ్ ల ద్వారా ర్ణయం తీసుకోబడుతుంది. సాధారణంగా టారిఫ్ దిగుమతులపైన విధించబడుతుంది. కొన్ని సమయాలలో దేశాలు ఎగుమతి మీద లేదా సబ్సిడీల మీద తరిఫ్ఫ్ లు విధిస్తాయి. వీటన్నిటినీ వాణిజ్య అడ్డంకులు అని అనవచ్చు. అదే ఒక ప్రభుత్వం ఈ వాణిజ్య అడ్డంకులను తొలిగించినట్లైతే స్వేచ్చా వాణిజ్య స్థితి ఏర్పడుతుంది. అదే ఒక ప్రభుత్వము సురక్షితమైన విధానాలను అవలంబించినట్లయితే వాణిజ్య అడ్డంకులను సృష్టించినట్లే.

ఫేర్ ట్రేడ్ ఉద్యమంను ట్రేడ్ జస్టిస్ ఉద్యమం అని కూడా అంటారు. ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం శ్రామిక, పర్యావరణ మరియు వస్తువుల ఉత్పత్తిలో సామాజిక ప్రమాణాలను పాటించడం ముఖ్యంగా, మూడవ మరియు రెండవ ప్రపంచ దేశాలు మొదటి ప్రపంచ దేశాలకు ఈవాస్తువులు దిగుమతి చేయడం. ఈ అంశము వాణిజ్యము అనేది ఒక మానవ హక్కుగా [6] చర్చించబడుతుంది.

ప్రమాణాలు అనేవి స్వచ్చందంగా దిగుమతి చేసుకొనే సంస్థలు లేదా ప్రభుత్వము తన వాణిజ్య చట్టాలు మరియు ఉద్యోగిత ఆధారంగా నిర్ణయింపబడతాయి. ఒక్కొక్కరి వాణిజ్య విధానాలు ఒక్కో విధంగా ఉంటాయి. 1980 లో కాఫీ ఉత్పత్తి కొరకు వస్తువులను నిషేధించి, బానిస సేవకులను వినియోగించి, కనీస ధరల పతకాలను ప్రవేశ పెట్టారు. వాణిజ్య విలువలను నిర్ణయించడంలో స్వచ్చంద సంస్థలు కూడా పాత్ర వహిస్తాయి. ఇవి స్వతంత్రంగా వ్యవహరించి ఏ విధమైన ఫేర్ ట్రేడ్ లేబులింగ్ పాటించాలో నిర్ణయం తీసుకొంటాయి.

సూచనలు

 1. "Distribution Services". Foreign Agricultural Service. 2000-02-09. Retrieved 2006-04-04. Cite web requires |website= (help)
 2. WTO _వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
 3. పరిచయం.
 4. మిల్టన్ ఫ్రైడ్ మాన్ ప్రైస్ సిద్ధాంతం
 5. ఆరిజన్ ఆఫ్ మనీ అండ్ ఆఫ్ బ్యాంకింగ్ లో చెప్పబడిన ప్రకారం ప్రత్యేకించిబంగారం పూర్వకాల ద్రవ్యం యొక్క సాధారణ రూపం.
 6. "Should trade be considered a human right?". COPLA. 9 December 2008. Cite web requires |website= (help)
ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా, అధికారిక నామం కామన్వెల్త్ అఫ్ ఆస్ట్రేలియా, భూగోళం యొక్క దక్షిణ భాగంలో, పసిఫిక్ మహాసముద్రానికి, హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న ఒక దేశం. ఇది ప్రపంచం లోని ఆరవ అతి పెద్ద దేశం. మరియు సాంప్రదాయిక 7 ఖండాలలో ఒకటి, విస్తీర్ణంలో అతి చిన్న ఖండం.

