మొహర్రం

(ఆంగ్లం : Muharram) (అరబ్బీ : محرم ), లేదా ముహర్రం, ముహర్రమ్-ఉల్-హరామ్, అని పిలువబడే ఈ ముహర్రం, ఇస్లామీయ కేలండర్ లోని మొదటినెల, మరియు ఇస్లామీయ సంవత్సరాది, (తెలుగు నెలలలోని చైత్రమాసము లాగా)

చరిత్ర

మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్‌ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ కేలండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు (అరేబియాలోని యూదులు మరియు క్రైస్తవులతో సహా) ఈ కేలండర్ ను వాడేవారు. ప్రాచీనకాలంలో ఆషూరా దినం, అనగా ముహర్రం యొక్క పదవతేదీని, అనేక సాంప్రదాయక గుర్తుల కనుగుణంగా పర్వముగాను పండుగగానూ జరుపుకునేవారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం 'మొహరం'. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ 'మాతం' చదవటాలు గుర్తుకొస్తాయి. మొహర్రం జరిగే పది రోజులు విషాద దినాలే కాని, ఎంత మాత్రం పర్వదినాలు కావు.

క్రీ.శ. 632లో మహమ్మద్‌ ప్రవక్త (స) పరమపదించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌, హజ్రత్‌ ఉమర్‌, హజ్రత్‌ ఉస్మాన్‌, హజ్రత్‌ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుసైన్‌- ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్‌ (స) మనవలు. హజ్రత్‌ అలీ తనయులు. హజ్రత్‌ అలీ తరువాత ప్రజలు ఇమామ్‌ హసన్‌ను ప్రతినిధిగా ఎన్నుకొన్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్‌ మావియా. అతనిలో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. యుద్ధం ప్రకటించి ఇమామ్‌ హసన్‌ను గద్దెదించాలనుకొన్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమామ్‌ హసన్‌ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హసన్‌ విషప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్‌ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు. ఇస్లామీయ ధర్మశాస్త్రాన్ననుసరించి సంప్రతింపులే సమస్యల విమోచనకు మార్గాలు. చర్చలకోసం ఇమామ్‌ హుసైన్‌ రాజధాని కుఫాకు బయల్దేరారు. యజీద్‌కు విషయం తెలిసింది. పాషాణ హృదయుడైన అతడు ఇమామ్‌ హుసైన్‌ను మార్గం మధ్యలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమామ్‌ పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీద్‌ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలసి మొత్తం 72 మంది ఇమామ్‌ హుసైన్‌ వెంట ఉన్నారు. పది రోజులు యుద్ధం జరిగింది. ఇమామ్‌ హుసైన్‌ పరివారం స్వల్పమైనా వీరోచితంగా పోరాడి అశువులు బాసింది. పదోరోజు హుసైన్‌ ఒక్కరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్‌ కోసం శత్రువునడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు భీరువులై ఇమామ్‌ హుసైన్‌ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహర్రం పది రోజులు విషాద దినాలు.

తెలుగు ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లిములే కాక అన్ని వర్గాల ప్రజలూ జరుపుకోవడం వందలాది ఏళ్ళుగా సాగుతోంది. యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య జూన్ 29, 1830న నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహర్రం పండుగను తాను రచించిన కాశీయాత్ర చరిత్రలో అభివర్ణించారు. ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహర్రం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించారు: షహరు(హైదరాబాదు)కు కంచికి గరుడసేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహర్రం పండుగ ప్రబలమైన యుత్సవము. ఆ యుత్సవ కాలములో పరమాత్ముని చైతన్యము ఆ షహరులో నెక్కువగా ప్రకాశించుటచేత అనేక వేలమంది యితర మతస్థులుగా నుండేవారు కూడా షహరుకువచ్చి ఆ తొమ్మిదో దినము మొదలు ఆఖరువరకు నుంచున్నారు.[1]

ఆషూరా

ముహర్రంనెల పదవరోజు యౌమీ ఆషూరా. ముహమ్మద్ ప్రవక్త మనుమడైన హుసేన్ ఇబ్న్ అలీ, కర్బలా యుద్ధంలో అమరుడైన రోజు. ముహర్రం నెలను, "షహీద్ " (అమరవీరుల ) నెలగా వర్ణిస్తూ, పండుగలా కాకుండా, వర్థంతిలా జరుపుకుంటారు. షియా ఇస్లాంలో ఈ ముహర్రం నెల మరియు "ఆషూరా", కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం, శోక దినాలుగా గడుపుతారు. షియాలు మాతమ్ (శోక ప్రకటన) జరుపుతారు. తెలంగాణలో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను పీర్ల పండుగ అనే పేరుతో జరుపుకుంటారు. హైదరాబాద్‌ పాతబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ వూరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలావానుంచి ప్రారంభమై ఈ వూరేగింపు అలీజా కోట్ల, చార్మినార్‌, గుల్జార్‌ హౌస్‌, మీరాలం మండీ, దారుల్‌ షిఫాల మీదుగా కొనసాగి చాదర్‌ ఘాట్‌ వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన ఏనుగుపై ఈ వూరేగింపు సాగుతుంది.

