యునెస్కో

ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో), United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO), ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రధాన అంగము. ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945 లో స్థాపించారు. ఇది తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణ లకు తన తోడ్పాటు నందిస్తుంది. అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం మరియు సాంస్కృతిక పరిరక్షణ కొరకు పాటు పడుతుంది.[1] ఇది నానాజాతి సమితి యొక్క వారసురాలు కూడా.

యునెస్కోలో 193 సభ్యులు మరియు 6 అసోసియేట్ సభ్యులు గలరు. దీని ప్రధాన కేంద్రం, పారిస్, ఫ్రాన్సులో గలదు.


ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ (United Nations Educational, Scientific and Cultural Organization)
Unesco
Org typeప్రత్యేకమైన సంస్థ
AcronymsUNESCO
Headయునెస్కో డైరెక్టర్ జనరల్
: ఆద్రే అజౌలే
Statusక్రియాశీల
Established1945
Websitewww.unesco.org

నిర్మాణం

దీని ప్రధాన అంగాలు మూడు, ఇవి తన విధి విధాన (పాలసీ) నిర్మాణం కొరకు, అధికార చెలామణి కొరకు, మరియు దైనందిన కార్యక్రమాలకొరకు పాటుపడుతాయి.

 • సాధారణ సభ : దీని సభ్యులు మరియు సహకార సభ్యుల సమావేశాలను ప్రతి రెండేండ్లకొకసారి నిర్వహిస్తుంది. తన విధివిధానాలను, కార్యక్రమాలను తయారు చేస్తుంది.
 • కార్యనిర్వాహక సంఘం (బోర్దు) : కార్యనిర్వాహక సంఘం (బోర్దు), సాధారణ సభచే నాలుగేండ్లకొరకు ఎన్నుకోబడుతుంది.
 • మంత్రాలయం : మంత్రాలయం, దైనందిన కార్యక్రమాలను, మరియు దీని పరిపాలనా బాధ్యతలను చేపడుతుంది. దీని నిర్దేశాధికారి (డైరెక్టర్ జనరల్) నాలుగేండ్ల కాలానికొరకు ఎన్నుకోబడతాడు. దీనిలో 2100 మంది సిబ్బంది ఉన్నారు. మూడింట రెండువంతు సిబ్బంది పారిస్ లోనే తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిగతా వారు ప్రపంచంలోని పలు దేశాలలో గల ఐక్య రాజ్య విద్యో విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) కార్యాలయాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

కార్యక్రమాలు

యునెస్కో తన తన కార్యక్రమాలను 5 రంగాలలో నిర్వహిస్తుంది, అవి: విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక మరియు మానవ శాస్త్రాలు, సంస్కృతి, మరియు కమ్యూనికేషన్లు మరియు ఇన్ఫర్మేషన్.

 • విద్య : యునెస్కో, విద్య ద్వారా 'అంతర్జాతీయ నాయకత్వం' కొరకు అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తున్నది.
  • 'ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ (IIEP): దీని ప్రధాన ఉద్దేశం, వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్ లు చేపట్టడం.
 • యునెస్కో 'ప్రజా ప్రకటన'లిచ్చి, ప్రజలను చైతన్యవంతం చేస్తుంది.
 • సాంస్కృతిక మరియు శాస్త్రీయ ఉద్దేశాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతుంది, ఉదాహరణకు:
  • 'ఇంటర్నేషనల్ నెట్ వర్క్ ఆఫ్ జియోపార్క్స్'
  • 'బయోస్ఫియర్ రిజర్వ్స్' 1971 నుండి.
  • 'సిటీ ఆఫ్ లిటరేచర్'
  • 'అపాయంలో పడ్డ భాషలు'.
  • 'మాస్టర్ పీసెస్ ఆఫ్ ద ఓరల్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ.
  • 'మెమరి ఆఫ్ ద వరల్డ్'.
  • 'వాటర్ రిసోర్స్ మేనేజ్ మెంట్' 1965 నుండి.
  • ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
 • 'ఉపాయాలను, చిత్రాలు మరియు పదముల ద్వారా వ్యక్తీకరించడా'నికి ప్రోత్సహించడం.
  • 'భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని' ప్రోత్సహించడం.
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించడం.
  • మీడియా ద్వారా, సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి, రాజకీయ సిద్ధాంతాలను తయారుజేయడం.
 • వివిధ ఈవెంట్ లను ప్రోత్సహించడము, ఉదాహరణకు:
 • ప్రాజెక్టుల సంస్థాపన మరియు ఫండింగ్ సహాయ సహకారాలు, ఉదాహరణకు:
  • 'మైగ్రేషన్ మ్యూజియం'లు.[2]
  • 'యునెస్కో-యూరోపియన్ సెంటర్ ఫార్ హైయర్ ఎడ్యుకేషన్' 1972 లో స్థాపించబడింది.
  • 'ఫ్రీ సాఫ్ట్ వేర్ డైరెక్టరీ', ఉచిత సాఫ్ట్ వేర్ లకు సహాయం.
  • 'ఫ్రెష్ యునెస్కో', పాఠశాలల ఆరోగ్యపథాకాలు.[3].
  • 'ఆసియా పసిఫిక్ వార్తా ఏజెన్సీల సంస్థ'
  • అంతర్జాతీయ సైన్స్ కౌన్సిల్
  • 'యునెస్కో గుడ్ విల్ అంబాసిడర్స్'
  • 'ఏషియన్ సింపోజియం ఆన్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ స్పెసీస్', ఆసియాలో ఈ సమావేశాలు జరిగాయి.
  • 'బాటనీ 2000', టాక్జానమీ మరియు మెడిసినల్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ మరియు ఇతర వాతావరణ కాలుష్య వ్యతిరేక కార్యక్రమాలు.