ఉన్నత విద్య

ఉన్నత విద్య, పాఠశాల విద్య (సెకండరీ) తరువాత ప్రారంభమయ్యే విద్య. మన దేశంలో విద్యా విధానం 10+2+3 విధానం. 10 అనగా సెకండరీ విద్య, 2 అనగా ఇంటర్మీడియట్ విద్య (సీనియర్ సెకండరీ), 3 అనగా కాలేజి డిగ్రీ విద్య. కాలేజీ డిగ్రీలో మొదటి స్థాయి విద్యని పట్టభద్ర విద్య (గ్రాడ్యుయేషన్) అని, దాని తరువాత స్థాయి పట్టభద్ర తరువాత స్థాయి (పోస్ట్ గ్రాడ్యుయేట్) అని వ్యవహరిస్తారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత పరిశోధన స్థాయి విద్య (రీసర్చ్ పోగ్రాంలు అయిన ఎం.ఫిల్. మరియు పి.హెచ్.డీ. పట్టాలు) ఉన్నాయి. ఇవన్నీ ఉన్నత విద్యాశ్రేణిలోకి వస్తాయి.

ఈ విద్యలన్నీ వివిధ రంగాలలో వుండవచ్చు. ఉదాహరణకు, కళలు, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం జీవశాస్త్రం, గణితం, వాణిజ్యం, విద్య, సామాజిక శాస్త్రం, మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, భాషా శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వైద్య శాస్త్రం, న్యాయశాస్త్రం, ఇంజినీరింగ్ మరియు ఇతర రంగాలు.

ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నత విద్యా పరిషత్ సమన్వయం చేస్తుంది.

ఏప్రిల్ 17

ఏప్రిల్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 107వ రోజు (లీపు సంవత్సరములో 108వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 258 రోజులు మిగిలినవి.

కెన్యా

కెన్యా (ఆంగ్లం Republic of Kenya) రిపబ్లిక్ ఆఫ్ కెన్యా. తూర్పు ఆఫ్రికా లోని ఒక దేశం. పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన 47 ఆఫ్రికా దేశాలలో ఇది ఒకటి. కెన్యా జనసంఖ్య 52.2 మిలియన్లు. అత్యధిక జనసాంధ్రత కలిగిన ప్రపంచ దేశాలలో కెన్యా 27 వ స్థానంలో ఉంది. కెన్యా పాలనాబాధ్యతలను ఎన్నిక చేయబడిన గవర్నర్లు నిర్వహిస్తారు. కెన్యా వైశాల్యపరంగా 580,367 చద�kilo��పు మీటరుs (224,081 sq mi), ప్రపంచదేశాలలో 48 వ స్థానంలో ఉంది. కెన్యా ఉత్తరసరిహద్దులో ఇథియోపియా, ఈశాన్యసరిహద్దులో సోమాలియా, దక్షిణసరిహద్దులో టాంజానియా దేశాలు ఉన్నాయి. దీని రాజధాని నైరోబి.

పురాతన నగరం, మొట్టమొదటి రాజధాని సముద్రతీర నగరం మొబాంసా. విక్టోరియా సరోవరతీరంలో ఉన్న కిసుము సిటీ మూడవ పెద్ద నగరం. ఇతర ముఖ్యమైన పట్టణ కేంద్రాలలో నకురు, ఎల్డోరెటు నగరాలు ఉన్నాయి.

నిలోటో-భాషావాడుకరులైన పాస్టోలిస్టులు (కెన్యా నీలోటికు మాట్లాడే పూర్వీకులు) ప్రస్తుత దక్షిణ సూడాన్ నుండి క్రీ.పూ 500 లో కెన్యా ప్రాంతాలకు వలసవచ్చారు. 19 వ శతాబ్దంలో ఐరోపా అన్వేషణతో కెన్యా ఐరోపా కాలనీకరణ ప్రారంభమైంది. ఆధునిక కెన్యా 1895 లో బ్రిటీషు సామ్రాజ్యంచే స్థాపించబడిన ఒక ప్రొటొరేటు నుండి ఉద్భవించింది. తరువాత 1920 లో కెన్యా కాలనీ ప్రారంభమైంది. 1952 లో గ్రేటు బ్రిటషు, కాలనీల మధ్య ప్రారంభమైన అనేక వివాదాలు మాయు మాయు విప్లవానికి దారితీశాయి. ఫలితంగా 1963 లో స్వాతంత్ర్య ప్రకటన చేయబడింది. స్వాతంత్ర్యం తరువాత కెన్యా కామన్వెల్తు ఆఫ్ నేషన్సు సభ్యదేశంగా ఉంది. ప్రస్తుత రాజ్యాంగం 1963 స్వాతంత్ర రాజ్యాంగం స్థానాన్ని 2010 లో పునర్నిర్మించబడిన రాజ్యాంగం భర్తీ చేసింది.