అషూరా విశేషాలు

 • భూమిమీద మొదటిసారి అల్లాహ్ వర్షాన్ని కురిపిస్తాడు
 • తొలి ప్రవక్త ఆదం (ఆదాము) ప్రార్థన అల్లాహ్ అంగీకరించాడు
 • నూహ్ ఓడను జూడీ (ఆరారాతు) పర్వతాలపై అల్లాహ్ నిలిపాడు
 • ఫిరౌన్ (ఫరో) రాజు నుండిమూసా (మోషే) ను ఇశ్రాయేలు ప్రజలను అల్లాహ్ కాపాడి నైలు నదిని ఎర్రసముద్రాన్ని దాటిస్తాడు
 • ఇబ్రాహీం (అబ్రాహాము) ను నమ్రూదు రగిల్చిన అగ్నిగుండం నుండి అల్లాహ్ కాపాడుతాడు
 • ఇస్సాక్, యాఖూబ్ లకు కంటి చూపును అల్లాహ్ తిరిగి ప్రసాదిస్తాడు
 • యూసఫ్ (యోసేపు) ను చెరసాల నుండి అల్లాహ్ విడిపిస్తాడు
 • యూనుస్ (యోనా) ను తిమింగలం కడుపులోనుండి అల్లాహ్ ఒడ్డున పడేస్తాడు
 • దావూద్ (దావీదు) పశ్చాతాపాన్ని అంగీకరించి అల్లాహ్ క్షమిస్తాడు
 • అయూబ్ (యోబు) వ్యాధిని అల్లాహ్ స్వస్థపరుస్తాడు

ఇవీ చూడండి

మూలలు

బయటి లింకులు

  ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం

  భారతదేశంలో ఇస్లాం,హిందూమతం తరువాత రెండవ స్థానంలో గలదు. 2011 గణాంకాల ప్రకారం, 14.7% ముస్లింలు గలరు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ రెండవ స్థానంలో గలరు. సంఖ్యాపరంగానూ, శాతం పరంగానూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు, కాశ్మీర్, అస్సాం, ప.బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్నాటక ల తరువాత స్థానంలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 2001 గణాంకాల ప్రకారం ముస్లింలు 9.4% గలరు.

  ఇప్పలపల్లి (మహబూబ్ నగర్ గ్రామీణ మండలం)

  ఇప్పలపల్లి,తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ (గ్రామీణ) మండలంలోని గ్రామం.

  ఇది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది.

  ఇమాంబారా

  ఇమాంబారా (ఆంగ్లం: Hussainiya) షియా ముస్లింలు ముహర్రం జ్ఙాపకార్థ సమావేశ స్థలంగా ఉపయోగించబడే భవనం. దీనినే అషుర్ఖానా అని కూడా వ్యవహరిస్తారు.

  10 అక్టోబర్, 680 న మొహమ్మద్ ప్రవక్త మనవడు, షియాల ఇమాం అయిన హుసేన్ ఇబ్న్ ఆలీని ఇరాక్ లో జరిగిన కర్బాలా యుద్ధంలో ఉమయ్యద్ క్యాలిఫ్ సంహరించాడు. హుసేన్ ఇబ్న్ ఆలీని స్మరిస్తూ ఇదే రోజున ప్రపంచవ్యాప్తంగా షియాలు ముహర్రం పాటిస్తారు.

  ఇస్లామీయ కేలండర్

  ఇస్లామీయ కేలండర్ లేదా ముస్లిం కేలండర్ (అరబ్బీ : التقويم الهجري అత్-తఖ్వీమ్ అల్-హిజ్రి), ఇస్లామీయ దేశాలలో మరియు ముస్లింల సముదాయాలలో అవలంబింపబడుతున్న కేలండర్. ఇది చంద్రమాసాలపై ఆధారంగా గలది కావున దీనికి 'తఖ్వీమ్-హిజ్రి-ఖమరి' అని కూడా అంటారు. ఈ కేలండర్ లో 12 చంద్రమాసాలు మరియు దాదాపు 354 దినాలు గలవు.