బహుమతులు, అవార్డులు మరియు పతకాలు

యునెస్కో వివిధ అవార్డులను, బహుమతులను, శాస్త్ర, సాంస్కృతిక, శాంతి రంగాలలో ప్రదానము చేస్తుంది. ఉదాహరణకు :

 • 'మైక్రో బయాలజీలో 'కార్లోస్' బహుమతి.'
 • 'ఫెలిక్స్ హౌఫూట్-బాయినీ 'శాంతి బహుమతి'.'
 • 'గ్రేట్ మాన్-మేడ్ రివర్ ఇంటర్నేషనల ప్రైజ్ ఫార్ వాటర్ రీసోర్సెస్ ఇన్ అరిడ్ అండ్ సెమి-అరిడ్ ఏరియాస్.'
 • 'ఇంటర్నేషనల్ జోస్ మార్టి ప్రైజు.'
 • 'ఇంటర్నేషనల్ సైమన్ బోలివర్ ప్రైజు.'
 • 'జావేద్ హుసేన్ ప్రైజ్ ఫార్ యంగ్ సైంటిస్ట్.'
 • 'జిక్జీ వరల్డ్ ప్రైజ్', వ్రాత ప్రతుల సంరక్షణల కొరకు.
 • 'కళింగ ప్రైజ్', శాస్త్రాలను ప్రచారం చేసినందుకు.
 • 'లోరియల్-యునెస్కో అవార్డు', శాస్త్రాలను శోధించినందుకు స్త్రీలకు ఇస్తారు.
 • 'సెర్గీ ఐన్ స్టైన పతకం', సినిమాటోగ్రఫీ కళలలో.
 • 'సుల్తాన్ ఖబూస్ ప్రైజ్ ఫార్ ఎన్విరాన్మెంటల్ ప్రిజర్వేషన్.'
 • 'యునెస్కో గ్యుల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజు.'
 • 'యునెస్కో కింగ్ హమ్మాద్ బిన్ ఇసా అల్-ఖలీఫా ప్రైజ్ ఫార్ ద యూజ్ ఆఫ్ ఐ.సీ.టీ. ఇన్ ఎడ్యుకేషన్.'
 • 'యునెస్కో మొజార్ట్ పతకం', ప్రపంచ శాంతి కొరకు సంగీతం మరియు కళా రంగాలలో పనిచేసినందుకు.
 • 'యునెస్కో ప్రైజ్ ఫార్ పీస్ ఎడ్యుకేషన్.'
 • 'యునెస్కో ప్రైజ్ ఫార్ హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్.'
 • 'యునెస్కో సైన్స్ ప్రైజ్.'
 • 'యునెస్కో ఇన్స్టిట్యూట్ పాశ్చర్ పతకం.'
 • 'యునెస్కో ఆర్టిస్ట్స్ ఫార్ పీస్.'
 • 'క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్.'
 • 'సీల్ ఆఫ్ ఎక్సల్లెన్స్ ఫార్ హ్యాండీక్రాఫ్ట్స్.'