కెన్యా ప్రెసిడెంటు ప్రతినిధ్యం వహించే ప్రజాస్వామ్య రిపబ్లికు దీనిలో ఎన్నికైన అధికారులు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అధ్యక్షుడు దేశానికి, ప్రభుత్వానికి అధిపతిగా ఉంటారు. కెన్యా ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇతర అంతర్జాతీయ సంస్థలలో సభ్యదేశంగా ఉంది. సభ్యుడు. 1,460 GNI తో కెన్యా ఒక తక్కువ-మధ్య-ఆదాయం కలిగిన ఆర్ధిక వ్యవస్థగా వర్గీకరించబడింది తూర్పు, మధ్య ఆఫ్రికాలో కెన్యా ఆర్ధిక వ్యవస్థ అతిపెద్దది, నైరోబీ ప్రధాన ప్రాంతీయ వాణిజ్య కేంద్రంగా పనిచేస్తోంది. వ్యవసాయం అతిపెద్ద రంగం; టీ, కాఫీ సాంప్రదాయ నగదు పంటలుగా ఉన్నాయి. తాజా పువ్వులు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎగుమతిగా ఉంది. సేవా పరిశ్రమ ప్రధాన ఆదాయవనరుగా (పర్యాటక రంగం) ఉంది. కెన్యా తూర్పు ఆఫ్రికన్ కమ్యూనిటీ వర్తక సంఘంలో సభ్యదేశంగా ఉంది. అయితే కొన్ని అంతర్జాతీయ వర్తక సంస్థలు గ్రేటరు హార్ను ఆఫ్ ఆఫ్రికాలో భాగంగా వర్గీకరించాయి. కెన్యా అతి పెద్ద ఎగుమతి మార్కెట్టుగా ఆఫ్రికా ఉంది. తర్వాత స్థానంలో ఐరోపా సమాఖ్య ఉంది.

కోల్‌కాతా

కోల్‌కాతా (బెంగాళీ: কলকাতা) భారత దేశములోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని. ఇది తూర్పు భారత దేశములోని హుగ్లీ నది తూర్పు తీరముపై ఉంది. 2011 జనాభాగణాంకాలను అనుసరించి ఈ నగర జనాభా ప్రధాన నగరము 50 లక్షల జనాభా కలిగిఉన్నది కానీ చుట్టుపక్కల మహానగర పరిసర ప్రాంతాలను కలుపుకొని 1.4 కోట్ల జనాభా ఉంది. భారతీయ ప్రధాన నగరాలలో ఈ నగర జనసాంద్రత మూడవ స్థానంలో ఉంది. 2008 గణాంకాలను అనుసరించి ఈ నగరం కుటీర పరిశ్రమల ద్వారా పొందుతున్న ఆదాయం దక్షిణఆసియా దేశాలలో మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో ముంబయ్ ఢిల్లీ నగరాలు ఉన్నాయి. భారతీయ రాష్ట్రాలలో ఒకటి అయిన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత. హుగ్లీ నది తూర్పుతీరంలో ఉన్న ఈ నగరం తూర్పుభారతదేశానికి సాంస్కృతిక, వాణిజ్య మరియు విద్యా కేంద్రంగా విలసిల్లుతుంది. భారతీయ రేవుపట్టణాలలో ఇది పురాతనమైనది అలాగే అధికంగా ఆదాయాన్ని అందిస్తున్న రేవులలో ఇది ప్రధానమైనది. అభివృద్ధి చెందుతున్న దేశంలోని అభివృద్ధి చేందుతున్న నగరంగా కోల్‌కత నగరం గుర్తించతగినంతగా శివారుప్రాంతం లోని జనాభా పెరుగుదల, వాహన రద్దీ, పేదరికం, అధిక జనసాంద్రత మరియు ఇతర చట్టపరమైన సాంఘిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది.