  కొత్త సంవత్సరం

  సంవత్సరాది లేదా కొత్త సంవత్సరం ఒక సంవత్సరంలోని మొదటి రోజు. ఇది వివిధ కేలండర్ ల ప్రకారం వివిధ తేదీలలో మొదలవుతుంది. ఆయా దేశాలలో లేదా సంప్రదాయాలలో ఆ రోజు ఒక పండగ లాగా ఉత్సవాలు జరుపుకుంటారు.

  కోయిలకొండ

  కోయిలకొండ, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా, కోయిలకొండ మండలానికి చెందిన గ్రామం.

  ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 23 కి. మీ. దూరంలో ఉంది.కోయిలకొండ గ్రామంలో పురాతన కోటతో పాటు పురాతన ఆలయాలు, చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.

  జాతీయ శెలవు దినాలు

  ఒక దేశానికి సంబంధించి ప్రాముఖ్యత వహించిన రోజున ఆ దేశ ప్రజలందరూ వేడుకలు జరుపుకోటానికి వీలుగా దేశం మొత్తం మీద ఆ రోజు వ్యాపార, వాణిజ్య, విద్యాది అన్ని విభాగాలకు చెందిన అన్ని సంస్థలకూ శెలవు ప్రకటించడాన్ని జాతీయ శెలవు అంటారు.

  నగరం (మామిడికుదురు)

  నగరం అనేది తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలానికి చెందిన గ్రామము... పిన్ కోడ్: 533 247.

  ఇది మండల కేంద్రమైన మామిడికుదురు నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1681 ఇళ్లతో, 6250 జనాభాతో 681 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3116, ఆడవారి సంఖ్య 3134. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2113 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 74. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587817.పిన్ కోడ్: 533247.

  నెలవంక (1983 సినిమా)

  నెలవంక జంధ్యాల దర్శకత్వం వహించగా, గుమ్మడి, జె.వి.సోమయాజులు ముఖ్యపాత్రల్లో నటించగా 1983లో విడుదలైన తెలుగు సాంఘిక చిత్రం. సినిమా హిందూ-ముస్లిం వివాదాలు, ఐక్యత నేపథ్యంలో తీసిన సందేశాత్మక చిత్రమిది. జమీందారీ గ్రామం నేపథ్యంలోని ఈ సినిమాని జమీందారీ గ్రామమైన ముక్త్యాలలో చిత్రీకరించారు. సినిమా ఆర్థికంగా పరాజయం మూటకట్టుకోవడమే కాక పురస్కారాలను కూడా దక్కించుకోలేక నిరాశపరిచింది.

  పీర్ల పండగలో మొహరం గీతాలు

  పీర్ల పండుగలో మొహరం గీతాలు

  మహమ్మదీయుల ప్రధాన పర్వ దినాలలో మొహరం ముఖ్యమైనది. హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోక తప్త హృదయాలతో జరుపు కునే కార్యక్రమమే పీర్ల పండుగ మొహర్రం. ముస్లిం పంచాంగ రీత్యా అరేబియాలో సంవత్సరం యొక్క మొదటి నెల మొహరం. మొహరం పండుగ, మొహరం నెల మొదటి తేదీనుండి పదవ తేదీ వరకు జరుపుకునేవారు. మొహరం పండుగనే''పీర్ల పండుగ '' అని కూడా అంటారు. పీర్ అంటే మహాత్ములు, ధర్మనిర్దేశకులు అని అర్థం. ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి కలిగిన రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి, ఊరేగించి, పూజించే వాటిని పీర్లు అని పిలుస్తారు.

  పీర్ల పండుగ

  పీర్ల పండుగ : మొహరం పండుగును తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. షియా తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త ముహమ్మదుగారి మనమళ్ళు హసన్, హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. రక్తంకారేలా ఒళ్ళు కోసుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారు. నిప్పుల గుండం తొక్కుతారు. పీరుల్ని పీర్లచావడిలో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. ఇస్లాంలో ఇలాంటి హేతువులేని విషయాలను మూలం చేసుకునే పండుగలకు స్థానం ఇవ్వరు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా ఫత్వాలు ఉన్నాయి. అందుకే ఈ విషయం నిషిద్దం అని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించేముస్లిముల సంఖ్య తగ్గుతోంది. "ఊదు వేయందే పీరు లేవదు". ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి.