తపాళా బిళ్ళలు

ప్రపంచంలోని ఎన్నో దేశాలు యునెస్కో గౌరవార్థం తపాలా బిళ్ళలను విడుదల చేశారు.

డైరెక్టర్స్ జనరల్

 1. జూలియన్ హక్స్ లీ,  United Kingdom (1946–1948)
 2. జైమ్ టోర్రెస్ బోడెట],  Mexico (1948–1952)
 3. జాన్ విల్కిన్సన్ టేలర్,  United States (acting 1952–1953)
 4. లూథర్ ఇవాన్స్,  United States (1953–1958)
 5. విట్టోరినో వెరోనీస్,  Italy (1958–1961)
 6. రీనె మాహ్యూ,  France (1961–1974; acting 1961)
 7. అమాడో-మహ్తర్ ఎమ్-బో,  Senegal (1974–1987)
 8. ఫ్రెడెరిక్ మేయర్ జరగోజా,  Spain (1987–1999)
 9. కోఇచిరో మత్సూరా,  జపాన్ (1999–present)

ప్రాంతాలు

యునెస్కో ప్రధాన కేంద్రం ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో గలదు. దీని కార్యాలయాలు ప్రపంచంలోని అనేక దేశాలలో గలవు.

బయటి లింకులు

అక్షరాస్యత

అక్షరాస్యత (ఆంగ్లం : literacy) సాంప్రదాయికంగా, భాషాఉపయోగం చేయడానికి, చదవడం, వ్రాయడం, వినడం మరియు మాట్లాడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం.. నవీన దృక్ఫదంలో సమాచారం (communication) కొరకు కావలసిన నాలుగు మూల వస్తువులైనటివంటి నైపుణ్యాలు చదవడం, వ్రాయడం, వినడం మరియు మాట్లాడడం నేర్చుకునే విధానమే "అక్షరాస్యత". యునెస్కో వారి నిర్వచనం : గుర్తించడం (identify), అర్థం చేసుకోవడం (understand), పాల్గొనడం (interpret), సృష్టించడం (create), వార్తాలాపన (communicate), లెక్కంచడం (compute) మరియు ముద్రించిన మరియు వ్రాయబడిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడం "అక్షరాస్యత".క్రింది పట్టిక, భారతదేశం మరియు పొరుగుదేశాలలోగల మధ్యవయస్కుల మరియు యౌవనుల అక్షరాస్యతను సూచిస్తున్నది. గణాంకాలు 2002లో తీయబడినవి.

అజంతా గుహలు

మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళ ను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప చిత్ర కళలు బౌద్దమత కళకు చెందినవి. మరియు 'విశ్వజనీయ చిత్రకళలు'. . ఔరంగాబాద్ జిల్లా లోని మహారాష్ట్రలో నెలకొని ఉన్న అజంతా గుహలు మనకు వారసత్వంగా అందిన అపురూపమైన చారిత్రక సంపద. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దం నాటివని చెబుతారు. ఇక్కడ కనబడుతున్న చిత్రకళలో ఎక్కువ భాగం బౌద్ధ మతానికి చెందినవి. గుహల లోపల అద్భుతమైన నిర్మాణ సౌందర్యం కనబడుతుంది. అజంతా గ్రామము బైట ఉన్న ఈ గుహలు 1983 నుండి యునెస్కో (UNESCO) వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా పరిగణించబడుతున్నాయి. ఔరంగాబాద్‌ జిల్లాలోని అజంతా గ్రామానికి వెలుపల ఈ గుహలు ఉన్నాయి. దట్టమైన అడవుల మధ్య గుర్రపు నాడా ఆకారంలో ఉన్న కొండపై ఇవి నెలకొని ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాల మీద ఇవి పడమర నుండి తూర్పునకు వ్యాపించి ఉన్నాయి.