17వ శతాబ్దపు చివరి సమయంలో మొగల్ సామ్రాజ్య బెంగాల్ రాజ్యప్రతినిధి పాలనలో ప్రస్తుత కోల్ కత ప్రదేశంలో ఉన్న మూడు గ్రామాలు ఉండేవి. 1690లో బెంగాల్ నవాబు ఈస్టిండియా కంపనీకి వ్యాపార అనుమతి ఇచ్చిన తరువాత కంపనీ ఈ ప్రదేశాన్ని

బలమైన రేవుపట్టణంగా అభివృద్ధి పరచింది. 1756లో కొల్ కత నగరం నవాబు సిరాజ్ ఉద్ దులాహ్ చేత ఆక్రమించబడింది. తరువాతి సంవత్సరమే ఈస్టిండియా కంపనీ ఈ నగరాన్ని తిరిగి స్వాధీనపరచుకుని 1772 నాటికి పూర్తి సామ్రాజ్యాధిపత్యం కూడా సాధించింది. మొదట ఈస్టిండియా కంపనీ తరువాత బ్రిటిష్ సామ్రాజ్యపాలనలో కొల్ కత 1911 వరకు భారతదేశ రాజధానిగా ఉంటూ వచ్చింది. ఈ నగర భౌగోళిక పరమైన అసౌకర్యాలు, బెంగాలులో సమైగ్ర స్వతంత్ర ఉద్యమం తీవ్రరూపందాల్చడం వంటి పరిణామాల కారణంగా రాజధాని కొత్త ఢిల్లీకి బదిలీ చేయబడింది. ఈ నగరం స్వాతంత్ర్యోద్యమంలో కేంద్రస్థానం అయింది. ఆ సమయంలో ఈ నగరం ఉద్రక్త రాజకీయాలలో ఉంటూ వచ్చింది. 1947 స్వతంత్రం వచ్చిన తరువాత ఆధునిక భారతదేశంలో కొల్ కత విద్య, వితజ్ఞానం, సంస్కృతి మరియు రాజకీయలలో పలు దశాబ్ధాల కాలం ఈ నగరం ప్రధానకేంద్రంగా అభివృద్ధి చెందింది.

2000 నుండి ఈ నగరం వేగవంతంగా ఆర్థిక ప్రగతిని సాధించింది.

భారతదేశంలో 19-20 శతాబ్దాల మధ్యకాలంలో బెంగాల్ శిల్పశైలి మరియు మతవిశ్వాసం సంప్రదాయకంగా విభిన్నమైన సంస్కృతికి బెంగాల్ కేంద్రస్థానం అయింది. కోల్ కతలో ప్రాంతీయ సంప్రదాయరీతులను నాటకాలు, కళ, చలనచిత్రాలు మరియు సాహిత్యం రూపాలలో ప్రదర్శించే ఏర్పాట్లు జరగడం వలన అత్యధికమైన అభిమానులను సంపాదించుకుంది. భారతదేశంలో నోబుల్ బహుమతి అందుకున్న వారిలో పలువురు కొల్ కతలో జన్మించిన వారే. వీరు కళారంగంలోనూ, విజ్ఞానరంగంలోనూ మరియు ఇతర

రంగాలలోనూ నోబుల్ బహుమతి అందుకున్నారు. కొల్ కత నగరంలో తయారు చేయబడుతున్న చలనచిత్రాలకు జాతీయస్థాయి గుర్తింపు ఉంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అకాడమీ ఆప్ ఫైన్ ఆర్ట్స్, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, క్రికెట్ గ్రౌండ్స్ వంటివి కెల్ కతలో ఉన్నాయి. మిగిలిన భారతీయ నగరాలకంటే ప్రత్యేకంగా కెల్ కత ఫుట్ బాల్ సంబంధిత క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంది.

గూడూరు (నెల్లూరు)

గూడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పట్టణం. గూడూరు పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనది. ఇక్కడ వ్యాపారంలో నిమ్మకాయలు, అభ్రకం (మైకా) ప్రధానమైనవి.

గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి. గూడూరు పట్టణ జనాభా సుమారు 1,10,000.