  భూత్పూరు (భూత్‌పూర్ మండలం)

  భూత్‌పూర్‌, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, భూత్‌పూర్‌ మండలంలోని గ్రామం.

  ఈ గ్రామం జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌కు 8 కిమీ దూరంలో 44వ నెంబరు (పాతపేరు 7వ నెంబరు) జాతీయ రహదారిపై 16°42' ఉత్తర అక్షాంశం, 78°3' తూర్పు రేఖాంశంపై ఉపస్థితియై ఉంది.మహబూబ్‌నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారి కూడా గ్రామం మీదుగా వెళ్ళుచుండటంతో ఈ గ్రామం ప్రధాన రోడ్డు కూడలిగా మారింది.మొదట జడ్చర్ల తాలుకాలో భాగంగా ఉన్న ఈ గ్రామం 1986లో మండల వ్యవస్థ ఏర్పడిన పిదప ప్రత్యేకంగా మండల కేంద్రంగా మారింది.

  ముస్లింల పండుగలు

  ముస్లింల పండుగలు : ప్రపంచంలోని ముస్లింల సమూహం, సాంవత్సరిక కాలంలో జరుపుకునే సాంప్రదాయిక పండుగలు. ఇవి దాదాపు ధార్మిక విశ్వాసాలు గలవే.

  ముస్లింల సాంప్రదాయాలు

  ముస్లింల సాంప్రదాయాలు : ముస్లింల సాంప్రదాయాలు అనగానే అరబ్బుల, తురుష్కుల, మొఘలుల సాంప్రదాయాలు గుర్తుకొస్తాయి. ముస్లింల సాంప్రదాయాలు అనే అంశమే చర్చనీయాంశంగా అనిపిస్తుంది. ఇస్లాం మతం 7వ శతాబ్దం అరేబియాలో స్థాపింపబడిన మతము. ఇస్లాం అనునది ఆధ్యాత్మిక ధార్మిక జీవనవిధానం. ప్రారంభదశలో అరబ్బుల సాంప్రదాయాలే ముస్లిం సాంప్రదాయాలనే భ్రమ వుండేది. కానీ ఇస్లాం అనునది కేవలం అధ్యాత్మిక ధార్మిక జీవనవిధానాలనేకాకుండా విశ్వజనీయత, విశ్వసోదరభావం, వసుదైకకుటుంబం, మానవకళ్యాణం, సామాజికన్యాయం, సర్వమానవసౌభ్రాతృత్వం మొదలగు విశ్వౌదారగుణాలనుగల్గిన సంపూర్ణ జీవనవిధానమని మరువగూడదు.

  ఇస్లాం అరేబియానుండి, టర్కీ, పర్షియా, మంగోలియా, భారతదేశం, ఉత్తర తూర్పు ఆఫ్రికా, ఇండోనేషియా, జావా (ప్రాంతం), మలయా, సుమిత్రా మరియు బోర్నియో ప్రాంతాలలో శరవేగంగా విస్తరించింది.

  ముస్లిం సాంప్రద్రాయం అనే పదం సాధారణంగా ఒక మతరహితమైన ఒక సామాజిక సంస్కృతిగా చారిత్రక ఇస్లామీయ సభ్యతగా పరిగణించేవారు. ముస్లింలు ప్రపంచంలోని పలు దేశాలలో విస్తరించారు. పర్షియన్లుగా, తురుష్కులుగా, భారతీయులుగా, మలయీలు (మలేషియన్లు) గా, బెర్బర్లు (ఇండోనేషియన్లు) గా స్థిరపడి ముస్లింల సాంప్రదాయాన్ని ప్రాపంచీకరించారు.

  మొలంగూర్ కోట

  మొలంగూర్ కోట తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ఉన్న కోట. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ కోట గుట్ట కింద మొహర్రం రోజున జాతర జరుగుతుంది.

  రసోల్

  రాసోల్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, కంగ్టి మండలంలోని గ్రామం.

  ఇది మండల కేంద్రమైన కంగ్టి నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బీదర్ (కర్ణాటక) నుండి 99 కి. మీ. దూరంలోనూ ఉంది.

  లంగర్‌హౌస్

  లంగర్‌హౌస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది గోల్కొండకు దగ్గరలో ఉన్నది.

  హిజ్రత్

  హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్ మహమ్మదు ప్రవక్త మరియు అతని అనుయాయులు మక్కా నుండి మదీనాకు క్రీ.శ. 622లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.