ఆగ్రా

ఆగ్రా (ఆంగ్లం : Agra) (హిందీ : आगरा, ఉర్దూ : آگرا ), ఓ ప్రముఖ నగరం, ఉత్తరప్రదేశ్ లో, యమునా నది ఒడ్డున గలదు. మహాభారత కాలంలో దీని పేరు 'అగ్రబనా' లేదా స్వర్గం. టోలెమీ ప్రాచీన భౌగోళశాస్త్రజ్ఞుడు, తన ప్రపంచ పటంలో దీనిని ఆగ్రాగా గుర్తించాడు. ఈ నగరాన్ని నిర్మించిన వారి గురించి పలు కథనాలున్నాయి, కానీ ఎవరి ఆధీనంలో ఈ నగరముండినదో, ఈ విషయం మాత్రం చెప్పగలుగుతున్నారు. ఈ నగరం రాజా బాదల్ సింగ్ (1475) ఆధీనంలోనుండేది. పర్షియన్ కవి సల్మాన్ ప్రకారం రాజా జైపాల్ అనే రాజు ఆధీనంలో వుండేది, ఇతడికి మహమూద్ గజనీ నుండి సంక్రమించింది. 1506లో సికందర్ లోఢీ పాలించాడు, తరువాత ఇది, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోకి వచ్చింది. ఇందులోని తాజ్ మహల్, ఆగ్రా కోట మరియు ఫతేపూర్ సిక్రీ మూడునూ యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా, గుర్తింపబడ్డాయి.

ఆగ్రా కోట

ఆగ్రా కోట (Agra Fort), ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఉంది. దీనిని యునెస్కో వారు, ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇది ప్రఖ్యాత తాజ్ మహల్కు వాయువ్యంలో 2.5 కి.మీ. దూరాన గలదు. ఈ కోటకు 'లాల్ ఖిలా' (ఎర్రకోట కాదు) అని కూడా అంటారు.

భారతదేశం లోని ముఖ్యమైన కోటలలో ఒకటి. మొఘలులు బాబరు, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాను మరియు ఔరంగజేబులు నివసించారు. దీనిని విదేశీ దౌత్యవేత్తలు, యాత్రికులు, ఉన్నత పదవులను అలంకరించినవారు సందర్శించారు.

ఆస్ట్రియా

ఆస్ట్రియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా) మధ్య ఐరోపాలోని ఒక భూపరివేష్టిత దేశం. ఈ దేశము స్లొవేనియా మరియు ఇటలీలకు ఉత్తర దిశలో, స్విట్జర్లాండ్ మరియు లీక్టెన్స్టెయిన్లకు తూర్పులో, స్లొవేకియా మరియు హంగేరీలకు పశ్చిమాన, జర్మనీ మరియు చెక్ రిపబ్లిక్లకు దక్షిణ దిశలో ఉంది. ఈ దేశ రాజధాని నగరమైన వియన్నా డానుబే నదీ తీరాన ఉంది.

తొమ్మిదవ శతాబ్దంలో ఆస్ట్రియా భూభాగాలలో జనసాంద్రత పెరగడంతో ఈ దేశచరిత్ర మూలాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. 996లో వెలువడిన ఒక అధికార పత్రములో మొట్టమొదటిసారిగా "ఆస్టర్రీచీ" అన్న పేరు వాడబడింది. కాలక్రమంలో ఈ పేరు ఆస్టర్రీచ్గా రూపాంతరం చెందింది.

ఆస్ట్రియా తొమ్మిది రాష్ట్రాలతో కూడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఐరోపాలోని ఆరు నిరంతర తటస్థ దేశాలలో ఆస్ట్రియా ఒకటి; అనంత తటస్థత విధానాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన బహు కొద్ది దేశాలలో ఆస్ట్రియా ఉంది. 1955 నుండి ఐక్య రాజ్య సమితిలో సభ్యదేశంగా ఉన్న ఆస్ట్రియా 1995లో ఐరోపా సమాఖ్యలో చేరింది.

ఇస్తాంబుల్

ఇస్తాంబుల్ (టర్కిష్: ఇస్తాంబుల్, చారిత్రకంగా బైజాంటియన్ మరియు ఆ తరువాత కాన్‌స్టాంటినోపిల్ (టర్కిష్:قسطنطينيه); యూరప్ లోని అధిక జనసాంద్రత గల నగరం, ప్రపంచంలో 4 నాలుగవ అత్యధిక జనాభా గల నగరం. టర్కీ యొక్క అతి పెద్ద నగరం, సాంస్కృతిక, వాణిజ్య కేంద్రం. ఇస్తాంబుల్ రాష్ట్రం కూడా, ఇందులో 27 జిల్లాలు ఉన్నాయి. టర్కీకు వాయ్యువ్యదిశలో, ఇది బోస్ఫొరస్ జలసంధి లోగల ప్రకృతిసిధ్ధమైన ఓడరేవు, దీనిని 'గోల్డన్ హార్న్' అని కూడా అంటారు. యూరప్ మరియు ఆసియా