చెరువు

చెరువు లేదా జలాశయం మంచి నీరు నిలువచేయు ప్రదేశము. చాలా చెరువులు వర్షం మీద ఆధారపడతాయి. మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి. భారతదేశములో చాలా గ్రామములలో చెరువునీరు త్రాగడానికి ఉపయోగిస్తారు. కొన్ని పెద్దచెరువులు పంటపొలాలకు నీరందిస్తున్నయి. పూర్వకాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి రాజ్యంలో చెరువులు త్రవ్వించారు. నదులమీద ఆనకట్టలు కట్టి నీటిని నిలువచేసే వాటిని కూడా చెరువులే అనాలి. ఇలా తయారైన నాగార్జునసాగర్ ఒక సముద్రం లాగా ఉంటుంది.

ధర్మాజీగూడెం

ధర్మాజీగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, లింగపాలెం మండలానికి చెందిన గ్రామము..

పిన్ కోడ్: 534 462. ధర్మాజీగూడెం పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 16 వేలు జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచాయితీ కల ఈ గ్రామం లింగపాలెం మండలంలో అతి పెద్దది. ఈ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాల, ఒక బాలికోన్నత పాఠశాల, ఒక జూనియర్ కళాశాల ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటి ఆడియో, వీడియో కళాశాల ఇక్కడే ఏర్పాటయినది. మాగంటి సీతారామదాసు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల 1950 వ సంవత్సరంలో ప్రారంభం అయినది. ఇందులో సుమారు 700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

పత్తి

ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. నూలును తయారు చేయుటకు ఉపయోగించే 'ప్రత్తి' లేదా 'పత్తి' (దూది) ఈ మొక్కలనుండే లభిస్తుంది. ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది అమెరికా, ఆఫ్రికా మరియు భారత దేశాలకు చెందిన పొద లాంటి మొక్క. ఇది ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరిగే మొక్క. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి, గుడ్డలు నేయటానికి వాడతారు. ప్రపంచంలో గుడ్డలు నేయటానికి అత్యధికంగా వాడబడే ప్రకృతి సహజమైన పీచుపదార్థము. ఇలా నేసిన గుడ్డ మృదువుగా, గాలి ఆడేటట్లు ఉంటుంది.

పద్మ విభూషణ్ పురస్కారం

పద్మ విభూషణ్ పురస్కారము జనవరి 2, 1954 నెలకొల్పబడింది. భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవముగా ఈ పురస్కారమును గుర్తిస్తారు. భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవ నందించిన భారత పౌరులకు ఈ పతకమునిచ్చి గౌరవిస్తారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO ) అనేది అంతర్జాతీయ వాణిజ్యాన్ని పర్యవేక్షించడానికి మరియు సరళీకృతం చేయడానికి దాని స్థాపకులచే రూపొందించబడిన ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ 1947లోని ప్రారంభమైన సుంకాలు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందానికి (GATT) బదులుగా అధికారికంగా మారాకేష్ ఒప్పందాన్ని 1995 జనవరి 1లో ప్రారంభించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ పాల్గొనే సంస్థల మధ్య వాణిజ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది; వాణిజ్య ఒప్పందాలను చర్చించడానికి మరియు నిర్మించడానికి ఒక ప్రణాళికను మరియు సభ్య ప్రభుత్వాల యొక్క ప్రతినిధులు మరియు వారి చట్టసభలచే సంతకం చేసిన WTO ఒప్పందాలకు పాల్గొనేవారు కట్టుబడి ఉండేలా చూడటానికి ఒక వివాద పరిష్కార విధానాన్ని అందిస్తుంది. WTO దృష్టి సారించే అధిక సమస్యలను మునుపటి వాణిజ్య మంతనాల నుండి, ప్రత్యేకంగా ఉరుగ్వే రౌండ్ (1986-1994) నుండి ఉత్పాదిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచంలోని అత్యధిక జనాభాను సూచిస్తున్న పేద దేశాలు సమాన స్థానాలను పొందేలా మెరుగుపర్చడానికి 2001లో ప్రారంభించిన దోహా డెవలప్‌మెంట్ అజెండా (లేదా దోహా రౌండ్) అని పిలవబడే ఒక వాణిజ్య చర్చతో పట్టుదలగా కృషి చేస్తుంది. అయితే, " దిగుమతుల్లో కల్లోలాల నుండి రైతులను రక్షించడానికి ఒక 'ప్రత్యేక సురక్షిత కొలత' యొక్క ఖచ్ఛితమైన నియమాలపై వ్యవసాయ భారీ ఉత్పత్తుల ఎగుమతుదారులు మరియు జీవనోపాధి రైతులు అధికంగా గల దేశాల మధ్య విభేదం కారణంగా ఆ చర్చ కష్టసాధ్యమైంది. ఈ సమయంలో, దోహా రౌండ్ యొక్క భవిష్యత్తు అనిశ్చితంగా మారింది."WTO మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 95% కంటే ఎక్కువ భాగాన్ని సూచిస్తున్న 152 సభ్యులు మరియు 30 పరిశోధకులను కలిగి ఉంది, పలువురు సభ్యత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. మంత్రివర్గ సదస్సుచే WTO నిర్వహించబడుతుంది, ప్రతి రెండు సంవత్సరాలకు సమావేశం జరుగుతుంది; సదస్సు యొక్క విధాన నిర్ణయాలను అమలు చేసే ఒక సాధారణ మండలి మరియు ఇది రోజువారీ నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తుంది మరియు మంత్రివర్గ సదస్సుచే ఒక ప్రధాన నిర్వహణాధికారి నియమించబడతారు. WTO యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సెంట్రీ విలియమ్ రాపార్డ్‌లో ఉంది.