  మక్కా నగరంలో మహమ్మదు ప్రవక్తకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఏకేశ్వరవాదన వినడానికి మక్కావాసులు తయారులేరు. మహమ్మదు ప్రవక్త ఏకేశ్వరవాదాన్ని విగ్రహారాధనను ఖండించడాన్ని మక్కావాసులు జీర్ణించుకోలేకపోయారు. మహమ్మదు ప్రవక్తపై అతని అనుయాయులపై కత్తిగట్టారు. క్రీ.శ. 615 లో మహమ్మదు ప్రవక్త అనుయాయులు ఇథియోపియా లోని అక్సూమ్ సామ్రాజ్యంలో తలదాచుకొన్నారు. ఈ రాజ్యానికిరాజు క్రైస్తవుడు. ఏకేశ్వరవాదకులైన మహమ్మదుప్రవక్త అనుయాయులకు శరణమిచ్చాడు. "యస్రిబ్" (ప్రస్తుతం దీని పేరు మదీనా) నగరవాసులు మహమ్మదు ప్రవక్తకు ఆహ్వానించారు. మహమ్మదు ప్రవక్త మక్కా నగరాన్ని వదలడానికి నిశ్చయించుకొన్నారు.

  సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. మహమ్మదు ప్రవక్త గారి వలస క్రింది విధంగా జరిగింది.

  హైదర్ అలీ

  హైదర్ ఆలీ (ఉర్దూ: سلطان حيدر علی خان) హైదర్ ఆలీ, సి 1720–1782 డిసెంబరు 7, ఇస్లామిక్ కేలండర్ ప్రకారం 2 ముహర్రం 1197) దక్షిణాదిన ఉన్న మైసూర్ రాజ్యం యొక్క వాస్తవ పాలకుడు. అతడి అసలు పేరు హైదర్ నాయక్. సైనిక విజయాలతో ప్రత్యేకతను చాటుకొని ఆనాటి మైసూరు పాలకుల దృష్టిని ఆకర్షించగలిగాడు. రెండవ కృష్ణరాజ వొడయారుకు దళవాయి (సర్వ సైన్యాధిపతి) గా ఎదగడం ద్వారా ఆయన రాజు, మైసూరు ప్రభుత్వంపై పెత్తన్నాన్ని సాధించి క్రమక్రమంగా అన్ని రకాల అధికారాలపై అదుపు సాధించాడు. అతను తన రాజ్యం యొక్క సరిహద్దులను మరాఠా సామ్రాజ్యం మరియు నిజాం హైదరాబాదు వద్ద వరకు విస్తరించాడు. హైదర్ ఆలీ బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ సైనిక విస్తరణనను సమర్థవంతంగా అడ్డుకున్న కొద్దిపాటి స్థానిక పాలకులలో ఒకడు. రెండు ఆంగ్ల-మైసూరు యుద్ధాలలో ఆయన బ్రిటిషు స్థావరమైన మద్రాసుకు అతి సమీపానికి రాగలిగాడు. అతను సుల్తాన్ హైదర్ ఆలీ ఖాన్, హైదర్ ఆలీ సాహిబ్ లాంటి అనేక గౌరవబిరుదాలను అందుకున్నాడు.

  హైదర్ ఆలీ పాలన తన పొరుగువారితో తరుచుగా జరిగే యుధ్ధాలతోను మరియు తన రాజ్యం లోపల జరిగే తిరుగుబాటులతోను కూడిఉంది. ఇది ఆ కాలంలో అసాధారణమైన విషయమేమీ కాదు. నిజానికి అప్పుడు భారత ఉపఖండంలో ఎక్కువభాగం సంక్షోభంలో ఉంది. మరాఠా సమాఖ్య మొఘల్ సామ్రాజానికి చెందిన అధికారులతో పోరాడుతున్నది. అతను ఒక మంచి తెలివి గల నేత. తను పాలన చేపట్టినప్పుటి కంటే పెద్ద రాజ్యాన్ని తన కుమారుడు టిప్పు సుల్తానుకు వదిలివెళ్ళాడు. అతను తన సైన్యాన్ని ఐరోపా సైన్యపు పధ్ధతులలో వ్యవస్థీకరించాడు. రాకెట్ ఆర్టిలరీని సైనికంగా వినియోగించడాన్ని అభివృధ్ధిచేసాడు, అతను ఇద్దరు భార్యలు, మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

  Allah-green.svg * * ఇస్లాం సంబంధిత వ్యాసాలు * * Mosque02.svg

  ఇతర భాషలు

  This page is based on a Wikipedia article written by authors (here).
  Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
  Images, videos and audio are available under their respective licenses.