ఖండాల మధ్య గల నగరం, ఇదో విశేషం. దీని సుదీర్ఘ చరిత్రలో 330-395 వరకు రోమన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 395-1204 వరకు బైజాంటియన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 1204-1261 వరకు లాటిన్ సామ్రాజ్యపు రాజధానిగాను, మరియు 1453-1922 వరకు ఉస్మానియా సామ్రాజ్యపు రాజధాని గాను వుండినది. ఈ నగరం 2010 కొరకు జాయింట్ "యూరోపియన్ సాంస్కృతిక రాజధాని"గా నియామకమైంది. ఇస్తాంబుల్ లోని పలు చారిత్రకప్రాంతాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించ బడ్డాయి.

ఎల్లోరా గుహలు

ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కి.మీ. దూరములో ఉంది. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు మరియు సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి.

మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటి నిర్మాణం కాలం క్రీ.పూ 600 నుంచి 800 మధ్య ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీ.పూ 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీ.పూ 800-1000. ఈ గుహలన్నీ పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి.

ఇందులో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. మూడు మతాల భావ సంగమం ఇది. ఎల్లోరాని అక్కడి స్థానికులు వేరులిని అని పిలుస్తారు. ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు-అక్టోబరు మధ్య కాలం అనువైనది. కాని విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే-జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు.

ఐక్యరాజ్య సమితి

ఐక్యరాజ్య సమితి (ఆంగ్లం: United Nations) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా మరియు ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.

కుతుబ్ మీనార్

కుతుబ్ మీనార్ (ఆంగ్లం: Qutub Minar హిందీ: क़ुतुब मीनार ఉర్దూ: قطب منار), ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల మీనార్, మరియు ఇండో-ఇస్లామీయ నిర్మాణాలకు ఒక అపురాపమైన ఉదాహరణ. ఇది ఢిల్లీ లోని మెహ్రౌలీ వద్ద గల కుతుబ్ కాంప్లెక్స్ లో గలదు. యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్'ను నమోదు చేశారు.

చార్మినార్

చార్మినార్ ఎక్స్ ప్రెస్, చార్మినార్ పేరుతో ఓ ఎక్స్ ప్రెస్ రైలును హైదరాబాద్-చెన్నైల మధ్య పరుగులు పెట్టించింది.1591 లో నిర్మించిన చార్మినార్ ( "నాలుగు మినరేట్స్ "), హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం లో ఉన్న ఒక స్మారక చిహ్నం మరియు మసీదు. ఈ ల్యాండ్ మార్క్, భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాల మధ్య జాబితా చేయబడ్డ హైద్రాబాద్ యొక్క గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది. చార్మినార్ 400 సంవత్సరాలకు పైగా పై అంతస్తులో మసీదుతో ఒక చారిత్రక ప్రదేశంగా ఉంది మరియు దాని పరిసర మార్కెట్లకు కూడా తెలుసు. హైదరాబాద్ లోని పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి. ఈద్-ఉల్-అజ్ మరియు ఈద్-ఉల్-ఫితర్ వంటి అనేక ప్రసిద్ధ పండుగలు జరుపుకుంటారు.

ఈ చార్మినార్ మూసీ నది తూర్పు ఒడ్డున ఉన్నది. పశ్చిమాన ఉన్న లాడ్ బజార్, మరియు ఆగ్నేయాన ఉన్న గ్రానైట్ మక్కః మసీదును సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇది పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసిన అధికారిక "కట్టడాల జాబితా " పై పురావస్తు మరియు నిర్మాణ నిధి గా జాబితా చేయబడింది. ఆంగ్ల నామం ఒక అనువాదం మరియు కలయికగా ఉన్న ఉర్దూ పదాలు చాతర్ మరియు మినార్ లేదా మీనార్, అనువదించడానికి "నాలుగు స్థంభాలు "; ఈ విధంగా ఉండే టవర్లు అలంకార మినరేట్స్ మరియు నాలుగు గ్రాండ్ వన్నుల ద్వారా మద్దతు జతచేయబడ్డాయి.