ప్రపంచీకరణ

ప్రపంచీకరణ (ఆంగ్లం: Globalization; గ్లోబలైజేషన్ ) అనేది సాహిత్యపరంగా చూస్తే స్థానిక లేదా ప్రాంతీయ విషయాలను ప్రపంచ విషయాలుగా మార్చివేసే ప్రక్రియ. ప్రపంచం లోని ప్రజలు అందరినీ ఏకం చేసి ఒకే ఒక సమాజంగా కలిసికట్టుగా పనిచేసేటట్టుగా చేసే ఒక పద్ధతిగా దీనిని వర్ణించవచ్చు.

ఈ పద్ధతి ఆర్ధిక, సాంకేతిక, సాంఘిక సంప్రదాయ మరియు రాజకీయ బలాల యొక్క మిశ్రమం.వాణిజ్యం, నేరుగా విదేశీ పెట్టుబడి, మూలధన ప్రవాహాలు, వలస పోవటం మరియు సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ వంటి వాటి ద్వారా జాతీయ ఆర్ధిక వ్యవస్థలను అనుసంధానించి అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థగా మార్చటానికి ప్రపంచీకరణ తరచుగా ఆర్ధిక ప్రపంచీకరణను సూచించటానికి ఉపయోగించబడుతుంది.[1]

సస్కియా సస్సేన్ వ్రాసిన దాని ప్రకారం "ప్రపంచీకరణ యొక్క మంచి భాగం-విధానాలు, మూలధనం, రాజకీయ సంబంధితాలు, పట్టణ ప్రాంతాలు, ఆ దేశానికి సంబంధించిన ఏర్పాట్లు, లేదా మరే ఇతర రకాలైన గతి విద్యలు మరియు విభాగాలు వంటి జాతీయ సంబంధిత నిర్మాణాలను ఆ జాతికి సంబంధంలేని వాటిగా చెయ్యటం మొదలుపెట్టే అసంఖ్యాక రకాలైన సూక్ష్మ-పద్దతులను కలిగి ఉంటుంది".

సంయుక్త దేశాల ESCWA " ప్రపంచీకరణ చాలా రకాలైన మార్గాలలో వర్ణించటానికి వీలున్న విస్తారంగా ఉపయోగించే పదం అని రాసింది.ఆర్ధికపరంగా వినియోగించినప్పుడు, వస్తువులు, మూలధనం, సేవలు మరియు కార్మికుల ప్రవాహానికి పరిగణలోకి తీసుకోదగ్గ అవాంతరాలు ఉన్నప్పటికీ.... కార్మికులు మొదలైన వాటి యొక్క ప్రవాహంను తీసుకురావటానికి దేశాల సరిహద్దుల మధ్య ఉన్న అడ్డంకులను తగ్గించటం మరియు తొలగించటంను సూచిస్తుంది....ప్రపంచీకరణ అనేది కొత్త విషయం ఏమీ కాదు.ఇది పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో మొదలయ్యింది కానీ దాని వ్యాప్తి మొదటి ప్రపంచ యుద్ధం మొదలు నుండి ఇరవయ్యో శతాబ్దం ముప్పావు భాగం వరకు నెమ్మదించింది.తమ పరిశ్రమలను రక్షించుకోవటానికి చాలా దేశాలు కొనసాగించిన ఆంతర్ముఖ విధానాలు ఈ నెమ్మదించడానికి కారణంగా చెప్పవచ్చు.. ఏది ఎలా ఉన్నప్పటికీ, ఇరవయ్యో శతాబ్దం నాల్గవ పావుభాగంలో ప్రపంచీకరణ విధానం బాగా పుంజుకుంది...."కాటో సంస్థకు చెందిన టాం జి.పాల్మార్ ప్రపంచీకరణను "సరిహద్దుల మధ్య మారకం పై ఉన్న రాష్ట్ర-నిర్బంధ నిబంధనలను తగ్గించటం లేదా తొలగించటం మరియు ఫలితంగా ఉద్భవించిన అధికంగా అనుసందానించబడ్డ మరియు సంక్లిష్టమైన ప్రపంచ వ్యవస్థ యొక్క ఉత్పత్తి"గా వివరించారు.థామస్ ఎల్. ఫ్రైడ్మన్ "చదునుచేయబడుతున్న" ప్రపంచం యొక్క ప్రభావాలను పరీక్షించాడు మరియు ప్రపంచీకరించబడ్డ వాణిజ్యం, విదేశాలకు సేవలందించటం, సరఫరా-గొలుసులు ఏర్పరచటం మరియు రాజకీయ శక్తులు ప్రపంచాన్ని మంచి మరియు చెడులు రెండిటికీ ఎల్లప్పటికీ మార్చివేశాయి అని వాదించాడు.ప్రపంచీకరణ విధానం తొందరగా అవుతున్నది మరియు వ్యాపార సంస్థలు మరియు నిర్వహణ పై ఒక పెరుగుతున్న ప్రభావాన్ని కొనసాగిస్తుందని కూడా వాదించాడు.ప్రపంచీకరణ అనే పదం ఒక సిద్ధాంత పరంగా ఆర్ధిక ప్రపంచీకరణ యొక్క పునర్నిర్మాణ విధాన్ని వర్ణించటానికి కూడా ఉపయోగించబడుతుంది అని నోం చోమ్స్కీ వాదించాడు.అంతర్జాతీయకరణ మరియు ప్రపంచీకరణ అను పదాలు కొన్నిసార్లు ఒక దాని బదులు ఇంకోటి వాడబడతాయి కానీ వాటి మధ్య అధికారికంగా గుర్తించతగిన తేడా ఉంది అనిహెర్మన్ యి.డాలీ వాదించాడు."అంతర్జాతీయకరణ" అను పదం దేశాల మధ్య కార్మికులు మరియు మూలధనం కదలలేకపోవటానికి (ఊహాత్మకమైన) కట్టుబడి ఉన్న అంతర్జాతీయ వాణిజ్యం, సంబంధాలు, ఒప్పందాలు మొదలైన వాటి ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది.

బేలూరు

బేలూరు (కన్నడ: ಬೇಲೂರು) కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఒక పట్టణం. మున్సిపాలిటి. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన చెన్నకేశావాలయం ఉంది. హొయసల శైలి శిల్పకళకు ఈ దేవాలయం ఒక నిలువుటద్దం. బేలూరును పూర్వం వేలా పురీ అనే వారు. క్రమంగా వేలూరుగా చివరికి బేలూరుగా మారింది. ఈ పట్టణం యాగాచి నది ఒడ్డున ఉంది. ఈ బేలూరు ఒకనాడు హొయసల రాజుల రాజధాని.