చౌమహల్లా పాలస్

చౌమహల్లా పాలస్ లేదా Chowmahalla Palace (నాలుగు మహాళ్ళు) హైదరాబాదు రాష్ట్రం లోని నిజాం యొక్క నివాసము. ఆసఫ్ జాహి వంశపు పరిపాలనా రాజధాని హైదరాబాదు యందు నిజాం యొక్క నివాస స్థలం. ఈ భవనం బర్కత్ అలీ ఖాన్ ముకర్రం జాహ్ యొక్క ఆస్తిగా పరిగణింప బడుతున్నది.పర్షియన్ భాషలో "చహర్" అనగా నాలుగు, అరబీ భాషలో "మహాలత్" అనగా సౌధాలు (బహువచనం), అలా దీనికి చౌమహల్లా అనే పేరు పెట్టబడింది.

ఉన్నత స్థాయి ప్రభుత్వ మరియు రాజరిక కార్యక్రమాలన్నీ ఈ పేలస్ లోనే జరిగేవి.

ఈసౌధానికి, యునెస్కో వారిచే సాంస్కృతిక వారసత్వ ప్రదేశ అవార్డును 2010 మార్చి 15 న ప్రదానం చేయబడింది.

జైపూర్

జైపూర్ ( / dʒ aɪ p ʊər / ( link=| ఈ ధ్వని గురించి వినండి ) ) రాజస్తాన్ రాజధానిగా మరియు అతిపెద్ద నగరం . 2011 నాటికి, ఈ నగరం 3.1 మిలియన్ల జనాభాను కలిగి ఉంది, ఇది దేశంలో అత్యధిక జనాభా కలిగిన పదవ నగరంగా నిలిచింది. జైపూర్ దాని భవనాల ఆధిపత్య రంగు పథకం కారణంగా పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇది దేశ రాజధాని నుండి 268 km (167 miles) ఉంది.

జైపూర్‌ను 1727 లో రాజ్‌పుట్ పాలకుడు జై సింగ్ II, అమెర్ పాలకుడు స్థాపించాడు, అతని పేరు మీద ఈ నగరానికి పేరు పెట్టారు. ఆధునిక భారతదేశంలో ప్రారంభ ప్రణాళికాబద్ధమైన నగరాల్లో ఇది ఒకటి, దీనిని విద్యాధర్ భట్టాచార్య రూపొందించారు. బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో, ఈ నగరం జైపూర్ రాష్ట్ర రాజధానిగా పనిచేసింది. 1947 లో స్వాతంత్ర్యం తరువాత, జైపూర్ కొత్తగా ఏర్పడిన రాజస్థాన్ రాజధానిగా మారింది.

జైపూర్ భారతదేశం లో పర్యాటక మరియు పశ్చిమ భాగంగా గోల్డెన్ ట్రయాంగిల్ పాటు పర్యాటక సర్క్యూట్ ఢిల్లీ మరియు ఆగ్రా 240 km, 149 mi ). ఇది రెండు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు నిలయం - జంతర్ మంతర్ మరియు అమెర్ కోట . ఇది రాజస్థాన్ లోని జోధ్పూర్ ( 348 km, 216 mi వంటి ఇతర పర్యాటక ప్రదేశాలకు ప్రవేశ ద్వారంగా కూడా పనిచేస్తుంది ), జైసల్మేర్ ( 571 km, 355 mi ), ఉదయపూర్ ( 421 km, 262 mi ), కోటా (252 కిమీ, 156 మైళ్ళు) మరియు మౌంట్ అబూ ( 520 km, 323 mi ). జైపూర్ సిమ్లా నుండి 616 కిలోమీటర్ల దూరంలో ఉంది.

6 జూలై 2019 న జైపూర్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చెక్కబడింది. అరుదైన యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ప్రపంచ వారసత్వ సందర్శనీయప్రాంతంగా గుర్తింపు ఇచ్చింది. ఈ మేరకు యునెస్కో(యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్) శనివారం(06 జూన్ 2019) ట్విట్టర్‌లో అధికారికంగా ఓ ప్రకటన చేసింది

ప్రపంచ వారసత్వ ప్రదేశం

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం (UNESCO World Heritage Site) ఒక ప్రత్యేకమైన ప్రదేశం (ఉదాహరణకు అడవి, పర్వతము, సరస్సు, ఎడారి, కట్టడం, నిర్మాణం, లేదా నగరం, దీనిని యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ కమిటీ చే ప్రపంచ వారసత్వ కార్యక్రమాన నిర్వహింపబడి, దీని జాబితా యందు నామినేట్ చేయబడి యుండవలెను. ఈ కమిటీ యందు 21 రాష్ట్ర పార్టీలుంటాయి. వీటికి రాష్ట్రపార్టీల జనరల్ శాసనసభ, 4 యేండ్ల కొరకు ఎన్నుకుంటుంది.

ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశము, సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ మానవుల వారసత్వాన్ని ఇతర తరాలకు అందించడం.

2008 వరకు 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 గలవు. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ మరియు 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి.

,

భారతీయ పర్వత రైల్వేలు

భారత పర్వత రైల్వేలు : భారతదేశంలో అనేక రైల్వేలు పర్వత ప్రాంతాలలో నిర్మించారు. వీటన్నిటినీ కలిపి భారత పర్వత రైల్వేలు అని అంటారు. ఇందులోని 4, 2007 లో నడుచుచున్నవి.

డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే

నీలగిరి పర్వత రైల్వే

కాల్కా-సిమ్లా రైల్వే

మాథేరాన్ పర్వత రైల్వేఈ పర్వత రైల్వేల సమూహాన్ని, యునెస్కో వారు, భారత పర్వత రైల్వేలుగా పరిగణించి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.

మహాబలిపురం

మహాబలిపురం తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 66 కి.మీ. దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నైకి 70 కి.మీ. దూరంలో ఉంది. మహాబలిపురం తమిళ భాషలో మామల్లపురం (மகாபலிபுரம்) (Mamallapuram) అని పిలుస్తారు. ఈ పట్టణంలో ఉన్న తీరం వెంబడి ఉన్న దేవాలయం ప్రపంచంలో యునెస్కో వారి చేత సంరక్షించ బడుతున్న హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటి.

మానస్ జాతీయ అభయారణ్యం

మానస్ జాతీయ అభయారణ్యం (ఆంగ్లం : Manas National Park), ఒక జాతీయ వనం, యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటింపబడింది. ఇది అస్సాం రాష్ట్రంలో హిమాలయాల పాదాల చెంత మరియు భూటాన్లో కొంత విస్తరించి ఉంది. ఇందులో అస్సాం తాబేళ్ళు, కుందేళ్ళు, బంగారు లంగూర్లు మరియ్ పిగ్మీ హాగ్ లు ఉన్నాయి.

సర్వేపల్లి రాధాకృష్ణన్

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 17, 1975) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.

హంపి

గమనిక: విజయనగరం (కర్ణాటక) అనే మరొక వ్యాసంలో విషయం విపులంగా ఉన్నది. "విజయనగరం", "హంపి" అనే రండు వ్యాసాలను వేరు వేరుగా చేసి, విషయాన్ని అందుకు అనుగుణంగా విభజించాలి.13-15వ శతాబ్దములో విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. విద్యారణ్య స్వామి ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయంగరసామ్రాజ్యం ఒకటి.

.

హుమాయూన్ సమాధి

హుమాయూన్ సమాధి (Humayun's tomb) మొఘల్ నిర్మాణాల సమూహం. ఢిల్లీ లోని తూర్పు నిజాముద్దీన్ లో ఉంది. దీనిని హుమాయూన్ మరణాంతరం, ఇతని భార్య హమీదా బాను బేగం, ఆదేశాన నిర్మాణం జరిగింది. 1562 లో నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయి. దీని ఆర్కిటెక్ట్ సయ్యద్ ముహమ్మద్ ఇబ్న్ మిరాక్ గియాసుద్దీన్ మరియు తండ్రి మీరక్ గియాసుద్దీన్. వీరిని 'హిరాత్' నుండి రప్పించారు. దీనిని నిర్మించుటకు 8 సంవత్సరాల కాలం పట్టింది. తాజ్ మహల్ నిర్మాణానికి పూర్వం దీనిని భారత్ లోనే అత్యంత సుందరమైన కట్టడంగా పరిగణించేవారు.

దీనిని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.