భారతదేశం జాబితాలు

భారత దేశానికి సంబంధించిన వివిధ జాబితాలు ఈ పేజీలో ఇవ్వబడ్డాయి. ఏదైనా క్రొత్త జాబితా తయారు చేస్తే దాని లింకు ఈ పేజీలో సంబంధిత విభాగంలో ఉంచండి.

ఆంగ్ల వికీలో en:Category:India-related lists అనే వర్గంలో అనేక జాబితాలు ఉన్నాయి. పరిశీలించగలరు.

మహెసనా

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మహెసనా జిల్లా (గుజరాతీ:મહેસાણા જિલ્લો) ఒకటి. మహెసనా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,837,892.

జిల్లాలో 600 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 22.40% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు.

రాజాం

రాజాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నగర పంచాయితీ

ఇది పురపాలక సంఘంగా గుర్తించబడింది. దీని అక్షాంశ రేఖాంశాలు 18.28N 83.40E.. సముద్రమట్టం నుండి ఎత్తు 41 మీటర్లు. (137 అడుగులు).

రాణిగంజ్

రాణిగంజ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. సికిందరాబాదుకి సమీపంలో ఉన్న ఈ రాణిగంజ్ లో ఇంజనీరింగ్ కు సంబంధించిన సామాన్లు లభిస్తాయి.

వాణిజ్యశాస్త్రం

వాణిజ్య శాస్త్రం ను ఇంగ్లీషులో కామర్స్ (Commerce or Business) అని అంటారు.

అర్ధం:- వ్యాపారం లేదా వర్తకం లో జరిగే వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయటాన్ని వాణిజ్యం అంటారు. వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు గురించి తెలిపే శాస్త్రం.

వాణిజ్య సంస్థ, కంపెనీ లేదా ఎంటర్ ప్రైజ్ అనగా వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి లేదా వినియోగదారులకు సేవల్నిఅందించడానికి ఏర్పడినట్టు చట్టపరంగా గుర్తింపు పొందిన సంస్థ.

ఇలాంటి వ్యాపారాలు పెట్టుబడిదారి (కాపిటలిస్ట్) వ్యవస్థలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులచే నడుపబడతాయి. వీటి ముఖ్యమైన ఉద్దేశం లాభాల్ని ఆర్జించడం మరియు వాటి అధిపతుల్ని ధనవంతుల్ని చేయడం. సోషలిస్టు వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలు లేదా పబ్లిక్ లేదా సహకార సంస్థలు ఎక్కువగా ఉంటాయి.

==వ్యాపారస్తుడు==bi

వ్యాపారం లేక వర్తకం చేసే వ్యక్తిని వ్యాపారస్తుడు లేక వర్తకుడు అంటారు. వ్యాపారస్తుడిని ఆంగ్లంలో బిజినెస్‍మెన్ అంటారు.

హిందూ మహాసముద్రం

హిందూ మహాసముద్రం ప్రపంచంలోకెల్లా మూడో అతి పెద్ద మహాసముద్రం. భూమి ఉపరితలంపై ఉన్న మొత్తం నీటిలో దాదాపు 20 శాతం హిందూ మహాసముద్రంలోనే ఉంది. దీనికి ఉత్తరాన భారత ఉపఖండం, పశ్చిమాన తూర్పు ఆఫ్రికా, తూర్పున ఇండొనేసియా, సుండా ద్వీపాలు, ఆస్ట్రేలియా, దక్షిణాన దక్షిణ మహాసముద్రం (లేదా, నిర్వచనాన్ని బట్టి అంటార్కిటికా) ఉన్నాయి. భారతదేశం పేరు మీదుగా దీనికి హిందూ మహాసముద్రమనే పేరు వచ్చింది. హిందూ మహాసముద్రాన్ని ప్రాచీన సంస్కృత సాహిత్యంలో రత్నాకర మని పిలిచారు. రత్నాకరమంటే వజ్రాలగని అని అర్థం. భారతీయ భాషల్లో దీన్ని హిందూ మహాసాగరం అని కూడా అన్నారు.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.